» »ఛలో లంబసింగి ... ఎంజాయ్ స్నో ఫాల్ !!

ఛలో లంబసింగి ... ఎంజాయ్ స్నో ఫాల్ !!

Written By:

తూర్పుకనుమలలో అతి చల్లని ప్రదేశం 'లంబసింగి'. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ జిల్లా మన్యం ఏరియా కిందకు వస్తుంది. మన్యం లోని చింతపల్లి మండలంలో 'లంబసింగి' అనే గ్రామము కలదు. దీనినే పర్యాటక ప్రియులు ముద్దుగా 'కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్' గా లేదా 'ఆంధ్రా ఊటీ' గా పిలుస్తారు. ఈ గ్రామానికే 'కొర్రబొయలు' అనే పేరుకూడా ఉంది.

వింటర్ సీజన్ లో వహ్వా అనిపించే అరకు లోయ అందాలు !!

సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగి ఒక గిరిజన గ్రామము. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి దీనికి. ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 0 డిగ్రీలు లేదా అంతకంటే అంతకంటే తక్కువగా నమోదైతాయి. మిగితా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదైతాయి.

కాశ్మీరాన్ని తలపించే లోయలు

కాశ్మీరాన్ని తలపించే లోయలు

ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు, కాశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. మన్యం ఏరియాలో ఉంది కనుక కొండలు, అడవులు దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇరువైపులా లోయలు ... మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిత్రకృప : Bdmshiva

చక్కటి అనుభూతి

చక్కటి అనుభూతి

ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు, కాశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. మన్యం ఏరియాలో ఉంది కనుక కొండలు, అడవులు దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇరువైపులా లోయలు ... మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిత్రకృప : oneindia telugu

జాగ్రత్త

జాగ్రత్త

ఎంతో అలసటతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు .... లంబసింగి వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా మైమరిచిపోతారు. అంతవరకు పడ్డ శ్రమకు న్యాయం చేకూరిందని భావిస్తారు.

లంబసింగి లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఉదయం 10 అయినా ఇంకా ఇప్పుడే తెల్లారిందా ?? అన్నట్లు మంచుతెరలు కమ్ముకొని ఉంటాయి. ఉదయం పూట కూడా లైట్ వేసుకొని కారు నడపాల్సివస్తుంది ఇక్కడ. ఏదైతేనేం పర్యాటకులు రాత్రి కంటే ఉదయమే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.

చిత్రకృప : Bdmshiva

అందాలను చూసి కొత్త ఉత్సాహం

అందాలను చూసి కొత్త ఉత్సాహం

ఎన్నో మలుపులు తిరుగుతూ సాగే లంబసింగి ప్రయాణం రసవత్తరంగా ఉంటుంది. కాఫీ తోటలు, పసుపు రంగులో కనిపించే వలిసెపూల తోటలు, తాజంగి రిజర్వాయర్, వాతావరణం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

చిత్రకృప : Bdmshiva

దక్షిణ భారతదేశంలో

దక్షిణ భారతదేశంలో

దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా శీతాకాలంలో లంబసింగి లో మంచు వర్షం కురుస్తుంది. రెగ్యులర్ గా ఉదయం 6 అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకు దర్శనం ఇస్తాడు. వేసవిలో మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు. లంబసింగిలో ప్రతిరోజూ 3 pm కు సూర్యుడు సన్నబడిపోతాడు. సాయంత్రం 5-6 అయ్యేసరిగి చలి ప్రారంభమవుతుంది.

చిత్రకృప : oneindia telugu

యాపిల్ సాగు

యాపిల్ సాగు

కాఫీ తోటల పెంపకం బ్రిటీష్ వారి కాలం నుండే ఉంది. ఇక్కడి కాఫీ గింజలను, మిరియాలను అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అమెరికాలోని ఫ్లోరిడా తరహా వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో యాపిల్ సాగు చేయాలన్న ఆలోచన పరిశీలనలో ఉన్నది.

చిత్రకృప : oneindia telugu

చూడదగ్గవి

చూడదగ్గవి

తాజంగి రిజర్వాయర్ వద్ద పర్యాటక శాఖ తాజాగా బోట్ షికారును ఏర్పాటుచేశారు. చక్కటి అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడకొండమ్మ దేవాలయం వద్ద మొన్నీమధ్య ఒక జలపాతం కూడా కనిపించింది. దేవాలయం వద్ద కనిపించింది కాబట్టి 'బోడకొండమ్మ జలపాతం' అని పేరు పెట్టారు. అలాగే 40 కి. మీ ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్, 75 కి. మీ ల దూరంలో ధారకొండ వాటర్ ఫాల్స్ చూడదగ్గవి.

చిత్రకృప : Abhishek SingerVerma

వసతి

వసతి

లంబసింగి గ్రామము ను ఒక టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో వసతి సౌకర్యాలను ఇప్పుడిప్పుడే ఏర్పాటుచేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రిసార్ట్ ను (హరిత రిసార్ట్ మాదిరిది) ప్రారంభిస్తోంది.

వసతి సౌకర్యాలు ప్రస్తుతం పర్యాటకులకు నర్సీపట్నం లో అందుబాటులో ఉన్నాయి. లంబసింగి - నర్సీపట్నం మధ్య దూరం 30 కిలోమీటర్లు.

టూర్ ప్యాకేజీ లు

టూర్ ప్యాకేజీ లు

వైజాగ్ నుండి లంబసింగి ఓవర్ నైట్ ట్రిప్ - రూ. 4300 - 2 రోజులు
లంబసింగి వన్ నైట్ స్టే అండ్ సైట్ సీఇంగ్ - రూ. 2600 - 2 రోజులు
లంబసింగి & కొత్తపల్లి వాటర్ ఫాల్స్ టూర్ - రూ. 5900 - 12 గంటలు
వైజాగ్ నుండి లంబసింగి వన్ నైట్ ట్రెక్కింగ్ - రూ. 6900 - 2 రోజులు
లంబసింగి & అరకు వ్యాలీ - రూ. 7990 - 2 రాత్రులు/ 3 రోజులు

చిత్రకృప : oneindi telugu

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

లంబసింగి కి చేరువలో వైజాగ్ ఎయిర్ పోర్ట్ (106 KM), వైజాగ్ రైల్వే స్టేషన్ (114 KM), నర్సీపట్నం రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ప్రభుత్వ బస్సులలో వచ్చేవారు నర్సీపట్నం, వైజాగ్, చింతపల్లి (19 KM) తదితర ప్రాంతాల నుంచి బస్సులలో రావొచ్చు.

చిత్రకృప : Adityamadhav83

Please Wait while comments are loading...