Search
  • Follow NativePlanet
Share
» »ఖండాలా - లోనావాలా లోని ప్రకృతి అందాలు !!

ఖండాలా - లోనావాలా లోని ప్రకృతి అందాలు !!

సాహస క్రీడలు ఆచరించేందుకు సిద్ధం అవుతున్నారా ? అయితే మీరు ఒక సారి ఖండాలా లోనావాలా ప్రదేశానికి వెళ్ళాల్సిందే. ఈ రకమైన మీ కోరికలు అన్నిటిని తీర్చే గొప్ప హిల్ స్టేషన్ ఖండాలా - లోనావాలా. ఈ హిల్ స్టేషన్ మహారాష్ట్ర లోని భోర్ ఘాట్ పర్వత శ్రేణులలో కలదు.

ఒక్కసారి సందర్శిస్తే, మరోమారు నవ యువకులు కావలసిందే. ఈ పర్వత నగరం మీకు అనేక సాహస క్రీడల రహస్యాలను అందిస్తుంది. కనుక బ్యాగు లు సర్దండి, ట్రెక్కింగ్ షూస్ ధరించండి, ఖండాలా - లోనావాలా హిల్ స్టేషన్ పర్యటనకు రెడీ అయిపోండి.

సాహస క్రీడల సామ్రాజ్యం

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

రాజ్ మచి పాయింట్
రాజ్ మచి ప్రదేశం నుండి ఖండాలా - లోనావాలా మొదలు అవుతుంది. ఈ ప్రదేశంలో అందమైన శివాజీ కోట మరియు ఇతర చుట్టుపట్ల కల లోయలు చూడవచ్చు. వాగ్ జై దారి అనే మరొక ప్రసిద్ధ ఆకర్షణ కూడా సమీపంలో చూడవచ్చు.

Pic Credit: Ravinder Singh

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

లోనావాలా సరస్సు
లోనావాలా వాసులకు లోనావాలా సరస్సు ఒక పిక్నిక్ ప్రదేశం. ప్రకృతి అందాలు ఇక్కడ ఆస్వాదించవచ్చు. దీనినే మాన్సూన్ లేక్ అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో ఈ సరస్సు పూర్తి గా నిండి, మిగిలిన కాలాలలో ఏందీ వుంటుంది. ఈ సరస్సు ఇంద్రయాని నది నీరు తో నిండుతుంది. ఇక్కడ అనేక పక్షులు కూడా చూడవచ్చు.

Pic Credit: solarisgirl

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

డ్యూక్ నోస్
ద్యూక్స్ నోస్ అనేది ఖండాలా లో ఒక కొండ కోన. దీనికి డ్యూక్ అఫ్ వెల్లింగ్టన్ పేరు పెట్టారు. ఇది ఒక మంచి పిక్నిక్ ప్రదేశం. హైకర్ లను, రాక్ క్లైమ్బార్ లను అమితంగా ఆకర్షిస్తుంది. దీనిని ముంబై రోడ్ జర్నీ లో వెళ్ళేటపుడు హై వే నుండి చూడవచ్చు. స్థానికులు దీనిని నాగు పాము తల ఆకారంలో వుండటం వలన నాగ ఫణి అని పిలుస్తారు.
Pic Credit: Wiki Commons

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

కార్లా గుహలు
లోనావాలా లో కల కార్లా గుహలు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. బౌద్ధ సన్యాసుల చే రాతిలో నిర్మించబడిన ఈ గుహలు బౌద్ధ మత ఆదర్శాలను, స్తూపాలను, శాసనాలను ప్రదర్శిస్తాయి. ఇక్కడ 37 స్తంభాలు కల చైత్య హాలు ఒక అద్భుత నిర్మాణం.

Pic Credit: Niyati Bane

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

లోనావాలా లోని భాజా గుహలు మొత్తంగా 18 గుహలు కలవు. వీటిని బౌద్ధ సన్యాసులు నిర్మించారు. మొదటి గుహ మాస్టర్ గుహ మిగిలిన వాటిలో పది బౌద్ధ విహారాలు. వీటిలో బౌద్ధ సన్యాసులు రెస్ట్ తీసుకుంటారు. మిగిలిన ఏడూ గుహలు బౌద్ధ మత గ్రంధ శిలా లేఖనాలతో నిండి వుంటాయి.

Pic Credit: Ramnath Bhat

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

బుషీ డాం
లోనావాలా లో బుషీ డాం ఒక పిక్నిక్ ప్రదేశం. వర్షాకాలంలో డాం నీరు పొంగి పొర్లుతుంది. నగర ప్రజలకు ఇది ఒక ఆహ్లాదకర ప్రదేశం. ఈ ప్రదేశంలో స్విమ్మింగ్ నిషేధించబడినది.

Pic Credit: Wiki Commons

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

లోహ ఘర్ ఫోర్ట్
లోహ ఘర్ కోట. దీనినే ఇనుప కోట అని కూడా పిలుస్తారు. ఈ కోటను చత్రపతి శివాజీ నిర్మించాడు. శిధిలావస్థలో కల ఈ కోటను దాని శిల్ప మరియు చారిత్రక ప్రాధాన్యతల కొరకు పర్యాటకులు సందర్శిస్తారు. ఈ కోటకు నాలుగు అతి పెద్ద గెట్ లు వుండటం చూడవచ్చు.

Pic Credit: Vivek Joshi

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

స్కార్పియన్ స్టింగ్ లేదా తెలు కొండి.
స్థానికులు దీనిని వించు కాటా అంటారు. ఇది లోహఘర్ ఫోర్ట్ సమీపంలో కల ఒక పొడవైన కొండ ప్రాంతం. ట్రెక్కింగ్ కు అనువైన ప్రదేశం. పైకి చేరితే అనేక సుందర దృశ్యాలు చూపుతుంది. ఈ ప్రదేశం అధిక పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Pic Credit: Elroy Serrao

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

షాపింగ్
ఖండాలా - లోనావాలా షాపింగ్ కు ప్రసిద్ధి కాదు. ఇక్కడ చిక్కి లు అధికంగా దొరుకుతాయి. స్థానిక షాపులలో తాజా స్వీట్ లు లభిస్తాయి. బెల్లం తో తయారైన చిక్కీలు ప్రసిద్ధి. కనుక వచ్చే ముందు వీటిని కావలసినన్ని తెచ్చుకోండి.

Pic Credit: Divya Kudua

 హిల్ స్టేషన్ పర్యటన రెడీ

హిల్ స్టేషన్ పర్యటన రెడీ

ఏమి తినాలి ?
ఖండాలా - లోనావాలాలో మీరు వేడి వేడి మసాలా టీ మరియు వేడి వాడా పావ్ ఎంపిక చేసికొనవచ్చు.

Pic Credit: Warren Noronha

ఖండాలా ఇతర ఆకర్షణలకు ఇక్కడ చూడండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X