Search
  • Follow NativePlanet
Share
» »దాద్రా నాగర్ హవేలీ లో సందర్శనీయ ప్రదేశాలు !

దాద్రా నాగర్ హవేలీ లో సందర్శనీయ ప్రదేశాలు !

By Mohammad

దాద్రా నాగర్ హవేలీ (దాద్రా నగరు హవేలీ) భారత దేశ కేంద్ర పాలిత ప్రాంతం. ఈ ప్రాంతానికి గుజరాత్ మరియు మహారాష్ట్ర లు సరిహద్దులుగా ఉన్నప్పటికీ, గుజరాత్ రాష్ట్రం చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఇక్కడ అధికార భాష గుజరాతీ గా ప్రకటించడం జరిగింది. దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సా.

దాద్రా నాగర్ హవేలీ చరిత్ర

దాద్రా నాగర్ హవేలీ పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేది. పూర్వం మహారాష్ట్ర పేష్వాలు ఇంగ్లీష్ వారితో, మొఘల్ వారితో తమకున్న శతృత్వం కారణంగా పోర్చుగీసు వారితో చెలిమి చేశారు. ఆ చెలిమికి గుర్తుగా వారు ఒప్పందం చేసుకొన్న ప్రకారం దాద్రా నాగర్ హవేలీ ని పోర్చుగీసు వారికి ఇవ్వటం జరిగింది. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడంతో ఇది భారతదేశ భూభాగంలో అంతర్భాగమైపోయింది.

దాద్రా నాగర్ హవేలీ లో సందర్శనీయ ప్రదేశాలు విషయానికి వస్తే, చూడవలసిన ప్రధాన ప్రదేశం సిల్వస్సా. ఇదొక్కటే ఇక్కడి ప్రధాన టూరిస్ట్ ప్రదేశం. దీనిని పోర్చుగీసు పాలనలో విలా డి పాకో డి అర్కోస్ అని పిలిచేవారు. సిల్వస్సా జనసందోహానికి దూరంగా ఉన్నా, ప్రకృతిని ప్రేమించే ఆరాధకులకు, ఘనమైన సంస్కృతీ వారసత్వానికి నిదర్శనం. మీరు చూడటానికి, చేయటానికి సిల్వస్సా లో చాలానే ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ ప్రదేశాలను ఒక్కొక్కటిగా చూద్దాం పదండి.

ఇది కూడా చదవండి : సిల్వస్సా - వన్య ప్రాణుల విభిన్న పర్యటన !

బింద్రాబిన్ ఆలయం, సిల్వస్సా

బింద్రాబిన్ ఆలయం, సిల్వస్సా

సిల్వస్సా లోని బింద్రాబిన్ ఆలయాన్ని అక్కడి వారు తాడ్కేశ్వర ఆలయం అని పిలుచుకుంటారు. ఈ దేవాలయంను సిల్వస్సా కి 18 కి.మీ. దూరంలో సాకర్టోడ్ నది ఒడ్డున ఒక శాంతియుత వాతావరణంలో నిర్మించబడింది.

చిత్ర కృప : Mandar Hublikar

బింద్రాబిన్ ఆలయం, సిల్వస్సా

బింద్రాబిన్ ఆలయం, సిల్వస్సా

ఇక్కడి ఒక దేవాలయం పరిమ శివుడికి అంకితమై ఉంది. ఇక్కడ సహజ సిద్దంగా ఉండే పొడవైన చెట్లు, సహజ వృక్ష సంపద మరియు జంతుజాలం నడుమ ప్రకృతి దృశ్యం చాలా అందంగా ఉండటం వల్ల ఇక్కడికి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు.

చిత్ర కృప : manish parmar

దూధ్ని, సిల్వస్సా

దూధ్ని, సిల్వస్సా

కాన్వేల్ కి 20 కిలోమీటర్ల దూరంలో, సిల్వస్సా కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూధ్ని వద్ద దమన్ గంగా నది వద్ద ప్రవహిస్తుంది. ఈ నది వద్ద ఆటలకు అనువైన వాటర్ ఫ్రంట్ దాని ఆధారంగా ఏర్పాటుచేసిన వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, ఫూట్ హిల్స్ సందర్శకులకు చక్కని కనువిందు చేస్తాయి.

చిత్ర కృప : HasHim Khan

దూధ్ని లో ఏ ఏ క్రీడలను ఆడవచ్చు ??

దూధ్ని లో ఏ ఏ క్రీడలను ఆడవచ్చు ??

పర్యాటక శాఖ వారు దూధ్ని లో వాటర్ స్పోర్ట్స్ మరియు రోయింగ్ పడవలు, కాయక్, నీటి స్కూటర్లు, పడవలు, జెట్ స్కిన్, మోటారు వేగం స్పీడ్ బోట్లు మరియు సిరాస్ రెసిడెన్షియల్ బోట్లు వంటివి పర్యాటకుల వినోదం కోసం ఏర్పాటు చేశారు.

చిత్ర కృప : Owais Khan

దూధ్ని లో ఎక్కడ బస చేయాలి ?

దూధ్ని లో ఎక్కడ బస చేయాలి ?

దూధ్ని కి వచ్చే పర్యాటకుల కోసం రాత్రి పూట బస చేయడానికి వసతి గృహాల సదుపాయం కలదు. దూధ్నిలో ఉన్న రెస్టారెంట్లు పర్యాటకులకు విలాసవంతమైన ఆహారాలను అందిస్తాయి. ఇక్కడ కాటేజీ లన్నీ గిరిజనుల గృహాలను పోలి ఉంటాయి.

చిత్ర కృప : Owais Khan

ట్రెక్కింగ్, దూధ్ని

ట్రెక్కింగ్, దూధ్ని

దూధ్ని కి వచ్చే క్రీడా ఔత్సాహికులకొరకు దట్టమైన అడవుల ప్రాంతంలో పర్యాటక శాఖ వారు ట్రెక్కింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ట్రెక్కర్లు విశ్రాంతి తీసుకోవటానికి సొంత టెంట్లూ ఏర్పాటుచేసుకోవచ్చు.

చిత్ర కృప : Naresh Gianchandani

కౌన్చా, సిల్వస్సా

కౌన్చా, సిల్వస్సా

కౌన్చా, సిల్వస్సా కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గిరిజన గ్రామం. చుట్టూ ఆకుపచ్చని లోయలు, దట్టమైన అడవులు మరియు పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల అందాలతో కౌన్చా గ్రామం నిండి ఉంటుంది.

చిత్ర కృప : Ameya Gokhale

కౌన్చా గిరిజన ప్రజలు, సిల్వస్సా

కౌన్చా గిరిజన ప్రజలు, సిల్వస్సా

కౌన్చా లోని గిరిజన ప్రజలు పచ్చని చెట్ల మద్య మట్టితో నిర్మించిన చిన్న చిన్న కుటీలరాల్లో జీవిస్తుంటారు. ఇక్కడి వారి ముఖ్యమైన వృత్తి వ్యవసాయం. ఖాళీ సమయాల్లో గిరిజన కళ రచనలు చేయడం మరియు సంగీతం మరియు నృత్యంతో ఆనందిస్తుంటారు.

చిత్ర కృప : my students critic forum

వెదురు వస్తువులు - కౌన్చా, సిల్వస్సా

వెదురు వస్తువులు - కౌన్చా, సిల్వస్సా

కౌన్చా ప్రజలు కళాత్మక వస్తువులు మరియు పక్షులు మరియు జంతువుల అలంకరణకు ఉపయోగపడే వస్తువులను విస్తృతంగా తయారుచేయడానికి వెదురును ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే బాణాలు మరియు కాగితం గుజ్జు చేయడానికి వెదురు ఉపయోగిస్తుంటారు.

చిత్ర కృప : niekkie

ఖాన్వేల్, సిల్వస్సా

ఖాన్వేల్, సిల్వస్సా

సిల్వస్సా కు 20 కిలోమీటర్ల దూరంలో ఖాన్వేల్ ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు హెరాల్డ్స్ ఒక అద్భుతమైన డ్రైవ్ గా ఉంది. ఖాన్వేల్ దారిపొడవునా మృదువైన రోడ్లు, గంభీరంగా కనిపించే చెట్లు, ఆకుపచ్చని కొండలు మరియు దట్టమైన అడవులు కనిపిస్తుంటాయి.

చిత్ర కృప : bikash4friends

ఖాన్వేల్, సిల్వస్సా

ఖాన్వేల్, సిల్వస్సా

ఖాన్వేల్ లో ఏమి చూడాలి ?

పక్షి మరియు జంతు ప్రేమికులు ఖాన్వేల్ అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు చూసి ఆనందం చెందవచ్చు. ఖాన్వేల్ ను శీతాకాలంలో అయితే అక్కడి దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోండి. శ్వాసతీసుకోలేనంత సీనరీలతో, ఆ ప్రాంతం మొత్తం ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉంటుంది.

చిత్ర కృప : Owais Khan

సత్మాలియా జింకల పార్క్, సిల్వస్సా

సత్మాలియా జింకల పార్క్, సిల్వస్సా

సిల్వస్సా రోడ్ లోని ఖాన్వేల్ శివారు ప్రాంతంలో సత్మాలియా జింకల పార్క్ ఉంది. ‘సాత్మయ' అనే పదానికి అర్థం ఏడు పీటస్. ఈ భారీ పార్క్ సుమారు 300 హెక్టార్లలో విస్తరించి ఉంది.

చిత్ర కృప : Njanasundaran P T

సత్మాలియా జింకల పార్క్, సిల్వస్సా

సత్మాలియా జింకల పార్క్, సిల్వస్సా

సత్మాలియా జింకల పార్క్ లోని అందమైన ప్రకృతి దృశ్యాలను, పచ్చని వృక్షాలను మరియు అక్కడ నివసించే జీవులను కెమెరాలలో బంధించవచ్చు. నామమాత్రపు చార్జీలతో జీపు లేదా క్వాలీస్ లో పార్కు మొత్తం ఆనందంగా చుట్టి రావచ్చు.

చిత్ర కృప : Njanasundaran P T

రోమన్ క్యాథలిక్ చర్చి, సిల్వస్సా

రోమన్ క్యాథలిక్ చర్చి, సిల్వస్సా

పోతా ... పోతా పోర్చుగీసు వారు ఏమైనా ఇచ్చి పోయారా అంటే అవి చర్చి లు అని ఆనక తప్పదు. సిల్వస్సా లో నిర్మించిన అనేక చర్చిలు పోర్చుగీస్ వారి ప్రత్యేకమైన నిర్మాణ శైలికి సాక్షాలు. వీటిలో ఒకటి రోమన్ కాథలిక్ చర్చి. దీనిని సిల్వాస్సా లో ఉన్న అత్యంత పురాతన చర్చిగా భావిస్తారు.

చిత్ర కృప : Ameya Gokhale

వాసనో లయన్ సఫారీ, సిల్వస్సా

వాసనో లయన్ సఫారీ, సిల్వస్సా

సిల్వస్సా కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసనో లయన్ సఫారీ ని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా భావిస్తారు. ఆసియా లయన్ లు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. వీటిని పర్యాటకులు దూరం నుండి సురక్షితంగా చూడటానికి రక్షణ వలయం కూడా ఉన్నది.

చిత్ర కృప : vishalparikh1982

గిరిజన సాంస్కృతిక మ్యూజియం, సిల్వస్సా

గిరిజన సాంస్కృతిక మ్యూజియం, సిల్వస్సా

గిరిజన సాంస్కృతిక మ్యూజియం సిల్వస్సా పట్టణంకు మద్యలో కలదు. ఈ మ్యూజియం యొక్క ప్రవేశ ద్వారం చాలా అద్భుతంగా, విలక్షణమైన దండలతో అలంకరించబడి ఉంటుంది.

చిత్ర కృప : images2005

గిరిజన సాంస్కృతిక మ్యూజియం, సిల్వస్సా

గిరిజన సాంస్కృతిక మ్యూజియం, సిల్వస్సా

గిరిజన జీవితం యొక్క వివిధ కోణాలను ప్రదర్శించే ఈ మ్యూజియం లోని గదుల్లో ప్రవేశించేటప్పుడు, సందర్శకులు ముందు బూట్లు తొలగించిన తర్వాత సందర్శించాలి.

చిత్ర కృప : Sameer Gupte

వంగంగా సరస్సు, సిల్వస్సా

వంగంగా సరస్సు, సిల్వస్సా

సిల్వస్సా కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో వంగంగా సరస్సు ఉంది. ఈ సరస్సు ఉన్న ప్రాంతం అత్యంత వినోదాత్మక ప్రదేశం గా ఉన్నది. ఈ సరస్సులు షూటింగులు మంచి డెస్టినేషన్స్ మరియు ఎక్కువగా బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇక్కడికి వచ్చే సాంగ్స్ మరియు డాన్స్ సీక్వెన్స్ లు చేస్తుంటారు.

చిత్ర కృప : Saifee Ratlamwala

వంగంగా సరస్సు, సిల్వస్సా

వంగంగా సరస్సు, సిల్వస్సా

జంటలకు, హనీమూన్ మరియు కుటుంబాలకు చాలా ఇష్టమైన వంగంగా సరస్సులో తోటలు అద్భుతమైన స్పాట్. కొత్తగా పెళ్ళైన కపుల్స్ ప్రత్యేకమైన ప్రదేశాలను చూడవచ్చు. అంతే కాదూ ఫ్యామిలి మెంబర్స్ మరియు పిల్లలు పడవ ప్రయాణాలలో ఆనందించవచ్చు.

చిత్ర కృప : images2005

లుహరి, సిల్వస్సా

లుహరి, సిల్వస్సా

లుహరి ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఇది సిల్వస్సా నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీవ్ర ఒత్తిడి గలవారికి, మానసిక ఉల్లసానికి ఇదొక పిక్నిక్ స్పాట్ గా చెప్పవచ్చు. నగరం నుండి దూరంగా ఎటువంటి అరుపులు, శబ్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ లుహరి ప్రదేశం.

చిత్ర కృప : Winae

లుహరి, సిల్వస్సా

లుహరి, సిల్వస్సా

లుహరి కి దగ్గరలో అటవీ ప్రాతం ఉంది కనుక ఎక్కువగా ట్రెక్కింగ్ యాత్రికులు వస్తుంటారు. ఇక్కడే గుడారాలు వేసుకొని సాహసయాత్రల్లో మునిగి తేలుతారు.

చిత్ర కృప : Winae

మధుబన్ డ్యామ్, సిల్వస్సా

మధుబన్ డ్యామ్, సిల్వస్సా

సిల్వస్సా కి 40 కి.మీ. దూరంలో మధుబన్ డ్యామ్ కలదు. దీన్ని గుజరాత్ మరియు దాద్రా నాగర్ హవేలి కలిసి నిర్మించారు. ఇక్కడ స్పీడ్ బోట్స్, నీటి స్కూటర్లు, ఆక్వా బైకులు, పడవలు, కాయక్, ప్రయాణీకుల ఓడలు మరియు బంపర్ పడవలలో సవారీలు చేసి ఆనందించవచ్చు.

చిత్ర కృప : hi_raja05

మధుబన్ డ్యామ్, సిల్వస్సా

మధుబన్ డ్యామ్, సిల్వస్సా

పర్యాటకులకు ఉండటానికి మధుబన్ డ్యామ్ వద్ద విలాసవంతమైన గుడారాలు ఏర్పాటుచేశారు. ఇక్కడ వారు వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొంటూ బహిరంగ ప్రదేశంలో భోజనం తింటూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : Naresh Gianchandani

దాద్రా పార్కు, సిల్వస్సా

దాద్రా పార్కు, సిల్వస్సా

సిల్వస్సా లో ఉన్న దాద్రా పార్కు ఆకుపచ్చని తోటలతో నిండి ఉంటుంది. ఈ అద్భుతమైన పార్కులో ఒక సుందరమైన సరస్సు మరియు కొన్ని వందల చెట్ల నడుమ జపనీయుల శైలిలో అందమైన చెక్క వంతెనలు, తెడ్డు పడవలు, గడ్డితో కప్పబడే కుటీరాలు మరియు జాగింగ్ ట్రాక్ తో నిండి ఉన్నాయి. సందర్శకుల కోసం రుచికరమైన వివిధరకాలైన ఆహారాలతో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Shreeram Ghaisas

దాద్రా పార్కు, సిల్వస్సా

దాద్రా పార్కు, సిల్వస్సా

దాద్రా పార్కు లో ఉన్న డెజా-వు అనే తోట సందర్శకుల్లో ఉత్సాహాన్ని కలిగించకమానదు. అందుకే బాలివుడ్ ఫిల్మ్ మేకర్లు ఇక్కడ సినిమాలు తీయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.సినిమాల్లో హీరోహీరోయిన్లతో డ్యాన్సులను మరియు హీరోయిన్లు చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మరియు హీరోయిన్లను ఊయ్యాలలూపే షాట్స్ తియ్యడం వంటి చిత్రీకరణాలన్నీ ఈ పార్కులో తీస్తుంటారు.

చిత్ర కృప : Nishant Sule

సిల్వస్సా ఎలా చేరుకోవాలి ??

సిల్వస్సా ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

సిల్వస్సాకు ముంబై విమానాశ్రయం సమీప విమానాశ్రయంగా ఉన్నది. దీనిని చేరుకోవాలంటే సిల్వస్సా నుండి రోడ్ మార్గం ద్వారా మూడు గంటల సమయం పడుతుంది. ఇక్కడ నుండి మీరు ఒక టాక్సీని అద్దెకు లేదా నగరం చేరుకోవడానికి ఒక పబ్లిక్ / ప్రైవేట్ రవాణా బస్సు ద్వారా వెళ్ళవచ్చు.

రైలు మార్గం

సిల్వస్సా నుండి 17 కిమీ దూరంలో సమీప రైల్వేస్టేషన్, వాపి ఉన్నది. ఇక్కడ నుండి మీరు ఒక టాక్సీని అద్దెకు లేదా స్థానిక రవాణా బస్సు ద్వారా నగరం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

సిల్వస్సా చేరుకోవటానికి ముంబై-వడోదర-ఢిల్లీ జాతీయ రహదారి నం.8 (వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే) సేవలు అందిస్తున్నది. ముంబై మరియు సిల్వస్సా మధ్యన దూరం 160 కిమీ. ఉన్నది. ముంబై (బోరివలి), సూరత్, అహ్మదాబాద్, ఉదయ్పూర్, నాసిక్ మరియు షిరిడి వంటి నగరాల నుండి రెగ్యులర్ బస్సు సేవలు ఉన్నాయి.

చిత్ర కృప : Sagar Tipnis

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X