Search
  • Follow NativePlanet
Share
» »ముంబై నగర పరిసర ఆకర్షణలు

ముంబై నగర పరిసర ఆకర్షణలు

ఒక వారాంతంలో ముంబై నగర చుట్టుపట్ల చూడవలసిన ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు ఏవి అని పరిశీలిస్తే...అనేక అద్భుత ప్రదేశాలు కలవు. ముంబై నగర జీవితం చాలా బిజిగా వుండి ఒత్తిడి కలిగించేదిగా వుంటుంది.

నగర వాసులలో అనేకమంది వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు నగరానికి దూరంగా వుండే ప్రదేశాలకు వెళ్లేందు కు ప్రయత్నిస్తారు. మరి వీరికి సూచించవలసిన ప్రదేశాలు ఏమిటి అనేది పరిశీలిస్తే...ముంబై చుట్టుపట్ల అనేక హిల్ స్టేషన్ లు కలవు.

వాటిలో ప్రధానమైనవి ఖండాలా - లోనావాలా, పంచాగ్ని లేదా మహాబలేశ్వర్. బీచ్ ప్రదేశాలు ఎంపిక చేసే వారికి ఆలి బాగ్, మురుద్ జన్జీరా లు సరైనవి. కనుక ముంబై చుట్టుపట్ల కల ఈ ప్రదేశాలు ఒక వారాంతం లో చూచి తప్పక ఆనందించండి.

కర్నాలా

కర్నాలా

కర్నాలా మహారాష్ట్ర లోని రాయగడ్ జిల్లాలో కలదు. ముంబై నుండి 47 కి.మీ. ల దూరం. అంటే స్వంత వాహనంపై ఒక గంట డ్రైవింగ్ లో చేరవచ్చు. ఇది చుట్టూ అడవులు, ఇరువైపులా పర్వత శ్రేణులు కలిగి వుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. లేదా బర్డ్ సాన్క్చురి లో పక్షులను గమనిస్తూ ఆనందించవచ్చు.

Photo Courtesy: Ashok Prabhakaran

కర్జాత్

కర్జాత్

కర్జాత్ ఒక సుందరమైన నగరం. అనేక పర్వతాలతో అందంగా వుంటుంది. ఇది మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో ఉల్లాస్ నది ఒడ్డున కలదు. ముంబై నుండి 62 కి.మీ. లు ఇక్కడ మీరు రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్, రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలు ఆచరించవచ్చు.

ఖండాలా - లోనావాలా

ఖండాలా - లోనావాలా

వారాంతపు విశ్రాంతికి ఇది చక్కటి ప్రదేశం. ముంబై నుండి 81 కి. మీ. ల దూరం , సుమారు గంటన్నర వ్యవధిలో చేరవచ్చు. ఈ హిల్ స్టేషన్ లో ట్రెక్కింగ్ చేయవచ్చు ఇక్కడ కల సరస్సు ఒడ్డున కూర్చొని ఆనందించవచ్చు. ఇక్కడ బసకు వసతులు కూడా లభిస్తాయి.

Photo Courtesy: Soham Banerjee

మాతేరాన్

మాతేరాన్

మాతేరాన్ చిన్న హిల్ స్టేషన్. అయినప్పటికీ అద్భుత అందాలు కలిగినది. ఇది మహారాష్ట్ర లోని పడమటి కనుమలలో కలదు. ముంబై నగరానికి సుమారు 83 కి. మీ. ల దూరం. రెండు గంటల వ్యవధిలో చేరవచ్చు. ఇక్కడ సూర్యోదయ, సూర్యాస్తమయాలు అద్భుత ఆనందాలు అందిస్తాయి.

Photo Courtesy: nevil zaveri

ఆలీబాగ్

ఆలీబాగ్

మహారాష్ట్ర లోని పడమటి కోస్తా తీరంలో ఆలీబాగ్ ఒక చిన్న టవున్. ముంబై కి 95 కి. మీ. ల దూరంలో వుంది. ఇక్కడ కల బీచ్ లో విశ్రాంతి తీసుకోవచ్చు లేదా కోట లు, పాలస్ లు అన్వేషించవచ్చు. ఇక్కడ రాత్రి వసతి పొందవచ్చు.

Photo Courtesy: Vikas Rana

మల్షేజ్ ఘాట్

మల్షేజ్ ఘాట్

సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తున వున్న ఆసక్తి కరమైన పర్యాటక కేంద్రం మల్షేజ్ ఘాట్ సమంగా వుండే, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి వుంటుంది. లెక్కలేనన్ని చెరువులు, కొండలు వుండే ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు, సరదా రాయుళ్ళకు, సాహాసికులకు, పర్వతారోహకులకు ఒకేలా ఆనందం కలిగిస్తుంది.

మురుద్ జన్జీరా

మురుద్ జన్జీరా

మురుద్ జన్జీరా ఒక ఓడరేవు . ఇదిమహరాష్ట్ర లోని మురుద్ కోస్తా గ్రామంలో కలదు. ముంబై నగరానికి 148 కి. మీ. ల దూరం. ఇక్కడ కోట లు, మరియు మరికొన్ని ఆకర్షణీయ సమీప ప్రదేశాలు చూడవచ్చు. లేదా బీచ్ లో విశ్రాంతి తీసుకొనవచ్చు.

Photo Courtesy: Nilesh3 str

పూనే

పూనే

పూనే ఒక మంచి నగరం. ఇది మహారాష్ట్ర లోని పడమటి కనుమలలో కలదు. ముంబై నగరానికి 162 కి. మీ. ల దూరంలో కలదు. ఆగాఖాన్ పాలస్ చూడవచ్చు లేదా సిన్హగడ్ కోట పరిశోదించవచ్చు. ముంబై నుండి సుమారు మూడు గంటలలో చేర గల ఈ ప్రదేశం ముంబై నగర వాసులకు ఒక చక్కటి వారాంతపు విశ్రాంత ప్రదేశం.

Photo Courtesy: Sayitaintsojoe

నాసిక్

నాసిక్

నాసిక్ ను ఇండియా యొక్క వైన్ కేపిటల్ అంటారు. ఇక్కడ అత్యధిక ద్రాక్ష తోటలు కలవు. ముంబై నుండి సుమారు 166 కి. మీ. లు వుంటుంది. శూలా వైన్ యార్డులు సందర్శించి వైన్ ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ బోటింగ్, ఫిషింగ్ కూడా చేయవచ్చు.

Photo Courtesy:Ramnath Bhat

సిల్వాస్సా

సిల్వాస్సా

సిల్వాస్సా , దాదర్ మరియు నాగర్ హవేలీ రాజధాని. ముంబై నగరానికి సుమారు 180 కి. మీ. ల దూరంలో కల ఈ ప్రదేశం వన్య జంతు ప్రియులను బాగా ఆకర్షిస్తుంది. ఇక్కడ కల వాసోన లయన్ సఫారి తప్పక చూడాలి. ఇక్కడ ట్రెక్కింగ్, మోటార్ బైకింగ్, బోటింగ్ వంటివి చేయవచ్చు.

Photo Courtesy: dnh.nic.in

డామన్

డామన్

డామన్ అక్కడ కల ప్రశాంతత తో ఒక స్వర్గం లా వుంటుంది. అరాబియా కోస్తా తీరంలో సుమారు 12.5 కి. మీ. ల పొడవు వ్యాపించి వున్నది. 185 కి. మీ. ల దూరం గల ఈ ప్రదేశం ముంబై నుండి మూడు గంటల ప్రయాణంలో చేరవచ్చు. బీచ్ లో విశ్రాంతి పొందవచ్చు. లేదా ఇక్కడ కల చర్చి లు చూసి ఆనందించవచ్చు.

Photo Courtesy: India Untravelled

పంచ గని

పంచ గని

పంచ గని ముంబై నగరానికి 244 కి. మీ. ల దూరం. నాలుగు గంటల ప్రయాణంలో చేరవచ్చు. లోయల మధ్య ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు అద్భుతంగా ఉంటాడు. ఇక్కడ స్ట్రా బెర్రీ లు అధికంగా పండుతాయ్. మీరు కొంచెం సాహసికులైతే, పారా గ్లైడింగ్ క్రీడా ఆడవచ్చు.

Photo Courtesy: flickr

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్ , మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కలదు. దీనిని అయిదు నదుల సంగమ ప్రదేశం అని కూడా అంటారు. బ్రిటిష్ వారికి ఇది వేసవి విశ్రాంతి ప్రదేశంగా వుండేది. ముంబై నగరానికి 264 కి. మీ. ల దూరం లో ఈప్రదేశం కలదు.

Photo Courtesy: Amungale

ఔరంగాబాద్

ఔరంగాబాద్

ఔరంగాబాద్ కు ఈపేరు మొఘల్ చక్రవర్తి ఔరంగా జేబ్ వలన వచ్చింది. ప్రదేశం పూర్తిగా మొఘల్ వైభవం తో వుంటుంది. ముంబై నగరానికి 369 కి. మీ. ల దూరం. ఇక్కడ హిమరూ శాల్స్ తయారు చేసే హిమరూ కర్మాగారం చూడవచ్చు.

Photo Courtesy: Aur Rang Abad

మరిన్ని ముంబై ఆకర్షణలకు క్లిక్ చేయండి

ముంబై హోటళ్ళ కు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X