Search
  • Follow NativePlanet
Share
» »జాతక దోషాలతో పాటు కోర్టు, రుణ బాధలు తీర్చే శనేశ్వర దేవాలయం

జాతక దోషాలతో పాటు కోర్టు, రుణ బాధలు తీర్చే శనేశ్వర దేవాలయం

మందపల్లిలో ఉన్న మందేశ్వరాలయంగా పిలిచే శనేశ్వర స్వామి దేవాలయం గురించి కథనం.

ఈ క్షేత్రంలో శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం చాలా అరుదైన విషయం. ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడని విశ్వసిస్తారు.

ఇక్కడ శని త్రమోదశి రోజు పూజలు జరిపించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా జాతకంలో శని దోషాల నివారణకు ఈ దేవాలయంలో కచ్చితంగా పరిహారం దొరుకుతుందని భక్తులు నమ్ముతారు.

అదే విధంగా కోర్టు కేసులు, రుణ బాధలు కూడా ఈ దేవాలయంలోని దైవ దర్శనంతో తీరిపోతాయనేది భక్తుల నమ్మకం. పురాణ ప్రాధాన్యత కలిగిన ఇంత విశిష్టమైన దేవాలయానికి సంబంధించిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం.

ఇక్కడ శనిదేవుడికి ప్రత్యేక ఆలయం

ఇక్కడ శనిదేవుడికి ప్రత్యేక ఆలయం

P.C: You Tube

హిందూ దేవాలయాల్లో అనేక చోట్ల శని గ్రహము నవగ్రమాల్లో ఒక భాగంగా ఉంటుంది. అయితే శని దేవుడిని మాత్రమే పూజించే మందిరాలను వేళ్ల పై లెక్కపెట్టుకోవచ్చు. అటువంటి దేవాలయాల్లో మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవాలయం ఒకటి.

రాజమండ్రికి దగ్గర

రాజమండ్రికి దగ్గర

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి గ్రామంలో ఈ ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఈ క్షేత్రం కాకినాడకు 60 కిలోమీటర్లు, అమలాపురానికి 30 కిలోమీటర్లు, రావులపాలంకు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అటవీ ప్రాంతం

అటవీ ప్రాంతం

P.C: You Tube

మందపల్లి పూర్వం ఒక అరణ్యం. ఈ అటవీ ప్రాంతంలో కైటభుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని కుమారులే అశ్వర్థుడు, పిప్పలుడు. వీరిద్దరు మారు రూపాల్లో ఈ అటవీ ప్రాంతంలో తమస్సు చేయడానికి వచ్చే మునులను, వేదాలను నేర్చుకోవడానికి వచ్చే వారిని చంపి తినేవారు.

అగస్త్యమహాముని

అగస్త్యమహాముని

P.C: You Tube

ఈ నేపథ్యంలో అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్రలో భాగంగా ఈ మందపల్లి ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఉన్న మునులు అగస్త్యమహర్షికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పి తమను ఆ రాక్షసుల బారి నుంచి కాపాడాల్సిందిగా వేడుకొంటారు.

శనీశ్వరుడి వద్దకు

శనీశ్వరుడి వద్దకు

P.C: You Tube

దీంతో అగస్త్య మహాముని బాగా ఆలోచించి ఇక్కడ గోదావరి తీరంలో శివుడి గురించి తపస్సు చేస్తున్న శనేశ్వరుడి దగ్గరకు మునులను తీసుకువెళుతాడు. అటు పై ఆ రాక్షసులను సంహరించి తమను కాపాడాల్సిందిగా మునులు వేడుకొంటారు.

తప:శక్తిని ధారపోయడానికి

తప:శక్తిని ధారపోయడానికి

P.C: You Tube

వీరి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన శనీశ్వరుడు తాను ప్రస్తుతం శివుడి గురించి తపస్సు చేస్తున్నానని తమస్సు వల్ల వచ్చిన శక్తితోనే ఆ రాక్షసులను సంహరించగలనని చెబుతాడు. దీంతో మునులు బాగా ఆలోచించి తమ తప:శక్తిని శనీశ్వరుడికి ధారపోయడానికి అంగీకరిస్తాడు.

ముసలి బ్రాహ్మణుడి రూపంలో

ముసలి బ్రాహ్మణుడి రూపంలో

P.C: You Tube

ఈ ప్రతిపాదనకు అంగీకరించిన శనీశ్వరుడు అశ్వర్థుడు, పిప్పలుడులను సంహరించడానికి అంగీకరిస్తాడు. ప్రథకం ప్రకారం మొదట శనీశ్వరుడి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో రావి చెట్టు రూపంలో ఉన్న అశ్వర్థుడి వద్దకు వెళుతాడు.

మింగేస్తాడు

మింగేస్తాడు

P.C: You Tube

వచ్చినవాడు సాధారణ బ్రాహ్మనుడేననని బ్రమించిన అశ్వర్థుడు శనీశ్వరుడిని అమాంతం మింగేస్తాడు. దీంతో శనీశ్వరుడు ఆ అశ్వర్థుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపేస్తాడు. దీంతో అశ్వర్థుడు విలవిలాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు.

బ్రాహ్మణ యువకుడి రూపంలో

బ్రాహ్మణ యువకుడి రూపంలో

P.C: You Tube

అటు పై పిప్పలుడి వద్దకు శనీశ్వరుడు బ్రాహ్మణ యువకుడి రూపంలో వెళ్లి తనకు వేదాలు నేర్పించాల్సిందిగా కోరుతాడు. పిప్పలుడు కూడా వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అని భావించి శనీశ్వరుడిని మింగేస్తాడు. ఇక్కడ కూడా శనీశ్వరుడు పిప్పలుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపి సంహరిస్తాడు.

బ్రహ్మహత్యాపాతకాన్ని

బ్రహ్మహత్యాపాతకాన్ని

P.C: You Tube

ఇక అసర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో ఆ శనీశ్వరుడు ఒక లింగాన్ని ప్రతిష్టించి దానికి సోమేశ్వరుడని పేరు పెడుతాడు. అయితే ఈ శివలింగం శనీశ్వరుడు ప్రతిష్టించడం వల్ల అదే పేరుతో అంటే శనేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.

విభిన్న పూజా విధానం

విభిన్న పూజా విధానం

P.C: You Tube

ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడి పూజా విధానాలు కూడా కొంత విభిన్నంగా ఉంటాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వీరిలో జాతక చక్రంలో శని వల్ల సమస్యలున్నవారే ఎక్కువ.

కోర్టు కేసులు

కోర్టు కేసులు

P.C: You Tube

అదే విధంగా కోర్టు కేసులు, శత్రుభయం, రోగాలు, రుణాల నుంచి విముక్తి కోసం స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమ కోర్కెలు తీరితే స్వామివారికి ముడుపులు తప్పకుండా చెల్లించేస్తుంటారు.

శనిత్రయోదశి

శనిత్రయోదశి

P.C: You Tube

శనివారం వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, శనివారం రోజున వచ్చే అమావాస్య రోజున ఈ క్షేత్రంలో విశేష పూజలు చేస్తారు. ఆ రోజుల్లో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్యల లక్షల సంఖ్యకు చేరుతుంది. ఆ రోజుల్లో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు.

ఇంటికి తీసుకువెళ్లకూడదు

ఇంటికి తీసుకువెళ్లకూడదు

P.C: You Tube

ఇందుకు అవసరమైన వస్తువులన్నీ దేవాలయం ప్రాంగణంలోనే దొరుకుతాయి. పూజ తర్వాత నల్లటి వస్త్రాలను దానం చేస్తారు. ఇక పూజలో మిగిలిపోయిన వస్తువులను ఇంటికి తీసుకువెళ్ల కూడదనేది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.

వెనక్కు తిరిగి చూడకూడదు

వెనక్కు తిరిగి చూడకూడదు

P.C: You Tube

అదేవిధంగా ఆలయం నుంచి బయటికి వెలుతూ వెనక్కు తిరిగి చూడకూడదని ఇక్కడి పూజారులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందుకు విరుద్ధంగా నడుచుకొంటే శని దోషం మళ్లీ చుట్టుకుంటుందని వారు చెబుతుంటారు. అందువల్లే పూజ తర్వాత ఎవరూ వెనక్కు తిరిగి చూడదరు.

సప్తమాత్రుకలు

సప్తమాత్రుకలు

P.C: You Tube

ఈ ఆలయంలోనే సప్తమాత్రుకలు ప్రతిష్టించినట్లు చెప్పే పార్వతీ దేవి విగ్రహం ఉంది. అదే విధంగా అష్టమహానాగుల్లో ఒకడైన కర్కోటకుడచే ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. అటు పక్కనే గౌతమి మహర్షి ప్రతిష్టించిన శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని కూడా చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X