Search
  • Follow NativePlanet
Share
» » బయన్దూర్ - బీచ్ లు, సూర్యాస్తమయాలు!

బయన్దూర్ - బీచ్ లు, సూర్యాస్తమయాలు!

బయందూర్ అక్కడ కల అందమైన బీచ్ లకు మరియు అద్భుత సూర్యోదయ సూర్యాస్తమయ ప్రదేశాలకు ప్రసిద్ధి. బయన్దూర్ ప్రదేశం కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో కుందాపూర లో కలదు.

ఈ గ్రామంలో సోమేశ్వర టెంపుల్ ప్రసిద్ధి. ఈ దేవాలయం సరిగ్గా సముద్రం ఒడ్డున ఒక అందమైన సెట్టింగ్ నిర్మాణం వాలే వుంటుంది. బయన్దూర్ లో అనేక టూరిస్ట్ ఆకర్షణలు కలవు. వాటిలో ప్రధానమైనవి

బయన్దూర్ బీచ్, బలక తీర్థ జలపాతాలు, క్షితిజ నేసర ధామ, సనీస్వర టెంపుల్, మహాకాళి టెంపుల్ మరియు శ్రీ రామచంద్ర మందిర్ లు. టూరిస్ట్ లు సాధారణంగా ఈ బీచ్ కు పూర్తి విశ్రాంతి పొందాలని, అద్భుత సూర్యాస్తమయాలు ఆనందించాలని వస్తారు.

ఇక్కడ కల వివిధ దేవాలయాలు అనేక మంది భక్తులను ఆకర్షిస్తాయి.

 మంగుళూరు తీర పట్టణాల సొగసులు

1.బయన్దూర్ బీచ్

బయన్దూర్ బీచ్ ఒక ప్రధాన ఆకర్షణ. అందమైన సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి. ప్రశాంతంగా వుండే ఈ బీచ్ అనేక మంది టూరిస్ట్ లను ఆకర్షిస్తుంది.
2.బెలక తీర్థ జలపాతాలు
బెలక తీర్థ జలపాతాలు బయన్దూర్ సమీపంలో కలవు. ఇది ఒక అందమైన ప్రదేశం అవటం వలన అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. జలపాతాలు కనువిందు చేస్తే, చెవులు సైతం ఆ జలపాతాల హోరు ధ్వనికి పరవసిస్తాయి. ప్రకృతి ప్రియులకు, ఫోటోగ్రాఫర్లకు స్వర్గం వలే వుంటుంది.

3.క్షితిజ నేసర ధామ
క్షితిజ నేసర ధామ ప్రదేశం దానికి గల సహజ ప్రకృతి అందాలతో, అనుకూల వాతావరణంతో అనేక తాటి మరియు కొబ్బరి చెట్ల వరుసలతో హుందాగా సముద్రపు ప్రాంతాలను చూస్తూ ఒక చిన్న కొండపై వుంటుంది. ఇక్కడ కొంత సమయం గడిపితే చాలు ఎంతో హాయిగా వుంటుంది.

4.శనీశ్వర టెంపుల్
ఈ దేవాలయంలోని శనీస్వరుడిని దర్శించు కునే నిమిత్తం అనేక మంది భక్తులు వస్తారు. ఈ ప్రాంతంలో ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినా దేవాలయాలలో ఒకటి.

5.మహా కాళి టెంపుల్

బయన్దూర్ లో కల మహా కాళి టెంపుల్ అతి పురాతనమైనది. మాత కాళికా దేవి విగ్రహం అందంగా వుంది భక్తులను ఆశీర్వదిస్తూ వుంటుంది. ఈ టెంపుల్ లో ఫోటోగ్రఫీ నిషేధించబడినది.


6.సోమేశ్వర టెంపుల్
సోమేశ్వర టెంపుల్ అంటే ఇది లింగాకృతి కల ఒక శివుడి దేవాలయం. బయన్దూర్ బీచ్ సమీపం లో కలదు. ఇక్కడ భక్తులు పూవులు, పాలు, పెరుగు, నేయి వంటి వాటితో లింగానికి పంచామృత అభిషేకం చేసి ఆనందిస్తారు.

7.శ్రీ రామ చంద్ర మందిర్
శ్రీరాముడి విగ్రహం కల ఈ శ్రీ రామ చంద్ర మందిర్ బయన్దూర్ లో ఒక ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడకు టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా వస్తారు. ఇక్కడ ఆల్కహాల్ మరియు మామ్సాహారాలు నిషేధించ బడినవి.


8.ఎలా చేరాలి ?

బయన్దూర్ కు సమీప ఎయిర్ పోర్ట్ మంగళూరు లో కలదు. ఇది సుమారు 121 కి. మీ. ల దూరం. ఈ ఎయిర్ పోర్ట్ నుండి దెస, విదేశా విమానాలు నడుస్తాయి. బయన్దూర్ లో ఒక రైల్వే స్టేషన్ కూడా కలదు. ఇక్కడ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరచుగా రైళ్ళు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X