» »అంతుచిక్కని రహస్య పురాతన ఆలయం - కారంజి ఆంజనేయస్వామి దేవాలయం

అంతుచిక్కని రహస్య పురాతన ఆలయం - కారంజి ఆంజనేయస్వామి దేవాలయం

Posted By: Venkata Karunasri Nalluru

LATEST: మక్కా గురించి మీకు తెలియని నిజాలు !

బెంగుళూర్ నగరంలో అద్భుతమైన దేవాలయాలు చాలా వున్నాయి. అందులోనూ ఆంజనేయస్వామి దేవాలయాలు చాలా వున్నాయి. అటువంటి ఆలయాలలో బసవనగుడి కారంజి ఆంజనేయ దేవాలయం చూడవలసిన ఆలయం. ఈ ఆలయం బెంగుళూర్ సిటీ రైల్వేస్టేషన్ నుండి సుమారుగా 4.3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆలయం గురించి

ఆంజనేయస్వామి విగ్రహం ఉత్తరదిక్కున సుమారుగా 18 అడుగుల ఎత్తు కలిగి వున్నది. బెంగుళూర్ నగరంలోనే అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహంగా చెప్తారు.

Anjaneya temple in Basavanagudi

PC : Brunda Nagaraj

ఆంజనేయస్వామి చేతులలో చూడామణి ని చూడవచ్చును. ఇది రామాయణంలోని ఒక సన్నివేశాన్ని గుర్తుచేస్తుంది. ఈ ఆలయంలో కారంజి సరస్సు ఉంది. అందుకే ఈ ఆలయానికి కారంజి ఆంజనేయ దేవాలయం అనే పేరు వచ్చింది.

Anjaneya temple in Basavanagudi

ఆలయం బిఎంఎస్ మహిళల కాలేజ్ ప్రక్కనే విశాలమైన ప్రదేశంలో వున్నది. ఇక్కడ పార్కింగ్ కోసం పుష్కలమైన స్థలం ఉంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గరుడస్వామి ఒక పొడవైన జెండా మీకు స్వాగతం పలుకుతూ కనిపిస్తుంది. ఆలయంలో రామాయణంలోని వివిధ సంఘటనలు వర్ణించే చెక్కడాలు చూడవచ్చును. గర్భగుడిలో కుడివైపున హనుమంతుని విగ్రహంతో పాటు ముఖ్య విగ్రహాలైన సీతాదేవి, శ్రీరాముడు మరియు అతని సోదరుడు లక్ష్మణుని విగ్రహాలు వున్నాయి. ఆలయం వెలుపల ఒక పెద్ద రావి చెట్టు వుంది. ఇక్కడ అనేక నాగదేవతల విగ్రహాలు వున్నాయి.

Anjaneya temple in Basavanagudi

PC : Brunda Nagaraj

దేవాలయ ప్రాంగణంలో పూజారుల కోసం అనేక ఆశ్రయాలను నిర్మించారు. ఇది ముజ్రై శాఖ కింద నిర్వహించబడుతుంది. ఆలయంలో ప్రసాదం చాలా రుచికరంగా వుంటుంది. ఇక్కడ ఆంజనేయస్వామి చాలా శక్తివంతమైన దేవుడు అని చెప్తారు. ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. సందర్శించడానికి దేవాలయం చుట్టూ అనేక ఆకర్షణీయమైన ప్రదేశాలు వున్నాయి. ఈ దేవాలయం చూడటానికి వచ్చినప్పుడు బుల్ టెంపుల్, దొడ్డగణపతి ఆలయం మరియు బాగ్లె రాక్ కూడా చూడవచ్చును.

Anjaneya temple in Basavanagudi

PC : Brunda Nagaraj

మీకు సాయంత్రం పూట ఆలయం సందర్శించాలని ప్లాన్ ఉంటే బసవనగుడి మరియు మహాత్మాగాంధీ బజార్ ల దగ్గర మంచి స్ట్రీట్ ఫుడ్ తిని షాపింగ్ కూడా చేయవచ్చు.

కారంజి ఆంజనేయ ఆలయం టైమింగ్స్

ఉదయం : 7 AM నుండి 12 PM
సాయంత్రం : 4 PM నుండి 8 PM

మెజస్టిక్ మరియు కేఆర్ మార్కెట్ నుండి బసవనగుడికి అనేక బస్సులు ఉన్నాయి. మీరు గాంధీ బజార్ బస్ స్టాండ్ లేదా గణేష్ భవన్ వద్ద దిగితే అక్కడినుండి ఆలయం చాలా దగ్గరలో వుంది. నడుచుకుంటూ వెళ్ళవచ్చును. మీరు ఆంజనేయస్వామి భక్తులైనట్లయితే తప్పకుండా ఈ ఆలయం సందర్శించాలి.