Search
  • Follow NativePlanet
Share
» »లక్ష్మీదేవి స్థిరంగా వైకుంఠం వదిలి భూలోకంలో వుండే ఒకే ఆలయ రహస్యం

లక్ష్మీదేవి స్థిరంగా వైకుంఠం వదిలి భూలోకంలో వుండే ఒకే ఆలయ రహస్యం

మహారాష్ట్రకు ఆధ్యాత్మిక రత్నం కొల్హాపూర్. పురాతన మోటైన దేవాలయాలు, ప్రశాంతమైన ఉద్యానవనాలు, చారిత్రక కోటలూ, అంతఃపురాలూ వీటన్నిటితో ఈ నగరం జాతీయ గర్వకారణం.

By Venkatakarunasri

మహారాష్ట్రకు ఆధ్యాత్మిక రత్నం కొల్హాపూర్. పురాతన మోటైన దేవాలయాలు, ప్రశాంతమైన ఉద్యానవనాలు, చారిత్రక కోటలూ, అంతఃపురాలూ వీటన్నిటితో ఈ నగరం జాతీయ గర్వకారణం. పంచగంగా నది ఒడ్డున ఉన్న కొల్హాపూర్ చరిత్ర మన దేశంలో చాలా కాలం సాగిన మరాఠా పాలనతో పెనవేసుకుపోయింది. చిత్రంగా, మహాలక్ష్మి అమ్మవారు చంపిన కొల్హాసురుడనే రాక్షసుడి పేరు మీద ఈ నగరం వెలిసింది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో వెలసిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం, శక్తి పీఠాలలో ఒకటి.ఈ శక్తి పీఠం ముఖ్యమైన ఆరింటిలో ఒకటి. ఈ ఆలయాన్ని దర్శిస్తే మోక్షం లభించి మనస్సులో కోరినకోర్కెలు తీరుతాయి.మహా విష్ణువు సతీమణి శ్రీ మహాలక్ష్మితో కలిసివుండే ప్రదేశంగా భావిస్తారు. కన్నడచాళుక్య రాజుల కాలంలో అంటే క్రీ.శ.700లలో నిర్మించబడిందిగా భావిస్తారు.

ఈ నగరం కొన్ని వందల ఏళ్ల నాటిది.శ్రీ మహా విష్ణువు కొల్హాపూర్ ను తన ఆవాసంగా చేసుకున్నాడనీ, మహాలక్ష్మి ఆయన అంశ అనీ ఇక్కడ నమ్ముతారు. అంబాదేవి గా పిలువబడే మహాలక్ష్మీ దేవాలయం కొల్హాపూర్ లో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం.కొల్హాపూర్ ను దక్షిణ కాశీ గా పిలుస్తారు.

లక్ష్మీదేవి స్థిరంగా వైకుంఠం వదిలి భూలోకంలో వుండే ఒకే ఆలయం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

శిలావేదికపై చతుర్భుజాలతో, స్వర్ణ కిరీటంతో అమ్మవారు దర్శనమిస్తారు. జెంస్టోన్స్ తో తయారుచేయబడిన ఈ విగ్రహం బరువు 40కిలోలు వుంటుంది. విగ్రహం ఎత్తు 3అడుగుల నల్లరాతి సుందర విగ్రహం.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

గర్భగుడి గోడపై శ్రీచక్రం వుండటం ఇక్కడి ప్రత్యేకత.మహాలక్ష్మీ విగ్రహం వెనుక శిలతో చెక్కబడిన సింహవాహనం వుంటుంది.అమ్మవారి కిరీటంలో విష్ణువు శయనించే ఆదిశేషుడు వుండటం మరోప్రత్యేకత.చతుర్భుజాలలోనూ 4ప్రత్యేకవస్తువులు వుంటాయి.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

కుడి కింది చేతిలో నిమ్మకాయ వుంటుంది.కుడి పై చేతిలో కౌముదికం,తల భూమికి ఆనినట్లుగా వుంటుంది. ఎడమపై చేతిలో కటకం అనే ఆయుధం,క్రింది చేతిలో ఒక పాత్ర వుంటుంది.ఈ నాలుగు నాలుగు ప్రత్యేక ధర్మాలను కలిగివుంటుంది.సాధారణంగా ఆలయాలలో విగ్రహాలు తూర్పు లేక వుత్తరముఖంగా వుంటాయి.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ప్రత్యేకత

కానీ మహాలక్ష్మీదేవి పశ్చిమాది ముఖంగా వుండటం మరో ప్రత్యేకత.పడమరలో వున్న గోడకు ఒక చిన్న కిటికీ వుంటుంది.ఇందులో నుండి మార్చి21 నుండి సెప్టెంబర్ లోపు 3రోజులు సూర్యాస్తమ కిరణాలు
అమ్మవారి ముఖంపై పడి వింతశోభను చేకూర్చటం మరో వింత అనుభవం.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

అమ్మవారికి రోజూ 5 సార్లు అర్చన జరుగుతుంది.ఉదయం 5గంటలకు శ్రీమహాలక్ష్మీదేవికి మంత్రపూతంగా సుప్రభాత సేవ చేస్తారు.శుక్రవారం పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల వూరేగిస్తారు.ప్రళయకాలంలో కూడా ఇక్కడ శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మి వుంటారని పురాణ కథనం.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

అందుకే దీనిని ఆ విముక్తక్షేత్రం అంటారు. లక్ష్మీదేవి భ్రుగుమహర్షి వల్ల విష్ణుమూర్తికి జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక వైకుంఠం వదలి కొల్హాపూర్ చేరి ఇక్కడ వేంకటేశ్వరుడని పిలవబడే విష్ణుమూర్తి వుండటం గ్రహించి స్థిరపడిపోయిందని చారిత్రికకథనం.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

తిరుమలలో మహాలక్ష్మి రూపమైన పద్మావతిదేవిని శ్రీనివాసుడు వివాహం ఆడినట్లు లక్ష్మీదేవి తెలుసుకొన్నది.ప్రతిరోజూ మధ్యాహ్నం దత్తాత్రేయుడు ఇక్కడకు వచ్చి అమ్మవారిభిక్ష స్వీకరిస్తూవుంటాడని అనుకుంటూ వుంటారు.సుమారు 6000కిందినాటిది ఈ దేవాలయం.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జనవరి31వ తేదీ,నవంబర్ 9వ తేదీన సూర్యాస్తమ కిరణాలు అమ్మవారి పాదాలను స్పృశిస్తాయి.అందుకే ఇక్కడ కిరణోత్సవసమయంలో లక్షలాది భక్తులు వచ్చి దర్శించుకుని పులకిస్తారు. అలాగే ఫిబ్రవరి 1,నవంబర్ 10న కిరణాలు అమ్మవారి వక్షస్థలంపై పడతాయి.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఫిబ్రవరి 2, నవంబర్ 11తేదీలలో మహాలక్ష్మిఅమ్మవారు శరీరంఅంతటా సూర్యకిరణాలు పడి వింతతేజస్సును ఇస్తాయి. ఈ రోజుననే కిరణోత్సవసమయం అంటారు.ఈ కిరణోత్సవ సమయం అనేది దాదాపు 1000సంల నుండి కొనసాగుతూ వస్తున్నదనిభావిస్తారు.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

కొంకణ రాజు కామదెవు చాళుక్య రాజు క్రీ.శ. 107లో కర్ణదేవ్ మహారాజ్ అడవి అంతా కొట్టించి ఆలయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడట.9వ శతాబ్దంలో రాజా గండివాడి మహాకాళి ఆలయం నిర్మించి వ్యాప్తిచేసాడు. అయితే 1792లో శంభోజీమహరాజ్ కు అమ్మవారు కలలో కనిపిస్తే విగ్రహం కొరకు వెదికాడట. అయితే లక్ష్మీదేవికి ఒక సోదరికూడా ఉంది.

pc:Dharmadhyaksha

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

సెప్టెంబర్ 26న అమ్మవారిని పునఃప్రతిష్టించారు. అప్పట్నుంచి మహారాష్ట్ర వారికి ఆరాధ్యదేవత అయింది.అయితే లక్ష్మీ దేవికి మరోసోదరి కూడా వుంది. ధనం మూలం ఇదం జగత్ అన్నారు
మరి ప్రతిఒక్కరు డబ్బు సంపాదించాలని ధనం కావాలని ఆశ పడుతూ వుంటారు.

pc:Dharmadhyaksha

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఆర్ధిక సమస్యలనుండి బయట పడాలని సర్వదా సిరిసంపదలనిచ్చే లక్ష్మీ దేవికి ఒక అక్కకూడా వుంది.ఆమెపేరే అలక్ష్మి.మరి సాగరమధనంలో లక్ష్మీ దేవి ఆవిర్భవిస్తుంది.లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకుంటానూ అంటాడు.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

అప్పుడు లక్ష్మీదేవి నిరాకరించి తనకు ఒక అక్కకూడా వుందని తనకు వివాహం జరిగాకే తాను వివాహం చేసుకుంటాను అంటుంది కానీ అలక్ష్మిని ఎవ్వరూ వివాహం చేసుకోటానికి ముందుకురారు.ఎందుకంటే ఆమె వున్నచోట ఐశ్వర్యం నిలబడదు.దారిద్ర్యం చుట్టుకుంటుంది.ఈ పరిస్థితుల్లో ఎవ్వరు ఎవ్వరూ వివాహం చేసుకోటానికి ముందుకురారు.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

చివరికి ఒక ఋషి ఆమెను పెళ్ళిచేసుకోటానికి ముందుకు వస్తాడు.ఆయన పేరు ఉద్దాలకుడు.తర్వాత లక్ష్మీదేవి శ్రీమహా విష్ణువును వివాహమాడుతుంది. అయితే లక్ష్మీదేవిఅక్క ఉద్దాలకుడితో వివాహం చేసుకున్న తర్వాత అతడితో పాటు ఇంట్లోకి వెళ్ళకుండా గుమ్మంవద్దే ఆగిపోతుంది.

pc:Dharmadhyaksha

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఉద్దాలకుడు ఆశ్చర్యంతో ఎందుకని అక్కడే ఆగిపోయావ్ అని అడుగుతాడుఅప్పుడు తాను శుభ్రంగా వున్న ఇంటిలో వుండనని,మురికిగాఎప్పుడూ ఏదో అశాంతితో వుండే ఇంటిలో మాత్రమే వుంటానని చెప్తుంది.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

మరి అందుకే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా,పరిశుభ్రమైన దుస్తులు ధరించి ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా వుండాలి.మైతాలజీ ప్రకారమే కాదు సైంటిఫిక్ గా కూడా ఇదినిజమే .పరిశుభ్రంగా ప్రశాంతంగా వున్న చోట అశాంతికి అనారోగ్యాలకు తావనేది వుండదు.

pc:Dharmadhyaksha

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూకూడా లక్ష్మీదేవి తామరపువ్వులో కూర్చున్నఫోటో మాత్రమే పెట్టుకోవాలి. నిలబడివున్న లక్ష్మీదేవి ఫోటోకాని లేదా లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ వున్న పటాలను ఇంట్లో ఎంతమాత్రం వుంచుకోరాదు.

pc:Dharmadhyaksha

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడ చూడవలసినవి

కొల్హాపూర్ లోని ప్రతి కోటకీ అబ్బురపరిచే చారిత్రిక వారసత్వం వుంది. చరిత్ర ప్రేమికులు శాహూ ప్రదర్శనశాల తప్పక చూడాలి. సంప్రదాయ కుస్తీ కళను ఇప్పటికీ సాధన చేసే ఖుష్బాగ్ మైదానం కొల్హాపూర్ లో వుంది.

pc:Dharmadhyaksha

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడ చూడవలసినవి

ఇది ఒకేసారి 30వేల మందికి కూర్చునే వసతి కల్పిస్తుంది - దీన్ని నిర్మించిన వారి చాతుర్యానికి ఇది తార్కాణం. ప్రకృతి ప్రేమికులు, ఆనందం కోరేవారు కొల్హాపూర్ లోని చెరువుల ఒడ్డున కాలక్షేపం చేయవచ్చు. మీరు చూడకుండా ఉండలేని మరో అద్భుత ప్రదేశం రంకాల చౌపాటే - అది పిల్లలు మీతో వచ్చినప్పుడు.

pc: wikimedia.org

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడ చూడవలసినవి

కొల్హాపూర్ వెళ్లి కూడా మీరు కొల్హాపురి మిసాల్ తినలేకపోయినా, కొల్హాపూర్ చెప్పుల జతలు కొనకపోయినా సిగ్గు పడాల్సిందే. షాపింగ్ కి వెళ్ళండి, ఇక్కడి స్థానికులు మిమ్మల్ని ఎంత సాదరంగా ఆహ్వానిస్తారో చూడండి. ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ప్రియమైన వారికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ చాలా రకాల కళాకృతులు, కానుకలు దొరుకుతాయి.

pc:Ankur P

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడ చూడవలసినవి

పుల్లటి పులుసు అని అర్ధం వచ్చే తంబాడ రస్సా తప్పకుండా రుచి చూడాల్సిందే - మీరు మసాలా రుచి ప్రియులైనా, కాకపోయినా. ఇక్కడ తయారయ్యే ప్రతీ వంటకం లోనూ ప్రత్యేకమైన కొల్హాపురి మసాలా పడవలసిందే.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

కొల్హాపూర్ గురించి సరదాగా వుండే చిన్న విషయం ఏమిటంటే దేశంలో మొట్టమొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర ఇక్కడే తయారైంది. ఇక్కడి వారు ఎక్కువగా మరాఠీ లో మాట్లాడతారు, ఐతే అందులో కొంచెం గుజరాతీ, మార్వాడి కూడా కలుస్తుంది.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడికి ఎప్పుడు, ఎలా చేరుకోవాలి?

కొల్హాపూర్ లో కోస్తా, అన్తఃస్థలీయ వాతావరణాల మిశ్రమం వుంటుంది. అందువల్ల, ఉష్ణోగ్రత కూడా బాగా వేడిగా గానీ, బాగా చల్లగా గానీ వుండదు. వేసవిలో ఉష్ణోగ్రత 35డిగ్రీలకు మించదు, తేమగా వున్నా వాతావరణం సాధారణంగా చల్లగానే వుంటుంది.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడికి ఎప్పుడు, ఎలా చేరుకోవాలి?

శీతాకాలం మరింత ఆహ్లాదపరుస్తుంది. అందువల్ల ఈ నగరాన్ని ఏడాది లో, వరదలు వచ్చే అవకాశం వున్న వానాకాలంలో తప్ప, ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇతరత్రా ఉష్ణోగ్రతలు 15 నుంచి 35 డిగ్రీల మధ్య వుంటాయి.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడికి ఎప్పుడు, ఎలా చేరుకోవాలి?

ముంబై నుంచి కొల్హాపూర్ కేవలం 387 కిలోమీటర్లు, పూణే నుంచి 240 కిలోమీటర్ల దూరం వుంటుంది. వాయు, రైలు రోడ్డు మార్గాల ద్వారా ఈ నగరం ఇతర ప్రధాన నగరాలకు కలపబడి వుంది. విమానంలో ఐతే మీరు ఉజలాయివాడి లో దిగవచ్చు.

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

జెంస్టోన్స్ తో తయారుచేయబడిన 40కిలోల బరువున్న లక్ష్మీదేవి విగ్రహం

ఇక్కడికి ఎప్పుడు, ఎలా చేరుకోవాలి?

రైలు కి వస్తే, ముంబై, పూణే ల నుంచి బయలుదేరే చాలా రైళ్ళు వున్నాయి. కొల్హాపూర్ కి కార్ లో వెళ్ళడం కూడా బాగానే వుంటుంది. కేవలం ఎనిమిది గంటల లోపు సమయం పడుతుంది. లేదంటే, ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు ఎంచుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X