Search
  • Follow NativePlanet
Share
» »సృష్టికి ముందు దేవతలంతా సమావేశమయ్యే ప్రాంతం

సృష్టికి ముందు దేవతలంతా సమావేశమయ్యే ప్రాంతం

కురుడు మలై గణేశ దేవాలయానికి సంబంధించిన కథనం.

యుగాంతం తర్వాత నూతన సృష్టి ఆ చతుర్ముఖుడి చేతులు మీదుగా జరుగుతుందని మనకు తెలిసిందే. ఇందుకోసం సకల దేవతలు ముందుగా ఒక చోట కుర్చొని చర్చిస్తారు. తదుపరి జరగబోయే సృష్టి ఏవిధంగా ఉండాలి. ఆ యుగంలోని మనుష్యుల ముఖ్యలక్షణాలు ఏవి తదితర విషయాలన్నీ వారి మధ్య చర్చకు వస్తాయి. ఇక సృష్టి నిర్మాణానికి ముందు దేవతలంతా కలిసి ఆ ప్రదేశంలో ఉన్న వినాయకుడికి చేస్తారు. అటువంటి విశిష్ట ప్రదేశం మరెక్కడో లేదు.

మన కర్నాటకలోనే ఉంది. ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే సకల విజయాలు జరుగుతాయని చెబుతారు. అందువల్లే కర్నాటకలోని చాలా మంది విద్యార్థుల నుంచి రాజకీయనాయకులు ముఖ్య కార్యాన్ని ప్రారంభించబోయే ముందు ఇక్కడకు వచ్చి ఆ దేవదేవుడిని సందర్శిస్తూ ఉంటారు. అదే విధంగా వినాయక చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన కథనం మీ కోసం...

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

కర్నాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని కురుడుమలై అనే పవిత్ర క్షేత్రంలో దేవతలందరూ సమావేశమవుతారని చెబుతారు.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

కరుడుమలై అనే పేరు కూడు మలే అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. అంటే ఒక చోట చేరు అని అర్థం.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

అంటే దేవతలందరూ ఇక్కడ ఒక చోట చేరేవారని అదే కాలక్రమంలో కరుడుమలై గా మారిందని స్థానికులు చెబుతారు. అదే విధంగా పూర్వం ఈ ప్రాంతాన్ని కూటాద్రి అని పిలిచేవారు.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

అదే కాలక్రమంలో కురుడు మలై గా మారిందని కూడా చెబుతారు. మరొక కథనం ప్రకారం త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులైన పరమేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించారని చెబుతారు.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

అందువల్లే ఆ యుద్ధంలో త్రిమూర్తులు విజయం సాధించరని స్థల పురాణం చెబుతోంది. అదే విధంగా త్రేతాయుగంలో ఈ స్వామివారిని రాముడు సేవించి లంకకు పయానమయ్యాడని ఇక్కడ లభించిన శిలాశాసనాలు తెలియజేస్తాయి.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

ద్వాపరంలో శ్రీ క`ష్ణుడు, పాండవులు ఇక్కడి వినాయకుడుని సేవించినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న గుడిని దాదాపు 2000 ఏళ్ల క్రితం నిర్మించినట్లు పురావస్తు శాఖ చెబుతోంది.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

ఈ గుడి మొత్తం ఏక శిల నిర్మితం. ఇక రాత్రి సమయంలో కౌటిన్య మహామునితో పాటు దేవతలు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవిస్తారని చెబుతారు.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

అందుకు ఆధారంగా రాత్రి పూత ఇక్కడ స్తోత్రాలు వినిపిస్తాయి. ఇక పర్వదినాల్లో ఈ దేవాలయం నుంచి ఓంకార నాదం వినిపిస్తుందని ఇక్కడి పూజారులతో పాటు భక్తులు కూడా చెబుతారు.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

ఇక్కడ గణపతి విగ్రహం ఎత్తు 18 అడుగులు కావడం విశేషం. ఈ కురుడుమలై దేవాలయానికి వంద మీటర్ల దూరంలో కౌంటిన్యమహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి దేవాలయం కూడా ఉంది.

కురుడుమలై

కురుడుమలై

P.C: You Tube

బెంగళూరు నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కోలారుతో పాటు బెంగళూరు నుంచి నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X