Search
  • Follow NativePlanet
Share
» »కొట్టారక్కర - కధాకళీ డాన్స్ లకి పుట్టినిల్లు !

కొట్టారక్కర - కధాకళీ డాన్స్ లకి పుట్టినిల్లు !

By Mohammad

కొల్లం జిల్లాలోని కొట్టారక్కర ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం రెండు మలయాళ పదాలతో ఏర్పడింది. కొట్టారం అంటే రాజభవనం అని, కర అంటే భూమి అని అర్ధం. అందుకే ఇక్కడ ప్యాలెస్ లు, దేవాలయాలు, సారవంతమైన భూమి ఉన్నాయి. కొట్టారక్కర కథాకళి కి పుట్టినిల్లు.

చరిత్ర

కొట్టారక్కర మొదట ట్రావెన్కోర్ రాయల్ అధీనంలో ఉండేది. తర్వాత భారతదేశ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. మొత్తంగా ఇక్కడ 7 రాజభవనాలు ఉన్నాయి. ఇందులో మొదటిది క్రీ.శ. 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు.

కధాకళీ

చిత్ర కృప : Sreeram R

కొట్టారక్కర లో సైట్ సీయింగ్ లంటే చర్చీలు, దేవాలయాలు, ప్యాలెస్ లు చూడాలి.సమయం ఉంటే షాపింగ్ చేయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

1. కొట్టారక్కర శ్రీ మహాగణపతి దేవాలయం

కొట్టరక్కర శ్రీ మహాగణపతి దేవాలయం, కొట్టరక్కరలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. చాలామంది ప్రజలు దీనిని దర్శిస్తారు. ఇది కొల్లం నుండి సుమారు 25 కి.మీ.ల దూరంలో కలదు. రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు. దేవాలయాన్ని మొదటగా కిజక్కేకర శివ దేవాలయం అని పిలిచేవారు.

ఆలయంలో ప్రధాన దైవం శివ భగవానుడు. అయితే, కాలక్రమేణా అక్కడ ఉప దేవతగా ప్రతిష్టించబడిన వినాయకుడితో ఇది గణపతి దేవాలయంగా ప్రసిద్ధి కెక్కింది. వినాయక చతుర్ధి, నవరాత్రి, అయిల్యామ్ మాకం మొదలైన పండుగలు చేస్తారు. వీటికి ప్రతి సంవత్సరం దక్షిణ భారత దేశం నుండే వేలాది భక్తులు వస్తారు.

కొట్టారక్కర శ్రీ మహాగణపతి దేవాలయం

చిత్ర కృప : Suvin KS

దేవాలయంలో శివుడు, పార్వతి, మురుగన్ మరియు అయ్యప్పల విగ్రహాలు కలవు. ఈ దేవాలయంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ప్రవేశ అనుమతి లభిస్తుంది. కొట్టరక్కర శ్రీ మహాగణపతి దేవాలయం లో ఇచ్చే ఉన్ని అప్పం ప్రసాదం కేరళ రాష్ట్రమంతా ప్రసిద్ధి చెందింది.

2. కొట్టారక్కర ప్యాలెస్

కొట్టారక్కర ప్యాలెస్ పురాతనమైనది. దీనిని క్రీ. శ. 14 వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాయల్ వంశస్థులు నిర్మించారు. కొట్టారక్కర లోను, దాని చుట్టుపక్కల ప్రదేశాలలో ఏడు ప్యాలెస్ శిధిలాలు కనిపిస్తాయి. ప్యాలెస్ లో మొదట ట్రావెన్కోర్ కుటింబీకులు నివసించేవారు. ఇండియా ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించిన తరువాత ప్రస్తుతం ఈ ప్యాలెస్ పైతృక కళా కేంద్రంగా ట్రావెన్కోర్ ట్రస్టీ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నది.

కొట్టారక్కర ప్యాలెస్

చిత్ర కృప : telugu native planet

3. పాతానపురం

పాతానపురం పడమటి కనుమల పర్వత శ్రేణి లో కలదు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండి ఏనుగులు అధికంగా సంచరించేవి. ప్రస్తుతం వాణిజ్య కేంద్రం గా కార్యకలాపాలను సాగిస్తున్నది. రబ్బరు చెట్లు, పాలు, పశువుల పరిశ్రమలు, ఇటుకల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి.

పాతానపురం పట్టణంలో చర్చీలు, దేవాలయాలు, మసీదులు ఉన్నాయి. కనుక మీరు అన్ని మతాల పండుగలను చూడవచ్చు. పెరియార్ నేషనల్ పార్క్ పట్టణ ప్రధాన ఆకర్షణ.

కొట్టారక్కర ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

కొట్టారక్కర కు సమీపాన 70 కి. మీ ల దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో కొట్టారక్కర చేరుకోవచ్చు.

రైలు మార్గం

కొట్టారక్కర లో రైల్వే స్టేషన్ కలదు. ఇది పట్టణం నుండి 2 కి. మీ ల దూరంలో ఉన్నది. కొల్లం - మధురై రైలు మార్గం లో ఉన్న స్టేషన్ కు ప్రతి రోజు రైళ్లు నడుస్తుంటాయి. స్టేషన్ బయట ఆటో లో ప్రయాణించి పట్టణములోపలికి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం / బస్సు మార్గం

కొట్టారక్కర కు ఇరుగుపొరుగు పట్టణాల నుండి, నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. తిరువనంతపురం, మధురై, కొల్లం, కుమిలీ, ఊటీ, కోయంబత్తూర్ తదితర నగరాలనుండి ప్రతి రోజు బస్సులు తిరుగుతుంటాయి.

బస్సు మార్గం

చిత్ర కృప : Binoj Mathew

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X