Search
  • Follow NativePlanet
Share
» »టాలీవూడ్ కమెడియన్లు - పుట్టిన ప్రదేశాలు !!

టాలీవూడ్ కమెడియన్లు - పుట్టిన ప్రదేశాలు !!

By Staff

పుట్టిన రోజు, ప్రేమికులరోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు పెళ్లి రోజు ... ఈ రోజుల్లో కూడా మనం వారి(టి) గురించి ప్రత్యేకంగా ఆలోచించి, వారిని కొనియాడి శుభాకాంక్షలు జరుపుకుంటాం. మరి ఈ రోజు (జులై 1) అంతర్జాతీయ జోక్ డే.

"నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం , నవ్వలేకపోవడం ఒక రోగం " అన్నారు సినీ రచయిత జంధ్యాల. ఒకప్పటి సినిమాల్లో వినోదం కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ పెట్టేవారు. కానీ తర్వాతి కాలంలో కామెడీని సినిమాల్లో సందర్బతోచితంగా కలిపేయడం అలవాటైనది. ప్రత్యేక ట్రాక్ అంటూ ఏమి లేకుండా కథలోని సన్నివేశాలను బట్టే కామెడీ సన్నివేశాన్ని పుట్టిస్తున్నారు.

నవ్వుతూ ప్రేక్షకులను నవ్విస్తూ సినిమాలకు జీవం పోసేవారు హాస్య నటులు. నేడు హాస్య నటులు లేని తెలుగు సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా రంగం లో ఉన్నంత హాస్య నటులు బహూశా మన దేశంలోనే కాదు .. మొత్తం ప్రపంచంలో మరే సినిమారంగంలో చూసినా కనపడరు. అంతగా తెలుగు సినిమా రంగంలో ఇక్కడున్న హాస్య నటులు పేరుకపోయారు. మన తెలుగు సినిమాలలో కేవలం హాస్యం మీదే ఎన్నో సినిమాలు వచ్చాయి. సినిమాలో నవ్వు పుట్టించడం కేవలం హాస్య నటులకే సుసాధ్యం. అంతర్జాతీయ జోక్ డే నేపథ్యంలో ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తున్న కొందరు ప్రముఖ హాస్య నటులు ఎక్కడ పుట్టరో, వారి ఇక్కడివరికి ఎలా చేరుకున్నారో ఒకసారి చూద్దాం పదండి ..

రేలంగి

రేలంగి

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య, వెండితెరకు స్వర్ణయుగం లాంటి రోజుల్లో ప్రజల గుండె తెరపై నవ్వుల నయాగరాల ఉప్పొంగిన హాస్య గంగ. ఈయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కి 75 కి. మీ. దూరంలో ఉన్న రావులపాడు లో జన్మించాడు. శ్రీకృష్ణ తులాభారం లో రేలంగికి చిత్రాలలో మొదటి అవకాశం వచ్చినా, పన్నెండేళ్ళ తర్వాత గుణసుందరి కథ చిత్రంలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చి రేలంగికి హాస్యనటుడిగా స్థిరపడిపోయాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవట!! పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు మన రేలంగి కావడం విశేషం.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ ఏమీ తినాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / wikipedia

అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య రాజమండ్రి కి 70 కి. మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు లో జన్మించాడు. ఈయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను వేయించారు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. ఈయన నటించిన ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు ఈయన సృష్టించినవే.

ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Adityamadhav83

రాజబాబు

రాజబాబు

తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటుని గా వెలిగిన రాజబాబు "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి. రాజమండ్రి కి 65 కి. మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో జన్మించినాడు. రాజ బాబు కి మొదటి సారి తెరపై కనిపించిన చిత్రం సమాజం. ఆ తరువాత వచ్చిన అంతస్తులు చిత్రానికి గాను మంచి గుర్తింపు లభించింది. ఈయన వరుసగా 7 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొన్న మొట్టమొదటి హాస్య నటుడు, తాత్విక ఆలోచనలు గలవాడు.

తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ కోటల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / info.omevo

పద్మనాభం

పద్మనాభం

హాస్య నటుడిగా పేరు గాంచిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించినాడు. మాయాలోకం సినిమాలో కోరస్ పాడటమే కాక అందులో మొదటిసారి నటించే అవకాశం పద్మనాభంకి వరించింది. పాతాలభైరవి సినిమా లో నటించిన తీరు చూసి విజయా సంస్థ వారు ఆయనతో మూడు సంవత్సారాల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకునారు. దాంతో ఆయన వెనుదిరిగి చూడలేదు. దర్శకుడిగా, నిర్మాతగా మరి కొన్ని చిత్రాలను కూడా తీశారు. ఆయన నిర్మాతగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం తో ఎస్పీ బాలసుబ్రమణ్యం ను గాయకుడిగా పరిచయం చేసినాడు.

కడప లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Madhusudana Reddy

నగేష్

నగేష్

నగేష్ దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రసిద్ధ హాస్య నటుడు. తెలుగు, తమిళం,కన్నడ, మళయాళం వంటి భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి అందరినీ నవ్వించాడు. ఈయన కర్నాటక రాష్ట్రం లో బెంగళూరు నగరానికి 70 కి. మీ. దూరంలో ఉన్న తుంకూర్ తాలూకా చెయ్యూరు అనే గ్రామంలో జన్మించినాడు. ఈయన నవ్విస్తూనే ఏడిపీంచేవారట. అందుకే ఈయనను దక్షిణాది చార్లీ చాప్లీన్ అని అభిమానులు పిలుస్తుంటారు. తమిళంలో వచ్చిన నీర్ కుమిలి ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసినాడు. తెలుగు లో దేవత చిత్రంతో పాటుగా, వేటగాడు, కొండవీటి సింహం, శుభాకాంక్షలు వంటి చిత్రాలలో నటించి మెప్పించాడు.

తుంకూర్ లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Bhanu Prakash S

సూర్యకాంతం

సూర్యకాంతం

సూర్యకాంతం, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈవిడ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో జన్మించింది. మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. ఐతే ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.

యానాం లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Ashwin Kumar

రమాప్రభ

రమాప్రభ

దక్షిణ భారతదేశపు సినిమాల్లో ప్రముఖ హాస్య నటీమణిగా రమాప్రభ పేరు తెచ్చుకున్నారు. ఈవిడ అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కి 40 కి. మీ. దూరంలోని కదిరి లో జన్మించింది. దక్షిణాది చిత్రాల్లో ఇప్పటివరకు 1400కు పైగా చిత్రాల్లో చేసి ఎంతో పాపులారిటీ సంపాదించారు. హాస్య నటులు రాజబాబు, అల్లు రామలింగయ్యలకు జంటగా చేసి వారితో హిట్‌ కాం బినేషన్‌గా పేరుతెచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు తాత మనవడు, బడి పంతులు, విచి త్ర బంధం, జీవన జ్యోతి, ప్రాణం ఖరీదు, పట్నం వచ్చిన పతివ్రతలు, అప్పుల అప్పారావు, దేవదాసు వంటి హిట్‌ చిత్రాల్లో చేసి హాస్య నటిగా రాణించారు.

పుట్టపర్తి లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / రహ్మానుద్దీన్

సుత్తి వేలు

సుత్తి వేలు

తన సుత్తి తో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను రెండు దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు సుత్తి వేలు కృష్ణా జిల్లాలోని విజయవాడ కి 70 కి. మీ. దూరంలో ఉన్న భోగిరెడ్డిపల్లి లో జన్మించినాడు. ‘ముద్ద మందారం' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినా కూడా ‘నాలుగుస్తంభాలాట' చిత్రంలో ఆయన పోషించిన సుత్తి పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సుత్తి వేలు గారు సుమారు 200 పైగా చిత్రాల్లో నటించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న బీచ్ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / carrotbeast

సుత్తి వీర భద్ర రావు

సుత్తి వీర భద్ర రావు

హస్య బ్రహ్మ జంధ్యాల పరిచయం చేసిన సుత్తి వీర భద్ర రావు గోదావరి జిల్లాలో పుట్టినప్పటికీ, విజయవాడ నే స్వస్థలంగా మారిపోయింది. చిన్నతనం నుంచే నటన మీద ఉన్న ఆసక్తి తో ఎలా గైనా సినిమాలో కనిపించాలనే ఉద్దేశంతో 'నాలుగుస్తంభాలాట' చిత్రంలో హీరో కి తండ్రి క్యారెక్టర్ లో కనిపించి మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సుమారుగా 50 చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందినాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన జలపాతాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Ashwin Kumar

బ్రహ్మానందం

బ్రహ్మానందం

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అసలు పేరు కన్నె గంటి బ్రహ్మానందం. ఈయన గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించాడు. నరేశ్ నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో హీరోకి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "అహ నా పెళ్ళంట". తెలుగులో 900కి పైగా సినిమా ల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఘనత ఈ హాస్యనటుడికి దక్కుతుంది. ఒకే భాషలో అత్యధికంగా సిని మాలు చేసిన బ్రహ్మానందం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించడం విశేషం.

గుంటూరు లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / guntur villages

ధర్మవరపు సుబ్రమణ్యం

ధర్మవరపు సుబ్రమణ్యం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా హాస్యనటుడు. ఈయన ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం లో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొన్న ఈయన జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురా లో అవకాశం వచ్చింది. సినిమాల్లోచేసి హాస్య నటునిగా టాలీవుడ్‌ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హాస్యనటుడిగానే కాదు సినీ దర్శకుడిగా సైతం చిత్రాలు చేశారు.

ప్రకాశం లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / wikipedia

ఆలీ

ఆలీ

తెలుగు సినిమాల్లో హాస్య నటునిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఆలీ. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి లో జన్మించాడు. సీతాకోక చిలుక చిత్రం ద్వారా బాల నటుడుగా పరిచయమైన అలీ , ఇప్పటి వరకు 800 పై చిలుకు చిత్రాలలో నటించాడు. ఇక ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, అలాగే పవన్ కల్యాణ్ తన ప్రతి చిత్రంలో ఆలీని పెట్టుకోవడం సెంటిమెంట్ గా పడిపోయింది.

రాజమండ్రి లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Srirama Ravi Teja Buddhavarapu

ఎమ్. ఎస్. నారాయణ

ఎమ్. ఎస్. నారాయణ

ఎమ్. ఎస్. నారాయణ గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. ఎమ్. ఎస్. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని నిడమర్రు. వీరిది రైతు కుటుంబము. ఈయన దాదాపు 700 చిత్రాలలో నటించారు. ఈయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ.

పాపి కొండల్లో బోట్ షికారు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / wikipedia

బాబు మోహన్

బాబు మోహన్

బాబుమోహన్ తెలుగు సినిమాలో నటించిన ప్రముఖ హాస్య నటుడు. ఈయన ఖమ్మం జిల్లాలోని బీరోలు లో జన్మించినాడు. ఈయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. అయిన మామగారు సినిమాలో నటించిన క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈయన హాస్య నాటుడే కాక రాజకీయనాయకుడు కూడా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ జోడీ ఏ సినిమాలో నైనా నవ్వు తెప్పిస్తుంది. కోట శ్రీనివాసరావు కాలి తో బాబు మోహన్ వెనకవైపు తన్నే తీరు ఉంటుంది భలే నవ్వులు పూయిస్తుంది.

ఖమ్మం లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / blossomedboy

సుధాకర్

సుధాకర్

సుధాకర్ ప్రధాన నటుడిగాను, హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు. సుధాకర్ కర్నూలు జిల్లా బనగానపల్లె కు కేవలం 15 కి. మీ. దూరంలోని కోయిలకుంట్లలో పుట్టాడు. తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. సుధాకర్ ప్రముఖ నటుడు చిరంజీవి కి మంచి మిత్రుడు. చెన్నైలో నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచి వీరిద్దరి పరిచయం ఉంది. ఇతను పరుగో పరుగు, యాముడికి మొగుడు చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించాడు.

బనగానపల్లె మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / manakurnool

సునీల్

సునీల్

సునీల్ తెలుగు సినిమా లో హాస్యనటుడుగా, ప్రస్తుతం నటుడి గా కొనసాగుతున్నాడు. ఇతడు విజయవాడ నగరానికి 135 కి. మీ. దూరంలో, పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో జన్మించాడు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో స్వయంవరం చిత్రం ద్వారా తెలుగు చిత్రానికి పరిచయం అయినాడు. ఇందులో హీరో కి ఫ్రెండ్ గా యాక్ట్ చేసినాడు. ఇతను హీరోగా కూడా కొన్ని చిత్రాలలో మెప్పించినాడు. అందాలరాముడు, మర్యాదరామన్న చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. ప్రస్తుతం మరో సినిమాలో ప్రధాన కధానాయకుడుగా మెప్పించబోతున్నాడు.

విజయవాడ లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / MustSee IndianTemples

వేణుమాధవ్

వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ పట్టణంలో పుట్టాడు. కృష్ణ హీరోగా చేసిన సంప్రదాయం సినిమాతో వేణు తెరంగేట్రం చేసినాడు. చూడటానికి పొట్టిగా ఉన్న మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు ఉంది. ఈయన తొలిప్రేమ, దిల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు బోలెడంత సినిమాలలో కనిపించే వేణు ప్రస్తుతం అస్సలు కనిపించడమే మానేసాడు. ఇతను హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించినాడు. వాటిలో ప్రేమాభిషేకం(దీనికి నిర్మాతగా కూడా వ్యవహరించినాడు), హంగామా, భూకైలాష్ వంటి చిత్రాలు ఉన్నాయి.

నాగార్జున సాగర్ - శ్రీశైలం బోట్ ట్రిప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Sudhirnlg

గుండు హనుమంతరావు

గుండు హనుమంతరావు

చూడగానే నవ్వు తెప్పించే పర్సనాలిటి, టైమింగ్ తో నవ్వించే సంభాషణా చాతుర్యం, అద్భుతమైన హాస్య రస పోషణ వెరసి గుండు హనుమంతరావు. దాదాపు మూడు దశాబ్ధాలుగా ప్రేక్షకులకి హాస్యాన్ని పంచుతున్న ఈయన విజయవాడ లో జన్మించినాడు. ఈయన నటించిన మొదటి సినిమా అహ నా పెళ్ళంట . అందులో చెవిటి క్యారెక్టర్ చేసిన తీరు భలేగా నవ్వు తెప్పిస్తుంది. ఈయనకు టీవీ, రంగస్థల నటుడిగా మంచి అనుభవం కూడా ఉంది.

విజయవాడ చుట్టు ప్రక్కల ఇతర ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Adityamadhav83

కృష్ణ భగవాన్

కృష్ణ భగవాన్

కృష్ణ భగవాన్ ఒక ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు. ఈయన కృష్ణా జిల్లా లోని కైకలూరు గ్రామంలో జన్మించినాడు. ఈ గ్రామం విజయవాడ మహా నగరానికి 80 కి. మీ. దూరంలో , రాజమండ్రి పట్టణానికి 120 కి. మీ. దూరంలో ఉంది. ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో నెగేటివ్ రోల్ చేసినా, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో నిలదొక్కుకొని హాస్యనటుడిగా స్థిరపడిపోయాడు.

ఆంధ్ర ప్రదేశ్ లోని అద్భుత వింతల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Dan Cross

కొండవలస లక్ష్మణరావు

కొండవలస లక్ష్మణరావు

కొండవలస లక్ష్మణరావు తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ నగరానికి 115 కి. మీ. దూరంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా కొండవలస అనే పల్లెటూరు లో జన్మించినాడు. ఈయన మొదట నటించిన తెలుగు సినిమా వంశీ దర్శకత్వం లో వచ్చిన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు . ఈ చిత్రంలో ఆయన నటించిన పొట్టిరాజు క్యారెక్టర్ తీరు అందరికి నవ్వు తెప్పిస్తుంది. ఇప్పటివరకు ఆయన 200 చిత్రాలలో నటించినారు.

శ్రీకాకుళం లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Ravigopal Kesari

విజయ నరేశ్

విజయ నరేశ్

నరేశ్ తెలుగు చిత్ర రంగంలో మెరిసిన హాస్యనటుడు, నటుడు. ఈయన అనంతపురం జిల్లా ప్రస్తుతం బాలకృష్ణ ఏంఏల్ ఏ గా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పట్టణంలో జన్మించినాడు. ఈ పట్టణం నుంచి లేపాక్షి 13 కి. మీ. దూరంలో ఉన్నది. ఈయన తల్లి విజయనిర్మల ప్రముఖ తెలుగు దర్శకురాలు, నటీమణి. పండింటి కాపురం చిత్రం ద్వారా బాల నటుడుగా రంగా ప్రవేశం చేసినా, ప్రేమ సంకెళ్ళు చిత్రంలో హీరోగా నటించినా, నాలుగు స్థంబాలాట, శ్రీ వారికి ప్రేమలేఖ, హై హై నాయక, జంబలకడి పంబ వంటి హాస్య చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు.

బెంగళూరు - లేపాక్షి వన్ డే రోడ్ ట్రిప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / rajesh_dangi

మల్లికార్జునరావు

మల్లికార్జునరావు

మల్లికార్జునరావు తెలుగు సినిమా హాస్య నటుడు. లేడీస్ టైలర్ చిత్రంలో బట్టల సత్యం క్యారెక్టర్ ద్వారా అందరికి సుపరిచితమైన ఈయన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి పట్టణంలో జన్మించినాడు. రావుగోపాల్ రావు సహకారంతో చిత్ర సీమలో అడుగుపెట్టిన ఈయన 1972 లో వచ్చిన తులసి అనే చిత్రంలో చిన్న వేషం వేసినాడు. లేడీస్ టైలర్ చిత్రం మంచి గుర్తింపు తీసుకొనివచ్చింది. ఆతరువాత వెనక్కు తిరిగి చూసుకోకుండా, ఏప్రిల్‌ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు, హలో బ్రదర్‌, అలీబాబా అరడజను దొంగలు, బద్రి, ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు వంటి 350 చిత్రాలలో నటించినాడు.

విశాఖపట్టణం లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / Gautam Sanka

ఏవిఎస్

ఏవిఎస్

తెలుగు చలనచిత్ర సీమలో ఎ.వి.ఎస్ గా పిలువబడే అమంచి వెంకట సుబ్రమణ్యం గుంటూరు జిల్లా తెనాలి లో జన్మించాడు. ఈయన నటించిన మొదటి సినిమా దర్శకుడు బాపు తీసిన మిస్టర్ పెళ్ళాం. మొదటి సినిమా తోనే నంది ఆవార్డు కైవసం చేసుకొన్నాడు. సుమారు 500 చిత్రాలలో నటించిన ఏవిఎస్, దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా రాణించినాడు. ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది', శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా'వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

గుంటూరు లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / PP Yoonus

రాజేంద్ర ప్రసాద్

రాజేంద్ర ప్రసాద్

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఈయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడుగా కొనసాగుతున్న రాజేంద్ర ప్రసాద్ నిమ్మకూరు గ్రామంలో జన్మించినాడు. ఈ గ్రామం విజయవాడ నగరానికి 50 కి. మీ. దూరంలో ఉన్నది. ఈయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా మేడమ్. సంగీత దర్శకత్వం వహించిన సినిమా టోపీ రాజా స్వీటి రోజా.

ఆంధ్ర ప్రదేశ్ లో 30 ఫ్యామిలీ ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త రాజధాని అమరావతి లో గల ప్రధాన ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / nimmakuru

 సప్తగిరి

సప్తగిరి

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే కామెడీయన్ గా ప్రత్యేక గుర్తింపు సాధించిన సప్తగిరి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 40 కి. మీ. దూరంలో పుంగనూరు లో జన్మించినాడు. పరుగు చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఈ కామెడీయన్ ప్రేమ కథా చిత్రం సినిమాతో హాట్ టాపిక్ గా మారాడు. ఆ తరువాత వెనక్కు తిరిగి చూడకుండా తనదైన హాస్యం తో తెలుగు ప్రేక్షకులకు మారిత చేరువైనాడు. లవర్స్, బీరువా వంటి చిత్రాలలో తనదైన కొంటె చేష్టలతో అందరినీ నవ్వించాడు. ఇతను చిత్ర పరిశ్రమలో మినీ బ్రహ్మానందంగా పేరు తెచ్చుకున్నాడు.

చిత్తూర్ లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: filmybeat / wikipedia

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more