Search
  • Follow NativePlanet
Share
» »వివాహా ఆలస్యానికి, నాగదోష పరిష్కారినికి ఈ ఆలయదర్శనం శ్రేయస్కరం

వివాహా ఆలస్యానికి, నాగదోష పరిష్కారినికి ఈ ఆలయదర్శనం శ్రేయస్కరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో చల్లపల్లి నుండి 5 కిమీ దూరంలో వున్న మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామిదేవాలయం నాగదోష పరిహార పూజలకు పేరుగాంచిన ప్రదేశం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని మోపిదేవి కుమారక్షేత్రం అని కుమారక్షేత్రమే సుబ్రమణ్య క్షేత్రం అని పిలుస్తుంటారు . ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి శివ లింగ రూపంలో వెలసి భక్తుల సకల ఇష్టార్థాలను స్వామి నెరవేర్చుతాడని ప్రసిద్ది .

స్కంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానదీ మహత్యం, ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం..

స్థల పురాణం

స్థల పురాణం

అగస్త్య మహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కాశీని వదలి వెళ్లాల్సి వస్తుంది. వింధ్య పర్వతం అహంకారంతో చెలరేగి ఆకాశంలోకి దూసుకొని పోయి సూర్యగమాన్ని సైతం నిరోధించసాగింది. ఒక్కసారిగా ప్రకృతి స్థంభించింది.

PC:youtube

స్థల పురాణం

స్థల పురాణం

గ్రహాలు సంచరించడం కూడా నిలిచిపోవడంతో, ఈ మహా ఉపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షిమాత్రమే అని భావించిన బ్రహ్మాది దేవతలు మహర్షికి విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వం తెలుసుకున్న మహర్షి తాను ఇప్పుడు కాశీని వదిలి వెళ్ళిపోతే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అమర కార్యానికి అంగీకరించాడు.

PC:youtube

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

లోపాముద్ర సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో ఉన్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగమెనరించి నమస్కరించింది. తాను తిరిగి వచ్చే వరకూ అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షి, విశ్వనాథులను మనసులో తలచుకుని దక్షిణాపథం వైపు పయణించాడు అగస్త్యుడు.

PC:youtube

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

పవిత్ర గోదావరీ నది ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగు పెట్టిన ఆ పుణ్యదంపతులు. కనకదుర్గమాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణవుని దర్శించుకుని వ్యాఘ్రపురం చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది లోపాముద్రా దేవి, శిష్యబ్రందము ఆయనను అనుసరించారు. ఒక పుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తిముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు.

PC:youtube

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

కుమారస్వామి ఉరగ (పాము)రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించాడు.

అగస్త్య, సనమత్కుమార, సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ళ వయస్సు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవత్ ఆరాధనతోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక సారి ఆ పరమేశ్వరుడి దర్శనానికై కైలాసం వెళతారు. అదే సమయంలో ఆ పరమేశ్వరుడు కైలాసంలో ఉండడు.

PC:youtube

అడస్త్య,లోపముద్రల ప్రయాణం:

అడస్త్య,లోపముద్రల ప్రయాణం:

లోకమాత పార్వతిదేవితో పాటు కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. ఆ సమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతా స్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగురంగుల వస్త్రా ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ సమయంలో పార్వతీ దేవి కుమారా ఏలా నవ్వు తున్నావు? వారు నేనులా కనిపించలేదా? ఆ తాపసులు మీ తండ్రి వలే అగుపడలేదా? భేదమేమైననూ కన్పించినదా? అని ప్రశ్నించగా? ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోపల ప్రశ్చాత్తాపపడినాడు.

PC:youtube

అడస్త్య,లోపముద్రల ప్రయాణం:

అడస్త్య,లోపముద్రల ప్రయాణం:

తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరి, ఈ ప్రాంతానికి చేరుకుని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకుని ఉగర రూపంలో తపస్సు చేయడం ప్రారంభించాడు.

PC:youtube

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

ఈ విషయాన్ని దివ్వ దృష్టితో తెలుసుకున్న అగస్త్య మహర్షి తన శిష్యలకు తెలియజెప్పి ఆప్రదేశం రాగనే సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్వ తేజస్సు వచ్చే పుట్ట మీద ప్రతిష్టించాడు.

PC:youtube

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

తర్వాత ప్రక్కనే ఉన్న కృష్ణా నదిలో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు చేశారు అగస్త్యమహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ పుట్టలున్న ఆ ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు.

PC:youtube

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అతడు మహా భక్తుడు. అతనికి సుబ్రహ్యమణ్యస్వామి కలలో కనిపించి, విగ్రహాన్ని వెలుపలికి తీసి, ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించమని ఆజ్ఝాపించాడు. తర్వాత పర్వాతాలు స్వామి ఆజ్జా మేరకు లాగే ఆలయాన్ని నిర్మించి లింగ ప్రతిస్టాపన చేస్తాడు.

PC:youtube

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

అగస్త్య, లోపముద్రల ప్రయాణం:

తన వృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారుచేసి, వాటిని కాల్సి అవి చెడిపకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమైపోగా మిగిలిన నంది, గుర్రం వంటివి స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీ పురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి గా స్థిరపడిందని చెబుతారు.

PC:youtube

ఈ క్షేత్ర ప్రత్యేకత

ఈ క్షేత్ర ప్రత్యేకత

స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానవట్టం. స్వామికి వేరే పానవట్టం ఉండదు. పానవట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంద్రం ఉంటుంది. అర్చనలు, అభిషేకాల సమయంలో ఈ రంద్రంలో పాలు పోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుండి గర్బగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

PC:youtube

ఈ క్షేత్ర ప్రత్యేకత

ఈ క్షేత్ర ప్రత్యేకత

ఇక్కడి దేవాయంలోని పుట్టలో పాలు పోయడం భక్తులు విశేషంగా భావిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చర్మ సంబంధవ్యాధులునయం అవ్వడం, చూపు మందగించినవారికి ద్రుష్టిని ప్రసాధించడం, శ్రవణదోషాలు, శారీరక దౌర్భల్యం మనోవ్యాధి నశింపచేయడం, విద్యా భివ్రుద్ది సకల సంపదలను సమకూర్చడం వంటి ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

PC:youtube

ఈ క్షేత్ర ప్రత్యేకత

ఈ క్షేత్ర ప్రత్యేకత

వివాహం ఆలస్యమవుతున్న వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించడం వల్ల వివాహం జరుగుతుందని భక్తుల గట్టి నమ్మకం.పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు. నాగదోషాలకు, సంతాన రాహిత్యా నివారణకు ,జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం గా శాస్త్రాలు చెపుతున్నాయి.

PC:youtube

ఈ క్షేత్ర ప్రత్యేకత

ఈ క్షేత్ర ప్రత్యేకత

నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారికి పర్వదినాల్లో మహాన్యాసపూర్వక రుద్రభిషేకంతో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

కృష్ణాజిల్లా లో విజయవాడ కు 70 కి. మీ దూరం లోను,మచిలీపట్టణానికి 35 కి.మీ దూరం లోను, గుంటూరు జిల్లా రేపల్లె కు 8 కి. మీ దూరం లోను మోపి దేవి క్షేత్రం ఉంది. అతి సమీపం లోని రైల్వేష్టేషన్ రేపల్లె.

ఇక్కడ ఉండటానికి ఎటువంటి హోటల్ సౌకర్యాలు ఉండవు. గ్రామీణ స్థాయి కాఫీహోటల్స్ మాత్రం ఉంటాయి. అవనిగడ్డ, రేపల్లె, చల్లపల్లి లో ప్రభుత్వ అతిథి గృహాలున్నాయి. 214 ఎ జాతీయ రహదారిపై చల్లపల్లి - పులిగడ్డ మధ్య మోపిదేవి క్షేత్రం ఉంది.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more