Search
  • Follow NativePlanet
Share
» »క్షణ కాలంలో వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరుతాయి

క్షణ కాలంలో వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరుతాయి

లోక కల్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం' ఒక

లోక కల్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం' ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న 'అయినవిల్లి'కి ఒక కిలోమీటరు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ స్వామి 'ముక్తేశ్వరుడు' పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడు.

ఈ ముక్తేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం రెవెన్యూ విభాగంలో అయినవిల్లి మండలం, కోనసీమ డెల్టాలో ఉంది. ఇది గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి-గొదావరి నదికి సమీపంలో ఉంది. కోనసీమకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చటి ప్రకృతి, పంటకాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు గోదావరి నది ఒడ్డు, ఇలా ఎన్నో అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ముక్తేశ్వర ఆలయం కాకినాడకు దాదాపు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..

పురాణ కథ:

పురాణ కథ:

ముక్తేశ్వర ఆలయం ఒక పురాతన ఆలయం. పురాణాల ప్రకారం ఈ గ్రామాన్ని ముక్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. ఒక దానికెదురుగా ఒకటిగా రెండు శివాలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.మొదట ఎదురుగా ఉండే దేవాలయంలో ఉన్న దేవున్ని క్షణ ముక్తేశ్వరుడు అని పిలుస్తారు.

PC: YOUTUBE

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

ఈ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది. ప్రసిద్ది చెందని శివుని ఆలయాల్లో శ్రీముక్తికంఠ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. రామాయణం ప్రకారం, స్థల పురానం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో శ్రీలంక నుండి పుష్పకవిమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే శివలింగం ఒకటి చూశాడు.

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

వెంటనే ఆ శివలింగానికి పూజలు చేసి ఆ పరమేశ్వరుడిని అక్కడే కొలువై ఉండాలని కోరగా, శ్రీరాముడి భక్తికి ఆ పరమశివుడు ఇక్కడే కొలువైనాడనికి చెబుతారు. అయితే ఈ క్షేత్రంలోని 'ముక్తేశ్వరుడు' శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై వున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

PC: YOUTUBE

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామిని సేవించాడని అంటారు. శ్రీరాముడు ప్రార్ధించిన వెంటనే స్వామి క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడట. అందువలన ఇక్కడి స్వామివారిని 'క్షణముక్తేశ్వరుడు' అనే పేరుతోనూ భక్తులు పిలుచుకుంటారు.

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది

దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.

ఈ ముక్తేశ్వరంలో

ఈ ముక్తేశ్వరంలో

ఈ ముక్తేశ్వరంలో నూతనంగా శ్రీ షిర్డి సాయి బాబా ఆలయాన్ని శివాలయం వద్ద నిర్మింపబడినది. అలాగే ఈ గ్రామానికి సుమారు 2కిలో మీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో జగత్ప్రసిద్దమైన మహాగణపతి ఆలయం కూడా ఉంది.

PC: YOUTUBE

ముక్తీశ్వర స్వామి ఆలయం దర్శించిన తర్వాత మరికొన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు

ముక్తీశ్వర స్వామి ఆలయం దర్శించిన తర్వాత మరికొన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు

అయినవిల్లి శ్రీసిద్దివినాయ స్వామి ఆలయం

అయినవిల్లి ముక్తీశ్వర స్వామి ఆలయం దర్శించిన తర్వాత మరికొన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటిలో అయినవిల్లి శ్రీసిద్దివినాయ స్వామి ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ఆ ఆలయం పురాతన చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం. ఆలయం స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు నిర్వహించడాని చెబుతారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని భక్తుల విశ్వాసం.

అన్న వరం:

అన్న వరం:

అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయం. ఆ ఆలయం తూర్పు గోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద ఉన్నది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 300మీటర్లు పొడవున ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల గుడి, వన దుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి.

అంతర్వేది:

అంతర్వేది:

అంతర్వేది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. సఖినేటిపల్లి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. గోదావరి నదీ ఒడ్డున ప్రశాంత వాతావరణం కలిగినదే అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో ఉన్న ఈ త్రికోణపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం ఉంది.పురాణాల ప్రకారం ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం వల్ల ఈ ప్రదేశానికి అంతర్వేది అనిపేరు వచ్చింది.

ద్రాక్షారామం:

ద్రాక్షారామం:

ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని తూర్పు గోదావారి జిల్లాలో కాకినాడకు సుమారు 30కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి. ఆ ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది. ఆలయంలో భీమేశ్వర స్వామితో పాటు మాణిక్యాంబ క్షేత్రపాలకులుగా ఉన్నారు. లక్ష్మీ నారాయణులు శివాలయంతో పాటు విష్ణు ఆలయం, శక్తిపీఠం ఉన్న దివ్వ క్షేత్రం ద్రాక్షా రామం.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

ఐనవల్లి కాకినాడకు 72 కి.మీ. (వయా యానాం, అమలాపురం, ముక్తేశ్వరం),రాజమండ్రికి 55 కి.మీ. (వయా రావులపాలెం,కొత్తపేట,వనపల్లి), అమలాపురానికి 12 కి.మీ. (వయా ముక్తేశ్వరం) దూరం లో ఉంది. గోదావరి నదిపై ఆవల కల కోటిపల్లికి వెళ్ళుటకు పంటు ఉంది. గోదావరిలో నీరు లేనపుడు పడవలు నడుపుతారు. అమలాపురం, రాజోలు, రావులపాలెం లకు బస్సులు ఉన్నాయి. ఆటోలు, టాక్సీలు కూడా సమీప గ్రామాల మధ్య తిరుగుతుండును.

PC: YOUTUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X