Search
  • Follow NativePlanet
Share
» »ఈ నాగద్వార్ యాత్రకి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటం !

ఈ నాగద్వార్ యాత్రకి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటం !

నాగ్ ద్వార్ యాత్ర ఇక్కడకు వెళ్ళటం అంత సులభంకాదు. ప్రతిఒక్కరికీ అక్కడికి వెళ్ళటం అంటే సాధ్యం కూడా కాదు. కేవలం 10రోజులు మాత్రమే ఈ యాత్రకి అనుమతి వుంటుంది.

By Venkatakarunasri

నాగ్ ద్వార్ యాత్ర ఇక్కడకు వెళ్ళటం అంత సులభంకాదు.

ప్రతిఒక్కరికీ అక్కడికి వెళ్ళటం అంటే సాధ్యం కూడా కాదు.

కేవలం 10రోజులు మాత్రమే ఈ యాత్రకి అనుమతి వుంటుంది.

అడుగుఅడుగునా మృత్యువు పొంచి వుంటుంది.

నాల్గుదిక్కులా దట్టమైన అడవి,పర్వతాలు,లోయలు జలపాతాలతో ఎంతో అందంగా అంటే భయంగా కూడా అనిపిస్తుంది.

మధ్య ప్రదేశ్ ఒక సుప్రసిద్ధ పర్యావరణ పర్యాటక కేంద్రం.మధ్య ప్రదేశ్ లోని ఆహారం, పండుగలు పబ్బాలుమధ్య ప్రదేశ్ లోని విభిన్న వంటకాలు మధ్య ప్రదేశ్ పర్యాటకానికి కీలకమైన భాగం. ఆహారంలో ప్రధానం గా రాజస్థానీ, గుజరాతీ వంటకాలు వుంటాయి. సీఖ్, షాహీ కబాబ్ లాంటి రాచరికపు వంటకాలు రాజధాని భోపాల్ ప్రసిద్ది. జిలేబీ, జీడిపప్పు బర్ఫీ లైతే మధ్య ప్రదేశ్ లోని అన్ని నగరాల్లో ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరుకుతాయి. అయితే రాష్ట్రంలోని వివిధ భాగాలలో ఆహారపు అలవాట్లలో తేడా వుంది. ఖజురహో లోని ఖజురహో నృత్యోత్సవం, గ్వాలియర్ లో జరిగే తాన్సేన్ సంగీత ఉత్సవం ప్రపంచ ప్రసిద్ది పొందాయి. మడాయి పండుగ, భాగోరియా పండుగ గిరిజన తెగలు జరుపుకునే సుప్రసిద్ధ గిరిజన పండుగలు.

ఈ నాగద్వార్ యాత్రకి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటం

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

ఇది ఎక్కడ వుందంటే భోపాల్ లోని పచ్మర్హి అనే ప్రాంతంలో.

ఇక్కడ వున్న శివాలయం ప్రత్యేకత

ఇక్కడ వున్న శివాలయం ప్రత్యేకత

ఇక్కడవున్న అత్యంత ప్రాచీనశివాలయాన్ని ఎంతో ప్రత్యేకంగా,పవిత్రంగా భావిస్తారు. ఇక ఇది శ్రావణమాసంలో మాత్రమే అనుమతిని ఇస్తారు.

10లక్షల మంది

10లక్షల మంది

ఈ 10రోజుల్లోనే దాదాపు 10లక్షల మంది ఈ నాగ్ ద్వార్ యాత్రఅనేది చేస్తారు. ఇక్కడ 10రోజుల తర్వాత ఎంతో విషపూరితమైన సర్పాలు, క్రూరమృగాలు తిరుగుతాయి.

ప్రవేశం

ప్రవేశం

ఇక ఆ ప్రాంతంలోకి ప్రవేశించాలంటే మానవమాతృలు ఎవరూ అంత సాహసాన్ని చేయరు.ఇది భోపాల్ నుండి 200కి.మీ ల దూరంలో వుంటుంది.

గుహ

గుహ

దట్టమైన అడవిలోని గుహలో శివుడియొక్క రూపాన్ని దర్శించటానికి భక్తులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ఇక్కడకు చేరుకుంటారు.

మందిర ప్రవేశం ఎప్పుడు చేయాలి?

మందిర ప్రవేశం ఎప్పుడు చేయాలి?

ఈ మందిర్ అనేది జూలై 18నుండి జూలై 28మధ్య మాత్రమే భక్తుల ప్రవేశానికి అనుమతి వుంటుంది.

దట్టమైన అడవి

దట్టమైన అడవి

సంవత్సరం పొడవునా అనుమతిలేని దట్టమైన అడవిలో వున్న ఈ ప్రాంతానికి వెళ్ళేదారిలో అనేక విషసర్పాలు, తేళ్ళవంటివి సందర్శకులకు దర్శనం ఇస్తాయి.

అనేక రకాల ఔషదమొక్కలు

అనేక రకాల ఔషదమొక్కలు

ఇక ఈ యాత్రలో ఎంతో ఎత్తు నుండి జాలువారే జలపాతాలు, అనేక రకాల ఔషదమొక్కలు మరోప్రక్క ఒక్కోఅడుగు ఎంతో జాగ్రత్తగావేస్తూ నడవాలి.

అటు,ఇటు అయితే ఇక అంతే!

అటు,ఇటు అయితే ఇక అంతే!

కొంచెం అటు,ఇటు అయినా అంతెత్తునుండి కొండలపై నుండి లోయల్లోకి పడిపోవలసిందే.

అడ్వెంచర్

అడ్వెంచర్

ఇక పారుతున్న నీటిలో నుండి దాటుకుంటూ వెళ్ళటం అనేది నిజంగా అడ్వెంచర్.మరి ట్రెక్కింగ్ ని,అడ్వెంచర్స్ ని కోరుకునేవారికి ఈ యాత్ర ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది.

18గంటలకంటే ఎక్కువ సమయం

18గంటలకంటే ఎక్కువ సమయం

దట్టమైన అడవిలో 20కి.మీ లు నడవాలి.ఇది నడవటానికి దాదాపు 18గంటలకంటే ఎక్కువ సమయమే పడుతుంది.

దేశవిదేశాల నుండి పర్యాటకులు

దేశవిదేశాల నుండి పర్యాటకులు

ఎందుకంటే రాళ్ళురప్పలు, కొండలు, లోయలతో అత్యంత దుర్లభంగా వుంటుంది. ఇక్కడ చుట్టుప్రక్కలప్రాంతాలు కాకుండా దీని గురించి ఇలాంటి అడ్వెంచర్స్ నుఇష్టపడే వాళ్ళు దేశవిదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తారు.

కుల దైవం

కుల దైవం

నాగ్ పూర్ మొదలైన ప్రాంతాలవారికి విదర్భనాగదేవత వారి యొక్క కుల దైవం.అంతే కాకుండా భూమండలం అనేది శేషనాగు తలపై వుందని వారు నమ్ముతారు.

ప్రాముఖ్యత

ప్రాముఖ్యత

అందుకే వారు ఈ ప్రాంతానికి అంతప్రాముఖ్యతని ఇస్తారు.ఇక్కడ శివుడి యొక్క సన్నిధిలో మహాయజ్ఞాన్ని జరిపించి ఆ భస్మాన్ని తమవెంట తీస్కెళ్ళి పొలాలలో చల్లుతారు.

నమ్మకం

నమ్మకం

ఆ విధంగా చేస్తే పాములనేవి రావని, హానిని కల్గించవని వారియొక్క నమ్మకం. అలాగే ఈ ప్రాంతంనుండి నాగలోకానికి దారివుందనేది కూడా వారియొక్క విశ్వాసం.

రోగాలను హరించే జలపాతంలోని నీరు

రోగాలను హరించే జలపాతంలోని నీరు

ఇక ఇక్కడ జాలువారే జలపాతంలోని నీటిని సేవిస్తే సంవత్సరంఅంతా అనారోగ్యానికి గురి కాకుండా వుంటారని వారియొక్క నమ్మకం.

కోరికలు తప్పకుండా నెరవేర్చే నాగద్వార్

కోరికలు తప్పకుండా నెరవేర్చే నాగద్వార్

మరి నాగ్ ద్వార్ లోని శివుడ్ని మన్నద్వాలబాబా అని అంటారు. మరి ఇక్కడకి వచ్చి కోరుకున్న వారికి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులయొక్క నమ్మకం.

 కొండలు,లోయలు, జలపాతాలు

కొండలు,లోయలు, జలపాతాలు

అందుకే కొండప్రాంతాల నుండి నడుచుకుంటూ ఈ ప్రాంతానికి వస్తూవుంటారు. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే 18గంటలపాటు నడిచే అత్యంత కష్టమైన,దుర్లభమైన కొండలు,లోయలు, జలపాతాలు దాటుతూ వెళ్ళాలి.

10రోజుల పాటు

10రోజుల పాటు

మరి అన్నికష్టాలకు ఓర్చి కూడా భక్తులు అక్కడికి వెళ్తూ వుంటారు.మరి ఆ ప్రాంతంలో స్థానికులు 10రోజుల పాటు తాత్కాలికంగా షాపులను కొన్ని ఏర్పాటుచేస్తారు.

ఇక్కడ చూడదగిన సమీపంలోని ప్రదేశాలు

ఇక్కడ చూడదగిన సమీపంలోని ప్రదేశాలు

అశోక పిల్లర్, సాంచి

సాంచి వద్ద ఉన్న అశోక పిల్లర్ రాష్ట్రంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందింది. పిల్లర్ ఒక కడ్డీ మరియు నాలుగు సింహాల ఒక కిరీటంతో ఉంటుంది. ఈ సింహాలు వెనుకకు తిరిగి నిలబడటానికి ఈ స్తంభంను 3 వ శతాబ్దం BC లో ఏర్పాటు చేయబడింది.

నీమచ్

నీమచ్

నవతోరణ్ దేవాలయం, నీమచ్

ఈ ఆలయ కేంద్రంలో ఉన్న వరాహ విగ్రహం దీనియొక్క గొప్ప ఆకర్షణ. ఈ నవ తోరణ్ ఆలయ అద్భుతమైన అలంకరణ ఆకులు, హారము కలిగి, మకర తలలు మొదలైన ఆకారంలో కలిగి ఉన్నది. పర్యాటకులు నీమచ్ లో ఉన్న ప్రముఖ ఆలయాన్ని దర్శించటంలో అద్భుతమైన ఆనందాన్ని చవి చూస్తారు. విక్రమ్ సిమెంట్ క్యాంపస్ ఖోర్ గ్రామానికి ముఖ్యమైన మైలురాయి వంటిది.

 ఖజురహో

ఖజురహో

దుల్హదేవ్ దేవాలయం, ఖజురహో

ఖజురహో దక్షిణ దేవాలయాలలో, దుల్హదేవ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనిని 1130లో చందేలాస్ నిర్మించారు మరియు ఇప్పటికి వారియొక్క కళ మరియు నిర్మాణాత్మకత ప్రతిబింబిస్తున్నాయి. ఆలయంలో ఐదు చిన్న గదులు మరియు ఒక సంవృత మందిరం ఉన్నాయి. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆకర్షించే విధంగా శివుడు మరియు పార్వతి చిత్తరువులతో అలంకరించబడి ఉన్నది. విగ్రహాల ముగింపు ఆ సమయంలోని కళాకారుని ప్రతిభను తెలియచేస్తున్నది. ఈ ఆలయం లోపల ఒక అందమైన శివలింగం ఉన్నది.

తులసి మ్యూజియం, సాట్నా

తులసి మ్యూజియం, సాట్నా

తులసి మ్యూజియ౦, ఒక పురావస్తు సంగ్రహాలయం, ఇది సాట్నా పర్యాటక రంగంలో గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మ్యూజియం రామ్వన్ అనే ఆసక్తిని కలిగించే ప్రదేశంలో సాట్నా నుండి 16 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది, ఈ మ్యూజియం 1977 వ సంవత్సరంలో ఏర్పాటుచేయబడింది.

వన్ విహార్, భోపాల్

వన్ విహార్, భోపాల్

భోపాల్ లోని వన్ విహార్ జాతీయ పార్కు నగరానికి మధ్యలో కుడివైపున ఉంది. ఈ పార్కుని 445 హెక్టార్ల భూమిలో నిర్మించారు, కొండపై నిలబడి నగరం మొత్తాన్నీ చూడవచ్చు. ఈ ప్రాంతం పర్యాటకులలో ప్రసిద్ది చెందింది, ప్రతి నేలా ఈ ప్రాంతాన్ని వేలమంది సందర్శిస్తారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

1. హైదరాబాద్ నుండి నిజామాబాద్, నాగపూర్ మీదుగా 14గంటలు పడుతుంది.

2. అదే విధంగా హైదరాబాద్ నుండి కరీంనగర్, చంద్రాపూర్ మీదుగా 17గంటలు పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X