» »200 రూపాయల నోటు మీద ఉండే ప్రదేశం ఏదో మీకు తెలుసా?

200 రూపాయల నోటు మీద ఉండే ప్రదేశం ఏదో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ దేశంలో 200 రూపాయల డినామినేషన్‌ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. నోటు ముందువైపు మహాత్మాగాంధీ బొమ్మ వెనక వైపు సాంచీ స్థూపం ఉన్నాయి. దేశ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నాలను ఎంచుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక రంగంలో నగదు కొరత తీవ్రంగా ఉంది.

కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చినప్పటికీ తక్కువ డినామినేషన్‌ కరెన్సీ లభ్యత సమస్య తీవ్రంగా ఉంది. 100 రూపాయల నోట్లకు డిమాండ్‌ పెరగడంతోపాటు కొరత కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 200 రూపాయల నోట్ల వల్ల తక్కువ డినామినేషన్‌ కరెన్సీ కొరత తీరే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన కొత్త కరెన్సీ నోట్లన్నీ రంగురంగుల్లో, ఆకర్షణీయమైన డిజైన్లలో ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్స్‌ అన్నీ పకడ్బందీగా ఉన్న 200 రూపాయల కొత్త నోటుపై ఉన్న ఇతర డిజైన్లు , జామెట్రిక్‌ పాటర్న్స్‌ కలర్‌ డిజైన్‌లో కలిసిపోయేట్టుగా ఉన్నాయి.

నోటు ముందువైపు మహాత్మాగాంధీ బొమ్మ వెనక వైపు సాంచీ స్థూపం ఉన్నాయి. ఈ వ్యాసంలో ఈ సాంచీ స్థూపం గురించి? సాంచీ స్థూపం విశిష్టత గురించి తెలుసుకుందాం.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

సాంచి ఇండియాలోని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయ్‌సేన్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం, ఇది భోపాల్‌కు ఈశాన్యంగా 46 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యప్రాంతంలోని బెస్‌నగర్ మరియు విదిషాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బౌద్ధ యాత్రికుల ముఖ్య స్థలాల్లో ఇది ఒకటి

బౌద్ధ యాత్రికుల ముఖ్య స్థలాల్లో ఇది ఒకటి

ఇది BCE మూడవ శతాబ్దం నుంచి CE 12వ శతాబ్దికి చెందిన పలు బౌద్ధ స్థూపాలకు నిలయం, బౌద్ధ యాత్రికుల ముఖ్య స్థలాల్లో ఇది ఒకటి. ఇక్కడి స్థూపం చుట్టూ ఉన్న తోరణాలు ప్రేమ, శాంతి, విశ్వాసం, సాహసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

మహా స్థూపం

మహా స్థూపం

సాంచిలోని మహా స్థూపం BCE మూడో శతాబ్దికి చెందిన చక్రవర్తి అశోకా ది గ్రేట్ స్థాపించారు. దీని కేంద్ర భాగంలో అర్థగోళాకారంలోని ఇటుకలతో కట్టిన కట్టడంలో బుద్ధుడి ఆస్తికలను ఉంచారు. దీని పైభాగాన ఛత్రం ఉంది, గొడుగు వంటి ఈ నిర్మాణం అత్యున్నత శ్రేణికి నమూనాగా ఉంటుంది, అస్థికలకు నీడనిచ్చి గౌరవించే ఉద్దేశంతో దీనిని నిర్మించారు.

 సాంచి అనగా

సాంచి అనగా

సాంచి బహుశా సంస్కృతం మరియు పాళీ పదమైన సాంచ్ నుండి పుట్టి ఉంటుంది, దీనికి అర్థం కొలవడం . అయితే హిందీలో సాంచి లేదా సాంచా అంటే అర్థం రాతి మూసలు.

సంగ కాలం

సంగ కాలం

ఈ స్థూపాన్ని BCE రెండో శతాబ్దిలో కొంతమేర ధ్వంసం చేశారు, సంగ చక్రవర్తి పుష్యమిత్ర సుంగుడి హయాంలో ఇది జరిగి ఉండవచ్చు. పుష్యమిత్రుడు మూల స్థూపాన్ని ధ్వసం చేయగా అతడి కుమారుడు అగ్నిమిత్రుడు దాన్ని పునర్నిర్మించాడని భావిస్తున్నారు.

ధర్మచక్రం

ధర్మచక్రం

సుంగ వంశీయుల తదుపరి పాలనా కాలంలో, ఈ స్థూపాన్ని రాతి కట్టడాలతో రెట్టింపు పరిమాణంలో విస్తరింపజేశారు. గుమ్మటాన్ని స్థూపంపై భాగానికి సమీపంలో విస్తరించారు మరియు చదరపు పరిమాణంలో మూడు పెద్ద ఛత్రాలను ఉంచారు. అనేక దొంతరలతో కూడిన ఈ గుమ్మడం ధర్మానికి నమునా -ధర్మచక్రం-గా ఉంది. ఈ గుమ్మటం ఒక పెద్ద వృత్తాకారపు వేదికపై ప్రదక్షిణ కోసం ఏర్పర్చబడింది, దీన్ని రెండు వరుసల మెట్ల దారి గుండా దర్శించవచ్చు.

శాతవాహనులు

శాతవాహనులు

నేలకు సమాంతరంగా రెండవ రాతి బాట వద్ద పలు రాతిస్తంభాల వరుసను కట్టారు దీనికి నలువైపులా నాలుగు పెద్ద ద్వారాలు (తోరణాలు) ఎదురెదురుగా ఉన్న రీతిలో కట్టారు. సుంగ వంశ పాలనా కాలంలో నిర్మించినట్లు భావిస్తున్న భవంతులే రెండు, మూడు స్థూపాలుగా ఉంటున్నాయి. (అయితే ఇవి బాగా అలంకరించిన తోరణాలు కావు, శాసనాలను బట్టి ఇవి శాతవాహన కాలానికి చెందినవి తెలుస్తున్నాయి)

శాతవాహన కాలం

శాతవాహన కాలం

కార్వ్‌డ్ డెకరేషన్ ఆఫ్ ది నార్తరన్ గేట్ వే టుది గ్రేట్ స్తూపా ఆఫ్ సాంచితోరణాలు, రాతిస్తంభాలను BCE 70లో నిర్మించారు, వీటిని శాతవాహనుడు కట్టించాడని భావిస్తున్నారు. దక్షిణ భాగంలోని తోరణం వద్ద పైభాగంలో ఉండే పెద్ద దూలాన్ని శాతవాహన శాతకర్ణి వద్ద పనిచేసే శిల్పులు బహుమతిగా ఇచ్చారని శాసనం నమోదు చేసింది.

శాతకర్ణి ప్రధాన శిల్పి

శాతకర్ణి ప్రధాన శిల్పి

"రాజన్ శ్రీ శాతకర్ణి ప్రధాన శిల్పి వాసితి పుత్రుడు అనందుడు సమర్పించిన బహుకృతి". రాతితో కట్టినప్పటికీ, వాటిని కొయ్యతో చెక్కినంత రమణీయంగా వంపులు చెక్కి కట్టారు. ప్రవేశ ద్వారాలవద్ద వర్ణ శిల్పాలను పెట్టారు.

బౌద్ధ సంప్రదాయం

బౌద్ధ సంప్రదాయం

అవి బుద్ధుడి జీవితంలో రోజువారీ ఘటనలకు సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించేవి. దారినపోయేవారికి ఇవి చాలా సులభంగా బోధపడుతూ వారి జీవితాలకు బౌద్ధ సంప్రదాయం ఎలా ఉపయోగపడుతుందో సుబోథకం చేసేవి.

రాజ సహాయం

రాజ సహాయం

సాంచి వద్ద చాలావరకు ఇతర స్థూపాల నిర్మాణానికి స్థానిక ప్రజానీకం విరాళాలు సమర్పించింది. స్థూపానికి ఆధ్యాత్మిక స్ఫూర్తి పొందాలనే కోరిక దీని వెనకు ఉంది. దీనికి ప్రత్యక్షంగా రాజ సహాయం ఉండేది కాదు. భక్తులు, స్త్రీ పురుషులు ఇరువురూ ఒక శిల్పానికి కావలిసినంత డబ్బు విరాళంగా ఇచ్చి బుద్ధుడి జీవితానికి సంబంధించి తమకు నచ్చిన దృశ్యాన్ని ఎంచుకునేవారు. తర్వాత వారి పేర్లు ఆ శిల్పంపై చెక్కబడేవి.

బుద్ధుడు

బుద్ధుడు

దీంతో స్తూపం మీద ఒక ప్రత్యేక ఉదంతానికి చెందిన కథ పలు చోట్ల పునరావృతమై కనిపించేది (దహేజియా1992). ఈ రాతి శిల్పాలలో బుద్ధుడిని మానవుడిగా మాత్రం చిత్రించేవారు కాదు. దీనికి బదులుగా కళాకారులు అతడికి కొన్ని లక్షణాలను ఆపాదించేవారు.

బోధి వృక్షం

బోధి వృక్షం

అతడు తండ్రి ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చిన గుర్రం, అతడి పాదముద్రలు, లేదా జ్ఞానోదయమైన సమయంలో బోధి వృక్షం కింద ఉన్న మండపం ఇలాంటి గుర్తులను చెక్కేవారు. మానవ దేహం బుద్ధుడికి సరిపోక పోవచ్చని వారు ఆలోచించి ఉండవచ్చు.సాంచి స్థూపం అంచులలోని కొన్ని వర్ణ చిత్రాలు గ్రీకు అలంకరణలలో ఉన్నవారు (గ్రీకు దుస్తులు, లక్షణాలు, సంగీత వాయిద్యాలు) స్తూపానికి మొక్కుతున్నట్లు చూపిస్తున్నాయి.

తదుపరి కాలాలు

తదుపరి కాలాలు

తదుపరి స్తూపాలు, ఇతర బౌద్ధ మత, తొలి హిందూ కట్టడాలను క్రీస్తు శకం 12వ శతాబ్ది వరకు శతాబ్దాల పాటు నిర్మిస్తూ వచ్చారు. 17వ ఆలయం బహుశా మొట్టమొదటి బౌద్ధ ఆలయాలులో ఒకటి కావచ్చు ఎందుకంటే దానిమీది తేదీలు తొలి గుప్తుల కాలాన్ని చూపిస్తున్నాయి.

 అద్భుతరీతి

అద్భుతరీతి

దీంట్లోనే సమతలాకారంలోని పై కప్పుతో ఉన్న చదరపు గర్బగుడి ఉంది. దానికి మంటపం నాలుగు స్తంభాలు కూడా ఉన్నాయి. గర్భగుడి లోపలి ప్రాతం మరియు వెలుపలి ప్రాంతంలోని మూడు పక్షాలు సాదాగా, నిరలంకారంగా ఉంటున్నాయి కాని, ముందుభాగం మరియు స్తంభాలను మాత్రం అద్భుతరీతిలో చెక్కారు.

బౌద్ధమతం పతనం

బౌద్ధమతం పతనం

దీంతో ఆలయానికి దాదాపు ప్రామాణిక రూపం సిద్ధించింది (మిత్రా 1971) భారతదేశంలో బౌద్ధమతం పతనంతో సాంచి స్తూపాలు ఉపయోగంలో లేకుండా పోయాయి. ఒక రకంగా అవి కనుమరుగయిపోయాయి.

పాశ్చాత్య చరిత్రకారుడు

పాశ్చాత్య చరిత్రకారుడు

1818లో జనరల్ టేలర్ అనే బ్రిటిష్ అధికారి సాంచి ఉనికిని గురించి నమోదు చేసిన (ఇంగ్లీషులో) మొట్టమొదటి పాశ్చాత్య చరిత్రకారుడిగా పేరుకెక్కాడు. ఔత్సాహిక పురావస్తు శాస్త్రజ్ఞులు మరియు గుప్తనిధుల వేటగాళ్లు ఈ ప్రాంతాన్ని 1881 వరకు తవ్విపడేశారు, ఆ తర్వాతే స్తూపం పునరుద్ధరణ పని మొదలైంది.

UNESCO

UNESCO

1912 మరియు 1919 మధ్య కాలంలో కట్టడాలను ప్రస్తుతం కనిపిస్తున్న రూపంలోకి సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. ఈరోజు, దాదాపు 50 స్మారక స్తూపాలు సాంచి కొండమీదే ఉంటున్నాయి. వీటిలో మూడు స్తూపాలు, పలు ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ స్మారక స్తూపాలను 1989 నుండి UNESCO ప్రపంచ వారసత్వ స్థలాలులో చేర్చారు.

 ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

హైదరాబాద్ నుండి సాంచి చేరుటకు విమానం ద్వారా 3గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్, నాగపూర్ మీదుగా సంచి వెళ్ళవచ్చును. బస్సులో నయితే కరీంనగర్, వార్ధామీదుగా 19గంటల సమయం పడుతుంది.