Search
  • Follow NativePlanet
Share
» »ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

By Venkatakarunasri

రాచరికవ్యవస్థ కాలగర్భంలో కలిసిపోయినా రాజులపరిపాలనాఇప్పుడు లేకున్నా ఆ కాలంలో వారిచేత నిర్మింపబడ్డకోటలు మాత్రం ఇప్పటికి పదిలంగా వున్నాయి. అప్పటివారి పరిపాలనను గుర్తు చేస్తుంటాయి.కోటనిర్మాణంలో ఆయా రాజులు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అత్యంతసుందరంగా, కళాతేజస్సుతో కోటలను నిర్మించేవారు. వారి పరిపాలనావిధానం కూడా ఆ కోటలలో మనకు కనిపించేది.అలాంటి అందమైన కోటలలో ఒకటి మధుగిరికోటని నిర్మించారు అప్పటిమైసూర్ రాజులు.

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఎక్కడుంది?

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు పట్టణానికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది ఈ మధుగిరి కోట, సుమారు మూడున్నర వేల అడుగుల ఎత్తైన ఏకశిలా పర్వతాన్ని కలుపుకొని ఈ కోట నిర్మించ బడింది. మొదట్లో దీన్ని మధు అని పిలిచేవారు.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

కాలానుగుణంగా మద్గరి.....మద్దగిరి అనే పేర్లు వచ్చాయి. మైసూరు రాజులు ఈ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్న తరువాత దీనికి "ప్రసన్న గిరి" అని పేరు పెట్టారు. హైదర్ అలీ మైసూర్ సంస్థానాధీశుడైన తరువాత దీనికి "పతేబాద్" అని పేరు మార్చాడు.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

అక్కడ లభించిన శాసనాలను బట్టి దీనికి కృష్ణ గిరి... మాధవ గిరి అని పేర్లున్నట్లు తెలుస్తున్నది. ఆంగ్లేయుల కాలంలో దీన్ని "మద్దగిరి" అని పిలిచే వారు. ఆంగ్లేయులు ఆ పేరును సరిగా పలకలేనందున 1927 వ సంవత్సరంలో అక్కడ ఆంగ్లేయుల అధికారిగా పనిచేసిన మాస్తి వెంకటేష్ అనే సుప్రసిద్ద కన్నడ కవి దీనికి "మధుగిరి" అని స్థిరమైన నామకరణం చేశాడు.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఈ పర్వతం ఆసియా లోనే అతి పెద్ద ఏకశిలా పర్వతమని స్థానికులంటారు. కొండ పైన విశాల ప్రదేశం తియ్యటి నీటి కొలనులు, ఉన్నాయి. పైకి ఎక్కడానికి మెట్లదారి ఉంది. ఈ కోటను టిప్పు సుల్తాన్ కాలంలో మరింత భద్రంగా తీర్చి దిద్దాడు. కోట గోడలు, బురుజులు ఇప్పటికి చెక్కుచెదర లేదు.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

కోటకు ఆనాడు నిర్మించిన అంతరాళ ద్వారం, దిడ్డివాకిలి, మైసూరు వాకిలి అనేవి నేటికి పతిష్టంగా ఉన్నాయి. ద్వారాలకు తలుపులు మాత్రం సిధిలమైనాయి. కోట లోపల చానయ్యన బావి, అరసన బావి, ప్రధాన బవి, దేవరాయ సముద్రం లాంటి పేర్లతో అనేక ఊట బావులున్నాయి.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

అవన్ని మంచి శిల్పకళాకృతులే గాక అందులోని నీరు చాల తియ్యాగా ఉన్నాయి. కోట వెలుపల ఆనాడు అత్యంత సుందరంగా నిర్మించిన రెండు పుష్కరణిలు ఈనాటికి చెక్కు చెదర కుండా ఉన్నాయి. కొండ దిగువనుండి కోట లోపలికి ప్రవేశించి కొండ పైకి వెళ్లాలంటే 15 కోట ద్వారాల నుండి వెళ్ళాల్సి వుంటుంది.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఈ కోట వైశాల్యం సుమారు 232 ఎకరాలుంటుంది. కోట లోపల కొన్ని ఆలయాలలోను, శిథిల మందిరాల లోను నిధుల కోసం ఇటీవల దుండగులు కొందరు రహస్యంగా త్రవ్వకాలు సాగించారు. ఆ కారణంగా కొన్ని కట్టడాలు శిథిలమైనాయని స్థానికులు చెప్తున్నారు.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ప్రాముఖ్యత

జయమంగలి కృష్ణ జింక రిజర్వ్ మైదానం: ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఏకశిల మధుగిరిలో వుంది. జయమంగలి కృష్ణ జింక రిజర్వ్ మైదానంను హళ్లీ కృష్ణ జింక అభయారణ్యం అని పిలుస్తారు. మధుగిరి నుండి 25 కిలోమీటర్ల దూరంలో కొడిగెనహళ్లి దగ్గరలో ఉంది. రిజర్వ్ లోపల రాత్రిపూట శిబిరాలకు కోసం ముందుగా అనుమతి తీసుకోవాలి.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

చెన్నరాయన దుర్గ

చెన్నరాయన దుర్గ తుంకూర్ ద్వారా మధుగిరి మార్గంలో కొరటగెరె నుండి 10 కిమీ దూరంలో వుంది. తొమ్మిది దుర్గ కోటలలో ఇది ఒకటి. కోట లోపల ఒక చిన్న ఆలయం మరియు పాత నిర్మాణాలు వున్నాయి. సిద్దర మెట్ట ఔషధ మూలికలకు ప్రసిద్ధి చెందింది. కొండ పైన వున్న అరణ్యాలలో ఔషధ విలువలు కలిగిన వృక్షాలు వున్నాయి.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

మధుగిరి ఫోర్ట్

మధుగిరి ఫోర్ట్ విజయనగర్ రాజవంశం వారు నిర్మించినది. జైన దేవాలయాలు కూడా ఈ ప్రదేశంలో కనిపిస్తాయి. మధుగిరి ఫారెస్ట్ ను తిమ్మలపుర ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫారెస్ట్ మగ కోళ్ళు, ఎలుగుబంట్లకు పేరుగాంచింది.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

మధుగిరి పట్టణంలో గల దేవాలయాలు

పట్టణంలో వెంకటరమణ మరియు మల్లేశ్వర దేవాలయాలు పక్కపక్కనే వున్నాయి. ఇక్కడ దేవాలయాలు ద్రావిడ శైలిలో నిర్మించబడ్డాయి. గర్భ గృహాలయం హొయసల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. శ్రీ హరిహరస్వామి దేవాలయం తూర్పుముఖంగా వుంది. క్రీ.శ. 979 శాలివాహన శకంలో నిర్మించారు. వీరశైవ గుర్రమ్మన మఠం వద్ద శివలింగస్వామి అనే గురువు యొక్క సమాధి ఉంది. మఠానికి సమీపంలో కొన్ని గుహలు వున్నాయి. అంతరాలదా బాగిలు, దిడ్డిబాగిలు మరియు మైసూర్ గేట్ వంటి అనేక ద్వారాలు కలిగిన కొండ దారి.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

దేవరాయన దుర్గ

దేవరాయనదుర్గలో ప్రధాన ఆకర్షణ యోగనరసింహ దేవాలయం. ఇక్కడ దగ్గరలో వున్న కొండలుదేవరయన్ దుర్గ కొండలు.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

నంది కొండలు: నంది హిల్స్ బెంగుళూరు వారికి ఒక ప్రముఖ హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 478మీ ఎత్తులో వుంది. కొండలు మార్గంలో పొద్దుతిరుగుడు తోటలు మరియు వైన్ యార్డులు ఉన్నాయి.

శివగంగే : శివగంగే మార్గంలో దేవాలయాల వరుస పొడవైన శృంగాకారకారంలో వున్నాయి. స్కందగిరి: స్కందగిరి కర్నాటకలో చిక్ బల్లాపూర్ పట్టణం సమీపంలో పర్వతంపై ఉంది. స్కందగిరి రాత్రి ట్రెక్కింగ్ ప్రసిద్ధి చెందింది.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

మధుగిరి చూచుటకు మంచి సమయం

మధుగిరి కొండ ట్రెక్ కు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి నెలలు.

PC:youtube

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

చేరుకోవడానికి ఎలా ?

మధుగిరి బెంగుళూర్ నుండి 100 కి.మీ దూరంలో వుంది. రూట్ 1: బెంగుళూర్ - నెలమంగళ - డబ్బసపేటే - కొరతగెరే - మధుగిరి మధుగిరి కోటకు కెంపెగౌడ బస్ స్టాండ్ నుండి ప్రత్యక్షంగా కె.ఎస్.ఆర్.టి.సి బస్సులు మరియు కె.ఆర్ మార్కెట్ బస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ట్రెక్ ప్రారంభ స్థానం మదిగిరి ప్రభుత్వ కార్యాలయ భవనాల మధ్య ఉంది. మధుగిరి మెట్ట ట్రెక్కింగ్ కు మీ వెంట నీటిని తీసుకుని వెళ్ళడం ఉత్తమం.

PC:Google maps

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతం ఎక్కడుందో తెలుసా ?

ఆహారం మరియు వసతులు మధుగిరి పట్టణం వద్ద పండ్లు, పానీయాలు, స్నాక్స్ అమ్మకం దుకాణాలు అందుబాటులో ఉన్నాయి.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more