Search
  • Follow NativePlanet
Share
» »మలయత్తూర్ - అందమైన తోటలు, చర్చీలు !!

మలయత్తూర్ - అందమైన తోటలు, చర్చీలు !!

By Mohammad

మలయత్తూర్ ఎర్నాకులం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు మూడు మళయాళం మాటలనుండి వచ్చింది. మల అంటే పర్వతం, అర్ అంటే నది మరియు ఊర్ అంటే స్ధలం అని చెపుతారు. చిన్నది మరియు సుందరమైనది అయిన ఈ పట్టణం పడమటి కనుమలకు మరియు పెరియార్ నదికి మధ్యన పర్వతాలు, భూమి మరియు నీరు కలిసే ప్రదేశంలో కలదు.

మలయత్తూర్ ఒక పురాతన కేధలిక్ చర్చికి ప్రసిద్ధి చెందింది. ఈ చర్చి క్రైస్తవ బోధకుడు సెయింట్ ధామస్ కు అంకితమివ్వబడినది. ఈ ప్రదేశం క్రిస్టియన్లకు యాత్రా స్ధలమే కాదు. సుందర అందాలు కల పట్టణం. ఇక్కడ సెయింట్ ధామస్ చర్చి మాత్రమే కాక, మరో రెండు చర్చిలు కలవు. వీటిని చర్చి ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ మరియు సెయింట్ సెబాస్టియన్ చర్చిలంటారు. ఇక్కడే దుర్గా దేవి దేవాలయం కూడా కలదు. మలయత్తూర్ వచ్చే యాత్రికులు మూలం కుజ్జి మరియు మహాగని తోట్టం ప్రదేశాలు కూడా చూడవచ్చు.

మలయత్తూర్

చిత్రకృప : Dilshad Roshan

మలయత్తూర్ చర్చి

మలయత్తూర్ చర్చి ప్రపంచ ఖ్యాతి గాంచినది. అంతర్జాతీయ గుర్తింపు ఈ చర్చికి లభించింది. సీజన్ తో నిమిత్తం లేకుండా భక్తులు ఈ చర్చికి వస్తూంటారు. జీసస్ శిష్యుడైన సెయింట్ ధామస్ ఇక్కడకు వచ్చి తన సందేశాన్ని ఇచ్చాడని చెపుతారు. సెయింట్ ధామస్ వందల సంవత్సరాల కిందట స్ధాపించిన మేరీ విగ్రహం కల ప్రదేశంలోనే నేటి మలయత్తూర్ చర్చి కలదని చెపుతారు.

అదూర్ - కేరళ సంప్రదాయాల పట్టణం !

మలయత్తూర్ కొండలపై గల ఈ మత సంస్ధ ప్రతి సంవత్సరం మిలియన్ల కొలది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ చర్చిని గ్రీసు మరియు రోమన్ శిల్ప శైలిలో నిర్మించారు. ఇక్కడ అనేక చెక్కడాలు, పెయింటింగులు, ఫైవ్ జాయ్ ఫుల్ మిస్టరీస్ ఆఫ్ జీసస్ క్రీస్ట్ వంటివి చర్చి గోడలపై కలవు.

మలయత్తూర్

చిత్రకృప : Ranjithsiji

ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో మలయత్తూర్ పెరున్నాల్ అనే పండుగ నిర్వహిస్తారు. ఇక్కడే కల మర్తోమా మండపం, సన్నిధి, గోల్డెన్ క్రాస్, మిరక్యులస్ వాటర్ స్ప్రింగ్ , సెయింట్ ధామస్ ఫుట్ ప్రింట్, అతని పెద్ద విగ్రహం వంటివి చూడదగిన ప్రదేశాలు.

దైవ భూమిలోని రుచులు మరియు కాలాలు

భక్తులు మరియు పర్యాటకులు సంవత్సరం పొడవునా ఈ చర్చికి వస్తూనే ఉంటారు. చర్చి ఎల్లపుడూ జన సమూహాలతో వుంటుంది. అయితే, వర్షాకాలంలో వర్షాలు అధికం కనుక సైట్ సీయింగ్ అసాధ్యమవుతుంది. మలయత్తూర్ పర్యటనకు శీతాకాలం అనుకూలమైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మలయత్తూర్

చిత్రకృప : Dilshad Roshan

మలయత్తూర్ కొచ్చి నుండి 47 కి.మీ. ల దూరంలో ఉండి, ఇరుగు పొరుగు జిల్లాలకు రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. ఇక్కడ తయారయ్యే ఆహారాలు మళయాళీల రుచులుగా ఉంటాయి. చిన్న హోటళ్ళు, కాఫీ హౌస్ లు ఈ ప్రదేశం ప్రత్యేకత. పండుగ సందర్భాలలో టవున్ బిజీ గా ఉండే సమయంలో పర్యాటకుల సౌకర్యార్ధం కొత్త తాత్కాలిక హోటళ్ళు కూడా తెరుస్తారు. పర్యాటకులు కేరళ ను సందర్శించేటప్పుడు మలయత్తూర్ ను ను తప్పక చేర్చుకోండి.

పెరియార్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురి, తేక్కడి !

మలయత్తూర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

మలయత్తూర్ కు కొచ్చి నుండి బస్సులు కలవు. వివిధ నగరాలనుండి ప్రభుత్వ బస్సులు, ప్రయివేటు బస్సులు కూడా నడుస్తాయి.

రైలు ప్రయాణం

మలయత్తూరుకు సమీప రైలు స్టేషన్ ఎర్నాకులం. ఎర్నాకులం రైలు స్టేషన్ నుండి దేశంలోని అన్ని నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి ఆటో రిక్షాలు లేదా టాక్సీలలో మలయత్తూర్ చేరవచ్చు.

విమాన ప్రయాణం

మలయత్తూర్ కు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం. విమానాశ్రయం నుండి మలయత్తూరు కు టాక్సీలు లభిస్తాయి. విమానాశ్రయం నుండి మలయత్తూర్ 15 కి.మీ. దూరం కాగా దీనికి రూ400 మాత్రమే టాక్సీ ఛార్జీలు అవుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X