Search
  • Follow NativePlanet
Share
» »మౌంట్ అబు చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలు ఇవే

మౌంట్ అబు చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలు ఇవే

By Kishore

ఎడారి రాష్ట్రంగా పేరొందిన రాజస్థాన్ లో ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబు. ఇది సిరోహి జిల్లాలో ఉంది. మౌంట్ అబు సముద్ర మట్టం నుండి 1,220 మీటర్ల ఎత్తులో ఉన్న ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. రాజస్థాన్ లోని ఏకైక హిల్ స్టేషన్ ఇదే కావడంతో పర్యాటకులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా చాలా మంది ధనవంతులు ఇక్కడే తమ స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ మౌంట్ అబు ప్రముఖ పర్యాటక కేంద్రంగానే కాకుండా పురాణ పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంది. ఇక్కడ చూడదగిని అత్యంత ప్రముఖ ప్రాంతాలైన దిల్వార జైన్ దేవాలయాలు, నక్కీ లేక్, సన్ సెట్ పాయింట్, అచలేశ్వర్ మహాదేవ దేవాలయం, మౌంట్ అబు బజార్ విశిష్టతలతో కూడిన వివరాలు మీ కోసం...

తెలుగు రాష్ట్రంలో కూడా పండరీపురం

ఆ బహిస్టు వల్లే కాశీ చౌడేశ్వరీ దేవి మన చెంతకు వచ్చింది రుజువు ఇదిగో

 1. దిల్వార జైన్ దేవాలయాలు

1. దిల్వార జైన్ దేవాలయాలు

P.C: You Tube

విశిష్టతలు...విలక్షణమైన నిర్మాణశైలి, చరిత్ర, ఫొటోగ్రఫీకు ఉత్తమమైన ప్రాంతం, జైనులు ఎక్కువ మంది వస్తుంటారు.

టికెట్ ఫీ...ఉచితం

సందర్శన సమయం....వారంలో అన్ని రోజులూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

చూడటానికి ఎంత సమయం పడుతుంది....సుమారు ఒక గంట

మౌంట్ అబు నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ జైన దేవాలయాల సమూహం ఉంటుంది. ఈ దేవాలయాలను 1 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించారు. పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయంలో శిల్ప సౌదర్యం చూడటానికి వెయ్యి కళ్లైనా చాలవు.

2. నక్కీలేక్

2. నక్కీలేక్

P.C: You Tube

విశిష్టతలు...ప్రకృతి సౌదర్యాన్ని ఆస్వాధించవచ్చు, ఫొటోగ్రఫీ, రిలాక్స్ కోసం

టికెట్ ఫీ...ప్రవేశం ఉచితం, బోటింగ్ చేయాలంటే మాత్రం కొంత రుసుమును చెల్లించల్సి ఉంటుంది.

సందర్శన సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ

చూడటానికి ఎంత సమయం పడుతుంది....సుమారు ఒక గంట నుంచి గంటన్నర

మౌంట్ అబు ప్రాంతంలో అత్యంత పర్యాటక ఆకర్షక ప్రాంతాల్లో నక్కీ సరస్సు కూడా ఒకటి. భారతీయ హిందు పురాణాలను అనుసరించి ఈ సరస్సులు దేవతలు తమ గోళ్లతో ఏర్పాటు చేశారని చెబుతారు. అందువల్లే దీనికి ఆ పేరు వచ్చింది. కుటుంబ సభ్యలు, స్నేహితులతో కలిసి ఇక్కడ బోటింగ్ చేయడం మరిచిపోలేని అనుభూతి. ఇక ఇక్కడ ఉన్న గాంధీ ఘాట్ కూడా చూడదగిన ప్రదేశాలలో ఒకటి.

3. సూర్యస్తమయం పాయింట్

3. సూర్యస్తమయం పాయింట్

P.C: You Tube

విశిష్టతలు....వీవ్ పాయింట్, ఫొటోగ్రఫీ

టికెట్ ఫీ...ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

ప్రవేశ సమయం....ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకూ

చూడటానికి ఎంత సమయం పడుతుంది....సుమారు 45 నిమిషాలు

ఆరావళి పర్వతశ్రేణిలో ఉన్న ఈ మౌంట్ అబు ప్రాంతంలో సూర్యాస్తమయం చూడటానికే చాలా మంది ప్రక`తి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడి సూర్యస్తమయం సమయంలో అనేక బాలివుడ్ సినిమాలను కూడా నిర్మించారు.

4. అచలేశ్వర్ మహాదేవ్ దేవాలయం

4. అచలేశ్వర్ మహాదేవ్ దేవాలయం

P.C: You Tube

విశిష్టతలు...ఆలయ నిర్మాణశైలి భిన్నంగా ఉంటుంది. హిందువులకు అత్యంత పరిత్రమైన పుణ్యక్షేత్రం

టికెట్ ఫీ....ఎటువంటి ప్రవేశ రుసుం లేదు

ప్రవేశ సమయం....వారంలో అన్ని రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ

చూడటానికి ఎంత సమయం పడుతుంది....సుమారు గంట

భారత దేశంలోని అత్యంత ప్రాచీన దేవాలయాలయాల్లో అచలేశ్వర్ మహాదేవ్ దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ శివుడి కుడికాలు బొటనవేలును పూజిస్తారు. ఇక ఈ దేవాలయంలో ఉన్న కంచుతో చేయబడిన నంది విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది.

 5. మౌంట్ అబు బజార్

5. మౌంట్ అబు బజార్

P.C: You Tube

విశిష్టతలు....షాపింగ్

ప్రవేశ రుసుం....ఉచితం

ప్రవేశ సమయం....శారంలో ఏడు రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ

షాపింగ్ చేయడనికి ఎంత సమయం పడుతుంది.....సుమారు గంట నుంచి రెండు గంటలు

మౌంట్ అబు వెళ్లిన ప్రతి ఒక్కరూ అక్కడి స్థానిక స్ట్రీట్ మార్కెట్ లో షాపింగ్ చేయకుండా వెనక్కిరారు. ముఖ్యంగా ఇక్కడ రాజస్థాన్ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో చేతితో తయారుచేసిన (హాండీ క్రాఫ్ట్) ఎన్నో వస్తువులు మనకు తక్కువ ధరకు లభిస్తాయి. చేతితో నేసిన వస్త్రాలు కూడా ఇక్కడ మనకు చాలా తక్కువ ధరకు లభిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X