Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ఎప్పుడు ట్రెక్కింగ్ వెలుతారో తెలుసా?

ఇక్కడ ఎప్పుడు ట్రెక్కింగ్ వెలుతారో తెలుసా?

కేరళలోని జాతీయ అభయారణ్యాల్లో పేరియార్ నేషనల్ పార్క్ ఒకటి.

రాత్రిపూట ట్రెక్కింగ్ వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి. సాధారణంగా పగటిపూట ట్రెక్కింగ్ వెళ్లడంతో పోలిస్తే రాత్రి పూట ట్రెక్కింగ్ కొంత థ్రిల్‌గా అనిపించడం సాధారణమే. ఇటువంటి రాత్రిపూట ట్రెక్కింగ్‌కు అనుకూలమైన ప్రాంతాలను మనం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అటువంటి వాటిలో పెరియార్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంక్జురీ ముందువరుసలో ఉంటుంది. ఆ నేషనల్ పార్క్ సంబంధించిన వివరాలు మీ కోసం...

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

P.C: You Tube

దశాబ్దాల కాలంగా పెరియార్ నేషనల్ పార్క్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ప్రక`తితో మమేకం కావాలనుకొనేవారికి ఇది మొదటి ఛాయిస్. ఇక్కడ వందల సంఖ్యలో మొక్కలు, వ`క్షజాతులతో పాటు వివిధ రకాల జంతు, పక్షిజాతులు ఉన్నాయి. దీంతో ఎక్కువగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

P.C: You Tube

ఇక్కడ నైట్ ట్రెక్కింగ్‌కు అనుమతి ఉంది. నైట్ ట్రెక్కింగ్‌కు మీతో పాటు స్థానిక గిరిజనులు మీకు గైడ్‌గా సహరిస్తారు. ప్రక`తితో చంద్రుని వెలుగులో అలా ముందుకు సాగిపోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

P.C: You Tube

ఈ ట్రెక్కింగ్ సుమారు మూడు గంటల పాటు సాగుతుంది. రాత్రి ఏడు గంటలతో పాటు తెల్లవారు జాము నాలుగు గంటలు అంటే 24 గంటల్లో రెండుసార్లు ఈ ట్రెక్కింగ్ అందుబాటులో ఉంటుంది. రాత్రి ట్రెక్కింగ్ వల్ల శారీరక అలసట కొంత తక్కువగా ఉంటుందని చెబుతారు. అయితే ఇందుకు కొంత ధైర్యం కూడా ఉండాలి.

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

P.C: You Tube

రాత్రి సమయంలో మీ ట్రెక్కింగ్ మార్గంలో కొన్ని జంతువులు అడ్డురావచ్చు. అయితే అటువంటి సమయంలో ఎలా ప్రవర్తించాలన్న విషయాన్ని ముందుగా గైడ్‌లు మీకు వివరిస్తారు. కచ్చితంగా ఆలాగే నడుచుకోవాలి. లేదంటే మీతో పాటు మీ పక్కనున్నవారికి కూడా ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకొండి.

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

P.C: You Tube

పెరియార్ నేషనల్ పార్క్‌కు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో కొచ్చి విమానాశ్రయం ఉంది. అదే విధంగా 140 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని మధురై విమానాశ్రయం కూడా ఉంది. పెరియార్ నుంచి కొరియాయం రైల్వేస్టేషన్ 114 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పెరియార్‌కు తమిళనాడు, కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X