Search
  • Follow NativePlanet
Share
» »గుంటూరులో ముఖ్యంగా చూడవల్సిన ప్రదేశాలు

గుంటూరులో ముఖ్యంగా చూడవల్సిన ప్రదేశాలు

గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ చరిత్ర రూపుదిద్దుడంలో కీలకపాత్ర పోషించింది. ఇక్కడ అనేక కొండలు, లోయలు, నదులు, బీచ్ లు ఉన్నాయి. జిల్లా సంప్రదాయాలకు, సంస్కృతికి, మతాలకు గొప్ప నిక్షేపస్థానంగా పరిగణించబడుతోంది. పురాతన కాలంనాటి నుండి ప్రధాన బౌద్ధకేంద్రంగా విరాజిల్లుతోంది.

గుంటూరులో చక్కని మైదానాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు చారిత్రక ప్రదేశాలు, మతాచార ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వేసవిలో వేడితో, శీతాకాలంలో చల్లదనంతో సమశీతోష్ణస్థితిలో వాతావరణం ఉంటుంది. తేలికపాటి నూలు దుస్తులు ధరించడం ఉత్తమం, హైదరాబాద్ నుండి గుంటూరు 292కిమీ దూరంలో ఉంది. గుంటూరు సందర్శనకు అనువైన కాలం ఆగస్టు నుండి మార్చి వరకు. గుంటూరులో చూడవల్సిన అతి ముఖ్యమైన ప్రదేశాలు..

నాగార్జునసాగర్:

నాగార్జునసాగర్:

హైదరాబాద్ నుండి రెండున్నర గంటల ప్రయాణం సాగిస్తే ఆహ్లాదకర వాతావరణం గల విజయపురి పట్టణానికి మీరు చేరుకోగలుగుతారు. సుమనోహరమైన హాయిని గొలిపే చుట్టుప్రక్కల ప్రాంతాలలో నాగార్జున సాగర్ ఉంది. ఇది గుంటూరు నుండి 150కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనకట్ట నుండి వెలువడే జలపాతాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. 24మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట అయిన నాగార్జున సాగర్ డ్యామ్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి విశిష్ట ఉదాహరణంగా నిలిచింది. కృష్ణానదిపై ఇది నిర్మించబడినది. ప్రపంచంలోనే అతి పెద్ద వంతెన మనుషుల ద్వారా నిర్మింపబడిన సరస్సు ఉంది. ఈ సరస్సు మధ్యలో ఉన్నదే నాగార్జున కొండ బల్లగట్టు సాయంతో ద్వాపానికి చేరుకోవచ్చును.

నాగర్జున సాగర్ లోని వెలకట్టలేని పురవస్తు అవశేషాలు, స్మారక చిహ్నాలు భద్రపరచబడి ఉన్నాయి. శిథిలాలను రవాణా చేసి పురాతన బౌద్ధకాలం నాటి విహార ప్రాంతం ఇక్కడ పునరుద్దరించబడినది.

Photo Courtesy : Sumanthk

ఎత్తిపోతల జలపాతాలు:

ఎత్తిపోతల జలపాతాలు:

నాగార్జున సాగర్ డ్యాం నుండి కేవలం సుమారు 11కి.మీ దూరంలో కృష్ణానది ఉపనది అయిన చంద్రవంక నదిపైన ఎత్తిపోతల జలపాతాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలతో 70అడుగలదిగువకు ఎగసిపడే జలపాతంతో లోతులేని చెరువుకనిపిస్తుంది. ఆహ్లాదకరమైన ప్రకృతితో కొండలు, గుహలతో ఇష్టపడే పిక్నిక్ స్పాట్ ఇక్కడ మొసళ్ళను పెంచే కేంద్ర ఉంది. ప్రకృతి సిద్దంగా వాటికి అనువైన ప్రదేశంలో పాకుతూ నడయాడే మొసళ్ళను మీరు అతి చేరువ నుండి చూడగలుగుతారు.

Photo Courtesy : commons.wikimedia.org

ఉండవల్లి:

ఉండవల్లి:

ఉండవల్లి వి.వాడ నుండి 5కిమీ దూరంలో ఉన్న సీతానగరం వద్ద ప్రకాశం వంతెనకు చేరువలో కృష్ణానది ఒడ్డున ఉంది. పురాతన నాలుగు అంతస్తుల రాతి కట్టడాలతో గల దేవాలయాలు గుహలకు ప్రత్యేకం. గుంటూరు నుండి 30కి.మీ దూరం.

Photo Courtesy: Ramireddy.y

మాచర్ల :

మాచర్ల :

గుంటూరు నుండి 125కి.మీ దూరంలో నాగార్జున సాగర్ నుండి 25కి.మీ దూరంలో ఉంది.హైహేయ రాజుల కాలంలో నిర్మించిన ఇక్కడి చెన్నకేశవ స్వామి దేవాలయం ఈ పట్టణానికి ఖ్యాతి చేకూర్చింది. ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవ వేడుకలకు సుదూర ప్రాంతాల నుండి తీర్థయాత్రీకులు పర్యాటకులు విచ్చేస్తారు.

ఎన్ టి ఆర్ మానససరోవరం:

ఎన్ టి ఆర్ మానససరోవరం:

మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు దివంగతులైన తర్వాత ఈ అందమైన రిక్రియేషన్ సెంటర్ కు ఆ పేరు వచ్చింది. ఇది గుంటూరు టౌన్ నుండి 6కి.మీ దూరంలో గల తక్కెళ్ళపాడు వద్ద ఉంది. 55ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఎన్ టి ఆర్ మానససరోవరంలో విలక్షణంగా ఉన్న ప్రక్రుతి ద్రుశ్యాలు. పూలతోటలు, పచ్చికబయళ్ళ , కుంటలు, చిన్న చిన్న గుట్టలతో విరాజిల్లుతోంది.

దుర్గి:

దుర్గి:

మాచర్ల నుండి 10కిమీ దూరంలో దుర్గి ఉంది. ఇక్కడ శిల్పకళ , రాతిబొమ్మలు చెక్క పాఠశాల ఉంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ రాకముందు నిపుణులైన కళాకారులు ఇక్కడ సాంప్రదాయబద్దంగా నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు. కాళాకారులు సంప్రదాయ పద్దతులను శైలిలను కొనసాగిస్తున్నారు ఆ విధంగా భవిష్యత్ తరాలకు కళలను సజీవంగా ఉండేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారు.

కారం పూడి:

కారం పూడి:

మాచర్ల నుండి 35కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజు బ్రహ్మనాయుడు నిర్మించిన చెన్నకేశవ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ప్రసిద్దిగాంచిన పల్నాటి యుద్దంలో ఉపయోగించిన ఆయుదాలు సురక్షితంగా ఇక్కడ భద్రపరచబడినవి..ఆ యుద్దంలో అసువులు బాసిన వీరుల జ్ఝాపకాలను స్మరించుకునేందుకు జరిగే వార్షికోత్సవం ఈ ప్రాంతం నుండి వచ్చే సందర్శకులందరినీ సమ్మోహతులను చేస్తుంది.

బాపట్ల:

బాపట్ల:

గుంటూరు నుండి 53కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్ల ఇక్కడ ఉన్న పురాతన భావనారాయణస్వామి దేవాలయానికి ప్రతీకగా నిలిచింది. ఇది రేపుగల అతి పురాతనమైన పట్టణం.

చేబ్రోలు:

చేబ్రోలు:

చేబ్రోలు గుంటూరు నుండి 15కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవాలయం, వాస్తు సంపదకు, శూలికి పెట్టింది పేరు ఇది భారతదేశంలోని అరుదైన దేవాలయాలో ఒకటి ఉంది.

ఉప్పల పాడు పక్షుల ప్రాంగణం:

ఉప్పల పాడు పక్షుల ప్రాంగణం:

గుంటూరు పట్టణం నుండి 5కి.మీ దూరంలో ఉంది. సిలికాన్స్ వైట్ లిబ్స్ తో సహా సిలేరియా నుండి వలస వచ్చిన 40జాతుల పక్షులకు నివాసప్రాంతం ఉప్పలపాడు పక్షుల ప్రాంగణం. అరుదైన పక్షులు సెంప్టెంర్ నుండి ఫిబ్రవరి నెలవరకు కనిపిస్తాయి.

PC- J.M.Garg

చేజెర్ల:

చేజెర్ల:

చేజెర్ల నరసారావు పేట నుండి సుమారు 30కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ క్రీ.శ మూడవ శతాబ్దం నుండి శైవ కేంద్రంగా ఉంది. భారతదేశంలోని 22జ్యోతిర్లింగాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు. ఇది ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటి.

అమరావతి:

అమరావతి:

గుంటూరు నుండి సుమారు 35కిమీ దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంద. క్రీ.పూ 2వశతాబ్దం నుండి క్రీ.శ 2వశాతబ్దం వరకు ధరణి కోట లేదా ధాన్యకటకం ప్రస్తత అమరావతి రాజధానికిగా శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధమతం పరిఢవిల్లింది. ఈ పురాతన బౌద్ధ కేంద్రం సాంచితో సమానమైనది. కృష్ణానది ఒడ్డున గల అమరలింగేస్వార స్వామి దేవాలయం ప్రధానమైన పుణ్యక్షేత్రం .

మంగళగిరి:

మంగళగిరి:

మంగళగిరి విజయవాడ నుండి 12కి.మీ దూరంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ కొండప్రక్క నున్న పానకాలస్వామి దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మంగళగిరి పట్టణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళగిరి నూలు నుండి తయారైన డ్రెస్ మెటీరియల్ , చీరలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

Photo Courtesy : commons.wikimedia.org

గుత్తికొండ:

గుత్తికొండ:

కారం పూడికి దగ్గరలో నరసారావుపేట నుండి 38కి.మీ దూరంలో దట్టమైన అడవీ ప్రాంతంలో మీరు అన్వేషించేదే గుత్తికొండ ఇక్కడ వాతావరణం ప్రశాతంగా ఉంటుంది. శతాబ్దాలకాలం పాటు అనేక మంది బుుషులు ఇక్కడ తపస్సు చేశారు. ప్రదేశానికి దక్షిణ కాశి అని కూడా ప్రతీతి ప్రఖ్యాతి గాంచిన గుత్తికొండ బిలం నేటికి అర్ధంకాని ప్రదేశం. గుహాలను అన్వేషించడానికి నేటికీ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more