• Follow NativePlanet
Share
» »ఇక్కడ మీ ‘గోళీలు’గొంతులోకి వస్తాయి.

ఇక్కడ మీ ‘గోళీలు’గొంతులోకి వస్తాయి.

Written By: Kishore

దయ్యం లేదని చెప్పేవారు ఎంత మంది ఉన్నారో ఆ దెయ్యం ఉందని చెప్పేవారు అంతకు రెండింతల మంది ఉంటారు. ఇలాంటి వారు భారత దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. దైవం ఉందని నమ్మితే దయ్యం కూడా ఉండాలని వాదించేవారు మనకు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. వీరు దయ్యం ఉందనడానికి కొన్ని ఆధారాలను కూడా చూపిస్తారు. అవి ప్రాంతాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు. ఈ కథనంలో మనం దయ్యాలు ఉందని చెప్పబడుతున్న భాంగ్రా కోట, కుల్దారా గ్రామం, ఢిల్లోలోని న్యాయస్థానం, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి వాటి గురించి తెలుసుకొందాం. అన్నట్టు ఇక్కడ ఉన్న కొన్ని ప్రాంతాల్లోని దయ్యాలు చాలా మంచివండోయ్. అవి మనకు సహాయం కూడా చేస్తాయి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక స్మశానం గురించి. అక్కడ ఉన్న ఓ సమాధికి నమస్కరిస్తే సంతానం కలుగుతుందని స్థానికులు చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. 

రామభక్త హనుమాన్ అంటే వీరికి నచ్చదు

ఇక్కడి రాళ్లకు రాసలీలు తెలుసు

1. భాంగ్రా ఫోర్ట్

1. భాంగ్రా ఫోర్ట్

Image Source:

భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న అత్యంత భయంకరమైన ప్రాంతాల్లో రాజస్థాన్ లోని భాంగ్రా కోట ఒకటి. దీనిని రాజా మాన్ సింగ్ నిర్మించాడు. స్థానిక కథనం ప్రకారం ఓ మాంత్రికుడు రాణి రత్నావతిని సొంతం చేసుకోవాలని మంత్ర, తంత్రాలు ప్రయోగించాలనుకొంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాణి రత్నావతి అతన్ని చంపేయాలని సైనికులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రగాడు చనిపోయే ముందు ఈ కోటలోని వారు అందరూ చనిపోతారని, గ్రామంలోని ఇళ్లకు పై కప్పులు ఉండవని శాపం పెడుతాడు. ఆ శాపం నిజమయ్యి కోటలోని వారు ఒక్కొక్కరుగా చనిపోయారు. ఇక ఇళ్లకు పై కప్పులు లేని విషయాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఉదయం పూట మాత్రమే ఈ కోటలోకి ప్రవేశం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ ఈ కోటలోకి పంపించరు.

2. చిలిపి దెయ్యం

2. చిలిపి దెయ్యం

Image Source:

రాజస్థాన్ లోని కోట పట్టణంలో ఉన్న బ్రిజ్ రాజ్ భవన్ ను 19వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని 1980లో హోటల్ గా మార్చివేశారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో మేజర్ బూర్టన్ ఈ కోటలో చనిపోయాడు. అతను దెయ్యంగా మారాడని చెబుతారు. అయితే అతను ఎవరికి హానిచెయ్యడని పైగా రాత్రి పూట గస్తీ కాసే వారు ఎవరైనా నిద్రపోతే ఒక లెంపకాయ మాత్రం కొడుతాడని చెబుతారు.

3. కుల్దారా

3. కుల్దారా

Image Source:

రాజస్థాన్ లోని జై సల్మీర్ కు దగ్గరగా కుల్దారా అనే గ్రామం ఉంది. ఈ గ్రామం మొత్తం దెయ్యాలు తిరుగుతుంటాయని చెబుతారు. పూర్వం ఈ గ్రామపెద్ద కుమార్తెను రాజ్యంలో పన్నులు వసూలు చేసే మంత్రి ఇష్టపడుతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. అయితే ఇది ఇష్టంలోని గ్రామస్తులు రాత్రికి రాత్రి ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లి పోతారు. అంతే కాకుండా ఆ గ్రామం ఎప్పుడూ నివాస యోగ్యం కాకుండా ఉండాలని శాపం పెడుతారు. అందువల్లే సాయంత్రం అయ్యే సమయానికి ఇక్కడ ఒక్కరు కూడా ఉండరు.

4. డూమాస్ బీచ్, గుజరాత్

4. డూమాస్ బీచ్, గుజరాత్

Image Source:

గుజరాత్ లోని డూమాస్ బీచ్ నే బ్లాక్ సాండ్ బీచ్ అని కూడా అంటారు. చాలా కాలం క్రితం ఈ ప్రాంతాన్ని స్మశానంగా వినియోగించేవారని చెబుతారు. అందువల్లే ఈ బీచ్ లో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొన్నట్లు అనిపించేదని చెబుతారు. ఇక అర్థరాత్రి తర్వాత ఎవరైనా ఈ బీచ్ లో ఉంటే మాయమవుతారని స్థానికులు చెబుతారు. అందువల్లే అర్థరాత్రి దాటిన తర్వాత చాలా వరకూ ఎవరకూ ఇక్కడ ఉండరు.

5. జీపీ బ్లాక్, మీరట్

5. జీపీ బ్లాక్, మీరట్

Image Source:

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జీపీ బ్లాక్ అనే ప్రాంతంలో దెయ్యాలు ఉన్నట్లు చెబుతారు. రాత్రిపూట ఎర్రటి దుస్తులు ధరించిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ కనిపిస్తుంటారని చెబుతారు. ఎవరైనా వీరిని కలవడానికి వెళితే మాయమై పోతారని స్థానికులు చెబుతుంటారు.

6. మగబిడ్డలను ప్రసాదించే స్మశానం

6. మగబిడ్డలను ప్రసాదించే స్మశానం

Image Source:

సాధారణంగా దయ్యాలు అన్న తక్షణం మనకు చెడు చేసే ఒక విధమైన జీవులని స్పురణకు వస్తుంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని డాషాయ్ అనే స్మశానంలోని ఒక బొమ్మకు నమస్కారం చేస్తే మగ బిడ్డలు పుడుతారని చెబుతారు. స్థానికులు చెప్పే కథనం ప్రకారం పూర్వం ఓ బ్రిటీష్ సైనికుడి భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు చనిపోయింది. అమెను ఈ స్మశానంలోనే ఖననం చేశారు. అంతే కాకుండా ఒడిలో చిన్న బాలుడితో ఉన్న ఆమె విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. ఈ విగ్రహానికి నమస్కారం చేస్తే సంతానం ముఖ్యంగా అబ్బాయి పుడుతాడని ఇక్కడి వారి నమ్మకం.

7.సింమ్లా...కల్కా రూట్ లోని టన్నెల్ నం.33

7.సింమ్లా...కల్కా రూట్ లోని టన్నెల్ నం.33

Image Source:

స్థానికుల కథనం ప్రకారం ఈ టన్నెల్ నిర్మాణాన్ని అప్పట్లో బ్రిటీష్ వారు ఒక బ్రిటీష్ ఇంజనీర్ కు అప్పగించారు. అయితే ఈ టన్నెల్ నిర్మాణంలో అతను విఫలమయ్యి ఇక్కడే ఆత్మహత్య చేసుకొన్నాడు. అప్పటి నుంచి అతని ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉందని చెబుతారు. అయితే అతను ఎవవరినీ ఇప్పటి వరకూ భాదించలేదని పైగా స్నేహంగా మాట్లాడుతాడని చెబుతారు.

8. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతం

8. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతం

Image Source:

ఈ ప్రాంతం ఉదయం పూటా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే రాత్రి అయిన వెంటనే ఇక్కడ ఎర్రని చీర కట్టుకొన్న ఓ మహిళ వాహనదారులకు ఎదురయ్యి తనకు లిఫ్ట్ ఇవ్వమని వేధిస్తుందని చెబుతారు. అందువల్లే రాత్రి సమయంలో ఎవరూ కూడా ఈ ప్రాంతం గుండా వెళ్లడానికి సాహసించరు.

9. ఢిల్లీలోని న్యాయస్థానం ఆవరణం

9. ఢిల్లీలోని న్యాయస్థానం ఆవరణం

Image Source:

ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో న్యాయవాదులు కుర్చొనే ప్రాంతంలో కుర్చీలు వాటంతట అవే ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లడం, గాల్లో కాగితాలు ఎగరడం తదితర ఘటనలు జరిగుతుంటాయి. వీటిని స్థానిక విజిలెన్స్ అధికారులు సీసీ కెమరాల్లో కూడా బంధించారు. అందువల్ల ఇక్కడ దెయ్యం తిరుగుతోందని నమ్ముతారు.

10 రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్

10 రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్

Image Source:

దేశంలోనే అత్యంత విశాలమైన ఫిల్మ్ సిటీగా పేరుగాంచిన రామోజి ఫిల్మ్ సిటీలో కూడా దయ్యాలు తిరుగుతున్నాయని నమ్ముతారు. అందువల్లే తరుచుగా ఇక్కడ లైట్స్ మెన్స్ ప్రమాదాలకు గురికావడం, ఇక్కడి హోటల్స్ లో ఉన్న అమ్మయిల దుస్తులు ఎవరో చించేయడం వంటివి జరుగుతాయని చెబుతారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి