Search
  • Follow NativePlanet
Share
» »ఈ సంత నీటి పై తేలియాడుతుంది?

ఈ సంత నీటి పై తేలియాడుతుంది?

ఈ కథనం భారత దేశంలోని అత్యంత ప్రాచూర్యం పొందిన నీటి పై తేలియాడే మార్కెట్ గురించి తెలియజేస్తుంది.

మానవుడి ప్రయాణ సాధనంలో పడవది తిరుగులేని స్థానం. ఇక పరిమాణంలో పెద్దగా ఉన్న పడవలనే ఓడలు అనేవారు. ప్రపంచ వర్తక రంగాన్ని మార్చిన కొన్ని సాధనాల్లో ఈ పడవలు, ఓడలు ముందువరుసలో ఉంటాయి. సాంకేతికత ఎంత అభివద్ధి చెందిన ఇప్పటికీ ప్రపంచంలో మనం అక్కడక్కడ చిన్నచిన్న నదులు, సరస్సుల పై పడవల్లో స్థానిక ఉత్పత్తులను పడవల్లో అమ్మడం చూడవచ్చు. ఇటువంటి ఫ్లోటింగ్ మార్కెట్ (తేలియాడే సంతలు) మనదేశంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక రాజధానిగా పేరొందిన కాశ్మీర్‌లో మనం ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌ను చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

P.C: You Tube

జమ్ముకాశ్మీర్‌లోని దాల్ సరస్సు పై ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ను మనం చూడొచ్చు. సూర్యోదయానికి ముందే ఇక్కడ మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా టమోటాలు, క్యారెట్‌తోపాటు తమార వేర్లతో తయారుచేసే వంటకాలను కూడా ఇక్కడ అమ్ముతారు.

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

P.C: You Tube

సాధారణంగా రంగురంగుల పడవల్లో స్థానికులు తమ ఉత్పత్తులను అమ్మడానికి సిద్ధంగా ఉంచుతారు. అందువల్లే ఈ దాల్‌సరస్సు ఉదయం పూట వర్తకులతో నిండిపోతుంది. అయితే ఉదయం తొమ్మిదింటికి అంతా స్థానికులు తమ ఉత్పత్తులను అమ్ముకుని తిరిగి దగ్గర్లోని తమ గ్రామాలకు వెళ్లిపోతారు.

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

P.C: You Tube

అందువల్లే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ను చూడాలంటే సూర్యోదయం కంటే ముందుగానే అక్కడకు చేరుకోవాల్సి ఉంటుందిం. ఈ దాల్ సరస్సు ఒడ్డున సూర్యోదయం చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ వేడివేడి కాశ్మీర్ ఛాయ్‌ను తాగుతూ ఉన్న సమయంలో లేలేత సూర్యకిరణాల మన ఒంటిని తాకుతూ ఉండటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

P.C: You Tube

వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఫ్లోటింగ్ మార్కెట్ మనకు వేసవి కాలంలో మాత్రమే కొంత క్రీయాశీలంగా ఉంటుంది. చిలికాంలో ఈ సరస్సు పై ప్రయాణించడానికి వర్తకులు అంతగా ఇష్టపడరు. దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా తమ ఉత్పత్తులను పడవల్లో పెట్టుకొని ఇక్కడికి వర్తకులు తీసుకొని వస్తారు.

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

P.C: You Tube

ఇక స్థానికులు కూడా తమ పిల్లలను పాఠశాలకు పంపించే దగ్గర నుంచి తాము సరుకులు కొనేవరకూ ఇ పడవలనే ఆశ్రయిస్తారు. ఇక ఫ్లోటింగ్ మార్కెట్ ముగిసిన వెంటనే స్థానిక సరస్సు అందాలను చూడటానికి కూడా పర్యాటకులు ఎంతగానో ఆసక్తి చూపుతారు. అందుకోసం ఇక్కడ ప్రత్యేకమైన పడవలు సిద్ధంగా ఉంటాయి.

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

ఫ్లోటింగ్ మార్కెట్, దాల్‌ సరస్సు

P.C: You Tube

ఓపెన్ డెక్ సౌకర్యం కలిగిన పడవలో దాదాపు రెండు గంటల పాటు మనలను సరస్సు మొత్తం తిప్పి చూపిస్తారు. సూర్యోదయం సమయంలో దాల్ సరస్సులో పడవ పై ప్రయాణం మీకు కొంత అనుభూతులను మిగుల్చుతుంది. అందువల్లే కాశ్మీర్ పర్యాటకానికి వెళ్లినవారిలో చాలా మంది దాల్‌సరస్సు, అక్కడి ఫ్లోటింగ్ మార్కెట్ అందాలను చూడకుండా వెనుతిరగరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X