• Follow NativePlanet
Share
» »కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !

కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !

ప్రపంచం అంతమయ్యే సమయంలో ఈ సృష్టి మనకు తెలిసేలా కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలను తెలిసినప్పుడు ఆ అంతం ఎప్పుడు వస్తుందా అని లెక్కలు వేయటం తప్ప డానికి విరుద్ధంగా మనం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. హిందూ పురాణాల ప్రకారం మొత్తం కాలమానాన్ని 4యుగాలుగా విభజించారు. అవే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం నివశిస్తున్నది కలియుగంలో.

ఈ యుగాంతంతో మొత్తం సృష్టి అంతమైపోతుందని మన హిందూ పురాణాలతో పాటు చాలా దేశాల పురాణాలలో కూడా వుంది. కలియుగాంతం జరిగే అన్ని పరిణామాల గురించి ఎన్నో గ్రంథాలలో,పురాణాలలో రాయబడి వుంది. ఈ కలియుగం గురించి, కలియుగం అంతం గురించి జరగబోయే విషయాలని మన ఆంధ్రరాష్ట్రంలో ముందే చెప్పిన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఆయన రాసిన కాలజ్ఞాన గ్రంథంలో కలియుగ అంతానికి గల కారణాలను విపులంగా రాశారు.

ఇది కూడా చదవండి: ఉత్తర మహారాష్ట్ర ప్రధాన ఆకర్షణలు !!

ఇప్పటికీ వాటిలో చాలా జరిగాయి కూడా. ఇలాంటి సంఘటనలతో ముడిపడివున్న చాలా సంఘటనల గురించి అతి ఘాడంగా నమ్ముతున్నారు. ఈవిధంగా యుగాంతం గురించి ఒక సంఘటన వుంది. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు, బోళాశంకరుడు అని అనేక పేర్లతో భక్తులు ఆ మహాశివుడిని పిలుచుకుంటారు. మన హిందూ పురాణాల ప్రకారం శివుడు లయకారుడు అంటారు. ఆయనే ఈ భూమి మీద జరిగే అన్ని కార్యాలకు మూలమని ఆయన లేనిదే చీమైనా కదలదని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ లింగాకార గుడి ఈ యుగాంతంతో ముడిపడి వున్నది.

ఇది కూడా చదవండి:మహారాష్ట్రలోని బుద్దుని అవశేషాలు!!!

స్వయాన మన భారతదేశంలోనే మహారాష్ట్ర రాష్ట్రంలో ..! మహారాష్ట్రలో ఎన్నో నదులకు, ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లో ఉంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతం ఒక హిల్ స్టేషన్ మరియు అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయాలి. ఇంతకు ఈ ప్రదేశం చెప్పలేదు కదూ ..! హరిశ్చంద్రగడ్. హరిశ్చంద్రగడ్ ఒక హిల్ ఫోర్ట్ అంటే కొండ కోట. కొండ మీద ఒక కోట ఉంటుంది. ఆ కోటలో ఇంతవరకు చెప్పానే యుగాంతం అని ఆ అలజడి రేపే అంశాలు దాగి ఉన్నాయి.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

హరిశ్చంద్రకోట

హరిశ్చంద్రకోట

ఆ గుడికి యుగాంతానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే ఒక్కసారి మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్రకోటకు వెళ్ళాల్సిందే. ఇది అత్యంత పురాతన కోట. ఈ కోటలోనే వుంది ఆ గుడి. ఈ కోటలోనే వున్న చిన్న గుడిలో 5 అడుగుల శివలింగం ఒకటి వుంది. ఆ లింగంపైన పెద్ద బండ రాయి కూడా ఒకటి వుంది. ఆ రాయి కిందపడకుండా ఈ లింగం చుట్టూ నాలుగు స్తంభాలు కూడా వున్నాయి. ఈ స్తంభాలే యుగాంతానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.

PC:Bajirao

కలియుగం

కలియుగం

ఆ గుడిలోని ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క యుగానికి ప్రతీక అని భక్తులు నమ్ముతున్నారు. ఆ నాలుగు స్తంభాలలో 3 స్తంభాలు ముందు జరిగిపోయిన యుగాలలో ఒక్కొక్కటిగా కూలిపోయాయని ఇప్పుడు మిగిలింది ఒక్క స్తంభమేనని ఆ స్తంభం ఈ కలియుగాంతం దగ్గరలో వున్నప్పుడు కూలిపోతుందని అలా ఆ స్థంభం కూలినప్పుడు కలియుగం అంతమైపోతుందని అక్కడి ప్రజలు,పండితులు చెబుతున్నారు.

PC: youtube

విశిష్టత

విశిష్టత

కొంతమంది వాదనల ప్రకారం కృతయుగంలోనే ఈ శివాలయాన్ని కట్టారంటే మరికొంతమంది వాదానల ప్రకారం హరిశ్చంద్రకోటను మొదటిసారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు 4వ శతాబ్దంలో కట్టివుంటారని చెబుతున్నారు. అయితే ఈ ఆలయం ఎప్పుడు కట్టారు? ఎవరు కట్టారు? అనే సమాచారం మాత్రం స్పష్టంగా తెలీడంలేదు.ఇదిలా వుండగా ఈ గుడికి ఒక విశిష్టత కూడా వుంది. ఈ గుడిలో ఎప్పుడూ 5 అడుగుల వరకు చల్లటి నీతితో నిండి వుంటుంది. నీరు ఆ గుడి గోడల నుంచి వస్తుందట.

PC: youtube

వింత

వింత

ఇక్కడ వున్న వింత ఏమిటంటే ఆ గుడిలో వున్న నీళ్ళు ఒక్క వర్షాకాలంలో తప్ప మిగిలిన అన్ని కాలాల్లో వస్తూవుంటుందంట. వర్షాకాలంలో మాత్రం అక్కడ ఒక్క చుక్క నీరు కూడా కనిపించదట. ఎండాకాలం ఆ నీరు బయట ఎంత ఎండగా వున్నా గడ్డ కట్టేంత చల్లగా వుంటుందట. ఈ వింతను చూడటానికి చాలా మంది భక్తులు వస్తూ వుంటారు.

PC: youtube

మిస్టరీ

మిస్టరీ

ఈ వింత ఎలా జరుగుతుందనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. ఈ నీరు ఒక మిస్టరీగా మిగిలితే అంత పెద్ద కొండ రాయిని ఒక స్థంభం ఎలా ఆపుతుందనేది ఒక మిస్టరీగా మిగిలింది. ఇన్ని విశిష్టతలు వున్న ఈ గుడికి కలియుగాంతానికి సంబంధం వుందా?అనే విషయానికి సంబంధించి కాలమే సమాధానం చెప్పాలి.

రోగాలను నయం చేసే శివుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

PC: youtube

హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

హరిశ్చంద్ర గడ్ థానే, పూణే మరియు అహ్మద్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. థానే జిల్లా నుంచి : థానే నుంచి కల్యాణ్ అనే పేరుగల ఊరికి బోర్డ్ తగిలించి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కి ఖుబిఫట గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఖిరేశ్వర్ గ్రామానికి బస్సు లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. ఖిరేశ్వర్ నుంచి 7 కి. మీ. వరకు ట్రెక్కింగ్ చేస్తే కొండమీదున్న హరిశ్చంద్రగడ్ కోట చేరుకోవచ్చు. పూణే లోని శివాజీనగర్ ఎస్ టి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజూ ఖిరేశ్వర్ కు బస్సులు నడుస్తాయి.

PC: youtube

అహ్మద్ నగర్ జిల్లా నుంచి

అహ్మద్ నగర్ జిల్లా నుంచి

నాసిక్, ముంబై లేదా అలైట్ కు వెళ్లే బస్సులు ఎక్కి ఘోటి గ్రామం చేరుకోవాలి. ఘోటి నుంచి సంగమ్‌నేర్ వయా మలేగావ్ మరియు అలైట్ బస్సులు ఎక్కి రాజూర్ గ్రామం చేరుకోవాలి. ఈ గ్రామం నుంచి 3 దారుల్లో కోట కు చేరుకోవచ్చు.

PC: youtube

 హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

రాజూర్ గ్రామం నుంచి పచనై గ్రామం వరకు బస్సులో లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. అక్కడి నుంచి నేరుగా ఉన్న మార్గంలో ఆ ఎత్తైన చోటుకి చేరుకోవాలి. కొత్తగా రాజూర్ నుంచి కొథలె(లోయ ప్రాంతం) వరకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. లోయ నుండి 2 - 3 గంటలు కాలినడకన వెళ్తే యుగాంతం చోటు కు వెళ్ళవచ్చు.

PC: youtube

 ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల సౌకర్యం

ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల సౌకర్యం

కోటుల్ నుండి కొథలె వరకు లోయ ప్రాంతమైన తోలార్ ఖింద్ మార్గం గుండా ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల సౌకర్యం గంట గంట కు ఉన్నది.

PC: youtube

వసతి సౌకర్యాలు

వసతి సౌకర్యాలు

కొండ మీద ఉన్న గుహాల్లో గణేశ్ ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో 50 వరకు వసతి కల్పించవచ్చు. క్యాంపైనింగ్ కూడా సూచించదగినది. కొథలె గ్రామంలో వసతి కొథలె గ్రామంలో బస చేయటానికి చారిటబుల్ ట్రస్ట్ వారు, సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు , దాతలు తక్కువ ధరకే వసతి సదుపాయం కలిపిస్తున్నారు.

PC: youtube

 రాత్రి పూట బస

రాత్రి పూట బస

ఖిరేశ్వర్ వసతి ఖిరేశ్వర్ లో రాత్రి పూట బస చేయటానికి లోకల్ స్కూల్ ఉత్తమం. ఇక్కడ చూడటానికి నాగేశ్వర్ ఆలయం మరియు యాదవ గుహలు ఉన్నాయి. పచ్‌నై గ్రామం లో రాత్రి పూట బస చేయటానికి హనుమాన్ ఆలయం సూచించదగినది.

PC: youtube

భోజన సౌకర్యాలు

భోజన సౌకర్యాలు

సమ్మర్ లో, వింటర్ లో స్థానికులు తయారు చేసిన వంటలను గుహల వద్ద అమ్ముతుంటారు కాబట్టి తినొచ్చు. ఐతే, మాన్సూన్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా వారు వంటలు చేయరు అప్పుడు మనమే స్వయంపాకం చేసుకోవాల్సిందే ..!

PC: youtube

వింటర్ సీజన్

వింటర్ సీజన్

తాగునీటి అవసరాలకై నిర్మించిన వాటర్ ట్యాంక్ కు గుహల వద్ద ఉన్నాయి. ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. తోలార్ ఖింద్ మరియు హరిశ్చంద్రగడ్ వద్ద వేసవి మరియు వింటర్ సీజన్ లో నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ అమ్ముతారు.

PC: youtube

కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

కొథలె నుండి హరిశ్చంద్ర గడ్ కు చేరుకోవటానికి సూచించదగిన మరో మార్గం కొథలె గ్రామం. ఇక్కడి నుంచి కోట మూడు కిలోమీటర్లు. నడక మార్గాన వెళ్తున్న మీరు అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. దారి మద్యలో నీటి తో నిండిన కుంట లను, చెరువులను గమనించవచ్చు.

PC: youtube

హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

కొండ మీద చూడవలసినది కోట. కోట పురాతమైనది చాలా వరకు శిధిలాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశం గురించి మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణాల్లో పేర్కొన్నారు. కోటను కాలచూరి వంశీయులు నిర్మించారు. కోట సముద్ర మట్టానికి 1424 మీ. ఎత్తున ఉంటుంది.

PC: youtube

కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

కొండ మీదకి చేరుకోవటానికి 4 -5 మార్గాలు ఉన్నాయి. అందులో ప్రసిద్ధి గాంచిన రూట్లు ఖిరేశ్వర్ నుంచి గుహలు, వాటర్ ట్యాంక్ ల ను దాటుకుంటూ జున్నార్ దర్వాజా వరకు చేరుకోవాలి. అక్కడి నుండి నేరుగా తోలార్ ఖింద్ కు చేరుకొని కొద్ది దూరం నడవాలి. రాళ్ళ గుట్టలను, తక్కువ అడవులున్న పీఠభూమి మైదానాలను, ఏడు కొండలను దాటుకుంటూ 2 - 3 గంటలు నడిస్తే హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.
గమనిక : నడిచి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో గుర్తులు ఉపయోగ పడతాయి.

PC:Prabuddha

బలెకిల్ల

బలెకిల్ల

ఈ ఏడు కొండలను స్కిప్ చేసి వెళ్లే మార్గం ఒకటి ఉన్నది. అది దట్టమైన అటవి ప్రాంతం కనుక వెళ్తే సమూహంగా(గ్రూప్ లుగా) వెళ్ళాలి. ఈ మార్గాన్ని బలెకిల్ల అంటారు. తోలార్ ఖింద్ నుండి రాక్ క్లైంబింగ్ చేసుంటూ వెళ్తున్న తప్పక ఆయాసం వస్తుంది. కాస్త ఆగుతూ వెళ్ళాలి. ఇలా వెళితే 1 -2 గంటల్లో హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.

PC: youtube

బెల్పడ గ్రామం

బెల్పడ గ్రామం

కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు బెల్పడ మల్షేజ్ ఘాట్ నుంచి కల్యాణ్ వెళ్లే మార్గంలో బెల్పడ గ్రామం ఉన్నది. అక్కడి నుంచి వయా సధ్లెఘాట్ గుండా 1 కిలోమీటరు దూరం నుడుచుకుంటూ దారిమధ్యలో ఎత్తుపల్లాలను, ఏటా వాలు రాళ్ళను దాటుకుంటూ వెళితే హరిశ్చంద్ర గడ్ చేరుకోవచ్చు.

PC: Dinesh Valke

కొథలె గ్రామం

కొథలె గ్రామం

కొథలె నుండి హరిశ్చంద్ర గడ్ కు చేరుకోవటానికి సూచించదగిన మరో మార్గం కొథలె గ్రామం. ఇక్కడి నుంచి కోట మూడు కిలోమీటర్లు. నడక మార్గాన వెళ్తున్న మీరు అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. దారి మద్యలో నీటి తో నిండిన కుంటలను, చెరువులను గమనించవచ్చు.

PC:Avinash Rohra

హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

కోట ఆవరణలో అందమైన విష్ణు దేవాలయం దగ్గర్లో పురాతన బౌద్ధ గుహలు ఉన్నాయి. మధ్య యుగ కాలానికి చెందిన నాగేశ్వర్ ఆలయం, హరిశ్చంద్రేశ్వర్ ఆలయం మరియు కేదారేశ్వర్ గుహాలయం కూడా సమీపంలోనే ఉన్నాయి.

PC:Dinesh Valke

సప్త తీర్థ పుష్కరణి

సప్త తీర్థ పుష్కరణి

సప్త తీర్థ పుష్కరణి ఆలయానికి తూర్పు వైపున సప్త తీర్థ పుష్కరణి చెరువు ఉన్నది. ఈ చెరువు ఒడ్డున ఆలయ నిర్మాణం మాదిరి కనిపించే కట్టడం ఒకటుంది. అందులో విష్ణు ప్రతిమలు ఉన్నాయి. మొన్ననే ఆ విగ్రహాలను గుహలకు దగ్గర్లోని హరిశ్చంద్రేశ్వర్ ఆలయానికి తరలించారు.

PC:Pmohite

సప్త తీర్థ పుష్కరణి

సప్త తీర్థ పుష్కరణి

సప్త తీర్థ పుష్కరణి వచ్చి పోయే ట్రెక్కర్లు ఈ చెరువు వద్దకు వచ్చి ప్లాస్టిక్ వస్తువులను పడేసేవారు దాంతో గత 7 సంవత్సరాల నుంచి ఈ చెరువు కనీసం స్విమ్ చేయటానికి కూడా ఉపయోగపడటం లేదు. వేసవిలో ఈచెరువు ఒడ్డున నిలబడితే చల్లగా ... ఫ్రిజ్ ముందర నిలబడ్డట్టు ఉంటుంది

PC:Pmohite

కేదారేశ్వర్ స్వామి ఆలయం

కేదారేశ్వర్ స్వామి ఆలయం

కేదారేశ్వర్ గుహాలయం పక్క చిత్రంలో మీరు చూస్తున్నది అపురూపమైన, అద్భుతమైన కట్టడం. ఇది అహ్మద్ నగర్ జిల్లాలోని హరిచంద్ర కోటలో ఉన్న కేదారేశ్వర్ స్వామి ఆలయం. ఈ మందిరం పైన ఒక పెద్ద బండరాయి, కింద 4 స్తంభాల పై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలీదు. ఎవరు నిర్మించారో కూడా తెలీదు.

PC:Bajirao

గుహాలయం

గుహాలయం

కేదారేశ్వర్ గుహాలయం కానీ ఇక్కడున్న నాలుగు స్తంభాలు 4 యుగాలకి(సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం) సంకేతాలు గా నిలిచాయి. ఒక్కో యుగాంతానికి ఒక్కో స్తంభం విరిగిపోతుంది.

PC:Bajirao

ఆకర్షణీయ ప్రదేశాలు

ఆకర్షణీయ ప్రదేశాలు

హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షణీయ ప్రదేశాలు కేదారేశ్వర్ గుహాలయం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కనుక, ఈ పెద్ద బండరాయి ఒక స్తంభం పైన మాత్రమే వున్నది. ఎప్పుడైతే ఈ స్తంభం కూడా విరిగిపోతుందో ఆ రోజు ఈ కలియుగానికి ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి మహాత్వమైన గోపురం ఇది...

PC:Bajirao

ఇంకో గొప్ప విషయం ఏమిటంటే

ఇంకో గొప్ప విషయం ఏమిటంటే

కేదారేశ్వర్ గుహాలయం ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ... గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది. ఆ నీరు చల్లగా ఉండటం వల్ల ఎవరూ లోనికి వెళ్ళరు. వర్షాకాలంలో మాత్రం ఒక్క చుక్క నీరు గుడి లో ఉండదు...!! వేసవి, శీతాకాలంలో 5 అడుగుల మేర ఎత్తులో నీరు వుంటుంది.

PC:Bajirao

కొంకణ్ క్లిఫ్

కొంకణ్ క్లిఫ్

కొంకణ్ క్లిఫ్ ఇక్కడ అద్భుతమైన సూర్యోదయాలను, సూర్యాస్తమాలను చూడవచ్చు. ప్రకృతి అందాలను, లోయ అందాలను, సహజ ప్రకృతి సన్నివేశాలను కూడా గమనించవచ్చు

PC:Bajirao

పిక్నిక్ ప్రదేశం

పిక్నిక్ ప్రదేశం

తారామతి పీక్ / తారామంచి ఈ పిక్నిక్ ప్రదేశం సముద్ర మట్టానికి 1429 మీ. ఎత్తున ఉంటుంది. దీనికి అనుకోని ఉన్న అడవుల్లో చిరుతలను చూడవచ్చు. పశ్చిమ కనుమల లోని కసర రీజన్ లో ఘోడ్‌శెప్(865 మీ.), అజోబా (1375 మీ) కులాంగ్ ఫోర్ట్(1471 మీ) లను కూడా చూడవచ్చు కానీ మసక మసకగా కనిపిస్తాయి.

PC:Bajirao

సమీపంలో కొన్ని ఆలయాలు

సమీపంలో కొన్ని ఆలయాలు

హరిశ్చంద్రగడ్ గుహలు దాదాపు కోట అంతటా గుహలు విస్తరించాయి. వాటిలో కొన్ని తారామని పీక్ వద్ద మరియు బస చేసే వద్ద ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.

PC:Bajirao

ఖిరేశ్వర్

ఖిరేశ్వర్

నాగేశ్వర్ ఆలయం, ఖిరేశ్వర్ దగ్గర ఇదొక విష్ణు దేవాలయం. ఇది ఖిరేశ్వర్ సమీపంలో ఉన్నది. ఇందులో ప్రధాన దైవం విష్ణువు. శిల్పం 1.5 మీ. పొడవు ఉండి విష్ణువు పడుకొని ఉన్న భంగిమలో ఉంటాడు.

PC: youtube

గుహాలయం

గుహాలయం

హరిశ్చంద్రేశ్వర్ ఆలయం ఇదొక గుహాలయం. ట్రెక్కింగ్ కు వచ్చే వారు ఇక్కడ వసతి పొందవచ్చు. సమీపంలో అనేక వాటర్ ట్యాంక్ కు ఉన్నాయి. ఆలయ రాతి నిర్మాణం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు. గణపతి విగ్రహం నల్లటి రాతి నిర్మాణాల మధ్య చెక్కుచెదరకుండా భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటున్నది.

PC:rohit gowaikar

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి