Search
  • Follow NativePlanet
Share
» »రుతుస్రావం ఈ దేవాలయ ప్రవేశానికి అడ్డుకాదు?

రుతుస్రావం ఈ దేవాలయ ప్రవేశానికి అడ్డుకాదు?

తమిళనాడులోని మేల్ మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠానికి సంబంధించిన కథనం.

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శబరిమల చర్చలే జరుగుతున్నాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు పీరియడ్స్ (రుతుస్రావం) వస్తుంది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించకూడదని గతంలో నిబంధన ఉండేది. అయితే సుప్రీం కోర్టు ఈ నిబంధనను కొట్టివేసింది. అయినా కూడా ఆ వయస్సు మధ్య ఉన్న మహిళలు శబరిమలలోకి వెళ్లడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే తమిళనాడులోని ఓ దేవాలయంలో పీరియడ్స్ ఉన్నవారు కూడా నేరుగా అమ్మవారికి పూజలు చేయవచ్చు. ఇరుముడి కట్టుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

శబరిమల ప్రధాన ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొంటున్నది పీరియడ్స్. అయితే తమిళనాడులోని ప్రముఖ దేవాలయంలో ఎన్నో దశాబ్దాలుగా పీరియడ్స్ సమయంలోనూ మహిళలు గర్భగుడిలోకి వెళ్లవచ్చు.

బ్రహ్మ మొదట యగం చేసినది ఇక్కడేబ్రహ్మ మొదట యగం చేసినది ఇక్కడే

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

అంతేకాకుండా స్వయంగా అమ్మవారికి పూజలు కూడా చేవచ్చు. అదే మేల్ మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం. దీనినే ఆదిపరాశక్తి సిద్దార్ పీఠం అని కూడా అంటారు.

ఇక్కడ అస్సోం సొగసులు చూస్తారా?ఇక్కడ అస్సోం సొగసులు చూస్తారా?

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

తమిళనాడు రాజధాని చెన్నైకు 92 కిలోమీటర్ల దూరంలోని మేల్ మరవత్తూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో రుతుస్రావాన్ని అపవిత్రంగా పరిగణించరు. ఈ క్రియను మహిళలో జరిగే ఒక సహజమైన ప్రక్రియగానే భావిస్తుంది.

మీ కోరికను వినాయకుడి చెవిలో చెప్పండి ఫలితం లభిస్తుందిమీ కోరికను వినాయకుడి చెవిలో చెప్పండి ఫలితం లభిస్తుంది

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

అందువల్లే మహిళలకు ఆ సమయంలో కూడా దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. అంతేకాకుండా అన్ని దేవాలయాల్లో కంటే ఈ దేవాలయం భిన్నమైనది. ఇక్కడ పూజారులు ఉండరు. మహిళలు ఎప్పుడైనా వెళ్లి స్వయంగా అమ్మవారికి పూజలు నిర్వహించవచ్చు.

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

అదే విధంగా ఇక్కడ కులమతాల పట్టింపు లేదు. ఏ కులం వారైనా, మతం వారైనా ఎప్పుడైనా వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవచ్చు. దైవం ద`ష్టిలో మహిళలు, పురుషులే కాకుండా అన్ని కులాలు, మతాల వారు అన్ని సమయాల్లోనూ సమానులే అన్న దానికి ప్రతీకగా ఇక్కడ పూజావిధానాలు ఉంటాయని చెబుతారు.

కామం కట్టలు తెంచుకొని ప్రవహించే ప్రాంతాల్లో విహరించారా...కామం కట్టలు తెంచుకొని ప్రవహించే ప్రాంతాల్లో విహరించారా...

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

ఈ ఆలయానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దీనిని అనుసరించి తమిళనాడులోని మేల్ మరువత్తూర్ గ్రామానికి చెందిన బంగారు అడిగళార్ అనే ఉపాధ్యాయుడు గ్రామంలోని ఓ వేపచెట్టుకు పాలు కారుతున్నట్లు గుర్తించాడు.

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

తర్వాత దానిని మరిచిపోయాడు. కొన్నిరోజులకు గ్రామంలో బలమైన గాలులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో ఆ వేప వ`క్షం కూలిపోయింది. వర్షం వెలిసిన తర్వాత చూస్తే అక్కడ ఓ శివలింగం కనిపించింది.

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

అటు పై బంగారు అడిగళార్ తనను తాను దేవి అంశగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే ఆదిపరాశక్తి ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1966లో బంగారు అడిగళర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు.

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

అన్ని మతాల వారికి ఆలయంలో ప్రవేశం ఉంటుంది. నేరుగా అమ్మవారికి అభిషేకం చేయవచ్చు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చేసేవారు. ఈ ప్రవచనాలకు ఆకర్షితులైన ఎంతో మంది ఆదిపరాశక్తి వార ప్రార్థన పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకొన్నారు.

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

తమిళనాడులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో కూడా ఈ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘంలోని సభ్యులు అంతా ఏడాదికి ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ శక్తిపీఠం డా ఓ ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజిక సేవా కార్యక్రమాలకు ఈ శక్తిపీఠం కేంద్రంగా మారింది. దీంతో ఇది ప్రముఖ యాత్రా స్థలంగా మారిపోయింది. ఇక్కడ మహిళలకు ఎటువంటి షరత్తులు, అడ్డంకులు ఉండవు.

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

ఆలయ నిర్మాత బంగారు అడగళార్ రుతుస్రావాన్ని అపవిత్రంగా చూడకూడదని చెప్పారని ప్రస్తుత ఆలయ ధర్మకర్తలు చెబుతున్నారు. అందువల్ల మహిళలను నేరుగా గర్భగుడిలోకి పంపి పూజలు చేయిస్తున్నారు.

కాళీమాత ప్రత్యక్షమైన చోటుకాళీమాత ప్రత్యక్షమైన చోటు

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

అంతేకాకుండా ఈ ఆలయంలో సమాననత్వం గురించిన సూక్తులు, సందేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వంతో పాటు కుల, మత సమానత్వం కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని ఒక శక్తిగా పరిగణిస్తారు.

కుమారస్వామి ముడుపులుగా మేకలు, కోళ్లు స్వీకరిస్తాడుకుమారస్వామి ముడుపులుగా మేకలు, కోళ్లు స్వీకరిస్తాడు

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

మరువత్తూర్ లో ఉన్న అరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం

P.C: You Tube

ఇక్కడ 21 మంది సిద్ధులు జీవసమాధి చెందారని చెబుతారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ సప్త కన్ని ఉపాలయం కూడా చూడదగినదే. ఈ ఉపాలయానికి పై కప్పు ఉండక పోవడం విశేషం. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి.

ఈ వినాయకుడు త్రినేత్రుడుఈ వినాయకుడు త్రినేత్రుడు

సతీదేవి మరణించిన ప్రాంతం?సతీదేవి మరణించిన ప్రాంతం?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X