Search
  • Follow NativePlanet
Share
» »ధైర్యవంతులకు మాత్రమే ఇక్కడ దెయ్యాలు షేక్ హాండ్ ఇస్తాయి

ధైర్యవంతులకు మాత్రమే ఇక్కడ దెయ్యాలు షేక్ హాండ్ ఇస్తాయి

గోవాలో దెయ్యాలు ఉన్న ప్రాంతాలకు సంబంధించిన కథనం.

By Kishore

గోవా అంటే మనకు గర్తుకు వచ్చేది బీచ్ లు, పార్టీ, రొమాంటిక్ వాతావరణం, అర్థనగ్నంగా ఉండే విదేశీయులు ఇవే గుర్తుకు వస్తాయి. అయితే ఈ పార్టీ, బీచ్ లే కాకుండా ఇంకా అనేక ఇంట్రెస్టింగ్ స్థలాలు ఉన్నాయి. అవే మోస్ట్ హాంటెడ్ అంటే దెయ్యాలు తిరిగే ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలు గోవాలో చాలా ఉన్నాయి. అందులోత్రి కింగ్స్ చర్చ్, ఇగోరికమ్ బంద్, దెయ్యాల హోటల్, ఎన్ హెచ్ 17 ముంబై...గోవా,సలిగాబో అనే గ్రామం ముఖ్యమైనవి. ఇందులో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అవి చదవడాని కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కథనంలో

అమెకు అలా స్నానం చేయించారుఅమెకు అలా స్నానం చేయించారు

ఇక్కడ పడుకొంటే మీ ఇంట్లో ఆ చప్పుడు ఖచ్చితంఇక్కడ పడుకొంటే మీ ఇంట్లో ఆ చప్పుడు ఖచ్చితం

1. త్రి కింగ్స్ చర్చ్

1. త్రి కింగ్స్ చర్చ్

P.C: YouTube

గోవాలోని క్యాజువలింమ్ అనే ప్రాంతంలో త్రి కింగ్స్ చర్చ్ ఉంది. ముగ్గురు రాజుల పేరు పై ఈ చర్చ్ కు త్రి కింగ్స్ చర్చ్ అని పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతంలో ముగ్గరు రాజులు నివసించేవారంటా. ఒక రాజు అధికార దాహంతో మిగిలిన ఇద్దరికీ విషం ఇచ్చి చంపేశాడు.

2. అటు పై పశ్చాత్తపంతో

2. అటు పై పశ్చాత్తపంతో

P.C: YouTube

అటు పై పశ్చాత్తాపంతో అతడు కూడా ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ ముగ్గురు రాజుల సమాధులు ఇక్కడ ఉన్నాయి. అర్థరాత్రి ఎవరైనా ఇటు వైపు వెలితే వారు మన వెంటపడి మాకు విముక్తి కలిగించాల్సిందిగా వేడుకొంటారని స్థానికులు చెబుతారు.

3. ఇగోరికమ్ బంద్

3. ఇగోరికమ్ బంద్

P.C: YouTube

గోవాలో ఇగోరికమ్ బంద్ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డుకు ఇరు వైపులా దట్టమైన చెట్లు ఉంటాయి. వీటిలో సంగం ఎండిపోయి చూడటానికి భయంకరంగా అనిపిస్తాయి. అర్థరాత్రి కాదు మధ్యాహ్న సమయంలో కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఆ దెయ్యాలు ప్రజలను పలకరించి భయపెడుతాయని చెబుతారు. అందువల్లే చాలా మంది మధ్యహ్న సమయంలో అక్కడకు వెళ్లరు.

4. దెయ్యాల హోటల్

4. దెయ్యాల హోటల్

P.C: YouTube

చాలా ఏళ్ల క్రితం నిర్మించతలపెట్టిన ఈ హోటల్ కొన్ని న్యాయపరమైన చిక్కుళ్ల వల్ల ఆగిపోయింది. ఆ హోటల్ చుట్టూ చిన్న చిట్టడివి ఉంది. ఎవరైనా ఇక్కడకు వెళితే వారిని అక్కడ ఉన్న దెయ్యాలు వెంబడిస్తాయని చెబుతారు. అందువల్లే పగలు కూడా ఎవరూ ఇక్కడికి వెళ్లరు.

5. ఎన్ హెచ్ 17 ముంబై......గోవా

5. ఎన్ హెచ్ 17 ముంబై......గోవా

P.C: YouTube

గోవాకు శివారులో ఉన్న ఎన్ హెచ్ 17 వద్ద రాత్రి పూట ఎవరూ వెళ్లడానికి సాహసించరు. అత్యవసర పనిమీద ఆ మార్గం గుండా వెళ్లాలని భావించినా తాము ప్రయాణిస్తున్న వాహనం నుంచి కిందకు దిగరు. ఎందుకంటే ఇక్కడ దయ్యాలు అటువంటి వారి శరీరాలను తాకుతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయని చెబుతారు.

6. సలిగాబో

6. సలిగాబో

P.C: YouTube

గోవాశివారులో సలిగాబో అనే చిన్న గ్రామం ఉంది. ఇక్కడ ఉన్న ఓ మర్రిచెట్టు ఉంది. అక్కడ ఈ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకొందని చెబుతారు. ఆ ఆత్మ ఇప్పటికీ అక్కడ ఉందని స్థానికులు భయపడుతున్నారు. రాత్రి సమయంలో పర్యాటకులు కూడా అక్కడికి వెళ్లడానికి సాహసించరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X