Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణభారతదేశంలోని చూడాల్సిన ఎంతో అందమైన ప్రదేశం మహాబలిపురం. మీరు చూసారా?

దక్షిణభారతదేశంలోని చూడాల్సిన ఎంతో అందమైన ప్రదేశం మహాబలిపురం. మీరు చూసారా?

By Venkatakarunasri

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో వున్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50కి.మీ ల దూరంలో వుంది.ఒకప్పుడు దాదాపు మామల్లపురంగా మహాబలిపురాన్ని పిలిచేవారు. 7 నుండి 10 వ శతాబ్ద కాలంలో పల్లవరాజుల కాలంలో పేరు మోసిన ఓడరేవు ఇది.

పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం ద్వారా దీనికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెప్పుకుంటూ వుంటారు.మాహా బలిపురం అంటేనే సముద్రతీరంలో వెలసిన దేవాలయానికి ప్రసిద్ధి. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను పిలిపించి స్వదేశీ కళాకారుల అండదండలతో సాగరతీరంలో ఈ వూరిలో అద్భుతమైన రాతి కట్టడాన్ని నిర్మించారు.

ఆనాటి రాజుల కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి అందరు శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు. వాటిలో ప్రధానమైనవి శ్రీకృష్ణుని రాయి. దీనినే కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తారు. దీనికి దాదాపు 1200 సంలు చరిత్రనే వుంది. దాదాపు 20 అడుగుల వెడల్పు అలాగే ఎత్తు,కేవలం 2 చదరపు గజాల స్థలంలో నిలిచి వుంటుంది.

పల్లవుల అద్భుత సృష్టి - మహాబలిపురం

మిస్టరీగా మారిన మహాబలిపురం

మిస్టరీగా మారిన మహాబలిపురం

దాదాపు 200 టన్నులు వున్న ఈ రాయి చెక్కుచెదరకుండా వుండటమే,ఇప్పటికీ మిస్టరీగా మారింది. ఈ రాయిని తొలిగించడానికి ఎంతో మంది ప్రయత్నించారు.కానీ ఎవరూ ఇంచు కూడా కదిలించలేకపోయారు.

రాయి మిస్టరీ

రాయి మిస్టరీ

1908 వ సంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్ధర్ ఆలీ అనే బ్రిటీష్ దొర ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదం అని తొలగించాలని ప్రయత్నించారు. దీని కోసం 7 ఏనుగులను తెప్పించి ఎత్తు నుంచి పల్లంలోకి పెద్దపెద్ద క్రేన్ల సహాయంతో ఆ రాయిని కదిలించటానికి చాలా ప్రయత్నాలే చేసారు.

 రాయి మిస్టరీ

రాయి మిస్టరీ

అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదిలించలేక నిరాశతో వెళ్ళిపోయారని చరిత్ర మనకి చెబుతుంది. ఇంత ప్రసిద్ధిగాంచిన ఆ రాయి ఆనాటి పల్లవుల రాజు నరసింహవర్మ ఇది ఆకాశదేవుని రాయని, దీన్ని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని పురాణ కధలలో చెబుతున్నారు.మరి కొందరు మాత్రం ఇది గుడి కోసం తెచ్చిన రాయని దాన్ని మధ్యలోనే వదిలేసారని భావిస్తున్నారు.

గ్రహాంతర వాసులు ఎగిరే పళ్ళాలు

గ్రహాంతర వాసులు ఎగిరే పళ్ళాలు

మరికొందరు ఆ రాయి గ్రహాంతర వాసులు ఎగిరే పళ్ళాలని చెబుతున్నారు.దాదాపు 250టన్నులు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యేపని కాదని అందుకే ఈ రాయి ఎలియన్స్ కు సంబంధించిందని చెబుతుంటారు.అచ్చం ఇలాంటి రాయిని పోలిన రాళ్ళు ప్రపంచంలో కొన్ని చోట్ల వున్నాయి.

ఆవుని మరియు పాలు త్రాగుతున్న దూడని చూడవచ్చు

ఆవుని మరియు పాలు త్రాగుతున్న దూడని చూడవచ్చు

అవి ఎలియన్స్ తిరుగుతున్నారని వూహాగానాలు వెలువరే ప్రదేశాలనీ మెక్సికన్ నగరం అలాగే పెరూ నగరంలో ఇలాటి రాళ్ళే వున్నాయి. ఇక ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే ఇంతటి టెక్నాలజీని వాడారా? అనే ఆశ్చర్యం కలిగిస్తుంది.ఒకే చిత్రంలో ఆవుని మరియు పాలు త్రాగుతున్న దూడని చూడవచ్చును.

రాకెట్

రాకెట్

అదే చిత్రంలో ఏనుగుని పాలు త్రాగుతున్న పిల్లఏనుగుని చూడవచ్చు. అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారనటానికి ఇక్కడ వున్న శిలాశిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్షపరిశోధన చేసారనటానికి చాలా ఆధారాలు కనపడతాయి.

రాకెట్

రాకెట్

ఆ ఆలయంలోని వినాయకుడు విగ్రహం పైన రాకెట్ లాంచ్ వెహికల్ కనిపిస్తుంది.దాంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక శిల్పాలు కూడా కనిపిస్తాయి.ఇవన్ని శిల్పాలు రాకెట్ లాంచి చేస్తున్నట్టే కనిపిస్తాయి.

బావి

బావి

ఇక్కడున్న మరో టెక్నాలజీ చిత్రం బావి. ఆ కాలంలో కొలతలు కూడా లేవు.అలాటిది ఎంతో ఖచ్చితత్వంతో ఆ బావిని తయారుచేసారు. అప్పట్లోనే టెక్నాలజీని వాడారు అనటానికి ఇదొక గొప్ప ఉదాగా మిగిలింది.

శూలం

శూలం

ఇదే కాకుండా ఆలయ గోపురం పైనున్న శూలాన్ని చూస్తే మనకి టెక్నాలజీ గుర్తుకు వస్తుంది.ఈ శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద రెండు కొమ్ములు అలాగే హెల్మెట్ ధరించినట్లు మనకి కనపడుతుంది.

రోదసిలోకి వెళుతున్న వ్యోమగాములు

రోదసిలోకి వెళుతున్న వ్యోమగాములు

ఆ శూలాన్ని పరీక్షించినట్లయితే అచ్చం శాటిలైట్ స్థంభం లాగానే కనపడుతుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోకి వెళుతున్న వ్యోమగాముల లాగా మనకు అనిపిస్తుంది. అంతేగాక విమానగోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి.

గాలి చొరబడని గర్భగుడి

గాలి చొరబడని గర్భగుడి

ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా దాన్ని నిర్మించారు.

గాలి చొరబడని గర్భగుడి

గాలి చొరబడని గర్భగుడి

శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ఆ ద్వారాలను కట్టారని అనిపిస్తుంది.ఎక్కడా కిటికీలు,తలుపులు కూడా కనపడవు.అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ ని తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారని తెలుస్తుంది.

లైట్ హౌస్

లైట్ హౌస్

ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ దేవాలయం ఎంతో విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడున్న లైట్ హౌస్ దాదాపు 1000యేళ్ళ క్రితంగా భావిస్తారు.

మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారిచూపించటానికి ఈ లైట్ హౌస్ ఏర్పాటుచేసారని ప్రసిద్ధిగాంచినది.

 లైట్ హౌస్

లైట్ హౌస్

పురాతనకాలంలోనే మన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అయ్యిందని చెప్పటానికి ఈ దేవాలయమే ఒక చక్కటి వుదాహరణ.అణువణువూ టెక్నాలజీని నింపుకుని పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గుడిని ఒక్కసారైనా మీరు దర్శించాల్సిందే.

ఇక్కడ బీచ్ కూడా వుంది

ఇక్కడ బీచ్ కూడా వుంది

మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. మరియు బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. కనుక సముద్ర స్నానం ప్రమాధకరము. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది.

 వసతి సౌకర్యాలు

వసతి సౌకర్యాలు

ఇక్కడ భోజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.

మహాబలిపురం వాతావరణం

మహాబలిపురం వాతావరణం

సమీపంలో సముద్రం వుండటం చే ఇక్కడ వాతావరణం సముద్రపు గాలులతో వేడిగాను మరియు తేమతో కూడిన చల్లదనంతోను వుంటుంది.

 మహాబలి పురం ఎలా చేరాలి ?

మహాబలి పురం ఎలా చేరాలి ?

ఈ పట్టణం సమీప పట్టణాల నుండి తరచుగా బస్సులతో కలుపబడి వుంది. స్థానికులతో మాట్లాడటం ఏమంత కష్టం కాదు. ఇక్కడ తమిళం తోపాటు వీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు.

రూట్

రూట్

మీరు హైదరాబాద్ నుండి వెళ్ళినట్లయితే 12 గంటలు పడుతుంది. మీరు ఈ మార్గమధ్యంలో విజయవాడ కనకదుర్గమ్మను అలాగే నెల్లూరు కామాక్షమ్మను మరియు తిరుపతి బాలాజీని, చెన్నై లో గల వివిధ ప్రదేశాలు కూడా మార్గమధ్యంలో చూడవచ్చును

క్రొకోడైల్ బ్యాంకు

క్రొకోడైల్ బ్యాంకు

క్రొకోడైల్ బ్యాంకు అనబడే పర్యాటక ఆకర్షణ మహాబలిపురానికి 14 కి. మీ.ల దూరంలో వుంటుంది. ఇక్కడ వివిధ రకాల మొసళ్ళు,పాములు వుంటాయి. దీనిని 1976 లో హీర్పతోలోగిస్ట్ రోములస్ వ్హితకేర్ ఏర్పరచారు. దీని ధ్యేయం దీనిలో ఇండియన్ మరియు ఆఫ్రికన్ మొసళ్ళను వృద్ధి చేయటమే.

అయిదు రథాలు

అయిదు రథాలు

అయిదు రథాలు లేదా స్థానిక భాషలో పంచ రథాలు అని చెప్పబడే ఈ నిర్మాణం ఏక శీలా శిల్పశైలి కి అద్దం పడుతుంది. తీర సముద్ర టెంపుల్ వలెనె, పంచ రథాలు కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. రాజు మహేంద్రవర్మ - 1 మరియు అతని వారసుడు నరసింహ వర్మన్ -1 పాలనలలో నిర్మించబడిన ఈ నిర్మాణ రహస్యం చరిత్రకారులకు ఇంతవరకు అంతు పట్టడం లేదు.

అర్జునుడి తప్పస్సు ప్రదేశం

అర్జునుడి తప్పస్సు ప్రదేశం

అర్జునుడి తపస్సు అనేది అతిపెద్ద బహిరంగ ఏకశిల. దీనిని 7 వ శతాబ్దం మధ్య భాగంలో నిర్మించారు. సుమారు 43 అడుగుల ఎత్తులో వుంటుంది. దీనినే దిగివచ్చిన గంగ అనికూడా అంటారు. కొంతమంది ఇది అర్జున పేరుపై నిర్మాణం జరిగిందని అనగా మరికొందరు రాజు భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి పరచేందుకు ఇక్కడ గంగను స్వర్గం నుండి నేల మీదకు తీసుకు రావటానికి ఇక్కడ తపస్సు చేసాడని చెపుతారు.

టైగర్ కేవ్స్

టైగర్ కేవ్స్

టైగర్ కేవ్స్ అనేది ఒక హిందూ టెంపుల్. దీనిని కొండను తొలచి నిర్మించారు. ఇది మహాబలిపురంలో సలువాన్ కుప్పం అనే ప్రదేశంలో వుంది. ఇక్కడ మలచిన టైగర్ తలలు టెంపుల్ ప్రవేశ భాగంలో వుంటాయి కనుక దీనికి ఈపేరు వచ్చింది. దీనిని పల్లవ రాజులు 8 వ శతాబ్దం లో నిర్మించినట్లు చెపుతారు. ఇదిఒకప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఈ టెంపుల్ కాంప్లెక్స్ ను అర్కేయోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X