Search
  • Follow NativePlanet
Share
» »కుమారారామం: భీమగుండంలో స్నానం చేస్తే పాపహరమే కాకుండా, అభీష్ట సిద్ధులు

కుమారారామం: భీమగుండంలో స్నానం చేస్తే పాపహరమే కాకుండా, అభీష్ట సిద్ధులు

రాజమండ్రి కి 47 కి. మీ. దూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా, సామర్లకోట రైల్వే స్టేషన్ కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పంచరామాల్లో చివరిదైన కుమార భీమారామము ఉంది. ఇక్కడ స్వామి వారిని కాల భైరవుడని పిలుస్తారు. ఇక్కడ సున్నపురాయితో తయారుచేయబడ్డ లింగం 60 అడుగుల ఎత్తులో ఉండి రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పంచారామాలలో 'కుమారారామం'ఒకటి. తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు. ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది. అయితే ఆ తరువాత బౌద్ధుల ప్రాబల్యం కారణంగా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది.

కాలక్రమంలో అంటే 11 వ శతాబ్దంలో స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఇక్కడి స్వామిని కుమార భీమేశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు. ఈ ఆలయంలోని శివుడిని 'కుమార భీమేశ్వరుడు'అని పిలుస్తారు. ఆయన 'వామదేవ'స్వరూపుడు. యోగ లింగంగా శివుడు వెలసిన ఈ క్షేత్రం సామర్లకోటలో అంతర్భాగంగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఆవల దిక్కున ఉంది. అమ్మవారి పేరు బాలాత్రిపురా సుందరి. క్షేత్ర పాలకుడు మాండవ్య నారాయణుడు. మరి ఈ కుమారారామం ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

కుమారారామం విశిష్టత:

కుమారారామం విశిష్టత:

ఈ ఆలయాన్ని కూడా తూర్పు చాళుక్యులు నిర్మించినట్టు శాసనాలు ఉన్నాయి. రెండు అంతస్థులు కలిగిన ఈ ఆలయంలో శివ లింగం మీద చైత్ర, వైశాఖ మాసాల్లో... ఉభయ సంధ్యల్లో సూర్య కిరణాలు నేరుగా పడడం విశేషం. ఈ ఆవరణలోని భీమగుండంలో స్నానం చేస్తే పాపహరమే కాకుండా, అభీష్ట సిద్ధులు కలుగుతాయని భక్తుల నమ్మకం.

PC: Aditya Gopal

స్థల పురాణం ప్రకారం

స్థల పురాణం ప్రకారం

స్థల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుణ్ణి సంహరించగా ఆ రాక్షసుని కంఠంలోని ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడగా అవే పంచారామ క్షేత్రాలుగా పిలువబడుతున్నాయి. అమరావతిలోని అమరేశ్వరాలయం, ద్రాక్షారామంలోని శివక్షేత్రం, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీరారామం, సామర్లకోటలోని ఈ కుమారారామం.

కోటగోడలాంటి ప్రాకారం

కోటగోడలాంటి ప్రాకారం

కోటగోడలాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల రెండవ ప్రాకారం ఉంది. ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం, వెనుక భాగాన పెద్ద రాతిస్థంభము ఉన్నాయి.

సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై

ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై

ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు.

PC:: విశ్వనాధ్.బి.కె.

ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా

ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా

ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి.

PC: Anushamutyala

భీమేశ్వరుడి శివలింగం నయనానందం

భీమేశ్వరుడి శివలింగం నయనానందం

గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆశీనుడై ఉంటాడు.

PC: Amruth varma

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిల

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిల

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడింది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి.

PC: Anushamutyala

పంచారామాలలో ఒక్కటి

పంచారామాలలో ఒక్కటి

ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుండును.అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది.ప్రాకారాపు గోడలు ఇసుక రాయి (sand stone) చే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్థంబాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమరరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది.

PC: Anushamutyala

ఆలయం చుట్టూ రెండవ ప్రాకారపు గోడను

ఆలయం చుట్టూ రెండవ ప్రాకారపు గోడను

ఆలయం చుట్టూ రెండవ ప్రాకారపు గోడను ఆనుకుని పొడవైన మంటపాలు రెండు అంతస్థులుగా ఉన్నాయి. ఈ మండపాలకు నాలుగు మూలలా సరస్వతీదేవి, కుమారస్వామి మొదలైన దేవతామూర్తుల మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయానికి పశ్చిమదిశలో నూరుస్తంభాల మండపం ఉంది. వీటిల్లో ఏ రెండు స్తంభాలూ ఒకే పోలికతో ఉండవు. ఆనాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఇది నిదర్శనం. ఊయల మండపంలోని రాతి ఊయలను ఊపితే అది ఊగుతుంది. ఈ చిత్రాన్ని మనం నేటికీ దర్శించవచ్చు.

PC: Anushamutyala

ఉత్సవాలు :

ఉత్సవాలు :

శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి... బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.

PC: Palagiri

ఎలా వెళ్ళాలి?:

ఎలా వెళ్ళాలి?:

కాకినాడకు 14 కి.మీ. దూరంలో సామర్లకోట ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి రైలు, బస్సు సదుపాయాలున్నాయి. సామర్లకోట కు 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు.

సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది. ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారారామము క్షేత్రం చేరుకోవచ్చు.

సామర్లకోట కు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు. అంతేనా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌక

PC : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X