Search
  • Follow NativePlanet
Share
» »షిమోగ...... అబ్బురపరిచే అందాలు !!

షిమోగ...... అబ్బురపరిచే అందాలు !!

కర్ణాటక రాష్ట్రంలో షిమోగ జిల్లాని "శివమొగ్గ" అని కూడా పిలుస్తారు. ఇది ఒక అందమైన పర్యటక ప్రదేశం.ఈ జిల్లాలో చూడవలసినవి ఎక్కువగా ఉన్నప్పటికి కొన్నిమాత్రమే బయటి ప్రపంచానికి తెలిసినాయి. ఈ జిల్లా అందమైన ఆలయాలకు, కోమలమైన ప్రకృతికి, పూర్వ సంస్కృతికి,ఎత్తైన కొండలకి, పచ్చటి పచ్చిక మైదాన ప్రాంతాలకి నిదర్శనం.ఇది ఉగ్రరూప నదులైన తుంగ, భధ్రా, సరస్వతి మరియు వార్ధా లను సరిహద్దులుగా కలిగి ఉంది. ఇది రాష్ట్రంలో కెల్లా ఎక్కవగా వరి పంట పండించే ప్రదేశం కనుకనే దీనిని కర్ణాటక రాష్ట్రంలో మనిషిలోని హృదయంతో పోలుస్తారు.స్ధానికులు షిమోగా ప్రాంతాన్ని భూమిపై అవతరించిన స్వర్గంగా పిలుస్తారు. పర్యాటకులకు, యాత్రికులకు వీనుల విందు చేసే ప్రఖ్యతిగాంచిన జోగ్ జలపాతం తక్కవ మందికి తెలసిన కేలడి సమీపాన ఉంది. మీరు గనక షిమోగ అందాలు ఆస్వాదించినట్లయితే చాలా ఎక్కువ ఆనందాన్ని పొందగలరని ఖచ్చితంగాచెప్పగలను.

 ప్రకృతి అందాలకు నెలవు

ప్రకృతి అందాలకు నెలవు

Photo Courtesy: Nishanth Jois

నివ్వెర పరిచే జోగ్ జలపాతం

నివ్వెర పరిచే జోగ్ జలపాతం

Photo Courtesy: Surajram Kumaravel

మంత్రముగ్ధులను చేసే నీటి అందాలు

మంత్రముగ్ధులను చేసే నీటి అందాలు

Photo Courtesy: Harsha K R

ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడి

ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడి

Photo Courtesy: Harsha K R

మరిన్ని అందమైన సహజ జలపాతాలు

మరిన్ని అందమైన సహజ జలపాతాలు

Photo Courtesy: Harsha K R

కోమలమైన పాడి పంటలు

కోమలమైన పాడి పంటలు

Photo Courtesy: Harsha K R

కంటికి కనిపించే పచ్చదనం

కంటికి కనిపించే పచ్చదనం

Photo Courtesy: Harsha K R

 కొండ ప్రక్కన వ్యవసాయం

కొండ ప్రక్కన వ్యవసాయం

Photo Courtesy: Harsha K R

కంటికి కనిపించే పచ్చదనం

కంటికి కనిపించే పచ్చదనం

Photo Courtesy: Harsha K R

రోడ్డుకి ఇరువైపుల పచ్చని చెట్లు

రోడ్డుకి ఇరువైపుల పచ్చని చెట్లు

Photo Courtesy: Harsha K R

ఎలా వెళ్ళాలి?

వాయు రవాణా

ప్రస్తుతానికి వాయు రవాణా ఈ జిల్లాలో లేనప్పటికీ శివమొగ్గ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.అంతగా కావాలంటే బెంగళూరులోని కెంపగౌడ విమానాశ్రయంలో దిగి,అక్కడి నుంచి రోడ్డు మార్గం లేదా రైలుమార్గం ద్వారా చేరుకోవచ్చు.

రైలు రవాణా

ఈ జిల్లాలో ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు భద్రావతి, హర్నహళ్ళి, కుంసి, ఆనందపురం, సాగర్ ల మీదుగా తల్గుప్ప వరకు ఒక రైలు మార్గం ఉంది. బెంగళూరు నుంచి రైలు సదుపాయం కలదు.

రోడ్డు రవాణా

ఈ జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి. 13వ నెంబరు జాతీయ రహదారి మరియు 206వ నెంబరు జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి కనుక బస్సు సదుపాయం సులభంగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X