» »వివాహం కావాలంటే ఏ దేవాలయాలు దర్శించాలి !

వివాహం కావాలంటే ఏ దేవాలయాలు దర్శించాలి !

Written By: Venkatakarunasri

LATEST: తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?

మన దేశంలో ఎన్నో ప్రత్యేకత కలిగిన ఆలయాలున్నాయ్. కొన్ని ఆలయాలకు వెళ్తే కొన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కొన్ని దేవాలయాల్లో స్థలపురాణం ఒకటయితే స్వామివారు తీర్చిన కోరికలను బట్టి ఆయనకి కొత్తపేరు పెట్టిన క్షేత్రాలూ వున్నాయ్. ఆ క్షేత్రాలు చూద్దాం.

తూర్పుగోదావరిజిల్లాలోని మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారికి కల్యాణం జరిపిస్తే వివాహంలో జరగనున్న విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని వీరభద్రునకు,భద్రకాళీ అమ్మవారికి వివాహం జరిగిందని స్థల పురాణం. ఇక్కడ కళ్యాణం చేయించదలచినవారు ఆలయం వారికి కాల్ చేసి మీరు పేరు నమోదు చేయించుకోవాలి. మీ పేరు, పుట్టినతేదీ, వివరాలు తెలియచేస్తే మీరు ఎప్పుడు స్వామివారికి కళ్యాణం జరిపిస్తే మంచిదో వారే తారీఖు నిర్ణయిస్తారు. మీరు దూరప్రాంతం నుంచి వస్తున్నవారైతే వసతిసౌకర్యం కూడా దేవాలయం దగ్గరలోనే వుంటుంది.

తూర్పుగోదావరిజిల్లాలోని మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామివారి దేవస్థానం

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి

1. మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి

వృధ్ధ గోదావరీ తటంలో వున్న క్షేత్రం మురమళ్ళ. ఇక్కడ స్వామి శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరేశ్వరస్వామి.

PC:youtube

2. సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం

2. సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం

పురాణ కధల ప్రకారం దక్షుడు యజ్ఞం చేయటం, దానికి పరమశివుణ్ణి ఆహ్వానించకపోవటం, సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలనే ఆకాంక్షతో వెళ్ళటం, అక్కడ శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో భస్మమవటం అందరికీ తెలిసిందే.

PC:youtube

3. దక్షయజ్ఞం

3. దక్షయజ్ఞం

సతీదేవి భస్మమవటంతో కోపించిన శివుడు వీరభద్రుడుని సృష్టించి దక్షయజ్ఞ వినాశనానికి పంపుతాడు. ఆయననే ఇక్కడ వీరేశ్వరుడంటారు. ఆయన మహా భయంకర రూపందాల్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు.

PC:youtube

4. దక్షుడు

4. దక్షుడు

తర్వాత దక్షుడు పశ్చాత్తాపపడటంతో ఆయనకి మేక తల అతికించి ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేస్తారు. కానీ సతీ దహనంవల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని వీరేశ్వరుడిని శాంతింపచేయమని ప్రార్ధిస్తారు.

PC:youtube

5. నరసింహావతారం

5. నరసింహావతారం

విష్ణుమూర్తి నరసింహావతారంలో వీరేశ్వరుడ్ని శాంతింపచేయబోతాడు. కానీ వీరేశ్వరుడు శాంతించడు సరికదా నరసింహస్వామి నడుం పట్టుకుని వదలడు. దానితో నరసింహస్వామి తన నరసింహావతార లీలను అక్కడే వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళి అందరూ కలిసి ఆది పరాశక్తిని ప్రార్ధిస్తారు.

PC:youtube

6. షోడశ కళలు

6. షోడశ కళలు

ఆవిడ ప్రత్యక్షమై విషయం తెలుసుకుని, తన షోడశ కళలలోని ఒక కళ భద్రకాళిని వీరభద్రుని శాంతింపచెయ్యటానికి భూలోకానికి పంపింది. భద్రకాళి అమ్మవారు ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడావిడ శరభ అశ్శరభ అంటూ పక్కనే వున్న తటాకంలో మనిగి కన్యరూపందాల్చి తటాకమునుండి బయటకువచ్చి వీరేశ్వరుని చూసింది.

PC:youtube

7. వీరేశ్వరుడు

7. వీరేశ్వరుడు

కన్యరూపంలోవున్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు. ఇదంతా జరిగింది మహామునులందరూ గౌతమీ తటంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని నివసిస్తున్న ప్రదేశంలో.

PC:youtube

8. వీరేశ్వరస్వామి

8. వీరేశ్వరస్వామి

దానిని మునిమండలి అనేవారు. మునులందరూ ఆ మునిమండలిలో వీరేశ్వరస్వామికి, భద్రకాళికి గాంధర్వ పధ్ధతిన వివాహం జరిపి స్వామిని శాంతింపచేశారు.

పాపికొండల మధ్యలో మరుపురాని ప్రయాణం !

PC:youtube

9. మురమళ్ళ

9. మురమళ్ళ

అప్పటినుంచి ఆ క్షేత్రంలో స్వామికి నిత్యం గాంధర్వ పధ్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ మునిమండలే కాలక్రమేణా మురమళ్ళగా నామాంతరం చెందింది.

PC:youtube

స్వామివారి కళ్యాణం చేయిస్తే

స్వామివారి కళ్యాణం చేయిస్తే

ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణానికి ఇంకొక విశేషం వున్నది. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే త్వరలో వారి సంతానం వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.

PC:youtube

11. నిత్య కళ్యాణం

11. నిత్య కళ్యాణం

భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూంటాయి. అంతేకాదు. స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులేకాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులనేకులు ప్రతి నిత్యం విచ్చేస్తారని పురాణ కధనం.

PC:youtube

12. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి

12. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి మహిమ, క్షేత్ర మహిమల దృష్ట్యా అవకాశంవున్నవారు తప్పక దర్శించవలసిన ఆలయం ఇది.

PC:youtube

13. డైరక్ట్ బస్సులు

13. డైరక్ట్ బస్సులు

కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం శ్రీవారి మెట్టుకి వెళ్ళే దారిలో వుంటుంది. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి డైరక్ట్ బస్సులుంటాయ్.

PC:youtube

14. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం

14. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం

ఇది స్వామివారి కొండ పైకి వెళ్లేముందు ఆరునెలల పాటు శ్రీనివాస మంగాపురంలో నివాసం వుండి వెళ్ళారని స్థలపురాణం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కల్యాణం చేయిస్తే త్వరగా వివాహం అవుతుందని నమ్మకం.

PC:youtube


Please Wait while comments are loading...