Search
  • Follow NativePlanet
Share
» »హోలీ వేడుకలను జరుపుకొనే ప్రదేశాలు !

హోలీ వేడుకలను జరుపుకొనే ప్రదేశాలు !

By Mohammad

హోలీ పండగ భారతదేశంలో అందునా ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకొనే పండగ. రంగుల పొడిని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందంలో మునిగి తేలుతుంటారు. పిల్లలు, యువకులు, పెద్దలు ఇలా ఏ వయసువారైన సరే ఆనందంతో చిందులేస్తూ ... రంగునీళ్లను బాటిల్లలో, మగ్గులలో తీసుకొచ్చి జల్లుతుంటారు.

చాలా మంది హోలీ ని మార్వాడీ పండగ అని అనుకుంటుంటారు. అది తప్పు ..! ఈ వేడుకలను అందరూ జరుపుకుంటారు కాస్త ఎక్కువగా మార్వాడీ లు జరుపుకుంటారు అంతే తేడా ..! హోలీ వేడుకలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. ఎక్కడ ఎలా పిలిచినా రంగులు జల్లుకోనేది సర్వసాధారణం.

ఇది కూడా చదవండి : హోలీ వేడుకలు ఎలా ? ఎప్పుడు ?

దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం హోలీ వేడుకల్లో ఎప్పుడూ ముందుంటుంది. మరీ నిక్కచ్చిగా చెప్పాలంటే కృష్ణుడు తో సంబంధమున్న ప్రతి ప్రదేశంలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతాయి. బాగా ఎత్తు లో ఒక కుండ ను వ్రేలాడదీసి దానిని కర్ర సహాయంతో పగలగొట్టే సన్నివేశం, ఆ తరువాత జరిగే సంబరాలు అన్నీ ఆకాశమే హాద్దుగా మిన్నంటుతాయి.

మథుర

మథుర

శ్రీ కృష్ణుడి జన్మ స్థలం అయిన మథుర లో, బృందావనం లో హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఇక్కడ ప్రజలు హోలీని 16 రోజులపాటు జరుపుకుంటారు. సంప్రదాయ పద్ధతులలో ఆచారవ్యవహారాలతో తమ ఇష్టదైవమైన శ్రీ కృషుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.

చిత్ర కృప : Jai

శాంతినికేతన్

శాంతినికేతన్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శాంతినికేతన్ లో హోలీ పండగ ఘనంగా జరుపుకుంటారు. పెద్దలు, యువకులు రంగు నీళ్ళు చల్లుకుంటూ ఆనందిస్తారు. వీధుల్లో కృష్ణుడు మరియు రాధా విగ్రహాలను పల్లకీలో ఊరేగిస్తూ .. నాట్యం చేస్తూ భక్తి పాటలు పాడతారు. సంప్రదాయ వంటలు, పాయసం మొదలైనవి చేసుకొని తింటారు.

చిత్ర కృప : Anupam Mukherjee

ఉదైపూర్

ఉదైపూర్

రాజస్థాన్ లోని ఉదైపూర్ లో హోలీ వేడుకలను కాస్త భిన్నంగా జరుపుకుంటారు. రంగులు జల్లుకోనేది కామనే అయినా ..! కర్రలను కుప్పగా పోగు చేసి వీధి చివరలో లేదా ఖాళీ మైదానంలో దహనం చేయటం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఎరుపురంగు పొడితో ఉన్న గుండ్రటి వస్తువును విసురుకుంటారు. అది వారికి తగిలి రంగు వెదజల్లుతుంది.

చిత్ర కృప : Adam & Danielle Rosenscruggs

రూప నగర్

రూప నగర్

పంజాబ్ లోని రూప నగర్ లో సిక్కులు భారీ ఎత్తున హోలీ వేడుకలను జరుపుకుంటారు. ఆనంద్ పూర్ సాహిబ్ లో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి విదేశాల్లో స్థిరపడ్డ సిక్కులు సైతం పాల్గొని ఆనందిస్తారు.

చిత్ర కృప : Harsha K R

బర్సాన

బర్సాన

ఉత్తర ప్రదేశ్ లోని బర్సాన హోలీ వేడుకలకు దేశంలోనే ప్రసిద్ధి చెందినది. ఇక్కడి హోలీ ని లాల్ మార్ హోలీ అని పిలుస్తారు. స్థానికంగా 'మార్' అంటే కొట్టు అని. హోలీ రోజున స్త్రీలు కర్రలతో పురుషులను కొడతారు. రాధా కృష్ణా ఆలయంలో సంప్రదాయ నృత్యాలు, భక్తి పాటలు పాడతారు.

చిత్ర కృప : Sreeram Nambiar

అహ్మదాబాద్

అహ్మదాబాద్

అహ్మదాబాద్ లో హోలీ వేడుకలు గమ్మత్తుగా ఉంటాయి. హోలీ రోజున కుండలో మజ్జిగ ను వేసి దానిని ఒక త్రాడు సహాయంతో వీధిలో ఎత్తున వ్రేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగలగొట్టటానికి ప్రయత్నిస్తుంటే, అమ్మాయిలు వారిని ఆపేందుకై రంగు నీళ్ళు జల్లుతుంటారు. ఎవరైతే కుండను పగలగోడతాడో అతనిని హోలీ రాజుగా ప్రకటిస్తారు.

చిత్ర కృప : rudresh_calls

ఇంఫాల్

ఇంఫాల్

మణిపూర్ రాజధానైనా ఇంఫాల్ లో హోలీ 6 రోజులపాటు జరుపుకుంటారు. రాత్రుళ్ళు జానపద నృత్యాలతో, పాటలతో ఆనందిస్తారు. యువకులు అమ్మాయిలకు తమతో 'గులాల్' ఆట ఆడమని డబ్బులిస్తారు. తెలుపు, పసుపు తలపాగా ధరించి 'గులాల్' ఆడుతూ నృత్యం చేస్తారు.

చిత్ర కృప : BITU PHUKAN

జైపూర్

జైపూర్

హోలీ వేడుకలు జైపూర్ నగరంలో ఘనంగా జరుపుకుంటారు. ఏనుగులకు, ఒంటెలకు మరియు గుర్రాలకు వివిధ రంగులు పూసి అలంకరిస్తారు. ఆతరువాత వాటిని వీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారు. కళాకారులు సంప్రదాయ రాజస్థానీ నృత్యాలను చేస్తారు. ఏనుగు పరుగుపందేలు, జల్లి కట్టు మాదిరి కొన్ని సాహస క్రీడలు (ఇప్పుడు లేదనుకోండి ..!) నిర్వహిస్తారు.

చిత్ర కృప : AppuKumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X