Search
  • Follow NativePlanet
Share
» »ఈ మఠాలను సందర్శిస్తే బుద్ధుడిని చూసినట్లే

ఈ మఠాలను సందర్శిస్తే బుద్ధుడిని చూసినట్లే

సిక్కింలోని ఈ మఠాలు బుద్ధుడుని ప్రశాంతంగా పూజించడానికి అనువైన ప్రాంతాలు. These monasteries in Sikkim that have been the premier place of w

పర్యాటకపరంగా సిక్కిం రాష్ట్రానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ మంచుపర్వత లోయలు, పూలగుబాలింపులు విదేశీ పర్యాటకులను సైతం రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రకతిలో మమేకం కావాలనుకొనేవారు తమ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వెలుతూ ఉంటారు. అదేవిధంగా సిక్కిం ధార్మిక క్షేత్రాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా శాంతియుత వాతావరణాన్ని ఇష్టపడే బౌద్ధులకు ఈ సిక్కిం స్వర్గధామం అని చెప్పవచ్చు. అందుకే ఇక్కడ అనేక బౌద్ధమఠాలు ఉన్నాయి. ఇందులో మూడు వందల ఏళ్ల క్రితం నిర్మించినవాటితో పాటు ఇటీవల నిర్మించిన బౌద్ధ మఠాలు కూడా ఉన్నాయి. ఇందులో దుబ్డి మఠం, ఎన్చీ మఠం, కార్టోక్ మఠం, లిగ్డం మఠం, పెమాయాంగ్ట్సే మఠం, పొడాంగ్ మఠం, రలాంగ్ మఠం, రుమ్తేంక్ మఠంలు చాలా ప్రత్యేకమైనవి. వీటికి సంబంధించిన వివరాలు మీ కోసం...

దుబ్డి మఠం

దుబ్డి మఠం

P.C: You Tube

సిక్కింలోని మఠాలన్నింటితో పోలిస్తే దుబ్డి మఠం అత్యంత పురాతనమైనది. గుట్ట పై ఉన్నటు వంటి మఠం చుట్టు పక్కల ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. సిక్కింలోని ప్రముఖ పర్యాటక కేంద్రం యుక్సోమ్ నుంచి ఈ దుబ్డి మఠం కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

ఎన్చీ మఠం

ఎన్చీ మఠం

P.C: You Tube

సిక్కిం రాజధాని గ్యంగ్‌ఠక్ నుంచి కేవలం ఈ ఎన్చీ మఠం కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దాదాపు 200 ఏళ్ల క్రితం ఈ మఠాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. బుద్ధిజంలోని వజ్రాయన శాఖకు ఈ మఠం చెందుతుంది. ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.

కార్టోక్ మఠం

కార్టోక్ మఠం

P.C: You Tube

కార్టోక్ సరస్సు ఒడ్డున ఈ కార్టోక్ మఠం ఉంటుంది. ఈ కార్టోక్ మఠాన్ని యుక్సోమ్ గ్రామ ప్రజలు తమ ఆస్తిగా భావిస్తుంటారు. ఎర్రని రంగులో ఉన్న ఈ మఠాన్ని చూడటానికి సుదూర ప్రాంతం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దుబ్డి మఠం, నాగ్డాక్ మఠం ఈ కార్టోక్ మఠానికి చాలా దగ్గరగా ఉంటాయి. పెల్లింగ్, గేజింగ్ నుంచి ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు.

లిగ్డం మఠం

లిగ్డం మఠం

P.C: You Tube

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ లిగ్డం మఠం ఉంటుంది. ఇక్కడ అనేక సినిమాషూటింగ్ లు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మఠం చుట్టూ మై మరిపించే ప్రాంతాలు ఉండటమే ఇందుకు కారణం. ఈ మఠాన్ని 1998లో నిర్మించారు. ఈ లిగ్డం మఠాన్ని 1998లో నిర్మించారు.

పెమాయాంగ్ట్సే మఠం

పెమాయాంగ్ట్సే మఠం

P.C: You Tube

మార్చి నుంచి జూన్ మధ్యలో పెమాయంగ్ట్సే మఠాన్ని ఎక్కువ మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. సిక్కింలో ఉన్న అత్యంత పురాతనమైన మఠాల్లో ఇది కూడా ఒకటి. మఠం లోపల ఎంతో అందమైన పెయింటిగ్స్‌ను మనం చూడొచ్చు. దాదాపు 300 ఏళ్ల క్రితం ఈ మఠాన్ని నిర్మించినట్లు చెబుతారు.

పొడాంగ్ మఠం

పొడాంగ్ మఠం

P.C: You Tube

సిక్కింలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న మఠం ఇదే. సముద్రమట్టానికి దాదాపు 4,500 అడుగుల ఎత్తులో ఈ మఠం ఉంటుంది. ఈ మఠం కూడా అందమైన చిత్రాలతో, పతాకాలతో చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. బాంగ్డోరా ఎయిర్ పోర్ట్ ఇక్కడికి 124 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత దేశంలోని చాలా నగరాలతో ఇక్కడికి రవాణా సదుపాయాలు ఉన్నాయి.

రలాంగ్ మఠం

రలాంగ్ మఠం

P.C: You Tube

సిక్కింలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రవాంగ్లాకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ మఠం ఉంటుంది. సిక్కింలోని అతి విశాలమైన మఠాల్లో ఇది కూడా ఒకటి. అత్యంత పురాతనమైన ఈ రలాంగ్ మఠం స్థానంలో నూతనంగా 1995లో మరో మఠాన్ని నిర్మించారు. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

రుమ్తేంక్ మఠం

రుమ్తేంక్ మఠం

P.C: You Tube

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ నుంచి ఇది కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిక్కింలోని అన్ని మఠాలతో పోలిస్తే రుమ్తేంక్ మఠం చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం మూడు అంతస్తులతో నిర్మించిన ఈ మఠం చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X