Search
  • Follow NativePlanet
Share
» »పశ్చిమకనుమల్లో ఈ సీజన్లో చూడాల్సిన ప్రాంతాలు

పశ్చిమకనుమల్లో ఈ సీజన్లో చూడాల్సిన ప్రాంతాలు

పశ్చిమ కనుమల్లో పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం

By Haritha Maanas

యునెస్కో వారి లెక్క‌ల ప్ర‌కారం... గుజ‌రాత్ స‌రిహ‌ద్దులో మొద‌లైన వీటి ఆవాసం త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి దాకా విస్త‌రించింది. హిమాల‌యాల క‌న్నా ముందే పుట్టిన ఈ ప‌శ్చిమ క‌నుమ‌ల నిండా ఎన్నో సుంద‌ర దృశ్యాలు అడుగు అడుగుకు స్వాగ‌తం ప‌లుకుతూ పిలుస్తాయి. ఒక‌టేమిటి... స‌ర‌స్సులు, గుట్ట‌లు, కొండ‌లు, జ‌ల‌పాతాలు, శిఖ‌ర‌పు అంచులు... ప‌శ్చిమ క‌నుమ‌ల వెంబ‌డి మ‌నోహ‌రంగా ఉంటాయి. ప‌శ్చిమ క‌నుమ‌ల‌లో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని ఎన్నో సుంద‌ర ప్రాంతాలు మిగిలేఉన్నాయి. ఖ‌నిజ ర‌త్నాల‌కు నెల‌వైన భూగ‌ర్భ‌గ‌నులు వెలిశాయి. వాట‌న్నింట‌నీ మ‌న‌సు నిండు నింపుకునేందుకు...ఆ ప్రాంతాల్ని సంద‌ర్శించాల్సిందే. ప‌శ్చిమ క‌నుమ‌ల వెంబ‌డి ఎన్నో అద్భుత న‌గ‌రాలు ఉన్నాయి. అందులో త‌ప్ప‌కుండా చూడాల్సిన ప్ర‌దేశాలేంటో తెలుసుకోండి.

1. మ‌హాబ‌లేశ్వ‌ర్‌

1. మ‌హాబ‌లేశ్వ‌ర్‌

Image source

ప‌శ్చిమ క‌నుమ‌ల న‌డుమ కొలువుదీరిన అంద‌మైన న‌గ‌రాల‌లో ఒక‌టి మ‌హాబలేశ్వ‌ర్‌. ఇది స‌ముద్ర మ‌ట్టానికి 4,178 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్క‌డ ఉన్న ప్రాచీన ఆల‌యం, వెన్నా న‌ది ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు. వేస‌విలో ఎండ‌ల‌కూ, న‌గ‌ర జీవితాన‌కి విసుగెత్తిన వ్య‌క్తికి మ‌హాబ‌లేశ్వ‌ర్ చ‌క్క‌టి విడిది ప్రాంతం. ఇక్క‌డి అడ‌వులు, కొండ‌లు, కోన‌లు, జ‌ల‌పాతాలు... న‌గ‌ర జీవికి ప‌ర్యాట‌క స్వ‌ర్గంలా అనిపిస్తాయి. ఎంత‌టి ఎండ‌లు కాసినా... ఇక్క‌డి అడ‌వులు త‌మ ప‌చ్చ‌ద‌నాన్ని కోల్పోవు. మ‌హారాష్ట్రాలో ఉన్న ఈ న‌గ‌రం మేలు జాతి వృక్షాల‌కు, జీవ జాతుల‌కు ఆవాసం వంటిది. వేస‌విలో ఇక్క‌డికి వ‌స్తే... చ‌ల్ల‌ని ప్రాంతం మ‌నుసుకు ఆహ్లాదాన్ని క‌లిగించ‌డంతో పాటూ మ‌ర్చిపోలేని మ‌ధురానుభూతులను మిగులుస్తుంది.

2. మొల్లెం

2. మొల్లెం

Image source

చాలా త‌క్కువ మందికి తెలిసిన ప‌ర్యాట‌క ప్రాంతం మొల్లెం. గోవా - క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లోని ప‌శ్చిమ క‌నుమ‌ల్లో ఇది కొలువుదీరి ఉంది. ప‌శ్చిమ‌క‌నుమ‌ల్లో క‌నిపించ‌ని అందాల‌ను చూడాల‌ని త‌హ‌త‌హ లాడే వారికి మొల్లెం మంచి టూరిస్ట్ స్పాట్‌. జీవ వైవిధ్యానికి చ‌క్క‌ని ప్రాంతం కూడా మొల్లెం అనే చెప్పాలి. అనేక ర‌కాల వ‌న్య‌ప్రాణులు ఇక్క‌డ ద‌ర్శ‌న‌మిస్తాయి. రెండు కొండ శిఖ‌రాల మ‌ధ్య నుంచి 306 అడుగుల ఎత్తు మీద నుంచి... కింద‌కు ప‌డే అందాల ధూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం కూడా మొల్లెం ప్రాంతంలోనే ఉంది. గోవా రాజ‌ధాని ప‌నాజీకి 60 కిలోమీట‌ర్ల దూరంల ఉంటుంది ఈ న‌గ‌రం. ఇక్క‌డ ఉండే నేష‌న‌ల్ పార్కు కూడా మంచి ఖ్యాతి పొందింది.

3. వ‌ల్ప‌రాయ్‌

3. వ‌ల్ప‌రాయ్‌

Image source

త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు జిల్లాలో కొలువుదీరి ఉంది వ‌ల్ప‌రాయ్. స‌ముద్ర మ‌ట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఈ హిల్ స్టేష‌న్ ఉంది. ప‌శ్చిమ క‌నుమ‌ల్లోని అనైమ‌లై కొండ‌ల్లో ఈ చిన్న ప‌ట్ట‌ణం ఉంది. ఈ ప్రాంతానికి వెళుతుంటే ప‌చ్చ‌ని తివాచీ ప‌రిచి... ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ ప‌ట్ట‌ణంలో స‌గానికి పైగా టీ తోట‌లే. ప‌శ్చిమ క‌నుమ‌ల నీడ‌లో పెరుగుతున్న టీ వ‌నాలు కంటికి ఆహ్లాదంగా ఉంటాయి. ద‌ట్ట‌మైన అడుగుల గుండా ప్ర‌యాణిస్తూ వెళ్లొచ్చు. ప్ర‌యాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. దారి పొడ‌వునా... సుంద‌ర జ‌ల‌పాతాల హోరు చెవులకింపుగా వినిపిస్తుంది.

4. దండేలి

4. దండేలి

Image source

ఉత్తర కర్ణాటకలోని పశ్చిమకనుమల్లో ఉన్న నగరం దండేలి. అక్కడి ప్ర‌కృతి అందాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. గలగలపారే నదులు, జంతు సంరక్షణాలయాలు... కాలు కదల నీయకుండా కట్టిపడేస్తాయి. వేసవిలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలలో దండేలి కూడా ఒకటి. పాయలుగా విడిపోయి పారే నదిని చూస్తూ సేదతీరే అవకాశం దండేలిలో పుష్కలం.

5. అగుంబే

5. అగుంబే

Image source

కర్ణాటకలోని షిమోగా (శివమొగ్గ) జిల్లాలో ఉన్న సుందర పర్యాటక ప్రాంతం అగుంబే. ప్ర‌కృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ ప్రియులకు ఇది సరైన గమ్యస్థానం. చిన్న చిన్న కొండలపైకి సులువుగా ట్రెక్కింగ్ కు వెళ్లి ఆనందించవచ్చు. గత కొన్నేళ్లుగా అగుంబే... కర్ణాటకలో పాపులర్ టూరిస్ట్ స్పాట్ గా వెలుగులీనుతోంది. సాయం సమయంలో అలా అగుంబేలోని సుందర ప్ర‌కృతిని షికారుకు వెళితే... మనసు తేలికపడుతుంది.

6. మడికెరి

6. మడికెరి

Image source

కర్ణాటకలోనే ఉన్న మరో అందమైన హిల్ స్టేషన్ మడికెరి. పశ్చిమకనుమల్లో ఉన్న సుందర ప్రదేశాలలో మడికెరిది అగ్రస్థానమే. ఈ పట్టణంలో కేవలం ప్ర‌కృతి అందాలే కాదు... ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోయిన భవంతులు, స్మారక కట్టడాలు కూడా కనిపిస్తాయి. ప్రశాంతతకు చిహ్నాలైన పార్కులు, తోటలతో కూడిన మడికెరిలో చూసి ఆస్వాదించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

7. కూనూర్

7. కూనూర్

Image source

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న రమణీయ హిల్ స్టేషన్ కూనూరు. దేశంలో ఉన్న రెండో అతి పెద్ద హిల్ స్టేషన్ ఇది. ఊపిరి కూడా కాసేపు ఆపి చూసేంత అందం ఈ ప్రదేశం సొంతం. ట్రెక్కింగ్ కు వెళ్లాలనుకునేవారికి, క్యాంప్ లు వేసుకునే వారికి అనువైన ప్రదేశం ఇది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X