Search
  • Follow NativePlanet
Share
» »కాకులు, పులులు కనిపించని కారడవిలో పరమేశ్వరుడు సందర్శిస్తే....

కాకులు, పులులు కనిపించని కారడవిలో పరమేశ్వరుడు సందర్శిస్తే....

మల్లెం కొండేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం.

దట్టమైన అటవీప్రాంతమే. పక్షుల కిలకిలరావాలు, జలపాతాల గలగల ధ్వనులు ఇక్కడ నిత్యం వినిపిస్తాయి. అయితే ఆ అడవిలో కాకులు పులులు మాత్రం కనిపించవు. అంతేకాకుండా అక్కడి దేవాలయానికి పై కప్పు లేక పోవడం కూడా విశేషం. అంతే కాకుండా ఇక్కడ కొండలోని గుండాల్లో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా సంతానం లేని వారు ఈ కొండ పై వెలిసిన స్వామిని కొలిస్తే వెంటనే ఫలితం ఉంటుందని చెబుతారు. ఈ ప్రాంతం వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం మల్లెంకొండ అటవీ ప్రాంతంలో ఉంది. నెల్లూరు జిల్లా సరిహద్దుగా ఉన్న ఈ ఆలయం విశేషాలతో కూడిన కథనం మీ కోసం.

పూలమాల ఆకారంలో ఉండటం వల్ల

పూలమాల ఆకారంలో ఉండటం వల్ల

P.C: You Tube

మల్లె కొండ శిఖరం పూలమాల ఆకారంలో ఉంటుంది. అందువల్లే ఈ శిఖరానికి మాల్యాద్రి అని పేరు పెట్టారు. ఈ శిఖరం పై కాశీ విశ్వేశ్వరుడు, మల్లెం కొండేశ్వరుల ఆలయాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ మల్లెం కొండేశ్వర ఆలయం నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెలితే రామసరి జలపాతం మనకు కనువిందు చేస్తుంది.

శివుడి ప్రతి రూపం

శివుడి ప్రతి రూపం

P.C: You Tube

ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో పాటు ఉన్న మల్లెం కొండయ్య శివుడి ప్రతి రూపంగా భక్తులు భావిస్తారు. కొండమీద వెలిసిన మల్లెం కొండయ్యకు దేవాయం అయితే ఉండేది కాని ఆ ఆలయానికి పై కప్పు మాత్రం ఉండేది కాదు. దీంతో కొన్ని శతాబ్దాల క్రితం ఆ ప్రాంతానికి చెందిన గ్రామస్తులు అంతా కలిసి ఆ దేవాలయం పై కప్పును నిర్మించాలని నిర్ణయించి పని ప్రారంభించారు. అయితే పై కప్పు నిర్మాణం పూర్తైన రాత్రికి కూలి పోయేది. దీంతో గ్రామస్తులు ఓ అర్థరాత్రి అక్కడే కాపుకాశారు.

రాత్రి సమయంలో యువకుడు

రాత్రి సమయంలో యువకుడు

P.C: You Tube

అర్థారాత్రి సమయంలో ఓ యువకుడు గుర్రం మీద అక్కడకు వచ్చి పై కప్పును కూలదోశాడు. దీంతో గ్రామస్తులు అంతా కలిసి ఆ యువకుడిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. అప్పుడే ఓ కాకి ఈ యువకుడి కళ్లను పొడవడానికి వచ్చింది. దీంతో యువకుడు తానే మల్లెం కొండేశ్వరుడినని తనకు పచ్చటి చెట్ల మధ్య ఆకాశాన్ని చూస్తూ గడపడం ఇష్టమని చెప్పాడు. అందువల్లే పై కప్పును కూలదోస్తున్నట్లు వివరించాడు.

అందుకే కాకి, పులి కనబడవు

అందుకే కాకి, పులి కనబడవు

P.C: You Tube

ఇక తన కళ్లు పొడవడానికి వచ్చిన కాకిని ఉద్దేశిస్తూ ఇక పై ఈ అరణ్యంలో మీకు చోటు లేదని శపించాడు. అందువల్లే ఇక్కడ కాకులు కనిపించవు. అదే విధంగా ఇక్కడ గోవులను తినడానికి నిత్యం ఓ పులి వచ్చేది. దీంతో ఆ గోవులు మేపేవారు మల్లెం కొండేశ్వరుడితో తమ గోడును చెప్పుకొన్నారు. దీంతో పులికి కూడా ఈ అడవిలో స్థానం లేదని చెప్పాడు. అందువల్లే ఈ అరణ్యంలో మనకు అటు కాకులే కాకుండా పులి కూడా కనిపించదు.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube

కొండమీద మల్లెంకొండేశ్వరుడి ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 10 కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ కోనలు దాటుకొంటూ వెళ్లాలి. కడప జిల్లా బద్వేల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె ఉంది. ఇక్కడి వరకూ బస్సు సౌకర్యం ఉంది. ఈ గ్రామం నుంచి కొండ పైకి నడుచుకొంటూ వెళ్లిలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X