» »నరకాసురుడు కట్టించిన దేవాలయం మన భారతదేశంలో ఎక్కడ వుందో మీకు తెలుసా?

నరకాసురుడు కట్టించిన దేవాలయం మన భారతదేశంలో ఎక్కడ వుందో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించి భూదేవి సంతోషిస్తుంది. ఆ బిడ్డను (నరకాసురుడిని) జనకమహారాజుకు అప్పజెప్పి విద్యాబుద్ధులు నేర్పించమని అడుగుతుంది. జనకమహారాజు వద్ద పెరిగి పెద్దయిన నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురం (ప్రస్తుత అస్సాంలోని గువహతి ప్రాంతం) అనే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. కామాఖ్య దేవతకు గొప్ప భక్తుడైన నరకుడు, అమ్మవారికి ఒక గుడిని కట్టిస్తాడు. అదే ప్రస్తుత గువహతి లోని కామాఖ్య దేవాలయం. ఇండియాలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఇది పురాతనమైనది. కామాఖ్య దేవాలయం మరిన్ని విశేషాలు ...

నరకాసురుడు వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి, భూదేవి ల కుమారుడు. నిర్దిష్టకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని భూదేవికి చెప్తాడు విష్ణుమూర్తి. అందుకు చింతించిన భూదేవి, ఎప్పటికైనా తన కుమారుని విష్ణుమూర్తే సంహరిస్తాడని అనుకొని, భూదేవి తన బిడ్డకు ప్రాణ రక్షణ కలిగించమని వరం కోరుకుంటుంది. అందుకే సరే అన్న విషుమూర్తి, తన తల్లి చేతులలోనే ఇతనికి మరణము ఉంటుందని హెచ్చరించి వెళ్ళిపోతాడు.

ఎక్కడ ఉంది ?

ఎక్కడ ఉంది ?

కామాఖ్య దేవాలయం, గువహతి (గౌహతి) నగరానికి పశ్చిమ భాగంలో నాలాచల్ కొండల యందు ఉన్నది. ఇది అనేక దేవాలయాలు కలిగిన ప్రత్యేక దేవాలయం.

చిత్రకృప : Deeporaj

ఏ ప్రాంతం నుంచైనా

ఏ ప్రాంతం నుంచైనా

గౌహతి చేరుకోవటానికి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు, రైళ్లు మరియు బస్సులు వస్తుంటాయి. నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా కామాఖ్య దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చు. క్యాబ్, టాక్సీ లేదా ఆటో రిక్షాలు, సిటీ బస్సులు మొదలైన రవాణా సాధనాలను ఉపయోగించి గుడి వద్దకు చేరుకోవచ్చు.

చిత్రకృప : Kamalakshidevi1

కామాఖ్య దేవాలయం

కామాఖ్య దేవాలయం

కామాఖ్య దేవాలయం లో పది ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. అ దేవాలయాలు వరుసగా : కాళీ, తార, సోదశీ, భువనేశ్వరి, భైరవి, చిన్న మస్తా, ధుమవతి, బగళాముఖీ, మాతంగి మరియు కమల దేవాలయాలు.

చిత్రకృప : Kunal Dalui

యాత్రా స్థలం

యాత్రా స్థలం

సాధారణ హిందూ భక్తులకు మరియు తాంత్రిక భక్తులకు ఇదొక ముఖ్యమైన యాత్రా స్థలం. కాళికా పురాణం ప్రకారం కామాఖ్య భక్తుల కోరికలను తీర్చేదిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించేదిగా వర్ణించారు.

చిత్రకృప : Subhashish Panigrahi

యోని భాగం

యోని భాగం

కాళికా పురాణం ప్రకారం, ఈ ఆలయం శివుని కోసం సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తుంది. అంతేకాదు శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆమె యోని భాగం పడిపోయిన స్థలం కూడా.

చిత్రకృప : Raymond Bucko, SJ

మార్పులు, చేర్పులు

మార్పులు, చేర్పులు

నరకాసురుడు కామాఖ్య అమ్మవారికి ఆలయాన్ని కట్టించి, పూజలు చేసేవాడు. అతని మరణానంతరం (సత్యభామ నరకాసురుడుని చంపుతుంది) ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని మరలా క్రీ.శ 8- 17 వ మధ్యకాలంలో అనేకసార్లు పునర్నిర్మించబడినది.

చిత్రకృప : Gitartha Bordoloi

ఉమానందుడు

ఉమానందుడు

కామాఖ్య ఆలయంలో శివుడిని 'ఉమానందుడు' అని పిలుస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేసుకొనే వీలుంటుంది. జంతుబలులు ఇక్కడ సర్వ సాధారణం.

చిత్రకృప : Deeporaj

మగ జంతువులు

మగ జంతువులు

అమ్మవారికి నల్లరంగు అంటే మహా ఇష్టం. అందుకే అన్ని నల్ల రంగు జంతువులనే కోతి, మేక, పావురం, గాడిద లాంటివి బలిగా ఇస్తారు. ఇది ఇక్కడి ఆచారం. అదికూడా మగ జంతువులనే బలిగా ఇస్తారు.

చిత్రకృప : chandrashekharbasumatary

బహిష్టు అయ్యే అమ్మవారు

బహిష్టు అయ్యే అమ్మవారు

అమ్మవారు ప్రతిఏటా జూన్ రెండవ వారంలో బహిష్టు అవుతుంది. ఆ సమయంలో గుడిని నాలుగు రోజులు మూసేస్తారు. అయిదవ రోజు స్నానం తర్వాత దేవాలయాన్ని తెరిచి భక్తులకు దర్శనం కలిగిస్తారు. అస్సామీ భాషలో దీనిని 'అంబుబాచి' అని పిలుస్తారు. ఆ సమయంలో జరిగే వేడుకలను 'అంబుబాచి మేళా' గా జరుపుకుంటారు.

చిత్రకృప : Vikramjit Kakati

గుడిలో

గుడిలో

అద్భుతమైన శిల్ప శ్రేణులు, వెలుపలివైపు వినాయకుడు మరియు దేవుళ్ళు, దేవతల చిత్రాలు మరియు మూడు పెద్ద మండపాలను కలిగి ఉంది ఈ దేవాలయం.

చిత్రకృప : carol mitchell

పవిత్రస్థలం

పవిత్రస్థలం

గుడిలోని మధ్య మండపం పవిత్రస్థలం గా భక్తులను అలరిస్తుంది. సహజంగా ఏర్పడిన నీటిబుగ్గలోని నీరు యోని ఆకారంలో గల గండశిల పగులలోంచి ప్రవహిస్తూ ఉంటుంది. అంబువాసి వేడుకల సందర్బంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో గర్భగుడిలోంచి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సయిడ్ వలె రుతుస్రావం వలె కనిపిస్తుంది.

చిత్రకృప : Devi bhakta