Search
  • Follow NativePlanet
Share
» »శివగిరి సాహస కృత్యాలకు మారుపేరు !!

శివగిరి సాహస కృత్యాలకు మారుపేరు !!

By Mohammad

శివగిరి (శివ్ గిరి) కర్నాటక రాష్ట్రంలోని ఒక పర్యాటక ప్రదేశం. సాహస కృత్యాలను ఇష్టపడేవారికి ఇదొక చక్కటి ప్రదేశం. చిక్కమగలూరు జిల్లాలోని యెమ్మెదొడ్డి గ్రామం సమీపంలో దట్టమైన అడవుల మధ్యలో శివగిరి ప్రాంతం ఉన్నది. ఈ పర్యాటక ప్రదేశం చుట్టూ హొగ్గరెకనగిరి కొండలు కప్పేస్తూ ఉంటాయి.

శివగిరి గ్రామం కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి కొండపై 100 సంవత్సరాల చరిత్ర కల పురాతన కాఫీ ఎస్టేట్లు ఉన్నాయి. శివగిరి టైగర్ రిజర్వు అనేక క్రూర మృగాలతో నిండి ఉంటుంది. కాఫీ తోటలలో సైతం పులులు ఎంతో హుందాగా విహరిస్తూ ఉంటాయి.

శివగిరిలో సందర్శించవలసిన స్థలాలు

శివగిరి లో పర్యాటకులు చూడవలసినది సమీపంలోని దొడ్డబాలె సిద్దరగుడ్డ శిఖరం, పురాతన శివాలయం, వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ మరియు సరస్సు. వీటిని ప్రధాన ఆకర్షణ లుగా చెప్పుకోవచ్చు.

ఇది కూడా చదవండి : కర్నాటకలోని ఏకైక విహార స్థలం - చిక్కమగలూరు !

శివగిరి ప్రదేశం చూడటానికే కాదు సాహస కృత్యాలకు మారుపేరు గా నిలిచింది. శివగిరి పర్యటన వర్షాకాలం కష్టమనిపించినా ... ఇతర కాలాల్లో పర్యటన ఆనందంగా ఉంటుంది. రాక్ క్లైంబింగ్ మరియు ట్రెక్కింగ్ శివగిరిలో ఆనందాన్నిచ్చే క్రీడలు. శివగిరి ప్రదేశం బెంగళూరు మహానగరానికి 235 కిలోమీటర్ల దూరంలోను, హుబ్లీ నుండి 215 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. ఈ ప్రదేశ పర్యాటక స్థలాల విషయానికి వస్తే ...

శివగిరి - సందర్శనీయ స్థలాలు

దొడ్డబాలే సిద్దరగుడ్డ శిఖరం, శివగిరి

దొడ్డబాలే సిద్దరగుడ్డ శిఖరం, శివగిరి

శివగిరి మొత్తానికే సెంటర్ ఆఫ్ అట్ర్యాక్షన్ దొడ్డబాలే సిద్దరగుడ్డ శిఖరం. ఈ శిఖరం సముద్ర మట్టానికి 5,500 అడుగుల ఎత్తున ఉంది. శివగిరిలో ఇది తప్పక చూడదగిన ప్రదేశం. పర్యాటకులు చుట్టూఉన్న ప్రకృతి అందాలతో పాటుగా లేక్ విల్లే డ్యామ్, బాబా బుడంగిరి హిల్స్, భద్ర లేక్, యెమ్మేదొడ్డి గ్రామాలను శిఖరం నుండి చూడవచ్చు.

చిత్ర కృప : harshavardhan_j_n

దొడ్డబాలే సిద్దరగుడ్డ శిఖరం, శివగిరి

దొడ్డబాలే సిద్దరగుడ్డ శిఖరం, శివగిరి

దొడ్డబాలే సిద్దరగుడ్డ శిఖరం ట్రెక్కింగ్ మరియు రాక్ క్లైంబింగ్ లకు ఎంతో తేలికగా ఉండి అక్కడి కాఫీ తోటల అందాలను చూసేలా చేస్తుంది. శిఖరం ఎక్కేటపుడు పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడి జంతువులు ఎటువైపు నుండైనా దాడి చేయవచ్చు కనుక అనుభవం ఉన్న గైడ్ సహాయంతో వెళ్ళటం మంచింది.

చిత్ర కృప : Sofi Lundin

శివాలయం ,శివగిరి

శివాలయం ,శివగిరి

శివగిరి లో 400 సంవత్సరాల క్రితం నాటి శివాలయాన్ని భక్తులు తప్పక సందర్శించాలి. త్రిమూర్తులలో ఒకడైన శివభగవానుడు ఇక్కడి ప్రధాన దైవం.

చిత్ర కృప : SrinivasKulkarni

శివాలయం ,శివగిరి

శివాలయం ,శివగిరి

శివాలయం లోని శివుడు ఎంతో మహిమ కలవాడని, భక్తులు కోరిన కోరికలను త్వరగా తీరుస్తాడని ఇక్కడి వారి నమ్మకం, విశ్వాసం. శివాలయాన్ని దొడ్డబాలే సిద్దరగుడ్డ శిఖరం నుండి కూడా చూడవచ్చు.

చిత్ర కృప : harshavardhan_j_n

మడగడకెరె సరస్సు, శివగిరి

మడగడకెరె సరస్సు, శివగిరి

శివగిరి సమీపంలోని మడగడకెరె సరస్సు వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి సరస్సు పెద్దదిగా ఉండి బోటింగ్ వంటి షికార్లకు ఆనందంగా ఉంటుంది.

చిత్ర కృప : cherokee saw

మడగడకెరె సరస్సు, శివగిరి

మడగడకెరె సరస్సు, శివగిరి

స్థానిక కథనం ప్రకారం మడగడకెరె సరస్సు మ్యాజిక్ రెయిన్ చే ఏర్పడిందని చెబుతారు. చిన్న చిన్న తుంపరలు గాలివాన కు ప్రవాహంలా కొట్టుకొచ్చి సరస్సు ఏర్పడిందని మరికొందరి భావన.

చిత్ర కృప : cherokee saw

ముథోడి వన్య ప్రాణి సంరక్షణాలయం, శివగిరి

ముథోడి వన్య ప్రాణి సంరక్షణాలయం, శివగిరి

ముథోడి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ శివగిరి ప్రాంతంలో చూడవలసినది. ఇది భద్ర వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ లో భాగంగా ఉండి, ఇండియాలో 25 వ టైగర్ రిజర్వ్ గా ప్రకటించబడింది.

చిత్ర కృప : ☆Mi☺Λmor☆

ముథోడి వన్య ప్రాణి సంరక్షణాలయం, శివగిరి

ముథోడి వన్య ప్రాణి సంరక్షణాలయం, శివగిరి

ముథోడి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ లో కనిపించే వన్య ప్రాణులు

స్యాంక్చురీ లో అడవి జంతువులతో పాటు పక్షులు కనిపిస్తాయి. పులి, గుంట నక్క, అడవి కుక్కలు, ఏనుగులు, చిరుత తో పాటుగా గద్దలు, గుడ్ల గూబ లు వంటి పక్షులు సహజంగా సంచరించే ప్రాణులలో కొన్ని. ఈ స్యాంక్చురీ లో 120 కి పైగా వృక్ష జాతులు పక్షులకు, జంతువులకు ఆహారంగా, ఆవాసంగా ఉన్నాయి.

చిత్ర కృప : Dineshkannambadi

రవాణ వ్యవస్థ

రవాణ వ్యవస్థ

వాయు మార్గం

శివగిరి ప్రదేశానికి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 235 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం ద్వారా దేశీయ, విదేశీయ పర్యాటకులు ప్రయాణం చేయవచ్చు. ఏర్ పోర్ట్ నుండి నేరుగా టాక్సీలు, క్యాబ్ లు కూడా లభిస్తాయి.

రైలు మార్గం

శివగిరికి సమీపంలో హుబ్లీ రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుబ్లీ నుండి దేశంలోని ఇతర నగరాలకు రైలు ప్రయాణం చేయవచ్చు. టాక్సీలు, క్యాబ్ లలో హుబ్లీనుండి శివగిరి చేరవచ్చు.

రోడ్డు మార్గం

బెంగుళూరు, హుబ్లీ, మంగుళూరు, కొల్లేగల్ మరియు ఇతర రాష్ట్రంలోని ఇతర నగరాల నుండి రాష్ట్ర మరియు ప్రయివేట్ బస్సులలో శివగిరి చేరవచ్చు. ఈ నగరాల నుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను కూడా నడుపుతోంది.

చిత్ర కృప : Goudar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X