Search
  • Follow NativePlanet
Share
» »ఉజ్జయిని అసంఖ్యాక పౌరాణిక కథల సంగమ ప్రదేశం !

ఉజ్జయిని అసంఖ్యాక పౌరాణిక కథల సంగమ ప్రదేశం !

'కుంభమేళా' అనేది అనేక మంది హిందువులందరూ ఒక చోటు చేరి జరుపుకొనే జాతర. సాధారణంగా ప్రతి 4 సంవత్సరాల కొకసారి జరుపుకొనే కుంభమేళా ను అర్ధ కుంభమేళా(6 సంవత్సరాల కొకసారి) మరియు పూర్ణ కుంభమేళా(12 సంవత్సరాల కొకసారి) లుగా జరుపుకుంటుంటారు. ప్రయాగ, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ లలో కుంభమేళా నిర్వహించబడుతుంది.

ఇది కూడా చదవండి : మధ్య ప్రదేశ్ పర్యాటక ఆకర్షణలు ... సంక్షిప్తంగా !

ప్రస్తుతం(ఏప్రిల్ 22 నుండి మే 21 వరకు) ఉజ్జయినీ లో కుంభమేళా జరుగుతున్నది. 12 సంవత్సరాల క్రితం అంటే 2004 లో కుంభమేళా ఉజ్జయినీ లో జరిపారు మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. శిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయినీలో అఘోరాలు, సాధువులు మరియు భక్తులు అందరూ 'హరహరమహా దేవా శంభో శంకరా' అంటూ ఆలయ పురవీధుల్లో తిరుగుతూ ఆధ్యాత్మికత ను పెంపొందిస్తున్నారు. హిమాలయాల నుంచి వచ్చే నాగ సాధువులు కుంభమేళా ప్రధాన ఆకర్షణ. ఇలా ఎన్నో విశేషాలతో కూడి ఉన్న ఉజ్జయినీ గురించి కొన్ని మాటల్లో ..

ఉజ్జయిని

ఉజ్జయిని

ఉజ్జయిని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మాళ్వా ప్రాంతంలో ఒక జిల్లాగా ఉన్నది. పూర్వం మగధ సామ్రాజ్యం లో మహాజనపదాలలో అవంతీ లేదా అవంతిక(బహుబలి సినిమాలో తమన్నా క్యారెక్టర్ పేరు) ఒక భాగంగా ఉండేది. ఉజ్జయిని హిందువుల ప్రముఖ పుణ్య క్షేత్రం మరియు 12 ఏళ్లకొకసారి కుంభమేళాకు ప్రసిద్ధి.

చిత్ర కృప : M P Tourism

ఉజ్జయిని లో ఏమి చూడాలి ?

ఉజ్జయిని లో ఏమి చూడాలి ?

ఉజ్జయిని పుణ్య క్షేత్రం కాబట్టి, ఇక్కడ లెక్కకు మించి ఆలయాలు, ఆశ్రమాలు కనపడతాయి. అలాగే భర్తృహరి గుహలు, కాలియాదేహ భవనం, పురాతన ఖగోళశాల మరియు ఇతరత్రా ఆకర్షణలను చూడవచ్చు.

చిత్ర కృప : ravi kant

మహాకాళేశ్వర్ ఆలయం, ఉజ్జయిని

మహాకాళేశ్వర్ ఆలయం, ఉజ్జయిని

మహాకాళేశ్వర్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వర్ విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. ఇక్కడ దేవునికి ఇచ్చిన ప్రసాదం తిరిగిఇస్తాడని కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం అతి వైభవంగా, కన్నుల పండుగగా వేడుకలను నిర్వహిస్తారు.

చిత్ర కృప : Dhara Shah

బడే గణేష్‌జి కా మందిర్, ఉజ్జయిని

బడే గణేష్‌జి కా మందిర్, ఉజ్జయిని

బడే గణేష్‌జి కా మందిర్, ఉజ్జయిని పట్టణంలో కెల్లా ఉన్న ఆలయాల్లో సంప్రదాయ ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలో ఉన్న పెద్ద గణేషుని విగ్రహం చాలా పవిత్రంగా, కళాత్మకంగా ఉంటుంది. ఈ విగ్రహం చాలా మహిమకలదని , ఎవ్వరైనా ఈ ఆలయాన్ని దర్శించి తమ కోరికలను కోరుకుంటే అవి అతి త్వరలోనే తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం.

చిత్ర కృప : Ujjain.travel

గోపాల్ మందిర్, ఉజ్జయిని

గోపాల్ మందిర్, ఉజ్జయిని

గోపాల్ మందిర్ ను "ద్వారికదిష్ ఆలయం" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ఇందులోని విగ్రహం 2 అడుగుల ఎత్తులో, వెండితో తయారుచేయబడి ఉంటుంది. విగ్రహం పాలరాతి పీఠం మీద ఉంచబడింది మరియు వెండి ఫలకాలతో తయారుచేసిన తలుపులు ఉన్నాయి. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతుంటాయి.

చిత్ర కృప : spparmar5276

కాల్ భైరవ్ ఆలయం, ఉజ్జయిని

కాల్ భైరవ్ ఆలయం, ఉజ్జయిని

కాల్ భైరవ్ ఆలయం పురాతన హిందూ సంప్రదాయ ఆలయాల్లో ఒకటిగా భావిస్తారు. దీనిని కాల భైరవుడు శివుని ఆవిర్భావము లలో ఒకటి గా విశ్వసిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టు కింద శివలింగంను చూడవొచ్చు. ఈ శివలింగం, నంది విగ్రహానికి ఎదురుగా ఉంటుంది. మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో గొప్ప వేడుకను జరుప్పుకుంటారు.

చిత్ర కృప : Utcursch

భర్తృహరి గుహలు, ఉజ్జయిని

భర్తృహరి గుహలు, ఉజ్జయిని

క్రీ.శ. 10 వ శతాబ్దం నాటి భర్తృహరి గుహలు కేవలం ఉజ్జయిని పట్టణానికే కాదు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ గుహలు శిప్రా నది ఒడ్డున ఉన్నాయి. వీటిలో అడుగుపెట్టడం ఒక అద్భుతమైన అనుభవంగా చెప్పుకోవచ్చు. ఈ గుహలలో క్రింద వెళ్లినవారికి ఊపిరి పీల్చుకోవటం చాలా కష్టమవుతుంది కనుక జాగ్రత్తగా వెళ్ళాలి.

చిత్ర కృప : wikicommons

నవగ్రహ మందిర్, ఉజ్జయిని

నవగ్రహ మందిర్, ఉజ్జయిని

ఉజ్జయిని లోని నవగ్రహ మందిర్ కూడా శిప్రా నది ఒడ్డున ఉన్నది. ఇది మన సౌర వ్యవస్థ గ్రహాలకు అంకితం కావింపబడ్డ ఏకైక దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో పౌర్ణమికి మరియు శనివారాలలో గుంపులుగుంపులుగా ప్రజలు కనిపిస్తారు. ఇక్కడి స్థానికులు ఈ ప్రదేశాన్ని త్రివేణి తీర్థం అని కూడా పిలుస్తారు.

చిత్ర కృప : ajrao

మంగళ్ నాథ్ ఆలయం, ఉజ్జయిని

మంగళ్ నాథ్ ఆలయం, ఉజ్జయిని

మంగళ్ నాథ్ , ఉజ్జయిని పట్టణంలో ఉన్న శివుడికి అంకితం చేయబడ్డ ఒక పవిత్ర దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించిన తరువాత పర్యాటకులు చిత్రమైన అనుభూతిని పొందుతారు. ఈ ఆలయం ఎక్కడైతే ఉందో అక్కడ మొట్టమొదటి రేఖాంశము భూమిపై వెళ్లిందని చెపుతారు. ఈ దేవాలయం నుండి స్పష్టంగా గ్రహాలను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.

చిత్ర కృప : V.narsikar

హర్సిద్ధి దేవాలయం, ఉజ్జయిని

హర్సిద్ధి దేవాలయం, ఉజ్జయిని

హర్సిద్ధి దేవాలయం ఉజ్జయిని పట్టణంలో ఒక ప్రత్యేకమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయంలో కృష్ణ వెర్మిలియన్ రంగులతో చిత్రించబడ్డ దేవి అన్నపూర్ణ విగ్రహం, దేవి మహాలక్ష్మి మరియు దేవి సరస్వతి విగ్రహాల మధ్యన ఉన్నది. ఈ స్థలానికి ఒక పురాణగాథ ఉన్నది అదేమిటంటే శివుడు తన సతి శరీరాన్ని మోసుకెళుతున్నప్పుడు, ఆమె మోచేయి ఈ స్థలంలో పడిపోయిందని చెపుతారు.

చిత్ర కృప : ravi kant

గడ్ కాళిక, ఉజ్జయిని

గడ్ కాళిక, ఉజ్జయిని

గడ్ కాళిక, ఉజ్జయిని ప్రాంతంలో నెలకొని ఉన్న ప్రసిద్ది చెందిన గుడి. ఈ దేవాలయాన్ని పురాణాలలో చాలా శక్తిగల దేవత, కాళికకు అంకితం చేయబడ్డారు. ఇక్కడే మహాకవి కాళిదాసుకి నాలుక మీద కాళికా మాత బీజాక్షరాలు రాసిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ శక్తివంతమైన దేవతకి నివాళులు అర్పించేందుకు భక్తులు చాలామంది వస్తుంటారు.

చిత్ర కృప : sourav chatterjee

విక్రం కీర్తి మందిర్, ఉజ్జయిని

విక్రం కీర్తి మందిర్, ఉజ్జయిని

విక్రం కీర్తి మందిర్ ని ఉజ్జయిని పట్టణంలో మౌర్య యుగంనాటి వైభవం తెలిసేట్లుగా కట్టించారు. ది సింధియా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పురావస్తు సంగ్రహాలయం, ఆర్ట్ గ్యాలరీ మరియు ఆడిటోరియంలు విక్రమ్ కీర్తి మందిర్ స్వంతం. ఈ మ్యూజియంలో గొప్ప శ్రేణి గల చిత్రాలు, రాగి రేకులు మరియు నర్మదా లోయలో కనుగొన్న శిలాజాలు ఉన్నాయి.

చిత్ర కృప : wikicommons

దుర్గాదాస్ కి చ్చత్రి, ఉజ్జయిని

దుర్గాదాస్ కి చ్చత్రి, ఉజ్జయిని

దుర్గాదాస్ కి ఛత్రి, ఉజ్జయిని దేవాలయ పట్టణంలో ఉన్న ఒక గొప్ప స్మారక కట్టడం. దీనిని రాజపుత్రుల కాలంనాటి ఒక చిరస్మరణీయ వ్యక్తి, వీర్ దుర్గాదాస్ యొక్క స్మారక చిహ్నంగా ఛత్రి రూపంలో కట్టించారు. ఈ స్మారక చిహ్నం రాజ్ పుట్ నిర్మాణ శైలిని కలిగి ఉండి, పర్యాటకులకు ఒక ప్రముఖ ఆకర్షణగా ఉన్నది.

చిత్ర కృప : wikicommons

చింతమన్ గణేశ్ ఆలయం, ఉజ్జయిని

చింతమన్ గణేశ్ ఆలయం, ఉజ్జయిని

చింతమన్ గణేష్ ఆలయం, ఉజ్జయిని నగరంలో ఉన్న అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజూ వందల కొద్ది భక్తులు గణేశుడి ఆశీర్వచనాల కోసం ఈ ఆలయానికి వస్తుంటారు. చింతమన్ అంటే 'ఒత్తిడి నుండి ఉపశమనం' అని అర్థం. ఈ ఆలయంలో ఉన్న గణేషుడి విగ్రహం స్వయంభూ విగ్రహమని ఇక్కడి ప్రజల నమ్మకం.

చిత్ర కృప : Anshul_sharma

వేధశాల, ఉజ్జయిని

వేధశాల, ఉజ్జయిని

ఉజ్జయిని లోని వేధశాల ని క్రీ.శ.1719 వ సంవత్సరంలో జైపూర్ మహారాజైన సవాయ్ రాజ్ జైసింగ్ నిర్మించాడు. పురాతన భారతదేశంలో ఖగోళ అధ్యయనాలు కేంద్రాలలో ఇది ఒకటి. ఈ వేధశాల నాలుగు స్మారక కట్టడాలను కలిగి ఉన్నది. ఈ ప్రయోగశాల ఒక ప్లానెటోరియం మరియు ఒక టెలిస్కోప్ హౌస్, దిజ్ఞాష యంత్ర మరియు నక్షత్రాల స్థానం కలిగి ఉన్నది. 'సూర్యుని ఫలకం' ఈ వేధశాలలో చాలా ప్రసిద్ది.

చిత్ర కృప : Bernard Gagnon

కాలియాదేహ రాజభవనం, ఉజ్జయిని

కాలియాదేహ రాజభవనం, ఉజ్జయిని

కాలియాదేహ ప్యాలెస్, ఉజ్జయిని పట్టణం యొక్క ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. క్రీ.శ. 1458 లో శిప్రా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఈ రాజభవనాన్ని నిర్మించినారు. ఈ రాజభవనం ఒక గొప్ప నిర్మాణాత్మకత విలువను కలిగి ఉండి, పెర్షియన్ నిర్మాణానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ రాజభవనాన్ని అక్బర్ మరియు జహంగీర్ చక్రవర్తులు సందర్శించారు.

చిత్ర కృప : PepaLand

సందల్వాల భవనం, ఉజ్జయిని

సందల్వాల భవనం, ఉజ్జయిని

సందల్వాల భవనాన్ని క్రీ.శ. 1925 లో ఫిదా హుస్సేన్ అబ్దుల్ హుస్సేన్ సందల్వాల కట్టించారు. ఈ భవన నిర్మాణశైలి పురాతన భారత నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ భవనం చూసిన తర్వాత చూసినవారికి ఒక వాంఛనీయ అనుభూతి కలుగుతుంది. ఈ భవనాన్ని ఉజ్జయిని నగరంలోనే ఒక గొప్ప నిర్మాణ కళాఖండంగా చెపుతారు.

చిత్ర కృప : wikicommons

సిద్దవట్, ఉజ్జయిని

సిద్దవట్, ఉజ్జయిని

సిద్ధవట్, శిప్రా నది ఒడ్డున ఉజ్జయినిలో ఉన్నది. ఈ ప్రదేశాన్ని సందర్శించేవారు ఇక్కడ శిప్రా నదిని తాబేలులాగా సిద్ధవట్ వద్ద చూడవచ్చు. సిద్ధవట్ ఘాట్ పోస్ట్ అంత్యక్రియ కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఈ స్థలాన్ని పురాణాలలో ప్రేత-శిలల-తీర్థ అని చెప్పబడింది. ఇక్కడి స్థానికులు ఈ స్థలంలోనే పార్వతి ప్రాయశ్చిత్తం ఒనరించుకున్నదని నమ్ముతారు.

చిత్ర కృప : wikicommons

సందీపని ఆశ్రమం, ఉజ్జయిని

సందీపని ఆశ్రమం, ఉజ్జయిని

ఉజ్జయినికి 5 కిలోమీటర్ల దూరంలో సందీపని మహర్షి ఆశ్రమం ఉంది. ఇక్కడే శ్రీకృష్ణబలరాములు, కుచేలుడు అనబడే సుదాముడు కలిసి చదువుకొన్నారు. అన్నదమ్ముల విగ్రహాలతో పాటు బాల్య స్నేహితుడైన కుచేలుని విగ్రహమూ ఇక్కడ ఉండటం విశేషం. శ్రీ కృష్ణ కదల తైల వర్ణ చిత్రాలు ఇక్కడ గొప్ప ఆకర్షణ.

చిత్ర కృప : wikicommons

విక్రమాధిత్యుడు - బేతాళుడు

విక్రమాధిత్యుడు - బేతాళుడు

విక్రమాదిత్యుడు ఒక శవాన్నిపట్టుకుని, తన భుజంపై వేసుకుని తీసుకుని వెళుతున్నప్పుడు, అది రాజుకి చిక్కుతో కూడిన ఒక సాహస కథను చెప్పి, చివరిలో ఒక ప్రశ్నను అడుగుతుంది. రాజుకి సమాధానం తెలియనప్పుడు మాత్రమే మౌనంగా ఉండగలడు లేదా సమాధానం తెలిసి చెప్పకుంటే అతని తల పగిలిపోతుంది. దురదృష్టకంగా, ఆ రాజు అతనికి ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసని చెప్పడం,దాంతో ఆ భేతాళున్ని పట్టుకోవడం మరియు అది తప్పించుకోవడం, మళ్లీ దానిని పట్టుకోవడం, అది పారిపోవడం, ఇలా ఇరవై నాలుగు సార్లు జరిగిన తర్వాత, చివరి ప్రశ్న విక్రమాదిత్యుడిని సంశయంలో పడేస్తుంది. ఇలా ఎన్నో సస్పెన్స్ లతో భేతాళ కథలు ఈ ప్రదేశంలో జరిగినట్టు కథనం.

చిత్ర కృప : wikicommons

భస్మ మందిర్, ఉజ్జయిని

భస్మ మందిర్, ఉజ్జయిని

ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు.

చిత్ర కృప : wikicommons

ఉజ్జయిని లో ఏమి తినాలి ?

ఉజ్జయిని లో ఏమి తినాలి ?

ఉజ్జయిని లో స్ట్రీట్ ఫుడ్ చాలా ప్రసిద్ధి మరియు టవర్ చౌక్ లో దొరికే ఆహారాన్ని పసందుగా లాగిస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకి చాట్లు, భెల్ పూరీ, నెయ్యితో కూడిన మొక్కజొన్న ఆహారం వంటి స్థానిక వీధి వంటకాలు ఆకర్షిస్తాయి. ఉజ్జయిని వస్తే స్థానిక వంటకాలను తినటం మరిచిపోవద్దు.

చిత్ర కృప : Kaustav Bhattacharya

షాపింగ్

షాపింగ్

ఉజ్జయిని లో షాపింగ్ విషయానికి వస్తే, గిరిజనుల నగలు, దుస్తులు పర్యాటకులని బాగా ఆకర్షిస్తాయి. అలాగే వెదురుతో తయారుచేసిన వస్తువులు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందినాయి. యాత్రికులు వీటిని స్థానిక బజారులో కొనుగోలు చేసుకోవచ్చు.

చిత్ర కృప : Keep me Green>>

ఉజ్జయిని ఎలా చేరుకోవాలి ?

ఉజ్జయిని ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

ఉజ్జయిని నగరం నుండి 55 కి.మీ. దూరంలో సేవి ఆహిల్యబాయి హోల్కర్ ఎయిర్ పోర్ట్, ఇండోర్ లో ఉన్నది. ఇండోర్ ఎయిర్ పోర్ట్ నుండి ఇండియా లోని అన్ని ముఖ్య నగరాలకు, ప్రైవేటు మరియు పబ్లిక్ డొమెస్టిక్ విమానమార్గాల ద్వారా అనుసంధించబడింది. ఎయిర్ పోర్ట్ నుండి ఉజ్జయిని చేరుకోవటానికి టాక్సీలు అందుబాటులో లభిస్తాయి. ఇండోర్ నుండి బస్సుల ద్వారా కూడా ప్రయాణికులు ఉజ్జయిని చేరుకోవొచ్చు.

రైలు మార్గం

ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్. ఇది ఇండియాలోని ముఖ్య రైల్ స్టేషన్ లకు అనుసంధించబడింది. ఉజ్జయిని నుండి ఇండోర్, ఢిల్లీ, పూణే, ముంబై, చెన్నై, కోల్కతా, భోపాల్ మరియు మాల్వా మరియు అనేక ఇతర పట్టణాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి.

రోడ్డు మార్గం

ఈ నగరం రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ బస్సుల ద్వారా జతచేయబడి ఉన్నది. భోపాల్, ఇండోర్, ఆహ్మేదబాద్ మరియు గ్వాలియర్ నుండి ఉజ్జయినికి రోజువారి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గంలో ఇవే కాకుండా, డీలక్స్ ఏసీ మరియు సూపర్ ఫాస్ట్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : UjjawalTM

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X