Search
  • Follow NativePlanet
Share
» »శత్రుదర్భేద్యమైన ఈ కోట అందంలో కూడా అప్సరసకు దీటైనదే

శత్రుదర్భేద్యమైన ఈ కోట అందంలో కూడా అప్సరసకు దీటైనదే

అందమైన ప్యాలెస్ లతో పాటు శత్రుదుర్భేద్యమైన కోటలకు రాజస్థాన్ పెట్టని కోట. గుప్తుల నుంచి మొదలు రాజ్ పుత్ ల వరకూ ఎంతోమంది ఈ రాజస్థాన్ లో కోటల నిర్మించారు. ఇవన్ని ఎంతో అందమైనవే కాకుండా శత్రుదుర్భేద్యమైనవి కూడా. అందువల్లే అప్పట్లో రాజస్థాన్ లోని సామ్రాజ్యాలను జయించడానికి మిగిలిన రాజులు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇక ఈ కోటలు ఎన్నో చారిత్రాత్మక ఒప్పందాలకు కూడా సాక్ష్యంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ కోటలు పర్యాటక కేంద్రాలుగా మారాయి. కొన్ని కోటల్లో రెస్టోరెంట్లు కూడా వెలిసాయి. అటువంటి కోటలో అత్యంత అందమైన ఓ కోట గురించి ఈ కథనంలో తెలుసుకొందాం.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

అందులో నెహర్ ఘర్ కూడా ఒకటి. దీనిని పూర్వం సుదర్శన ఘర్ అని కూడా పిలిచేవారు. పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంటుంది.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

అరావళి పర్వత పంక్తుల్లోనే అత్యంత సుందరమైన కోటగా పేరుగాంచిన ఈ కోటను రాజ సవాయి జై సింగ్ క్రీస్తు శకం 1734లో నిర్మించారు. నెహర్ ఘర్ అంటే పులుల నివాసం అని అర్థం.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఈ కోట నిర్మించిన తర్వాత కూడా ఇక్కడ పులులు ఎక్కువ సంఖ్యలో తిరగడం వల్ల ఈ కోటకు ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. అంతేకాకుండా ఈ కోటకు సంబంధించిన మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

నెహర్ సింగ్ భోమియా అనే పేరుతో ఉన్న ఓ రాజకుమారుడి ఆత్మ ఈ కోటలో తిరుగుతూ ఉండేది. అతని ఆత్మకు శాంతి కలిగించేందుకువీలుగా ఈ కోటకు నెహర్ ఘర్ అనే పేరుపెట్టారు.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఇక జైగర్ కోట, అమీర్ కోట వలే రాజ్ పుత్ లకు ఈ నెహర్ ఘర్ కూడా అతి ముఖ్యమైనది. 16, 17వ శతాబ్దాల్లో ఈ కోట కేంద్రంగా విదేశీ వర్తక, వాణిజ్యాలు కూడా జరిగేవి.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

దీనిని బట్టి ఈ కోటకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ కోట పై భాగం నుంచి చూస్తే పింక్ సిటీగా పేరొందిన జై పూర్ మొత్తాన్ని విహం వీక్షణం చేయవచ్చు. దీన్ని బట్టి ఈ కోట ఎంత ఎత్తులో కట్టారో అర్థం చేసుకోవచ్చు.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఇక ఈ కోట లోపల రాజ మహేంద్ర భవన్ పేరుతో 12 గదులతో కూడిన ఓ ప్రాకారం ఉంది. ఇందులో రాజు తన 12 మంది భార్యలతో ఉండేవారు. ఈ 12 గదులు కూడా ఒకే రకంగా ఉండేవి. అంతేకాకుండా ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్లడానికి వీలుగా మార్గాలు కూడా ఉండేవి.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

అంతేకాకుండా రాజు ఏ గది నుంచి ఏ గదిలోకి వెళ్లాలడన్నది ఆ గదిలోని రాణికే కాకుండా మిగిలిన రాణులకు కూడా తెలియదు. దీన్ని బట్టి ఈ కోట నిర్మాణ శైలిలో అనుసరించిన సంక్లిష్టత ఏపాటితో అర్థం చేసుకోవచ్చు.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

కోట గోడల పై అందమైన కుడ్యచిత్రాలతో అలంకరించారు. ఆలనాటి కుడ్య చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ పెయింటింగ్స్ కు సహజ రంగులను వినియోగించడం విశేషం.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఈ కోట అనేక చారిత్రాత్మక ఒప్పందాలకు వేదిక. ముఖ్యంగా మరాఠా వీరులు జైపూర్ మీద దండెత్తినప్పుడు కుదిరిన శాంతి ఒప్పందానికి ఈ కోట వేదికగా మారింది. ఈ కోట మొత్తం చూసిన తర్వాత అందులోనే ఉన్న రెస్టోరెంట్ లోనే భోజనం కూడా చేయవచ్చు.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఈ కోటను ఏడాదిలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు. ఇక్కడ కోట లోపల అందమైన ఉద్యానవనాలను కూడా వీక్షించవచ్చు.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ప్రవేశ రుసుం భారతీయులకు రూ.25. విదేశీయులుకు రూ.200. ఈ కోటను ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించవచ్చు.అయితే సెప్టెంబర్ నుంచి మార్చి వరకూ ఎక్కువ మంది ఈ జైపూర్ కు దగ్గరగా ఉన్న నెహర్ ఘర్ ను సందర్శిస్తుంటారు.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఆ సమయంలో ఈ కోటతో పాటు చుట్టు పక్కల ఉన్న పరిసర ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా అప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత 20 నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. ఇక వేసవి కాలంలో ఈ కోట పరిసరప్రాంతాలు చాలా ఉక్కపోతగా ఉంటాయి.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఇక ఈ కోటలో అనేక సినిమాల చిత్రీకరణ కూడా జరిగింది. ముఖ్యంగా జోధా అక్బర్, రంగ్ దే బసంతి వంటి అనేక బాలివుడ్ చిత్రాల్లో ఈ కోట అందాలను చూడవచ్చు.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

రంగ్ దే బసంతి సినిమా తర్వాతనే ఈ కోట అనేకమంది పర్యాటకులను ఆకర్షించడంలో ముందున్నదని చెప్పవచ్చు. ఈ కోటకు దగ్గర్లోనే అమీర్ కోట, జైగర్ కోట కూడా ఉన్నాయి.

నెహర్ ఘర్ కోట, జైపూర్

నెహర్ ఘర్ కోట, జైపూర్

P.C: You Tube

ఈ నెహర్ ఘర్ కోట నుంచి జంతర్ మంతర్ కేవలం 2.7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా సిటీప్యాలెస్, హవామల్, జల్ మహల్ కూడా ఈ నెహర్ ఘర్ నుంచి చాలా తక్కువ దూరంలోనే ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X