Search
  • Follow NativePlanet
Share
» »ఇస్లాం నగర్ : మరిచిపోయిన రాజధాని !

ఇస్లాం నగర్ : మరిచిపోయిన రాజధాని !

By Mohammad

ఒకప్పటి భోపాల్ రాజ్యానికి రాజధానిగా సేవలందిన ఇస్లాం నగర్ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్న నగరం. ఇది రాజధాని భోపాల్ కు 13.8 కి.మీ. దూరంలో బేరసియా వెళ్లే మార్గంలో ఉంటుంది. పాడుబడిన రాజభవంతులు దీని గత వైభవ చిహ్నాలను గుర్తుకు తెస్తూ ఉంటాయి.

అనేక రాజపుత్రులు పాలించిన ఈ ప్రాంతాన్ని మొదట జగదీశ్ పూర్ అనేవారు. ముస్లీం లు ఎక్కువసార్లు ఆక్రమించుకోవడంతో "ఇస్లాం నగర్" గా మారిపోయింది. ఈ ప్రాంతాన్ని ఏలిన అనేక రాజవంశీయులు భవంతులను, దాని చుట్టూ అందమైన తోటలను నిర్మించారు. ఇప్పుడు అవే ఈ ఇస్లాం నగర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

రాణి మహల్

రాణి మహల్ ను ఇస్లాం నగర్ లో తప్పక చూడాలి. దీనిని క్రీ.శ. 1720 లో మహమ్మద్ ఖాన్ దోస్త్ అతని రాణుల నివాసం కోసం నిర్మించారు. అందమైన నిర్మాణం కలిగిన ఈ భవనంలో బాల్కానీలు, విశాల మైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ రాజభవనం మొఘలులు, రాజపుత్రులు, మాల్వా నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

ఇస్లాం నగర్ : మరిచిపోయిన రాజధాని !

రాణి మహల్

చిత్ర కృప : vikram singh

చమన్ మహల్

క్రీ.శ. 1715 లో ఇస్లాంనగర్ ను పాలించిన ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ నిర్మించిన చమన్ మహల్ లేదా 'ఉద్యానవన భవంతి' ఆ పేరుకు తగ్గదే. ఇసుకరాతితో నిర్మించిన భవంతి అద్భుత దృశ్యం. ఈ భవంతి ప్రవేశంలో 12 ద్వారాలు వున్న షీష్ మహల్ వుంది. ఈ భవంతి మధ్యలో ఫౌంటెయిన్ల తో కూడిన అందమైన ఉద్యానవనం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

ఇస్లాం నగర్ : మరిచిపోయిన రాజధాని !

చమన్ మహల్

చిత్ర కృప : paras fotografia

ఇస్లాం నగర్ కోట

ఇస్లాం నగర్ పర్యాటకం లో ప్రధాన ఆకర్షణ ఇస్లా౦ నగర్ కోట. ఈ బ్రహ్మాండమైన కోట చరిత్ర కు ఇస్లాం నగర్ తో అవినాభావ సంబంధం వుంది. దీన్ని క్రీ.శ. 1715 లో ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ స్థాపించాడు. ఈ కోటను అద్భుతమైన నిరమాన వైభవంతోనూ, కౌశలంతోనూ నిర్మించారు. ఇది కూడా మొఘల్, రాజపుత్రులు మరియు మాల్వా నిర్మాణ శైలిని తలపిస్తుంది.

ఇస్లాం నగర్ : మరిచిపోయిన రాజధాని !

ఇస్లాం నగర్ కోట

చిత్ర కృప : Manfred Sommer

ఇస్లాం నగర్ ఎలా చేరుకోవాలి ?

ఇస్లాం నగర్ చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

ఇస్లాం నగర్ కు 14 కి. మీ. దూరంలో భోపాల్ విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు ప్రయాణించవచ్చు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి ఇస్లాం నగర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఇస్లాం నగర్ సమీపాన భోపాల్ రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కు రైళ్లు నడుస్తాయి. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి ఇస్లాం నగర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

భోపాల్ మహానగరం నుండి మరియు దాని సమీప పట్టణాల నుండి ఇస్లాం నగర్ కు ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు తిరుగుతాయి.

ఇస్లాం నగర్ : మరిచిపోయిన రాజధాని !

ఇస్లాం నగర్ చిహ్నం

చిత్ర కృప : Manfred Sommer

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X