Search
  • Follow NativePlanet
Share
» »విజయంతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదించే బాలాంజనేయుడిని దర్శించారా

విజయంతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదించే బాలాంజనేయుడిని దర్శించారా

నల్లత్తూరులోని ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

నల్లత్తూరు తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుత్తణికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామిని సాక్షాత్తు విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముహుర్తం పెట్టిన శ్రీ కృష్ణదేవాలయాల గురువు వ్యాసరాయులు ప్రతిష్టించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం మిగిలిన చోట్లతో పోలిస్తే విభిన్నంగా ఉండటమే కాకుండా ఉత్తర దిశగా మొహం ఉంటుంది. ఈ ఆలయ దర్శనం వల్ల శత్రువు పై విజయంతో పాటు అంతులేని ఐశ్వర్యం మన సొంతమవుతుందని భక్తులు చాలా కాలంగా విశ్వసిస్తున్నారు. అందువల్లే కేవలం తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

విజయనగర సామ్రాజ్య కాలంలో

విజయనగర సామ్రాజ్య కాలంలో

P.C: You Tube

తమిళనాడులోని తిరుత్తణికి సమీపంవలో ఉన్నదే నల్లత్తూరు. ఇక్కడ ఉన్న ఆంజనేయుడి విగ్రహం అత్యంత ప్రాచీనమైనదే కాకుండా ఐశ్వర్యాన్ని, విజయాన్ని అందజేస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. స్థానిక కథనం ప్రకారం విజయనగర సామ్రాజ్య రాజ గురువు, హనుమంతుడి భక్తుడైన వ్యాసరాయులకు తీవ్రమైన జబ్బు చేసింది.

ఎంత మంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రాణం పై ఆశలు వదులుకొని ఆంజనేయుడిని ప్రార్థించాడు. తన జబ్బు నయమైతే దేశం నలుమూలలా హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్టించి ఆలయాలను నిర్మింపజేస్తానని మొక్కుకొన్నాడు.

వ్యాసరాయుల

వ్యాసరాయుల

P.C: You Tube

విచిత్రంగా కొన్ని రోజుల్లోనే వ్యాసరాయుల జబ్బు పూర్తిగా నయమై పోయింది. దీంతో మొక్కు ప్రకారం తన జీవితం మొత్తంలో దేశ వ్యాప్తంగా 754 ఆంజనేయ స్వామి దేవాలయాలు కట్టించాడు. అందులో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలా కట్టించిన దేవాలయాల్లో ఒకటి నల్లత్తూరు ఆంజనేయస్వామి దేవాలయం. ఇక ఈ దేవాలయం నిర్మాణానికి సంబంధించి కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది.

వ్యాసరాయుల సేవకులు తిరుపతిలో ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించారు. ఇందుకు అవసరమైన విగ్రహాన్ని తిరుత్తని నుంచి తీసుకొని వెలుతూ తోవలో నల్లత్తూరు వద్ద ఆగారు. ఆ సమయంలో విగ్రహాన్ని అక్కడి ఓ చెట్టు కింద పెట్టి కొద్ది సేపు విశ్రమించారు. తరువాత తిరుపతికి బయలుదేరాడానికి సమాయత్తమై విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించబోయారు.

ఆంజనేయస్వామి కలలో కనిపించి

ఆంజనేయస్వామి కలలో కనిపించి

P.C: You Tube

అయివే వారు ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి విగ్రహం ఒక ఇంచు కూడా కదలలేదు. అంతే కాకుండా అదే సమయంలో వ్యాసరాయుడికి ఆంజనేయస్వామి కలలో కనిపించి తను నల్లత్తూరులోనే ఉంటానని తనకు అక్కడ దేవాలయం నిర్మించాల్సిందిగా సూచించాడు. అలా నల్లత్తూరులో ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించబడింది.

కొద్ది కాలం పాటు ఈ ఆలయానికి పూజాది కార్యక్రమాలు బాగానే నిర్వహించారు. అటు పై కాలక్రమంలో ఈ దేవాలయం శిథిలమైపోయి విగ్రహం కూడా ఇసకలో కూరుకు పోయింది.

చక్రవర్తి అనే వ్యాపారికి

చక్రవర్తి అనే వ్యాపారికి

P.C: You Tube

ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం స్థానికంగా ఉంటున్న చక్రవర్తి అనే వ్యాపారికి, ఆయన భార్యకు ఒకేసారి ఆంజనేయస్వామి కలలో కనబడి తాను భూమిలో కూరుకుపోయిన స్థలం ఆనవాళ్లు తెలిపి తనను వెలికి తీయాల్సిందిగా సూచించాడు. దీంతో వారిరువురూ ఆ విగ్రహాన్ని వెలికి తీయించి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లింది.

బాలాంజనేయస్వామి

బాలాంజనేయస్వామి

P.C: You Tube

ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి మొహం చిన్నపిల్లవాడి ముఖంలాగా ఉంటుంది. అందువల్లే ఇక్కడి స్వామివారిని బాలాంజనేయస్వామి అని పిలుస్తారు. గతంలో ఈ విగ్రహం తోక చివర అమూల్యమైన రత్నం ఉండేది. ప్రస్తుతం ఆ రత్నాన్ని ఎవరో దొగిలించారని చెబుతారు. ఇక్కడ ఆంజనేయస్వామి ఉత్తర దిశలో ఉంటారు. ఇక్కడకు తిరుపతి ఉత్తర దిశలోనే ఉండటం గమనార్హం.

స్వామి కుడి చేతిలో తామర రేకులతో అభయముద్ర, ఎడమ చేతిలో తామర మొగ్గ హ`దయానికి దగ్గరగా ఉంటుంది. తామర పువ్వు జ్జానానికి, ఐశ్వర్యానికి, విజయానికి చిహ్నం. అందువల్లే స్వామిని కొలిస్తే అవన్నీ లభిస్తాయని భక్తులు నమ్మతారు.

తిరుత్తణి నుంచి 182 కిలోమీటర్లు

తిరుత్తణి నుంచి 182 కిలోమీటర్లు

P.C: You Tube

ప్రతి శుక్రశనివారాలతో పాటు శ్రీ రామనవమి, ఉత్సవాలు, హనుమజ్జయంతి చాలా బాగా జరుగుతుంది. తిరుత్తణి నుంచి నల్లత్తూరుకు 182 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 4 గంటలు. ప్రభుత్వ బస్సులు ఉన్నా, ప్రైవేటు ట్యాక్సీల్లో వెళ్లడం ఉత్తమం. నల్లత్తూరులో వసతి అంతగా బాగుండదు. అదువల్ల ఆలయ దర్శనం తర్వాత తిరిగి తిరుత్తణికి రావాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X