Search
  • Follow NativePlanet
Share
» »చరిత్ర నిధిని తమలో దాచుకున్న ఈ కోటలను చూశారా?

చరిత్ర నిధిని తమలో దాచుకున్న ఈ కోటలను చూశారా?

ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ప్రాచూర్యం చెందిన కోటలకు సంబంధించిన కథనం.

కోటలు చారిత్రకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ కోటలను పరిశీలంచడం వల్ల ఆయా కాలంనాటి రాజుల నుంచి సాధారణ ప్రజల జీవన విధానాలు మనకు అవగతమవుతాయి. అందుకోసమే వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోటల పై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి కోటలు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు మీ కోసం..

ఆంకాళమ్మ కోట

ఆంకాళమ్మ కోట

P.C: You Tube

ఆంకాళమ్మ కోట అటు తెలంగాణలోని మహబూబ్ నగర్ కు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సరిహద్దులోని నల్లమల అడువుల్లో ఉంది. ఈ ప్రాంతంలో ప్రవహించే కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండమీద 20 ఎకరాల విస్తీర్ణంలో కోటను నిర్మించారు.

ఆంకాళమ్మ కోట

ఆంకాళమ్మ కోట

P.C: You Tube

కోట కొంత శిథిలావస్థకు చేరుకుంది. ఈ కోటను 16వ శతాబ్దంలో నిర్మించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటకులు అమరగిరిగ్రామానికి చేరుకొని అక్కడి నుంచి పుట్టీల్లో, మోటారు బోటుల్లో ప్రయాణించి అంకాళమ్మ కోటను చేరుకొంటారు.

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట

P.C: You Tube

ఉదయగిరి కోట నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉంది. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉదయగిరి కోటది. పల్లవుల నుంచి విజయనగర రాజుల వరకూ ఈ కోటను పరిపాలించారు. ముస్లీం పాలకుల్లో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఈ కోను పాలించాడు.

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట

P.C: You Tube

అతను వాడిన ఖడ్గం ఇప్పటికీ ఈ కోటలో ుంది. అటు పై ఈ కోట ఆంగ్లేయుల వశమైంది. ఆ సమయంలో డైకన్ దొర కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ కోటలోని రాజ్ మహల్ లో అద్దాలమేడతో పాటు ఇంకా అనేక భవనాలను నిర్మించాడు. నెల్లూరు పట్టణానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట వీకెండ్ లో పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

గుత్తి కోట

గుత్తి కోట

P.C: You Tube

గుత్తికోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి సమీపంలో ఉంది. ఇది భారత దేశంలో అత్యంత పురాతనమైన దుర్గాల్లో గుత్తి కోట కూడా ఒకటి. దీనిని మొదట ఏడవ శతాబ్దంలో నిర్మించారు. అటు పై ముస్లీం రాజులు, బ్రిటీష్ వారు ఈ కోటను తమ ఆధీనంలోకి తీసుకొని పటిష్టం చేశారు.

గుత్తి కోట

గుత్తి కోట

P.C: You Tube

ఈ కోట భూ మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కోట శంఖు ఆకారంలో నిర్మించబడింది. 15 బురుజులు, 15 ముఖద్వారాలతో ఈ కోట ఉంటుంది. కోటలో అనేక మంచి నీటి బావులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో ఇప్పటికీ నీరు తాగడానికి పనికి వస్తాయి.

పెనుగొండ కోట

పెనుగొండ కోట

P.C: You Tube

పెనుకొండ కోట విజయనగర రాజుల రెండువ రాజధానిగా వెలుగొందింది. దీనిని శత్రుదుర్భేద్యంగా అత్యంత పటిష్టంగా నిర్మించారు. ఇక్కడ జైన మతము కూడా చాలా బాగా అభివ`ద్ధి చెందింది. అందువల్లే అక్కడ మనకు అనేక జైన దేవాలయాలు కనిపిస్తాయి.

పెనుగొండ కోట

పెనుగొండ కోట

P.C: You Tube

శ్రీ శ్రీ కృష్ణదేవ రాయల కాలంలో ఇది వేసవి విడిది కూడా. విజయనగర రాజ్య పతనానంతరం అక్కడి నుంచి అనేక ఏనుగులు, గుర్రాల పై విజయనగర సంపద తరలించి పెనుకొండ, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటలో దాచారని చరిత్ర చెబుతోంది. అందువల్లే ఈ రెండు కోటల్లో గుప్త నిధుల కోసం నిత్యం తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి.

కొండవీడు కోట

కొండవీడు కోట

P.C: You Tube

కొండవీడు కోట గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం సమీపంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అతి పురాతన కోటల్లో ఒకటి. కోట లోపల, కోట బయట గోడల మీద అపురూప శిల్ప సంపద ఉన్నాయి. ఈ కోటలో 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధ శాలలు ఉన్నాయి.

కొండవీడు కోట

కొండవీడు కోట

P.C: You Tube

ఇక్కడ సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే బౌద్ధమతం విరిసిల్లిందని చెబుతారు. శాతవాహనుల కాలంలో ఈ బౌద్ధమతం బాగా అభివ`ద్ధి చెందిందనడానికి అనేక ఆధారాలు లభించాయి. చైనాకు చెందిన పింగాణి పాత్రల అవశేషాలు కూడా ఈ కొండవీడులో లభించడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X