Search
  • Follow NativePlanet
Share
» »ధలై - పచ్చదనాల మధ్య ఉండే అందమైన ప్రదేశం !

ధలై - పచ్చదనాల మధ్య ఉండే అందమైన ప్రదేశం !

By Mohammad

ధలై, త్రిపుర లో ఇటీవల ఏర్పడ్డ నూతన జిల్లా. ఈ జిల్లా బంగ్లాదేశ్ తో సరిహద్దు పంచుకుంటుంది. ధలై జిల్లా ప్రధాన కేంద్రం అమ్బస్సా లో కలదు. ధలై రాష్ట్ర రాజధాని అగర్తలా నుండి సుమారు 90 కిలోమీతర్ల దూరంలో ఉన్నది. ఇక్కడికి చేరుకోవటానికి మూడు గంటల సమయం పడుతుంది. కార్లు లేదా బస్సులలో ప్రయాణించి గమ్యస్థానానికి వెళ్ళవచ్చు.

ఇది కూడా చదవండి : కైలాషహర్ - శివుని మరో నివాసం !

ధలై సహజ అందం

ధలై జిల్లా ఎక్కువగా అటవీ ప్రాంతాలతో, కొండ లతో నిండి ఉంటుంది. దీని చుట్టుపక్కల అందాలను, పర్యాటక ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు, యాత్రికులు ఇష్టపడతారు. లోన్గ్తరై మందిర్, కమలేశ్వరీ మందిర్, రాస్ ఫెయిర్ మొదలైన పర్యాటక ప్రదేశాలు ధలై సందర్శించదగ్గవి.

ధలై సహజ అందం

ధలై సహజ అందం

చిత్ర కృప : Piyushozarde

కమలేశ్వరీ మందిరం

కమలేశ్వరీ మందిరం కాళీ మాతకు అంకితం చేయబడింది. ఈ ఆలయం కమల్పూర్ పట్టణంలో కలదు. ఈ పట్టణం ధాలై జిల్లా ప్రధాన కేంద్రం అమ్బస్సా నుండి షుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కమలేశ్వరీ మందిరం అగర్తలా నుండి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళీ మాతకు మరోపేరు కమలేశ్వరీ, అందువల్ల ఈ ఆలయానికి ఆ పేరు పెట్టారు.

ఈ ఆలయానికి ఎడాదిపొడవునా తరచుగా భక్తులు వస్తారు. పర్యాటకులు అద్దె టాక్సీలలు అగర్తలా నుండి నేరుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అమ్బస్సా వరకు, తరువాత కమల్పూర్ కి బస్సులు కూడా ఉంటాయి.

కాళీ మాత, కమలేశ్వరీ మందిర్

కాళీ మాత, కమలేశ్వరీ మందిర్

చిత్ర కృప : bhavargarg

లోన్గ్తరై మందిరం

లోన్గ్తరై మందిరం ధలై జిల్లాలో గౌరవించదగ్గ ఆలయం. లాంగ్తారై శివుడికి కోక్బోరోక్ పేరు ఉంది. ఈ ఆలయం అగర్తలా నుండి షుమారు 102 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శివుని ఇల్లు, కైలాస పర్వతం నుండి శివుడు ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేవాడని నమ్ముతారు. ఆయన ఇక్కడ పాదం మోపాడని నమ్మకం, అప్పటినుండి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది, వెంటనే ఆలయం నిర్మించబడింది. ప్రజలు అన్నిచోట్ల నుండి లోన్గ్తరై ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

లోన్గ్తరై మందిరం, త్రిపుర

లోన్గ్తరై మందిరం, త్రిపుర

చిత్ర కృప : Karin Patry

'లాంగ్తర' అనే పదానికి 'లోతైన లోయ' అనే పేరుకూడా ఉంది. కుంఫి పువ్వు ఈ ఆలయానికి వెళ్ళే రోడ్డు పక్కన ఉన్న స్థానిక పుష్పం. ఈ ఆలయం గౌరవి౦చబడే ప్రదేశమే కాక, ఈ ఆలయ పరిసరప్రాంతాలు కూడా సందర్శనకు విలువకలిగినవి.

మణిపురి కమ్యూనిటి వారి రాస వేడుక

రాసలీల అనేది శ్రీకృష్ణుడు రాధ, ఆయన సఖులు (స్నేహితురాళ్ళు) తో చేసే ప్రసిద్ధ నృత్యం. కృష్ణుడి అనుచరులైన మనిపురిలు దేవుడు, నృత్య గౌరవార్ధం ప్రతి ఏటా రాస మేళాని నిర్వహిస్తారు. ధలై జిల్లలో, మణిపురి కమ్యూనిటీ ఈ రాస్ ఫెయిర్ ని గణనీయంగా నిర్వహిస్తుంది.

త్రిపుర ఉత్సవాలు

త్రిపుర ఉత్సవాలు

చిత్ర కృప : Abhisek Saha

సలెమ లో అతిపెద్ద వేడుక జరుగుతుంది. డిసెంబర్ నెలలో జరుపుకునే అతిపెద్ద ఆకర్షణ రాస వేడుకలో రాసయత్ర లేదా కృష్ణుడి ఊరేగింపు ఉంటుంది. కృష్ణుడి వివిధ చేష్టలు, జీవన దశల మట్టి నమూనాలు ఈ ఊరేగింపులో ప్రదర్శించ బడతాయి.

కృష్ణుడి భక్తులు ధలై జిల్లలో నిర్వహించే రాస వేడుకలో అధికంగా పాల్గొంటారు. నిజానికి, ఇది ఈ జిల్లాలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి కూడా. జిల్లా ప్రధాన కార్యాలయం అమ్బస్సా అగర్తలా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ధలై ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

అగర్తలా కు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే సిన్గేర్భిన్ విమానాశ్రయం త్రిపుర లో ఉన్న ఏకైక విమానాశ్రయం. పర్యాటకులు అగర్తలా వద్ద గల ఈ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి రోడ్డు మర్గాన ధలై చేరుకోవచ్చు. అగర్తలా నుండి ధలై చేరుకోవటానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుంది.

రైలు మార్గం

ధలై లో రైల్వే స్టేషన్ లేదు. ప్రస్తుతానికి నిర్మాణాన్ని చేపడుతున్నారు. ధలై కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ సిల్చార్. గౌహతి నుండి సిల్చార్ వరకు రైల్లో ప్రయాణించి, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ధలై వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం, ధలై

రోడ్డు మార్గం, ధలై

చిత్ర కృప : Piyushozarde

బస్సు లేదా రోడ్డు మార్గం

ధలై గుండా జాతీయ రహదారి పోతుంది. అగర్తలా, లుమ్డింగ్, సిల్చార్ మరియు అమ్బుస్సా ఈశాన్య ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి కూడా ధలై చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X