Search
  • Follow NativePlanet
Share
» »ఈ సోమేశ్వరాలయంలో 5 శివలింగాల్నీ ఒకేసారి దర్శించుకునే భాగ్యం..మరెక్కడా దొరకదు..!!

ఈ సోమేశ్వరాలయంలో 5 శివలింగాల్నీ ఒకేసారి దర్శించుకునే భాగ్యం..మరెక్కడా దొరకదు..!!

ఆ పరమేశ్వరుడికి వేయి నామాలు. అందుకే ఏ పేరుతో పిలిచినా పలుకుతానంటాడు ఆ పరమశివుడు. సాధారణంగా ఒక్క శివాలయంలో ఒక్క శివలింగం ఉండటాన్ని చూస్తుంటాము. అయితే ఒకే ఆలయంలో ఆపరమ శివుడు ఐదు విభిన్న నామాలతో కొలువయ్యాడు. అదెక్కడో తెలుసుకోవాలంటే బెంగళూరు వెళ్ళాల్సిందే. బెంగళూరులోని సోమేశ్వరాలయానికి వెళితో ఒకే గుడిలో ఏకంగా ఐదు శివలింగాలను ఒకేసారి దర్శించుకునే భాగ్యం దొరకుతుంది.

సృష్టి స్థితి లయ కారకుల్లో శివుడు లయానికి అధిపతి. అంటే మళ్లీమళ్లీ సృష్టి జరుగుతూ ఉండాలంటే ఏ వస్తువుకైనా, మరే జీవికైనా లయం అవసరం. ఆయా జన్మల బాధల నుండి జీవుల్ని విముక్తుల్ని చేయడమే రుద్రుడి ప్రథమ కర్తవ్యం. అందుకు శైవక్షేత్రాలన్నింటిని మోక్ష ప్రదాయకాలుగా పిలుస్తుంటారు.

భారతదేశంలో ఆ పరమశివుడినికి సంబంధించిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి

భారతదేశంలో ఆ పరమశివుడినికి సంబంధించిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి

భారతదేశంలో ఆ పరమశివుడినికి సంబంధించిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అయితే శివయ్య సోమేశ్వరుడు,అరుణాచలేశ్వరుడు, భీమేశ్వరుడు, నంజుండేశ్వరుడు, చంద్రమౌళీశ్వరుడు అనే భిన్న పేర్లతో ఒకే దేవాలయంలో కొలువైన క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హలసూరు సోమేశ్వర దేవాలయం. కామాక్షి సమేతంగా స్వామి కొలువైన ఈ ఆలయం భక్తిముక్తి ప్రదాయకం.

ఆలయ చరిత్ర :

ఆలయ చరిత్ర :

సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన యుగ ప్రారంభానికి పూర్వపు చరిత్ర ఉంది. కలియుగానికి ముందు ఈ ఆలయ ప్రాంతంలో మాండ్య మహర్షి ఆశ్రమం ఉండేదట. ఆ మహర్షి శిష్యలతో కలిసి నివసిస్తూ, అక్కడ ఉన్న ఒక స్వయంభూ లింగాన్ని పూజిస్తూఉండే వారట. కాలక్రమంలో ఈ శివలింగం భూగర్భంలో కలిసిపోయింది. ఆ ప్రదేశమంతా అడవిలా మారిపోయింది. ఆ తర్వాత 13వ శతాబద్ధంలో బెంగళూరు నగర నిర్మాతగా ప్రసిద్దిచెందిన కెంపెగౌడ తండ్రి జయప్పగౌడ ఒక సారి వేటకోసం ఈ ప్రాంతానికి వెళ్ళారట.

PC : Dineshkannambadi

ఈ ప్రాంతానికి హలసూరుగా పేరు

ఈ ప్రాంతానికి హలసూరుగా పేరు

అప్పట్లో ఈ ప్రాంతమంతయు పనసచెట్లతో నిండి ఉండేది. పనసచెట్టుని కన్నడంలో హలసిన మర అంటారు. అందువల్ల ఈ ప్రాంతానికి హలసూరుగా పేరు వచ్చింది. వేటలో అలసపిపోయిన జయప్ప గౌడ ఒక పనసచెట్టుక్రింది నిద్రపోయినాడు. అప్పుడు కలలో ఆ పరమేశ్వరుడు కనిపించారట. ఇక్కడి నేలలో లింగరూపంలో తానున్నాననీ, బయటకు తీసి గుడి కట్టించమనీ ఆజ్జాపించారట. అక్కడ తవ్విచూస్తే శివలింగం కనిపంచడంతో జయప్పగౌడ గుడిని కట్టించి అర్చనలు చేయించారు. ఆ శివలింగమే ఇక్కడ సోమేశ్వర లింగంగా విరాజిల్లుతోంది. తర్వాతి కాలంలో సోమేశ్వరుడ్ని కొలిచిన మహా భక్తులు ఈ ప్రాంగణంలోనే అరుణాచలేశ్వురుడ్నీ, భీమేశ్వరుడ్నీ, నంజుండేశ్వరుడ్నీ, చంద్రమౌళీశ్వరుడ్నీ ప్రతిష్టించి అర్చనలు జరిపినట్లు స్థల పురాణం తెలుపుతున్నది.

ఆలయ శిల్పకళా వైభవం:

ఆలయ శిల్పకళా వైభవం:

సోమేశ్వర ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులూ ఎంతో అభివృద్ధి చేశారు. అందుకే అక్కడి శిలాప్రతిమలు కొన్ని చోళశైలిలో, మరొకొన్ని విజయనగర శైలిలో దర్శనమిస్తాయి. నాలుగు ఎకరాల విశాల ప్రాంగణంలో ఉన్న ఆ ఆలయం ముందు భాగంలో 48 శిలాస్తంభాలతో పెద్ద మండపం ఉంటుంది. ఈ గుడి ప్రాకారం చుట్టూ మామిడి, సంపెంగ, జమ్మి, రావి, వేప చెట్లు సహా శివలింగా పుష్పవృక్షాలు భక్తులకు చల్లని నీడనిస్తుంటాయి.

PC : Dineshkannambadi

 ప్రాంగణంలోని గోడల మీద చక్కని శిల్పాలు

ప్రాంగణంలోని గోడల మీద చక్కని శిల్పాలు

ప్రాంగణంలోని గోడల మీద చక్కని శిల్పాలు చెక్కి ఉంటాయి. వీటిలో కొన్నింటిని మహా శిల్పి జక్కన వంశీయులు చెక్కారని చెబుతారు. ఆలయం చుట్టు ప్రాకారం వెనుక భాగంలో గరుడవాహనుడైన హరి హంసవాహనుడైన బ్రహ్మ, వృషభవాహనుడైన శివుడు, నెమలి మీద కూర్చుని ఉన్న కుమారస్వామి, గిరిజా కళ్యాణం , శస్త్రధారులైన సైన్యంతో సహా చక్కగా చెక్కిన ఆంజనేయుడి శిల్పాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడి గోడమీద చెక్కిన బ్రహ్మా దేవుడికి కూడా పూజలు చేస్తారు. ఇలా బ్రహ్మ దేవుడికి ఆలయంలో పూజ జరగడం ఓ విశషం.

PC : Gkpandey

గర్భగుడికి కుడివైపున కామాక్షి అమ్మవారి ఆలయం

గర్భగుడికి కుడివైపున కామాక్షి అమ్మవారి ఆలయం

ఇక గర్భగుడికి కుడివైపున కామాక్షి అమ్మవారి ఆలయం, ఆంజనేయ మందిరం కూడా ఉన్నాయి. కామాక్షి అమ్మవారి ఎదురుగా శిలతో చెక్కిన బీజాక్షర యుక్త శ్రీచక్రం ఉంటుంది. గర్భగుడి ప్రాకారంలో 63మంది నాయనార్ల విగ్రహాలు ఉన్నాయి. ముఖ మండపానికి ముందుభాగంలో ఇత్తడి తాపడంతో ఉన్న పెద్ద నంది గంభీరంగా దర్శనమిస్తుంది. ఈ మండపంలోనే శివుడి బ్రహ్మరథోత్సవ సమయంలో 11 రోజుల పాటు ఊరేగింపు జరిపే 11 వాహనాలను ఉంచుతారు.

పూల పల్లకి ఎంతో ప్రసిద్ది

పూల పల్లకి ఎంతో ప్రసిద్ది

కాగా సోమేశ్వరుడికి 11 రోజుల పాటు చైత్రమాసంలో ఉత్సవాలు జరుపుతారు. చైత్ర పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే పూల పల్లకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ రోజున అన్ని దేవస్థానాల గ్రామ దేవతలూ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణంలో పరివార దేవతలైన సుబ్రమణ్యేశ్వరస్వామి, విద్యాగణపతి, సరస్వతి, జేష్ఠాదేవి, దుర్గాదేవి, కాలభైరవుడు, దక్షిణామూర్తి కొలువై ఉన్నారు. అదే విధంగా ప్రతి సోమవారం, అమావస్య రోజుల్లో జరిపే శత రుద్రాభిషేకం ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. కార్తిక సోమవారాలూ, పౌర్ణమిరోజుల్లో కన్నుల పండువలా ఇక్కడ దీపోత్సవాలు నిర్వహిస్తారు. ఇక శివరాత్రి రోజున జరిగే ఉత్సవాలూ, అభిషేకాలను తిలకించేందుకు వేలసంఖ్యలో భక్తులు వస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X