Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ దేవాలయాన్ని కాదు ఆ ప్రాంత మట్టిని తాకినా మోక్షమే అందుకే

ఇక్కడ దేవాలయాన్ని కాదు ఆ ప్రాంత మట్టిని తాకినా మోక్షమే అందుకే

చిన్నపిల్లలు దైవ స్వరూపం అంటారు. అటు వంటి దైవమే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేసిన అల్లరికి ఆ ప్రాంతం ప్రత్యక్ష సాక్షం. చిట్టి చిట్టి పాదాలతో అడుగులు వేసినా, వెన్న దొంగిలించిన విధానాన్ని ఆ ప్రాంతం చిరునవ్వులు చిందిస్తూ మౌనంగా వీక్షించింది.

అదే విధంగా శృంగార, సరస సల్లాపాలు అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది శ్రీ కృష్ణుడి చేష్టలే. గోపికల వస్త్రాలను దొంగిలించి చెట్టెక్కినా, తన నెచ్చెలి రాధతో సరసాలాడినా, వేణునాదంతో గోపికలందరినీ తన చుట్టూ తిప్పుకొన్న ఆ పరమాత్ముడి లీలలన్నీ ఆ ప్రాంతంలోనే జరిగాయి.

అయితే శ్రీ కృష్ణుడి నిర్యాణం అనంతరం ఆ ప్రాంతం దట్టమైన అరణ్య ప్రాంతంగా మారిపోయింది. చివరికి ఒక భక్తుడి నిరంతర శ్రమ వల్ల ఆ ప్రాంతం తిరిగి పదిహేనవ శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. అటు పై అక్కడ అనేక ఆలయాలు వెలిశాయి. నిత్యం భక్తుల సందడితో కోలాలహలంగా మారిపోయింది. శ్రీ కృష్ణుడు తిరుగాడిన నేల కాబట్టే ఇక్కడ మట్టిని తాకినా పుణ్యమని హిందువుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాల వివరాలు మీ కోసం...

బృందావన్ కు ప్రత్యేక స్థానం

బృందావన్ కు ప్రత్యేక స్థానం

P.C: You Tube

హిందూ మతంలో బృందావన్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ కృష్ణుడి చిన్ననాటి ఆటపాటలకు ప్రత్యక్ష సాక్షి ఈ బృందావన్. సోదరుడు బలరాముడితో పాటు అతని గోపబాలలులతో కలిసి చేసిన వెన్న దొంగతనాలన్నీ ఈ బృందావన్ లోనే జరిగాయి.

బృందావన్ ప్రత్యక్ష సాక్షి

బృందావన్ ప్రత్యక్ష సాక్షి

P.C: You Tube

అదే విధంగా చిన్నపిల్లవాడిగా ఉంటూనే రాక్షసులతో పోరాడిన ఘటన ఘలనకూ ఈ బృందావన్ ప్రత్యక్ష సాక్షి. ఇలా దేవదేవుడైన ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడి చిట్టిపాదాలను మోసిన ఈ ప్రాంతంలోని మట్టిలోని రేణువు అత్యంత పవిత్రమైనదని భక్తులు నమ్మకం.

కనుమరుగై పోయింది

కనుమరుగై పోయింది

P.C: You Tube

శ్రీ కృష్ణుడు అన్న తక్షణం గుర్తుకు వచ్చే గోవర్థన పర్వతాలు, గోకులం వంటి ప్రాంతాలన్నీ ఈ బృందావన్ లోనే ఉన్నాయి. అయితే ద్వాపరయుగం తర్వాత పూర్తిగా ఈ బృందావన్ కనుమరుగై పోయింది. ఈ ప్రాంతంలో దట్టమైన చెట్లు పెరిగి అరణ్యంగా మారిపోయింది

చైతన్య మహాప్రభువు

చైతన్య మహాప్రభువు

P.C: You Tube

ఇలా కనుమరుగైన బృందావన్ ను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీ కృష్ణుడి పరమ భక్తుడైన చైతన్య మహాప్రభువు క్రీస్తు శకం 1515లో తిరిగి వెలుగులోకి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి దినదిన ప్రవర్థమానమై అభివ`ద్ధి చెందుతూ వచ్చింది.

ఆలయాలకు నిలయంగా

ఆలయాలకు నిలయంగా

P.C: You Tube

ఈ బృందావన్ ప్రస్తుతం అనేక ఆలయాలకు నిలయంగా మారింది. దీంతో ఈ బృందావన్ ను నిత్యం వేల మంది కృష్ణుడి భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఈ బృందావన్ లో చూడదగిన అనేక అలాయాలు ఉన్నాయి.

మదన్ మోహన్ ఆలయం

మదన్ మోహన్ ఆలయం

P.C: You Tube

కాళీఘాట్ సమీపంలో ఉన్న మదన్ మోహన్ ఆలయాన్ని ముల్తానాకు చెందిన రామ్ దాస్ నిర్మించాచరు. ఇది బృందావన్ లోని అత్యంత ప్రాచీన దేవాలయం. ఇక్కడ ఉన్న భగవంతుడి విగ్రహాన్ని ఔరంగజేబు దాడుల నుంచి కాపాడటానికి అప్పట్లో రాజస్థాన్ లోని కరులికి రహస్యంగా తరిలించారు. అటు పై ఆ విగ్రహం ప్రతిరూపాన్ని ఇక్కడ అమర్చారు.

బన్కే బిహారీ ఆలయం

బన్కే బిహారీ ఆలయం

P.C: You Tube

దీనిని 1862లో నిర్మించిన ఈ చలువరాతి దేవాలయంలో రాధా కృష్ణుల విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. బృందావన్ దర్శించిన ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించకుండా ఉండలేరు. రాసలీలల విగ్రహాలను కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

రాధా వల్లభాలయం

రాధా వల్లభాలయం

P.C: You Tube

శ్రీహిత్ హరివంశ్ మహాప్రభువు రాధా వల్లభ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ రాధా ధరించిన కిరిటాన్ని మనం చూడవచ్చు. ఈ కిరీటం పక్కనే మనకు మాధవుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడకు ఎక్కువగా విదేశీ భక్తులు వస్తుంటారు.

శ్రీ రాధా రమణ్ మందిరం

శ్రీ రాధా రమణ్ మందిరం

P.C: You Tube

శ్రీ రాధా రమణ్ మందిరాన్ని 1542లో గోపాల భట్టా చార్య ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఇక్కడ సాలగ్రామం రూపంలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఇటువంటి విగ్రహం చాలా అరుదైనది. అంతేకాకుండా ఈ విగ్రమం మహిమాన్వితమైనదని చెబుతారు.

రంగాజీ ఆలయం

రంగాజీ ఆలయం

P.C: You Tube

ఇక్కడ రంగనాథుడు శేష తల్పం పై ఉంటాడు. ద్రవిడియన్ శైలిలో నిర్మించిన ఈ ఆలయం పొడవాటి గోపురాన్ని కలిగి ఉంటుంది. ఈ గోపురం ఆరు అంతస్తులతో ఉంటుంది. అదే విధంగా ఈ దేవాలయంలోని 50 అండుగుల బంగారు పూత పూసిన ధ్వజస్తంభం కూడా ప్రత్యేక ఆకర్షణ

గోవింద్ జీ ఆలయం

గోవింద్ జీ ఆలయం

P.C: You Tube

ఈ ఆలయం ఇండో, గ్రీకు, మహ్మదీయ వాస్తు నిర్మాణ శైలికి నిదర్శనం. దీనిని అక్భర్ సేనానాయకుడు రాజా మాన్ సింగ్ నిర్మించారు. అప్పట్లోనే కోటి రుపాయలను ఈ దేవాలయం నిర్మాణం కోసం వెచ్చించారు. అయితే దీనిని ఔరంగజేబు కాలంలో కొంతమంది నాశనం చేశారు. ఈ దేవాలయ శిథిలాలను ఇప్పటికీ మనం చూడవచ్చు.

కృష్ణ బలరామ దేవాలయం

కృష్ణ బలరామ దేవాలయం

P.C: You Tube

దీనిని ఇస్కాన్ సంస్థ నిర్మించింది. పూర్తి చలువరాతితో నిర్మించబడిన ఈ దేవాలయం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి ప్రభు పాద సమాధి ఈ ఆలయానికి దగ్గరగా ఉంటుంది.

రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయం

రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయం

P.C: You Tube

బృందావన్ లో గల అత్యంత పురాతన ఆలయం ఈ రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయం. కృష్ణ భగవానుడు రాధతో సహా ఆయన ఇష్ట సఖులైన ఎనిమిది మందితో రాసలీలలు ఆడిన ప్రదేశంలో ఈ దేవాలయాన్ని కట్టినట్లు చెబుతారు.

సేవా కుంజ్

సేవా కుంజ్

P.C: You Tube

బృందావన్ లో అత్యం పవిత్రమైన ప్రదేశాల్లో సేవా కుంజ్ కూడా ఒకటి. భగవానుడు గోపికలతో రాసలీలలు అడిన ప్రదేశాల్లో సేవాకుంజ్ కూడా ఒకటని ఇక్కడి వారు చెబుతారు. ఇక్కడికి దగ్గర్లో తాన్ సేన్ గురువైన స్వామి హరిదాస్ సమాధి కూడా ఉంది.

రాధా గోవింద్ ఆలయం

రాధా గోవింద్ ఆలయం

P.C: You Tube

ఈ రాధా గోవింద్ ఆలయాన్ని చైతన్య మహాప్రభువు శిష్యుడైన బలరాం స్వామీజీ నిర్మించారు. ఈ ఆలయాన్ని తిరిగి 2004లో కొత్తగా పున: నిర్మించారు. ఈ ఆలయం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ దేవాలయం మొత్తం చలువ రాతితో నిర్మితం.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube

బృందావన్ శ్రీ కృష్ణుడి జన్మస్థానమైన ఉత్తర ప్రదేశ్ లోని మధుర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఆగ్రా-ఢిల్లీ రహదారిలో ఉంటుంది. మధుర నుంచి ఇక్కడకు నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X