» »దక్షిణ భారతదేశంలో ఏప్రెల్ - మే లో చూడదగ్గ సముద్రపు ఒడ్డున గల బీచ్ లు

దక్షిణ భారతదేశంలో ఏప్రెల్ - మే లో చూడదగ్గ సముద్రపు ఒడ్డున గల బీచ్ లు

Written By: Venkatakarunasri

LATEST: అక్కడ వర్షం పడితే చాలు వర్షంతో పాటు వజ్రాలు పడతాయి వెళతారా ?

మీలో ఎవరికి బీచ్ అంటే ఇష్టం లేదు చెప్పండి ? వేసవికాలంలో ఎండలు మండిపోతుంటాయి. అప్పుడు మనకు ఠకీమని బీచ్ లు గుర్తుకొస్తాయి. సెలవులు ఎలాగో వచ్చేసాయి. హమ్మయ్యా.. అనుకుంటే పొరపాటే. ఈ వేసవి సెలవులు కూడా హాయిగా గడపాలి కదా! సాయంకాలం అలా బీచ్ కి వెళ్తే చెప్పలేని ఉల్లాసంగా వుంటుంది కదూ. మరెందుకాలస్యం సౌత్ ఇండియా ఆఫ్ బీట్ బీచెస్ కి ఛలో మరి.. దక్షిణ భారతదేశంలో 15 దక్షిణ భారతదేశంలో 15 బీచ్ ల లిస్ట్ మీ కోసం. ఏ బీచ్ మీకు దగ్గరగా అనుకూలంగా వుంటుందో ఎంచుకోండి.

Latest: ప్రకృతి చెక్కిన శిల్పాలు - మీరు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన ప్రదేశాలు !

"విమానంలో ప్రయాణం....ఒక్క రోజులోనే ఏడుకొండల వాడి దర్శనం"!

సెలవులలో పిల్లలు, పెద్దలు కూడా బీచ్ కి వెళ్ళటానికి ఇష్టపడతారు. ప్రకాశవంతమైన సూర్యుడు, తడి ఇసుక, నీటిని చల్లడం ఈ సెలవులలో మీ మనస్సుకు అంతులేని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఏప్రిల్-మే నెలలలో వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పటికీ పర్యాటకుల సందర్శన తగ్గదు. వేడి నుండి గొప్ప ఉపశమనం పొందటానికి ఎక్కువ మంది ప్రజలు హిల్ స్టేషన్లలో గడపటానికి ఇష్టపడతారు. ఏదేమైనా సెలవులు బీచ్ లో సన్ బాత్ చేయాలని, ఈత కొట్టాలని మీకు అన్పిస్తుంది కదూ.

ప్రకృతి ఒడిలో.....ఇండియాలోని 10 బీచ్ లు !l

ఈ సీజన్లో ప్రసిద్ధ బీచ్లు రద్దీగా ఉంటాయి. అందువలన ఈ సీజన్లో మీకు దగ్గరగా గల ఆఫ్ బీట్ బీచెస్ కొన్నింటిని ఎంచుకోండి. గోవా లేదా అండమాన్ బీచ్ లలో మాత్రమే సరదాగా వుంటుందని మీరు అనుకుంటే అది పొరపాటే. ఈ వేసవిలో దక్షిణ భారతదేశంలోని కొన్ని ఇలాంటి బీచ్లని మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబసభ్యులతో వెళ్లి ఆనందించొచ్చు.

ఇది కూడా చదవండి: టాలీవూడ్ కమెడియన్లు - పుట్టిన ప్రదేశాలు !!

దక్షిణ భారతదేశంలో ఏప్రెల్ - మే లో చూడదగ్గ సముద్రతీర ప్రాంతాలు

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. భీమునిపట్నం బీచ్

1. భీమునిపట్నం బీచ్

భీమిలి అని పిలవబడే ఈ ప్రశాంతమైన బీచ్ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్ అక్కడి పరిసర ప్రాంతాల వారికి బాగా తెలిసిన బీచ్. కానీ నిజంగా పర్యాటకులలో చాలామందికి ఎక్కువగా తెలియదు. ఇక్కడ అలలు అద్భుతంగా వుంటాయి. సముద్రంలో ఈత కొట్టడానికి అనుకూలంగా వుంటాయి. ఇక్కడ ప్రసిద్ధిచెందిన 13 వ శతాబ్ధం నాటి భీమిలి దేవాలయం కూడా చూడవచ్చును. భారతదేశంలోని అందమైన సముద్ర తీరాల్లో ఇది ఒకటి.

PC: Adityamadhav83

2. బేకాల్ బీచ్

2. బేకాల్ బీచ్

కాసర్గోడ్ జిల్లాలో ఉన్న బేకాల్ బీచ్ కేరళలోని తూర్పు తీరంలో వున్న ఒక అసాధారణ బీచ్. ఈ బెకాల్ బీచ్ సినిమాల ద్వారా జనాదరణ పొందినప్పటికీ ఇంకా చాలామందికి తెలీదు. ఇక్కడ ప్రసిద్దిచెందిన బేకాల్ కోటను చూడవచ్చును. బేకాల్ సమీపంలో ఉన్న మలబార్ ట్రైల్, హైకింగ్, బోటింగ్ చేయవచ్చును. ఇక్కడ అనేక రకాల పక్షులను కూడా చూడవచ్చును.

PC: Manu gangadhar

3. కౌప్ బీచ్

3. కౌప్ బీచ్

కౌపు బీచ్ కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఉంది. ఈ బీచ్ దగ్గర వున్న లైట్ హౌస్ చాలా ప్రసిద్ది చెందినది. లైట్ హౌస్ ఉదయం 5 నుండి 6 గంటల వరకు ప్రజలకు తెరిచి ఉంటుంది. ఉడిపికి దక్షిణాన 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ మారియమ్మ దేవి యొక్క మూడు దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది.

PC: Subhashish Panigrahi

4. మరారి బీచ్

4. మరారి బీచ్

కేరళలోని అలప్పుజ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో మరారి బీచ్ ఉంది. ఈ అందమైన బీచ్ లో మనం సూర్యోదయం, సూర్యాస్తమయం యొక్క గొప్ప దృశ్యాలను తిలకించవచ్చును. కొబ్బరి చెట్లు మరియు బంగారు ఇసుకతో నిండిన ఈ బీచ్ లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చును. పోర్చుగీసు వారు నిర్మించిన డచ్ ప్యాలెస్ మరారి బీచ్ దగ్గర చూడవలసిన విహార కేంద్రం. ఈ ప్యాలెస్ 14 వ శతాబ్దపు గొప్ప శిల్పకళకు ప్రసిద్ది చెందింది. మరారి బీచ్ చుట్టూ అనేక శివాలయాలు కూడా కలవు.

PC: nborun

5. ముళప్పిలంగడ్ బీచ్

5. ముళప్పిలంగడ్ బీచ్

కేరళలోని పొడవైన బీచ్ లలో ఇది ఒకటి. ఇది కేరళలోని తలాసేరీకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రైవ్-ఇన్ బీచ్. ఈ బీచ్ నుండి 100 మీటర్ల దూరం ధర్మదాం అనే ఒక ద్వీపం ఉంది. మీరు తక్కువ అలలు ఉన్నప్పుడు ఈ ద్వీపానికి వెళ్లవచ్చు. ఈ బీచ్ నీలి మస్సెల్స్ కి ప్రసిద్ది చెందింది. అందువల్ల బీచ్ చుట్టూ వున్న అనేక రెస్టారెంట్లు ఈ రుచికరమైన ఆహారాన్ని అందిస్తాయి.

PC: Rijin

6. మరావంతే బీచ్

6. మరావంతే బీచ్

కర్నాటక తీరంలో ఉన్న కుంటాపురా సమీపంలోని మరావంతే బీచ్ ఒకటి. బీచ్ కి ఒక వైపు NH 66 (జాతీయ రహదారి) మరియు ఇంకొక వైపు సుపర్ణిక నది. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా వుంటుంది కదూ! ఈ రెండూ కలసి మనకు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా బీచ్ లో వరాహస్వామి ఆలయం ఉంది. మరావంతే సమీపంలో గాంగోలీ కోటను కూడా చూడవచ్చును.

PC: Ashwin Kumar

7. కురంగడ్ బీచ్

7. కురంగడ్ బీచ్

కురంగడ్ బీచ్ కార్వార్ తీరంలో ఉన్న ఒక తాబేలు ఆకారపు ద్వీపంలో వుంది. 30 నిమిషాల పడవ ప్రయాణం ద్వారా మాత్రమే ఈ తీరాన్ని చేరవచ్చును. కురంగడ్ చుట్టూ ఉన్న పచ్చటి చెట్లు మిమ్మల్ని ప్రశాంతమైన మరో లోకానికి తీసుకువెళ్తుంది అనటం అతిశయోక్తికాదు. ఈ బీచ్ దగ్గర వున్న ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి దేవాలయం పెద్ద ఆకర్షణ. ఇక్కడకు వేలాది మంది వచ్చి దర్శించుకుంటారు. కురంగడ్ బీచ్ పడవ సవారీలు, స్నార్కెలింగ్, డైవింగ్ మరియు టైడల్ పూల్ వంటి కార్యకలాపాలను అందిస్తుంది.

PC: flickr.com

8. ముత్తోం బీచ్

8. ముత్తోం బీచ్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని ముత్తోం గ్రామంలో అందమైన, నిర్మలమైన ముత్తోం బీచ్ ప్రసిద్ది చెందింది. ఇది కన్యాకుమారిలో వున్న ప్రధాన బీచ్ కంటే పర్యాటకులు 2% కంటే తక్కువగా కలది. ఇది ఇది అత్యంత అనుకూలమైన, ఎంతో ఇష్టపడే ఆఫ్-బీట్ బీచ్ గ ప్రసిద్ధిచెందినది. బీచ్ కి ఇరువైపులా పెద్దపెద్ద రాళ్ళు కాపలాగా వున్నట్టు వుంటాయి. ముత్తోంలోని తిరుననక్కరై కావే అనే జైనమతానికి సంబంధించిన దేవాలయం. ఈ ప్రదేశం కూడా అత్యంత ప్రాముఖ్యత పొందినదిగా చెప్పవచ్చును.

PC: Rafimmedia

9. చోవర బీచ్

9. చోవర బీచ్

కేరళలోని కేవళాలో ఉన్న చౌరా బీచ్ అందమైన మరియు ప్రశాంతత కలసిన ఒక అందమైన బీచ్. ఇది చౌరా ఫిషింగ్ గ్రామానికి పక్కన ఉంది. చౌరా బీచ్ లో వున్న ఆయుర్వేద రిసార్ట్ లో మీరు ఆసక్తి వుంటే మసాజ్ కూడా చేయించుకోవచ్చును. బీచ్ కి దగ్గరలో ఉన్న ఒక కొండపై చౌరా అయప్ప టెంపుల్ ఉంది.

PC: Kerala Tourism from India

10. పిచవరం బీచ్

10. పిచవరం బీచ్

పిచవరం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మాన్ గ్రూవ్ ఫారెస్ట్. ఇది ప్రసిద్ధ పర్యావరణ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది తమిళనాడులోని చిదంబరంలో ఉంది. ఈ బీచ్ చాలా శుభ్రంగా వుంటుంది. బీచ్ చుట్టుప్రక్కలా అనేక చెట్లు వున్నాయి. 2004 లో వచ్చిన సునామీ సమయంలో ఈ బీచ్ తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే ఇది ఇప్పటికీ అందంగా కనపడుతుంది. ఈ బీచ్ లో 3 గంటలుండే పడవ రైడ్ మీకు మరింత ఉల్లాసాన్ని కల్గిస్తుంది.

PC: Navaneeth Krishnan S

11. కప్పిల్ బీచ్

11. కప్పిల్ బీచ్

కప్పిల్ బీచ్ కేరళలో వర్కాల నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్ అరేబియా సముద్రానికి కలుపబడుతుంది. ఇక్కడ గల కొబ్బరి తోటల సమూహాలు సముద్ర తీరానికి ఒక ఆకర్షణగా నిలిచాయి. బీచ్ వద్ద బ్యాక్ వాటర్ రైడ్ సరదాగా, జాలీగా ఉంటుంది.

PC: Navaneeth Krishnan S

12. బెలెకెరి బీచ్

12. బెలెకెరి బీచ్

కర్నాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో బెలెకెరి బీచ్ కలదు. ఈ ప్రదేశం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ బీచ్ నుండి సూర్యాస్తమయం మరియు సూర్యోదయం దృశ్యం చూడటానికి అద్భుతంగా వుంటుంది. ఇక్కడ 15 వ శతాబ్దం నాటి జెనుబీరా మరియు ఈశ్వర దేవాలయాలు చాలా ప్రసిద్ది చెందిన ఆలయాలు. మాంగనీస్ ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి బ్రిటిష్ వారు బెలెకెరి సముద్రతీరాన్ని ఉపయోగించారు.

PC: wikimedia.org

13. ఎళిమల బీచ్

13. ఎళిమల బీచ్

కేరళలోని కన్నూర్ లో వుండే ఎళిమల బీచ్ "అందం" అనే పదానికి సరైన నిర్వచనాన్నిస్తుంది. బీచ్ కుడివైపున శిల్పాలతో చెక్కబడిన రాతి స్తంభాలు ఉన్నాయి. బీచ్ సమీపంలో అంతకుముందు యుగాల నుండి ఒక మనోహరమైన సమాధి గది కూడా ఉంది. ఈ బీచ్ డాల్ఫిన్ ఔత్సాహికులకు ఇష్టమైనది. ఎట్టికులన్ బే సమీపంలో డాల్ఫిన్లు చూడవచ్చును.

PC: Sreejithk2000

14. ఒట్టినెనె బీచ్

14. ఒట్టినెనె బీచ్

బైందూర్ లో ఉన్న ఒట్టినెనె బీచ్ కర్నాటకలోని కుందాపూర్ నుండి 40 కి.మీ దూరంలో ఉంది. ఈ బీచ్లో సందర్శకులు చాలాతక్కువ మంది వుంటారు. మీరు ఈ బీచ్ వద్ద కొన్ని రోజులు గడపాలనుకుంటే ఇక్కడ కొన్ని గదులు మరియు ఒక రెస్టారెంట్ ఉన్నాయి. మీరు ఒట్టినెనె బీచ్ లో సోమనాథేశ్వర ఆలయం కూడా చూడవచ్చు.

PC: flickr.com

15. చెరై బీచ్

15. చెరై బీచ్

కేరళలో ఉన్న చెరై బీచ్ ఒక హాట్ స్పాట్. బ్యాక్ వాటర్స్ యొక్క అద్భుత దృశ్యానికి ఈ బీచ్ ప్రసిద్ది చెందింది. చెరై బీచ్ లో పడవలో ప్రయాణించి ఎంజాయ్ చేయవచ్చును. ఇక్కడ తక్కువ కొండలు పొడవైన సముద్రతీరం ఈత కొట్టడానికి అనుకూలంగా వుంటుంది. మీరు ఇక్కడ బోటింగ్ కూడా చేయవచ్చును. ఇక్కడ ఆహ్లాదం కలిగించే కొబ్బరి తోటలు మరియు చైనీస్ ఫిషింగ్ వలలు ఇక్కడ ఫోటోలు తీసుకోవటానికి అనుకూలంగా వుంటుంది.

PC: flickr.com