Search
  • Follow NativePlanet
Share
» »ఈమె ఉన్నచోట ఆ యాగం చేస్తే శని దోష నివారణ అంతేనా యాగంలో ఎండుమిరపకాయలు...

ఈమె ఉన్నచోట ఆ యాగం చేస్తే శని దోష నివారణ అంతేనా యాగంలో ఎండుమిరపకాయలు...

ఈ దేవిని ఆరాధిస్తే మనకు క్షుత్రశక్తుల భయం ఉండదు. ఇక అన్నింటా విజయమే వరిస్తుంది. ముఖ్యంగా పురాణ కాలంలో యుద్ధాల్లో గెలవడానికి రాజులు ఈ మాతను ఆరాధించేవారు. ఇందుకోసం ప్రత్యేక యాగం కూడా చేసేవారు.

ఆ యాగంలో ఎండుమిరపకాయలు వేస్తే వాటి ఘాటు అక్కడి వారికి ఎంతమాత్రం తగలదు. దీనిని మనం ఇప్పటికీ ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే ఈ దేవికి భారత దేశంలో చెప్పుకోదగ్గ ఆలయాలు లేవు. కేవలం వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంది. ఆ ఆలయ విశేషాలతో పాటు అమ్మవారికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో మీ కోసం

ఉగ్ర నారసింహుడు

ఉగ్ర నారసింహుడు

P.C: You Tube

హిరణ్యకసిపుడి సంహరించిన ఉగ్రనారసింహుడిని శాంతపరచడానికి లక్ష్మీ దేవి చెంచు రూపంలో వచ్చిందని మన పురాణాలు చెబుతాయి. అయితే కొన్ని చోట్ల ఆ నారసింహుడిని శాంతపరిచింది శరభేశ్వరుడి రూపంలో ఉన్న పరమేశ్వరడని ఉంది.

కాళీ మాతే

కాళీ మాతే

P.C: You Tube

ఆయనకు శక్తి స్వరూపిణి అయిన కాళీ మాత ప్రత్యంగరా రూపంలో సహాయపడింది కొన్ని చోట్ల ఉంది. మిక్కిలి భయంకరంగా ఉన్న ఈ దేవత నల్లగా, సింహం మొహంతో 18 చేతులను కలిగి ఉంటుంది. ఈ 18 చేతులతో 18 ఆయుధాలు కూడా ఉంటాయి.

క్షుద్రపూజలకు విరుగుడుగా

క్షుద్రపూజలకు విరుగుడుగా

P.C: You Tube

నుదిటిమీద నెలవంక కూడా ఉంటుంది. ఈ దేవత క్షుద్రపూజలకు విరుగుడుగా ఈ దేవతను పూజిస్తారు. పూర్వ కాలంలో యుద్ధాలను జయించడానికి రాజులు ప్రత్యంగరా దేవి కోసం నికుంబళా యాగం చేసేవారని చెబుతారు.

రామాయణంలో కూడా

రామాయణంలో కూడా

P.C: You Tube

ఆ సమయంలో యుద్ధం జరిగే ప్రాంతానికి ఎనిమిది దిక్కులా ఎనిమిది స్మశానాలను ఎంపిక చేసుకొని అక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించేవారు. రామయణంలో కూడా ఈ దేవత ప్రస్తావన ఉంది. రామ, రావణ యుద్ధం సమయంలో ఇంద్రజిత్ ఈ ప్రత్యంగరా దేవి ఆశిస్సుల కోసం హోమం చేయాలని భావించాడు.

ఇంద్రజిత్తును జయించడం కష్టం

ఇంద్రజిత్తును జయించడం కష్టం

P.C: You Tube

అయితే ఈ యాగం పరిసమాప్తం అయితే ఇంద్రజిత్తును జయించడం కష్టమని భావించిన లక్ష్మణుడు, హనుమంతుడి సహాయంతో ఆ యాగం పూర్తి కాకుండా అడ్డుకొన్నాడు. అందువల్లే రామ, రావణ యుద్ధంలో రాముడు గెలిచాడని చెబుతారు.

అదర్వణ కాళీ అని కూడా

అదర్వణ కాళీ అని కూడా

P.C: You Tube

ఇక ఈ ప్రత్యాంగరా దేవిని ఆ పరాశక్తి స్వరూపం కావడం వల్ల అమ్మవారిని అదర్వణ కాళీ అని కూడా అంటారు. ఈ ప్రత్యాంగర దేవికి భారత దేశం మీద కేవలం వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి.

అయ్యవడితో పాటు హోసూరులోని

అయ్యవడితో పాటు హోసూరులోని

P.C: You Tube

ఇక ప్రాచీన కాలం నుంచి ఉన్న దేవాలయాల్లో ప్రస్తుతానికీ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవాలయాల్లో తంజావూరు జిల్లాలోని అయ్యవడి ప్రత్యాంగిరా దేవి దేవాలయం ముఖ్యమైనది. అంతే కాకుండా హొసూరులోని దేవాలయం కూడా ముఖ్యమైనదే.

అజ్జాత వాసం సమయంలో

అజ్జాత వాసం సమయంలో

P.C: You Tube

ఇక్యడ ఆలయ గోపురం పై ప్రత్యాంగిరా దేవి పెద్ద విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఇదిలా ఉండగా అయ్యావడిని మొదట్లో అల్వర్ పడి అనే వారు. పురాణ కథనం ప్రకారం పాండవులు అజ్జాత వాసం ప్రారంభ సమయంలో తమ ఆయుధాలను ఇక్కడ చెట్టు కింద ఉంచి ప్రత్యంగరను పూజించారని చెబుతారు.

నికుంబళా యాగం

నికుంబళా యాగం

P.C: You Tube

ఆ అల్వర్ పడి కాలక్రమంలో అయ్యావడిగా మారిందని చెబుతారు. ఈ ఆలయంలో అమావాస్య వంటి ప్రత్యేక రోజుల్లో నికుంబళా యాగం చేస్తారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్ప, భైరవుడు, శరభేశ్వరుడు, శూలిని, వారాహి, సుదర్శన చక్రం, మహాలక్ష్మి దేవతలను యాగం చుట్టూ వేదాలను, ధర్మాలను, శాస్త్రాలను అనుసరించి ప్రతిష్టింపజేస్తారు.

ఎండు మిరప కాయలు

ఎండు మిరప కాయలు

P.C: You Tube

ఇక యాగం సమయంలో యాగ కుండం లోనికి 96 రకాల వివిధ ద్రవ్యాలు, నవ ధాన్యాలు, పట్టుచీరె, నెయ్యి వంటి వాటితో పాటు ఎండు మిరపకాయలు కూడా వేస్తారు. అయితే ఎంత పరిమాణంలో ఎండు మిరపకాయలు వేసినా ఆ ఘాటు అక్కడ ఉన్నవారి పై ప్రభావ చూపించదని చెబుతారు.

ఉత్తర దిక్కుగా

ఉత్తర దిక్కుగా

P.C: You Tube

ఇందుకు ఆ మహామాత శక్తే ప్రధాన కారణమని స్థానిక పూజారుల కథనం. సమాజంలో తాము పోగొట్టుకొన్న స్థానం కోసం, శత్రు నాశనం, రుణ విమోచనం, ఉద్యోగ, వివాహాది విషయాల్లో సానుకూలత, శని దోష నివారణ కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తారు. ఇక అయ్యవాడిలో ప్రత్యాంగిరా దేవి ఆలయం ఉత్తర దిక్కుగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X