» »మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టిన ఊళ్ళో ఎలాంటి అద్భుతాలు వున్నాయో తెలుసా ?

మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టిన ఊళ్ళో ఎలాంటి అద్భుతాలు వున్నాయో తెలుసా ?

Posted By: Venkata Karunasri Nalluru

గుజరాత్ రాష్ట్రం పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పవచ్చును.ఈ రాష్ట్రంలో ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన శిల్పసంపదతో కూడిన ఆలయాలు, వన్యప్రాణ సంరక్షణా కేంద్రాలు, అనేక చారిత్రిక ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

ఈ రాష్ట్రంలోని సందర్శనీయ స్థలాలలో సోమనాథాలయం, ద్వారకలోని ద్వారాకాదీశుని ఆలయం, పాలిటానాలయం, లఖ్ పథ్, భద్రకోట, అహ్మద్ షా నిర్మించిన మసీదు, తోలవిరా పురాతత్వ స్థలం, అహ్మదాబాద్ లోని మెట్లబావులు, శిథిలమైన మహాదేవుని ఆలయం, పావుఘడ్ జైన్ ఆలయం, పావుఘడ్ లోనే వున్న కాళీమాత ఆలయం, మరాఠా ప్యాలెస్ తదితర ప్రాంతాలున్నాయి. వీటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !

గుజరాత్ లో సందర్శనీయ స్థలాలు

ఈ నెలలో టాప్ 6 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ద్వారకలోని ద్వారాకాదీశుని మందిరం

1. ద్వారకలోని ద్వారాకాదీశుని మందిరం

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన కృష్ణ మందిరాలలో ఇది ఒకటి. దీనినే జగత్ మందిర్ అని కూడా పిలుస్తూవుంటారు. ద్వారకలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఇది ఒకటి. దీనితో పాటు ఇక్కడే ఉన్నటువంటి రుక్మిణీ ఆలయం, నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.

2. లోథల్

2. లోథల్

గుజరాత్ లోని 7 వండర్స్ లో ఒకటి. సింధూ నాగరికతలో అత్యంత పురాతన నగరం ఇది. ప్రపంచపు నాగరికతలలో ఒకదానికి కేంద్రంగా నిలిచిన ఈ పురాతత్వ ప్రదేశం గుజరాత్ లోని సారగ్ వాలా గ్రామ సమీపంలో వుంది. పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చును.

3. ధోలావిర

3. ధోలావిర

హరప్పా నాగరికతకు కేంద్రంగా వున్న పురాతన నగరాలలో ఇది ఒకటి. భారత ఉపఖండంలో వున్న 8 ప్రధాన హరప్పన్ నగరాలలో ఇది 5వ నగరం. ప్రస్తుతం ఇది భారత పురాతత్వ అధ్యయన సంస్థ సంరక్షణలో వుంది.

4. సూరత్ కోట

4. సూరత్ కోట

అద్భుత నిర్మాణశైలిలో రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న కోట ఇది. సూరత్ లోని పాత కోట నగరంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఠీవిగా నిలిచివుంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఇది కూడా ఒకటి

5. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా

5. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా

బరోడా నగరంలో వున్న అత్యద్భుత భవనం లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షక కేంద్రం. ఇది అత్యాధునికి వసతులతో కూడిన ఈ భవనం అత్యద్భుతమైన భారత, బ్రిటన్ శైలితో అందరినీ ఆకర్షిస్తుంటుంది.

6. ఝాల్టామినార్, అహమ్మదాబాద్

6. ఝాల్టామినార్, అహమ్మదాబాద్

అహమ్మదాబాద్ లోని ఝాల్టామినార్ సిడిబషీర్ మసీదుగా ప్రసిద్ధిచెందింది. ఈ మసీదుకు వున్నా జంట శిఖరాలు అటుఇటు కదులుతూ అందరినీ ఆకర్షిస్తుంటాయి.షేకింగ్ శిఖరాలు నగరంలో ప్రధాన ఆకర్షణ. దీనితో పాటే నిర్మితమైన రాజ్ బీబీ మసీదు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది.

7. భుజియా ఫోర్ట్, కచ్

7. భుజియా ఫోర్ట్, కచ్

గుజరాత్ లో వున్న భారీ పర్వత కోటలలో భుజియా హిల్ ఫోర్ట్ ఒకటి. కచ్ ప్రాంతంలోని భుజ్ లో వున్న ఈ కోట చరిత్రలో ఆరు ప్రధాన పోరాటాలకు వేదికగా నిలిచింది.రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షక కేంద్రాలలో దీనితో పాటు జామ్ నగర్ లోని లఖోటా కోట, అహమ్మద్ నగర్ లోని భద్ర కోట, సూరత్ కోట వున్నాయి.

8. సూర్యదేవాలయం, మొధేరా

8. సూర్యదేవాలయం, మొధేరా

మొధేరాలోని సూర్యదేవాలయం గుజరాత్ లో నిర్మితమైన అత్యద్భుత ఆలయసముదాయాలలో ఒకటి. అంతేకాదు దేశంలో ప్రసిద్ధ సూర్యదేవాలయాలలో ఇది కూడా ఒకటి. పుష్పవతి నదీతీరంలో వున్న ఈ ఆలయం అత్యద్భుత శిల్పసంపదకు నిలయం.

9. హాతీసింగ్ జైన్ ఆలయం, అహమ్మదాబాద్

9. హాతీసింగ్ జైన్ ఆలయం, అహమ్మదాబాద్

గుజరాత్ లో జైన వాస్తు శిల్పశైలితో నిర్మితమైన అత్యద్భుత నిర్మాణాలలో హాతీసింగ్ జైన్ ఆలయం ఒకటి. ఇది ధర్మనాధ తీర్థంకురుడు ద్వారా నిర్మించబడినది. హాతీసింగ్ ఆలయంతో పాటు పాలిటానా ఆలయం కూడా గుజరాత్ లో నిర్మించబడిన రెండు జైన ఆలయాలు.

10. జామా మసీదు

10. జామా మసీదు

అహమ్మదాబాద్ లోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటైన జామా మసీద్ భారత్ లో తప్పనిసరిగా సందర్శించాల్సిన మసీదులలో ఒకటి. భద్ర కోటలలో నిర్మితమైన ఈ మసీదు అప్పట్లో భారత ఉపఖండంలోనే అత్యంత పెద్దమసీదుగా ప్రసిద్ధి చెందింది.

11. మహమ్మద్ బఖ్బరా జునాఘడ్

11. మహమ్మద్ బఖ్బరా జునాఘడ్

జునాఘడ్ లో వున్న మహమ్మద్ బఖ్బరా ఒక సమాధి.ఇది ప్రపంచ పర్యాటక ఆకర్షక కేంద్రాలలో ఒకటి. దీనితో పాటు ఇక్కడి ఘిర్ నేషనల్ పార్క్, ఘిర్నార్ పర్వతశ్రేణి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూవుంటాయి. ఎపిక్ ఛానెల్ లోని ఎకాంత్ శ్రేణి నిషిద్ధ ప్రదేశాలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

12. రాణీకీ వావ్, పాటన్

12. రాణీకీ వావ్, పాటన్

పాటన్ నగరంలోని పాత నగరం నగరశివార్ ప్రాంతంలో వున్న సహస్రలింగ చెరువు, రాణీకి వావ్ పేరుతో వున్న మెట్లబావి ఇక్కడ ప్రధానపర్యాటక ఆకర్షణ కేంద్రాలు. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలలో చోటు సంపాదించిన రాణీకీ వావ్ గుజరాత్ లో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. అంతేకాదు అనేక కోటలు, పర్యాతకప్రాంతాలు, మెట్లబావుల వంటి ఆకర్షణలతో పాటు ప్రసిద్ధిచెందిన పటోలా చీరలకు పుట్టినిల్లు ఈ పాటన్ పట్టణం.

13.కీర్తి తోరణం, వాద్ నగర్

13.కీర్తి తోరణం, వాద్ నగర్

వాద్ నగర్ లోని కీర్తితోరణం 45 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ఎరుపు, పసుపు రంగుల ఇసుక రాతి కట్టడం. అంతేకాకుండా నరేంద్ర మోడీ జన్మస్థలం కూడా ఇక్కడే.

14. బౌద్ధ గుహలు, జునాగఢ్

14. బౌద్ధ గుహలు, జునాగఢ్

జునాగఢ్ లోని బౌద్ధ గుహలు ఇక్కడి పర్యాటకులకు ప్రధాన ఆకర్షక కేంద్రాలు. అత్యద్భుత నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ గుహలు.

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా? షాకింగ్ నిజాలు !

అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?