Search
  • Follow NativePlanet
Share
» »ఆ మూడు అడుగులకు మూడు ఆలయాలు, నేపథ్య గాయకులు సందర్శించే అందులోని ఒక ఆలయం

ఆ మూడు అడుగులకు మూడు ఆలయాలు, నేపథ్య గాయకులు సందర్శించే అందులోని ఒక ఆలయం

విష్ణువు దశావతారాల్లో వామనావతారం కూడా ఒకటి. రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాలానికి పంపించిన వామనుడన్న తక్షణం మనకు మదిలో మెదిలేది చిన్న వటువు రూపం. అయితే ఆ వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశానికి, భూమికి ఏక రీతిగా పెరిగిన రూపంలో మనకు చాలా అరుదుగా కనిపిస్తాడు.

ఇలా పెరిగిన రూపాన్నే త్రివిక్రమ రూపం అని పిలుస్తారు. అటు వామనుడికి కాని, ఇటు త్రివిక్రమ రూపానికి కాని చెప్పుకోదగ్గ సంఖ్యలో దేవాలయాలు లేవు. అయితే తమిళనాడులో మూడు అడుగులకు ప్రతీకగా మూడు దేవాలయాలు ఉన్నాయి.

ఇందులో మూలవిరాట్టు ఆ త్రివిక్రమ రూపమే. ఈ నేపథ్యంలో ఆ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలతో పాటు త్రివిక్రమ రూపానికి పేరెన్నిక గన్న ఆలయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం. ఈ ఆలయ దర్శనం వల్ల సంగీత రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని భక్తుల నమ్మకం. అందువల్లే నేపథ్య గాయకులు ఈ ఆలయాన్ని తరుచుగా సందర్శిస్తూ ఉంటారు.

బలి చక్రవర్తి

బలి చక్రవర్తి

P.C: You Tube

విష్ణుమూర్తి వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేల దానమడిగాడన్న విషయం తెలిసిందే. విశ్వరూపంలో రెండు అడుగులతో భూమి, ఆకాశం కొలిచిన మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని బలి చక్రవర్తిని కోరుతాడు.

పాతాలంలోకి

పాతాలంలోకి

P.C: You Tube

తన తల మీద పెట్టమని బలి చక్రవర్తి చెబుతాడు. దీంతో బలి చక్రవర్తి పై విష్ణువు పాదం మోపగానే ఆయన పాతాళంలోకి వెళ్లి పోతాడు. ఆ విశ్వరూపాన్నే త్రివిక్రముడిగా కొలుస్తారు. ఈ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

 తమిళనాడులో మూడు ఆలయాలు

తమిళనాడులో మూడు ఆలయాలు

P.C: You Tube

అందులోనూ ప్రాచూర్యం పొందిన ఆలయాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇక వామనుడు కొలిచిన మూడు అడుగులకు సూచిస్తూ తమిళనాడులో మూడు ఆలయాలు ఉన్నాయి. అందులో ఒక ఆలయంలోని విగ్రహం భూమిని కొలుస్తున్నట్లు ఉంటుంది. అదే సీర్కళిలో ఉంది.

తిరుక్కోవలూరు

తిరుక్కోవలూరు

P.C: You Tube

మరో ఆలయంలో ఆకాశాన్ని కొలుస్తున్నట్లు ఉంటుంది. అదే తిరుక్కోవల్లూరు. ఇక బలి చక్రవర్తి తల మీద కాలు పెట్టినట్లు ఉన్న ఆలయం కంచిలో ఉంటుంది. ఈ మూడింటిలో తిరుక్కోవలూరులో ఉన్న విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది.

 త్రివిక్రమ సన్నిధి

త్రివిక్రమ సన్నిధి

P.C: You Tube

వామన అవతారంలో అంటే చిన్న రూపంలో వామనుడు ఉన్న ఆలయాన్ని చిన్న సన్నిధి అని అంటారు. ఇక్కడ స్వామి చేతిలో చిన్న గొడుగు మాత్రం ఉంటుంది. ఇక విశ్వరూపంలో స్వామివారు కొలువై ఉన్న ఆలయాన్ని త్రివిక్రమ సన్నిధి అని అంటారు.

కుడికాలు పైకెత్తి

కుడికాలు పైకెత్తి

P.C: You Tube

ఇక్కడ స్వామి రూపం పెద్దదిగా ఉంటుంది. కుడికాలు పైకి ఎత్తి ఉండగా పక్కన పున్నాగ చెట్టు ఉంటుంది. అదే విధంగా కుడి చేతిలో శంఖాన్ని, ఎడమ చేతిలో చక్రం ఉంటుంది. ఒక కాలుతో ఆకాశం మొత్తాన్ని కొలిచినట్లు ఉంటుంది.

కుడికాలుని బ్రహ్మ కడుగుతున్నట్లు

కుడికాలుని బ్రహ్మ కడుగుతున్నట్లు

P.C: You Tube

మరో అడుగు భూలోకాన్ని కొలిచి మూడవ అడుగు ఎక్కడ అని బలి చక్రవర్తిని అడుగుతున్నట్లు కుడివైపున గల మరో చేతి ముద్ర ఉంటుంది. అదే విధంగా కుడికాలుని బ్రహ్మ కడుగుతూ ఉంటాడు.

శుక్రాచార్యుడు కూడా

శుక్రాచార్యుడు కూడా

P.C: You Tube

ఇక వామనుడికి దానము చేయకూడదని చెప్పే శుక్రాచార్యులు, సతీ సమేతంగా మ`కంండ మహర్షి, ముదలాళ్వారుల్లు, గరుక్మంతుడు మొదలైన వారి విగ్రహాలన్నీ స్వామివారికి రెండు వైపులా కనిపిస్తాయి.

దశావతరా ఒడ్డానం

దశావతరా ఒడ్డానం

P.C: You Tube

స్వామివారికి 108 సాలగ్రామాల మాల నడుముకి దశావతారం ఒడ్డానము ఉంటాయి. స్వామి నిలుచున్న భంగిమాలో ఇంత పెద్ద విగ్రహం మరెక్కడా లేదు. లోకాలను కొలిచిన స్వామివారు కనుక ఈయనను ఉలకళ్ద పెరుమాల్ అని కూడా పిలుస్తారు.

చెక్కతో చేయబడింది

చెక్కతో చేయబడింది

P.C: You Tube

ఇక్కడ స్వామివారి విగ్రహం చెక్కతో చేయబడింది కాబట్టి మూలవిరాట్టుకు అభిషేకము ఉండదు. ఆలయం సువిశాలంగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. దాదాపు రెండువేల ఏళ్ల క్రితమే ఇక్కడ మూలవిరాట్టుతో పొటు దేవాలయం ఉన్నట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది.

192 అడుగుల ఎత్తులో

192 అడుగుల ఎత్తులో

P.C: You Tube

ఆలయంలో మూడు పెద్ద గోపురాలు, నాలుగు చిన్న గోపురాలు ఉంటాయి. అత్యంత ఎతైన గోపురం 11 అంతస్తులతో 192 అడుగుల ఎత్తుతో ఉండటం విశేషం. పాండ్య, పల్లవ, విజయనగర రాజులు ఈ ఆలయం అభివ`ద్ధికి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు.

 పురాణాల్లో

పురాణాల్లో

P.C: You Tube

ఈ క్షేత్రం ప్రస్తావన బ్రహ్మ, పద్మపురాణాల్లో కనిపిస్తుంది. ఈ క్షేత్రం పూర్వం చేర, చోళ, పాండ్య దేశాల మధ్య ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని నడునాడు అని కూడా పిలుస్తారు. ఆళ్వారులు తమ పాశుముల్లో తిరుక్కోవెలూరు ను ఎంతగానో కీర్తించారు.

 ప్రబంధ అవతార స్థలం

ప్రబంధ అవతార స్థలం

P.C: You Tube

ముఖ్యంగా ఆళ్వారుల దివ్య ప్రబంన్ని మొదట ఇక్కడ పాడటం వల్ల ఈ క్షేత్రాన్ని ప్రబంధ అవతార స్థలంగా కూడా పేర్కొంటారు. వైష్ణవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం.

స్వరాలాపన చేయడాన్ని

స్వరాలాపన చేయడాన్ని

P.C: You Tube

వైష్ణవ భక్తాగ్రేసరులైన ముదలాళ్వార్లు నేరుగా భగవంతుడిని సందర్శించి పాశురములను పాడిన దివ్యక్షేత్రం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇక్కడ స్వరాలాపన చేయడాన్ని హిందువులు పరమ పవిత్ర కార్యంగా భావిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X