Search
  • Follow NativePlanet
Share
» »మణికరన్ వేడి నీటి బుగ్గలో స్నానం చేస్తే దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి!

మణికరన్ వేడి నీటి బుగ్గలో స్నానం చేస్తే దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి!

మణికరన్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కుల్లూ జిల్లాలోని ఈశాన్య భుంతర్‌లోని బియాస్ మరియు పార్వతి నదుల మధ్య ఉన్న పార్వతీ లోయలో నెలకొని ఉంది. ఇది 1760 మీటర్ల ఎత్తులో ఉంది, కుల్లు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కులు నుండి మనాలి వెళ్లే మార్గంలో మణికరన్ ప్రదేశం ఉన్నది. పార్వతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం వేడి నీటి బుగ్గకు ప్రసిద్ధి చెందినది. ఈ చిన్న పట్టణం తన వేడి నీటి బుగ్గలతో యాత్రా కేంద్రాలతో మనాలి మరియు కుల్లు సందర్శిస్తున్న పర్యాటకులను తన వైపుకు ఆకర్షించుకుంటోంది. ప్రయోగాత్రకమైన భూ అంతర్గత ఉష్ణశక్తి కర్మాగారం కూడా ఇక్కడ నిర్మితమైనది.

మణికరన్ హిందువులు మరియు సిక్కులకు తీర్థయాత్ర కేంద్రం. వరదల తర్వాత మనువు మణికరన్ లో మానవజీవితాన్ని పునఃసృష్టించాడని, ఆ విధంగా ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా చేశాడని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ పలు ఆలయాలు మరియు ఒక గురుద్వార కూడా ఉన్నాయి. ఇక్కడ రాముడు , కృష్ణుడు, మరియు విష్ణువు ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వేడినీటి బుగ్గలకు మరియు సుందర ప్రకృతి దృశ్యానికి పేరుగాంచింది.

మణికరన్ వేడి నీటి బుగ్గలు

మణికరన్ వేడి నీటి బుగ్గలు

దేవతలకు నిలయంగా పేరుపొందిన హిమాచల్ ప్రదేశ్ లోని ‘మణికరన్' పార్వతీ లోయలో ఉంటుంది. ఈ మణికరన్ హిందువులతో పాటు.. సిక్కులకు కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్న నీటిలో స్నానం చేస్తే... దీర్ధకాలంగా బాధపడుతున్న చర్మ రోగాలతో పాటు.. ఆస్మా కూడా చాలా వరకూ నయం అవుతుంది.. అందుకనే ఈ క్షేత్రానికి నిత్యం హిందూ, సిక్కులు భక్తులు వేల సంఖ్యలో వస్తారు.

PC:wikimedia

நதியென நான் ஓடோடி... கடலினை தினம் தேடினேன்

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం, పరమశివుడు ఆయన దేవేరి పార్వతి ఈ లోయలో నడుస్తున్నప్పుడు, పార్వతి తన కర్ణాభరణాలలో ఒకదాన్ని ఇక్కడ జారవిడిచిందట. ఈ కర్ణాభరణాన్ని నాగదేవత అయిన శేషుడు స్వాధీనపర్చుకుని దాంతోపాటు భూమిలోకి మాయమైపోయాడట. పరమశివుడు విశ్వ నృత్యమైన తాండవ నృత్యం చేసినప్పుడు మాత్రమే శేషుడు ఈ ఆభరణాన్ని స్వాధీనపర్చి నీటలోకి విసిరివేశాడట. స్పష్టంగానే, 1905లో భూకంపం వచ్చేంతవరకు మణికరన్ జలాల్లో ఆభరణాలు విసిరివేయబడటం కొనసాగింది.

PC: Raghavan Prabhu

పురాణ గాథ

పురాణ గాథ

ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు పరమశివుడు, పార్వతీదేవి పర్వతాలతో, హరిత పత్రాలతో వ్యాపించి ఉన్న ప్రాంతానికి వచ్చారని మణికరన్ పురాణ గాథ చెబుతోంది. ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి మరులుగొన్న వీరు కాస్సేపు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి వీరు ఇక్కడే పదకొండు వందల సంవత్సరాలు గడిపారని భక్తుల విశ్వాసం.

వారు ఇక్కడ గడిపిన కాలంలో, పార్వతీదేవి మణి నీటి ప్రవాహంలో జారిపోయిందట.ఈ పురాణగాధ నుంచే మణికరన్ పేరు పుట్టింది.

PC:Himanshu Nagar

Manikaran (9)

ఈ ప్రాంతాన్ని సందర్శించాక ఇక కాశీని కూడా సందర్శించనవసరం లేదని జనం విశ్వాసం

ఇక్కడి నీళ్లు ఇప్పటికీ వేడిగానే ఉంటూ పరమ శుభదాయకంగా భావిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తీర్థయాత్ర ముగించిన ఫలితం ఒనగూరుతుందని నమ్మిక. ఈ ప్రాంతాన్ని సందర్శించాక ఇక కాశీని కూడా సందర్శించనవసరం లేదని జనం విశ్వాసం. ఈ బుగ్గలోంచి ఉబికి వచ్చే నీటికి వ్యాధులను పోగొట్టే శక్తులు ఉన్నాయని భావిస్తుంటారు. ఇక్కడి నీరు ఎంత వేడిగా ఉంటుందంటే బియ్యం కూడా ఉడికిపోతాయి.

పరమశివుడికి చెందినది కావడంతో ఈ ఆలయాన్ని అత్యంత భయభక్తులతో చూస్తుంటారు. అయితే, 1905 సంభవించిన భూకంపం ఆలయాన్ని స్వల్పంగా దెబ్బతీసింది మరియు ఆలయం కాస్త పక్కకు ఒరిగిపోయింది.

మణికరన్ గురుద్వారా

మణికరన్ గురుద్వారా

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరన్ లో ఉన్న ప్రసిద్ద పర్యాటక ప్రదేశం శ్రీ గురునానక్ దేవ్ జీ గురుద్వారా. గురునానక్‌తో సంబంధం కారణంగా ఇక్కడి శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా సుప్రసిద్ధమైనది. ఈ గురుద్వారాకు వచ్చే భక్తులు వేడినీటి బుగ్గల నుంచి వచ్చే వేడినీటిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక్కడ చేసే మూడు స్నానాలలో ఒకటి గురుద్వారా కిందనే ఉంది. స్త్రీ పురుషులకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడికి కాస్త దూరంలో లంగార్ హాల్ (సామూహిక వంటశాల) ఉంది ఇక్కడ ఉచిత భోజనం అందిస్తారు.

PC:Tegbains

కూలాంత పీఠం:

కూలాంత పీఠం:

హిమాచల్ ప్రదేశ్ లోని విష్ణు కుండం వద్ద ఉన్న కూలాంత పీఠం దేశంలోని అత్యుత్తమ పీఠాల్లో ఒకటి. జానపద గాధల ప్రకారం లయకారకుడు శివుడు ఇక్కడే నివశించాడు. అందువ్ల ఈ ప్రాంతం అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. భక్తులకు మోక్షాన్ని ప్రసాధించే శక్తిగల పవిత్రమైన నీరు ఈ పీఠంలోని చెరువులో ఉన్నాయని నమ్ముతారు.

PC:Manu moudgil

హరీందర్ పర్వతం & పార్వతీ నది:

హరీందర్ పర్వతం & పార్వతీ నది:

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న హరీందర్ పర్వతం & పార్వతి నది ఏడాది పొడవునా అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తాయి. మంచుతో కప్పబడిన హరీందర్ పర్వతం, దాని దట్టమైన పచ్చటి లోయ రెండూ కలిసి మణికరణ్ అందాన్ని ఇనుమడి౦పచేస్తాయి.

PC:Harigovind Kaninghat harkan

రామచంద్ర దేవాలయం:

రామచంద్ర దేవాలయం:

17 వ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ నిర్మించిన రామచంద్ర దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.హిమాచల్ ప్రదేశ్ లోని మణికరన్ లో ప్రసిద్ద పర్యాటక ప్రదేశం. ఒక ఇతిహాసం ప్రకారం విష్ణువు ఏడవ అవతారం అయోధ్యా రాజు రామచంద్రుడు ఈ గుడిని అయోద్య నుండి మణికరన్ కు మార్చాడు. ఈ గుడి చరిత్ర ఈ గుడి గోడల్లోని ఒకదానిపై రాసి ఉంది.

PC:wikimedia

శివుడి ఆయలం:

శివుడి ఆయలం:

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న పురాతన దేవాలయం శివాలయం.లయకారకుడైన శివుడు, సృష్టికారకుడు బ్రహ్మ, స్థితి కారకుడు విష్ణువు కలిసి త్రిమూర్తులుగా వ్యవహరింపబడతారు. 1905 లో రిక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రత తో వచ్చిన భూకంపం తరువాత ఈ గుడి కొద్దిగా ఒరిగింది. కులు లోయ నుంచి దేవతలు వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శిస్తారని ప్రజలు నమ్ముతారు.

PC:Jayantanth

పుల్గా :

పుల్గా :

మణికరణ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న పుల్గా ఇక్కడి మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ప్రకృతి స్వర్గంగా ఎంతోమంది చేత భావించబడే ఈ ప్రదేశం చుట్టూ పైన్ చెట్ల అడవులతోను, పర్వతారోహణ మార్గాలతోను చుట్టుబడి వుంటుంది. పర్వతారోహణ చేయాలనుకునే యాత్రికులకు ఈ 16 కిలోమీటర్ల దారి వెంట 1600 మీటర్లు ఎక్కే అవకాశం వుంది.

PC:Alok Kumar

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

విమాన మార్గం: మణికరన్ కు సుమార్ 35కిలోమీటర్ల దూరంలో భున్తార్ ఎయిర్ పోర్ట్ ఉంది. ఢిల్లీ, ఛండీగర్ మరియు మరికొన్ని ప్రధాన నగరాల నుండి రెగ్యులర్ విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. మణికరన్ కు అతి సమీపంలో 160కిమీ దూరంలో చండీగడ్ ఎయిర్ పోర్ట్ ఉంది.

రైలు మార్గం:

మణికరన్ కు ఎలాంటి సమీప రైల్వేష్టేషన్ మంజూరు కాలేదు. కానీ మనికరన్ కు దగ్గరలో ఒక పెద్ద రైల్వేష్టేషన్ పంజాబ్ లో పథాన్ కోట్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి ఇండియాలోని ప్రధాన నగరాల నుండి ప్రధాన రైలులు చేరుతాయి. మనికరన్ కు సుమారు 300కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుండి ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. అలాగో మరో రైల్వేష్టేన్ సుమారు 149కిలోమీటర్ల దూరంలో జోగిందర్ రైల్వేష్టేషన్ ఉంది.

రోడ్డు మార్గం: సిమ్లా, పతాన్ కోట్, చంఢీగఢ్, న్యూ ఢిల్లీ వంటి ప్రధాన నగరాల నుండి అనేక బస్సు సర్వీసులున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more