Search
  • Follow NativePlanet
Share
» »శివతాండవాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా చిత్రించిన స్థల సందర్శనతో

శివతాండవాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా చిత్రించిన స్థల సందర్శనతో

ప్రకృతి సంపదకు నిలయమైన ఆ ప్రాంతం అనేక పురాణ కథనాలకు ఆలవాలము. అక్కడ జలపాత అందాలు చూడాల్సిందేకాని వర్ణనకు అక్షరాలు చాలవు. ఇక ఆ క్షేత్రంలో శివుడు ఆనంద తాండవం చేశాడు. అంతేకాకుండా ఆ తాండవాన్ని బ్రహ్మ స్వయంగా అక్కడ గోడ పై చిత్రించాడు.

ఏడాదికి ఒకసారి అక్కడ జరిగే విశిష్ట పూజకు త్రిమూర్తులు తప్పక హజరవుతారు.ఇక శుంభు, నిశుంభుల గురువు కూడా ఆ ప్రాంతంలోనే ఆదిపరాశక్తి చేతిలో హతమయ్యాడు. ఇక్కడ ఉన్న పరమేశ్వరుడికి ఆ గంగాదేవి స్వయంగా తేనేతో అభిషేకం చేసింది.

ముఖ్యంగా శివుడు, విష్ణువు వేర్వేరు కాదని నిరూపించే పుణ్యక్షేత్రం కూడా ఇదే. ఇక్కడ పురాతన వస్తు సంగ్రహాలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

పేదల ఊటి

పేదల ఊటి

P.C: You Tube

తమిళనాడుడోలని కుట్రాలం పేరు వినగానే చాలామందికి పేదవారి ఊటి ఇదే కదా అన్న భావన కలుగుతుంది. అందుకు తగ్గట్టే ఆ ప్రాంతం పచ్చటి కొండలు, కొండల పై నుంచి జల, జలా జాలువారుతున్న జలపాతాలు మదిని పులకింపజేస్తాయి.

పురాణ కథలకు నిలయం

పురాణ కథలకు నిలయం

P.C: You Tube

అయితే ఈ కుట్రాలం అనేక దేవాలయాలకు పురాణ కథనాలకు ప్రసిద్ధి చెందింది. శివుడి తాండవాన్ని అయిన బ్రహ్మ స్వయంగా చిత్రీకరించాడని చెబుతారు. వేదవ్యాసుడు రచించిన తమ్రపర్ణి మహాత్త్యం అనే గ్రంథంలో ఈ కుట్రాలం యొక్క విశిష్టత గురించి విపులంగా వర్ణించబడింది.

 పృథువు అనే రాజు

పృథువు అనే రాజు

P.C: You Tube

అందులో ఉన్న విషయాలను అనుసరించి...పూర్వం ఈపుణ్యభూమి పృథువు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పాలనలతో ఈ ప్రాంతంలోని ప్రజలంతా సుఖ శాంతులతో గడుపుతుండేవారు.

బృహస్పతి

బృహస్పతి

P.C: You Tube

ఈ రాజ్యంలో దేవగురువు బృహస్పతికి వంశానికి చెందిన రోచిష్మానుడు, సురిచి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీరు నాలుగు వేదాలతో పాటు సకల శాస్త్రాలను నేర్చుకొని ప్రజలకు దైవ చింతన ప్రాముఖ్యాన్ని వివరించేవారు. అయితే వారు పరమ విష్ణుభక్తులు.

దేశాటన చేస్తూ

దేశాటన చేస్తూ

P.C: You Tube

అదే సమయంలో శివుడిని పరమ అసహించుకునేవారు. ఈ క్రమంలో దేశాటన చేస్తూ విష్ణు తత్వాన్ని బోధిస్తూ, శివుడిని నిందిస్తూ ఉండేవారు. వీరి మాటల ప్రభావానికి చాలా మంది శివుడి ఆరాధనను వీడి వైష్ణవులుగా మారేవారు.

శివుడిని కలిసి

శివుడిని కలిసి

P.C: You Tube

ఈ విషయం పృథువు మహారాజుకు తెలిసి తీవ్రంగా బాధపడ్డారు. దీంతో కలత చెందిన పృథువు నేరుగా కైలాసానికి వెళ్లి శివుడితో ఈ విషయాన్ని విన్నవించాడు. దీంతో శివుడు తగిన సమయంలో అగస్త్య మహాముని ద్వారా సమస్య పరిష్కారవుతుందని రాజును తిరిగి పంపించివేశాడు.

అగస్త్య మహాముని

అగస్త్య మహాముని

P.C: You Tube

ఇది జరిగిన కొన్ని రోజులకు అగస్త్య మహాముని కుట్రాలంలో ఉన్న విష్ణువు దేవాలయాలయానికి శివ చిహ్నాలతో వచ్చాడు. దీంతో అక్కడే ఉన్న రోచిష్మానుడు, సురిచితో పాటు కొంతమంది వైష్ణవ భక్తులు అగస్త్యుడిని అడ్డుకున్నారు.

విష్ణు భక్తుడి వేశంలో

విష్ణు భక్తుడి వేశంలో

P.C: You Tube

దీంతో అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన అగస్త్య మహాముని విష్ణువు భక్తుడిగా వేషం ధరించి అదే ఆలయానికి వస్తాడు. దీంతో ఆ ఇద్దరి సోదరులతో పాటు మిగిలిన వైష్ణు భక్తులు అగస్తుడిని గౌరవంగా దేవాలయంలోని గర్భగుడిలోకి తీసుకువెళ్లి ఆయనే పూజలు చేయాల్సిందిగా కోరుతారు.

విష్ణువు విగ్రహం శివలింగంగా

విష్ణువు విగ్రహం శివలింగంగా

P.C: You Tube

గర్భగుడిలోకి వెళ్లిన అగస్త్యుడు, శివుడిని ధ్యానిస్తూ పూదండతో విష్ణువు విగ్రహాన్ని తాకాడు. మరుక్షణమే, నిల్చున్నభంగిమలోని ఆ విష్ణువు ప్రతిమ శివలింగంగా మారిపోయింది. అదే సమయంలో ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న విష్ణు పరివార దేవతలంగా శివపరివార దేవతలుగా మారిపోయారు.

వాదనకు దిగుతాడు

వాదనకు దిగుతాడు

P.C: You Tube

దీంతో సురిచి అగస్త్యడితో వాదనకు దిగుతాడు. వీరిద్ధరి వాదనకు సాక్షాత్తు ఆ పరాశక్తి మధ్యవర్తిత్వం వహిస్తుంది. విష్ణు తత్వమే గొప్పదని సురిచి వాదించగా కాదు శైవ తత్వమే గొప్పదని అగస్త్య మహాముని వాదిస్తాడు.

శివదీక్ష తీసుకొంటారు.

శివదీక్ష తీసుకొంటారు.

P.C: You Tube

ఇలా ఐదు రోజుల పాటు సాగిన వాదనలో చివరకు వాదనలో అగస్త్య మహాముని విజయం సాధిస్తాడు. ఫలితంగా విష్ణుభక్తులంతా అగస్త్య మహాముని ద్వారా శివ దీక్షను తీసుకుంటారు. అయితే అటు పై విష్ణువు, పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమవుతారు.

విష్ణువు, శివుడు

విష్ణువు, శివుడు

P.C: You Tube

తామిద్దరం వేర్వేరు కాదని ఒక్కరే అని చెప్పి అంతర్థానమవుతారు. అప్పటి నుంచి ఆ రాజ్యంలో ప్రజలు ఎవరికి నచ్చిన దైవ పూజను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఇక మధ్యవర్తిత్వం వహించిన పరాశక్తి కుర్చొన్న పీఠాన్ని థరణీపీఠ మని పిలుస్తారు.

 థరణీ పీఠం మూడు రంగుల్లో

థరణీ పీఠం మూడు రంగుల్లో

P.C: You Tube

ఈ ధరణీ పీఠాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈ పీఠం స`ష్టి, స్థితి, లయ కారానికి చిహ్నమని చెబుతారు. అందువల్లే ఈ థరణి పీఠం మనకు తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో కనిపిస్తుంది. ఈ పీఠం పై ఉన్న అమ్మవారిని ధరణీపీఠ నాయకిగా ప్రజలు పూజిస్తారు.

ఉదంబరుడు

ఉదంబరుడు

P.C: You Tube

ఇదిలా ఉండగా శుంభు, నిశుంభుల గురువైన ఉదంబరుడు ఇక్కడి గుహలో ఉంటూ దేవి దర్శనానికి వచ్చే వారిని సంహరించి తినేవాడు. అంతే కాకుండా చుట్టు పక్కల ఏవరైనా యాగాలు చేస్తుంటే వారిని కూడా హింసించేవారు.

 మూడు కిలోమీటర్ల దూరంలో

మూడు కిలోమీటర్ల దూరంలో

P.C: You Tube

దీంతో బుుషులు దేవిని ప్రార్థించ థరణీపీఠ నాయకి ఆ రాక్షసగురువును యుద్ధంలో ఇక్కడే సంహరించింది అని పురాణ కథనం. ఆ యుద్ధం జరిగిన ప్రాంతం కుట్రాల జలపాతానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

 గంగాదేవి తేనతో అభిషేకం

గంగాదేవి తేనతో అభిషేకం

P.C: You Tube

అదే విధంగా ఇక్కడ ఉన్న తీర్థానికి శెన్బగతీర్థం అని పేరు. ఇక్కడ అమ్మవారికి చైత్రమాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక పరమశివుడికి ఇక్కడ గంగాదేవి తేనెతో అభిషేకం చేసింది. అందువల్లే ఇక్కడ ఉన్న జలపాతానికి శివమధుగంగ అని పేరు వచ్చినట్లు చెబుతారు.

కుట్రాలం కూడా ఒకటి

కుట్రాలం కూడా ఒకటి

P.C: You Tube

ఇక ముఖ్యంగా పరమశివుడు ఈ ప్రపంచం మీద ఐదు చోట్ల ఆనందంగా శివతాండవం చేశారని శివపురాణం చెబుతుంది. అందులో ఒకటి కుట్రాలం. ఇక్కడ శివుడు తాండవం చేసిన సభను చిత్ర సభ పేరుతో పిలుస్తారు.

 ఇక్కడ మనకు చిత్రం రూపంలో

ఇక్కడ మనకు చిత్రం రూపంలో

P.C: You Tube

మిగిలిన సభల కంటే ఈ సభ విభిన్నమైనది. మిగిలిన నాలుగు చోట్ల శివుడు విగ్రహ రూపంలో ఉంటే ఇక్కడ మాత్రం మనకు చిత్ర రూపంలో దర్శనమిస్తాడు. శివతాండవంలో కూడా విశిష్టమైనదిగా చెప్పుకొనే త్రిపుర తాండవ భంగిమను బ్రహ్మ దేవుడు ఇక్కడ స్వయంగా చిత్రీకరించడాని చెబుతారు.

కుట్రలీశ్వరుడు

కుట్రలీశ్వరుడు

P.C: You Tube

ఇక్కడ శివుడిని కుట్రలీశ్వరుడిగా పేర్కొంటారు. ఇక చిత్రసభలో ఏడాదికి ఒకసారి ఆరుద్శ దర్శనం పేరుతో ప్రత్యేక పూజ జరుగుతుంది. ఆ సమయంలో నిర్వహించే తాండవ దీపారాధనకు ముక్కోటి దేవతలు ఇక్కడకు వస్తారని చెబుతారు.

నత్తి, మూగ వారికి

నత్తి, మూగ వారికి

P.C: You Tube

ఇక్కడ స్వామివారితో పాటు ఉన్న అమ్మవారిని ప్రార్థిస్తే నత్తి, మూగ తో బాధపడే వారికి సత్వరం ఉపశమనం దొరుకుతుందని చెబుతారు. చైత్ర మాసంలో వసంతోత్సవం, కార్తీక మాసంలో పవిత్రోత్సవం, నవరాత్రి, స్కంధషష్టి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఎప్పుడు సరైన సమయం

ఎప్పుడు సరైన సమయం

P.C: You Tube

జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కుట్రాలం దర్శనకు సరైన సమయం. ఆ సమయంలో ఇక్కడి జలపాతం హోయలను కూడా చూడవచ్చు. కుట్రాలంకు చెన్నై నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. కుట్రాలంలో బస బాగుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X