Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకులకు స్వర్గధామం అయిన హోటల్స్ ఇక్కడే?

పర్యాటకులకు స్వర్గధామం అయిన హోటల్స్ ఇక్కడే?

భారతదేశంలోని హోటల్స్ గురించి ప్రత్యేక కథనం.

నెలకు ఒకసారైనా మంచి రెస్టోరెంట్ కు వెళ్లి మనకు ఇష్టమైన వంటకాలను తిని కనీసం రెండు రోజులు సరదాగా గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే మనం వెళ్లే రెస్టోరెంట్ లో సకల సౌకర్యాలు ఉండాలనుకొంటాం. ముఖ్యంగా ఆహారంతో పాటు స్విమ్మింగ్ పూల్, టీ.వీ తదితర సౌకర్యాలన్నీ ఉండాలనుకొంటాం. అలా భారత దేశంలో అత్యంత విలాసవంతమైన రెస్టోరెంట్ల వివరాలు మీ కోసం...

తాజ్‌‌లేక్ ప్యాలెస్

తాజ్‌‌లేక్ ప్యాలెస్

P.C: You Tube

తాజ్‌లేక్ ప్యాలెస్ భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన హోటల్స్ ‌లో ఒకటి. ఈ రెస్టోరెంట్ రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లోని సరస్సు మధ్యలో ఉంది. ముఖ్యంగా వీవీఐపీలు, ఫారినర్స్ ఇక్కడ ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతారు. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది.

లీలా ప్యాలెస్

లీలా ప్యాలెస్

P.C: You Tube

తాజ్‌ప్యాలెస్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన హోటల్ లీలాప్యాలెస్. ఇది కూడా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉంటుంది. పర్యాటకులకు రెడ్‌కార్పెట్ స్వాగతం లభిస్తుంది. ఈ హోటల్‌లో ఉండేవారికి రాజస్థాన్ సంప్రదాయ వంటకాలతో పాటు ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఒబెరాయ్ అమర్ విలాస్

ఒబెరాయ్ అమర్ విలాస్

P.C: You Tube

ఈ ఒబెరాయ్ అమర్ విలాస్ ఆగ్రాలోని ప్రముఖ హోటల్. ఆగ్రాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం తాజ్‌మహల్ కు కేవలం 600 మీటర్ల దూరంలోనే ఈ హోటల్ ఉంటుంది. ఇక్కడ స్పా, యోగా కూడా అందుబాటులో ఉంటుంది.

ఉమాయిద్ భవన్ ప్యాలెస్

ఉమాయిద్ భవన్ ప్యాలెస్

P.C: You Tube

ఈ ప్యాలెస్‌ను హెచ్, హెచ్ మహారాజ్ ఉమాయిద్ సింగ్ జీ క్రీస్తుశకం 1928లో జోద్‌పురలో కట్టించారు. ఈ ప్యాలెస్ ముందు భాగంలో పచ్చని ఉద్యానవనం ఉండటం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్యాలెస్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన జస్‌వంత్ తాండ, మెహరంగర్ కోట తదితరాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X